ప్రభుత్వ టీచర్ కి రూ. 20 వేలు ఫైన్ ఎందుకో తెలుసా..?

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చెట్లను పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.. ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు కూడా చెట్లు నాటండి అని తోటి నటీనటులకు ఛాలెంజ్ చేస్తున్నారు.. ఆ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు కూడా చెట్లను నాటుతున్నారు. ఇంతకీ ఈ చెట్ల గోల ఏంటని అనుకుంటున్నారా.. మీరే చూడండి.  కొత్త మంది చెట్లను నాటకపోగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. ఆ నరికేసిన వాళ్ళు ఏ అక్షరం రానివాళ్లు అయితే పరవాలేదు.. బడిలో పిల్లలు పాఠాలు చెప్పాల్సిన టీచర్ చెట్లను నరికాడు.. తెలియనివాడు తప్పు చేస్తే క్షమించొచ్చు.. మరి తప్పు చెయ్యొద్దని బుద్దులు చెప్పే బడి పంతులు ఇలాంటి పనిచేస్తే ఎలా చెప్పండి.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకం క్రింద మహాశక్తి నగర్, వీధి నెం. 2 లో 4 ఏళ్ల క్రితం నాటిన గుల్ మొహర్ చెట్టును దొంతి నర్సింహా రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు. దీనిపై హరితాహారం పర్యవేక్షకుడు ఐలయ్య ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఉపాధ్యాయుడిపై కమిషనర్ జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లడుతూ.. సదరు ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నా ఇలా చేయడం తగదని వ్యాఖ్యానించారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని కమిషనర్ మండిపడ్డారు. దీనికి బదులుగా ఆయనకు ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. చెట్టును అనుమతి లేకుండా కొట్టేసినందుకు గానూ మున్సిపల్ కమిషనర్ ఈ జరిమానా విధించారు. పర్యావరణ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు గానూ టీచర్ మరో 50 చెట్లు నాటాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

అదానీ పరమైన గంగవరం పోర్టు

విశాఖ గంగవరం పోర్టు అదానీ గ్రూప్ వశమైంది. గంగవరం పోర్టులోని  మెజారిటీ వాటాను దక్కించుకున్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎ్‌సఈజెడ్‌).. ఇప్పుడా పోర్టును తమ సంస్థలో విలీనం చేసుకోనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.10 శాతం, విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్‌కు 31.15 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. దీంతోగంగవరం పోర్టు లిమిటెడ్‌లో  89.6 శాతం వాటా అదానీల చేతికి వచ్చినట్లైంది.  గంగవరం పోర్టులోని మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును పూర్తిగా అదానీ గ్రూప్ సొంతం చేసుకునేందుకు ఏపీ సెజ్ ప్రతిపాదించింది. స్పందించిన ప్రభుత్వం వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పోర్టును ఏపీ సెజ్‌లో విలీనానికి కూడా అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటి నివేదిక తర్వాత... ఏపీ వాటా కూడా కొనుగోలు చేసి గంగవరం పోర్టును పూర్తిగా సొంతం చేసుకోనుంది అదానీ గ్రూప్  గంగవరం పోర్టు చెల్లించిన మూలధనం రూ.51.7 కోట్లు. ఇందులో 58.1వాటా డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం,  31.5 శాతం వాటా వార్‌బర్గ్‌ పింకస్‌ చేతిలో ఉంది. మిగిలిన 10.4వాటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిది. మార్చి 3న గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను అమెరికా పీఈ కంపెనీ వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి కొనుగోలు చేసిందిఅదానీ పోర్ట్స్‌.  తర్వాత  58.1 శాతం వాటాను ప్రమోటర్లు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.3,604 కోట్లు వెచ్చించింది.  ఒక్కో షేరుకు రూ.120 చెల్లించి వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5 శాతం వాటాను అదానీ పోర్టు కొనుగోలు చేసింది. అదే ధరకు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి 30 కోట్ల షేర్లను (58.1) సొంతం చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.  పశ్చిమ తీరప్రాంత కంపెనీగానే పరిమితం కాకుండా.. దేశ వ్యాప్త కార్గో యుటిలిటీ కంపెనీగా ఎదగాలని అదానీ పోర్ట్సు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే గంగవరం పోర్టును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు అదానీల చేతిలో ఉంది. తాజాగా గంగవరం పోర్టు కూడా సొంతం అయింది. ఈ రెండు పోర్టులతో కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది. దాదాపు రూ.12,000 కోట్లకు కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్‌ 75 శాతం వాటాను  కొనుగోలు చేసింది. 2025 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 500 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచుకోవాలన్నది అదానీ పోర్ట్సు లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా తీరంలో విశాఖపట్నం పోర్టుకు తర్వాత వ్యూహాత్మకంగా గంగవరం పోర్టు ఉంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నాన్‌- మేజర్‌ పోర్టు. ప్రస్తుతం 9 బెర్త్‌లతో పని చేస్తున్న పోర్టు స్థాపిత సామర్థ్యం 64 ఎంఎంటీ (మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు). అన్ని వాతావరణ పరిస్థితుల్లో కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యంతోపాటు డీప్‌ వాటర్‌, మల్టీపర్పస్‌ ఓడరేవు ఇది. 2 లక్షల డెడ్‌వెయిటేజ్‌ టన్నుల (డీడబ్ల్యూటీ) నౌకలు కూడా పోర్టులోకి వచ్చే సదుపాయం ఉంది. 1,800 ఎకరాల స్థలం కలిగిన ఈ పోర్టును 250 ఎంఎంటీపీఏ సామర్థ్యానికి పెంచాలన్నది అసలు ప్రణాళిక. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి. బాక్సైట్‌, చక్కెర, అల్యూమినా, ఉక్కు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. తూర్పు, దక్షిణ, మధ్య భారత ప్రాంతాల్లోని ఎనిమిదికి పైగా రాష్ట్రాలకు ఇది ఇంటర్‌ల్యాండ్‌ గేట్‌ వే పోర్టు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ భోజనానికి బ్రేక్.. వైసీపీ ఎమ్మెల్యే దుర్మార్గం 

అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు అన్నట్లుగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు.. అధికార వైసీపీ నేతల వ్యవహారం. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు అండగా నిలవడంలోప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార వైసీపీ నేతలైతే పత్తా లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. కరోనా సోకి  తీవ్ర కష్టాల్లో ఉన్నా కనీస సాయం కూడా చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. తాము సాయం చేయకపోగా.. స్వచ్చందంగా సేవ చేస్తున్న సంస్థలను కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.  తాజాగా వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచితంగా వ్యవహరించారు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సేవచేస్తున్న వారిపై ఎమ్మెల్యే కన్నెర్ర జేశారు. రోగులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అయితే తక్షణమే శివశక్తి ఫౌండేషన్ సభ్యులను భోజనం పంపిణీ నిలిపివేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా పోలీసులు వెళ్లి భోజనం పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. భోజనం పంపిణీ చేస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై పేద ప్రజలు, స్థానికుల అసహనం వ్యక్తం చేశారు.  కరోనా కష్టాల్లో కనిపించకుండా పోయిన వైసీపీ నేతలు... ఇతరుల సాయం చేయకుండా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ వైఫల్యం భయటపడుతుందనే భయంతోనే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కరోనా రోగులకు సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు భోజనం పెట్టకుండా అపేయించడం ఏంటని మండిపడుతున్నారు. 

కరోనాతో సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా సోకి రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య  మృతి చెందారు. గత పదిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు కలెక్టర్.. మంగళవారం ఉదయం చనిపోయారు. నల్గొండ జిల్లాకు చెందిన అంజయ్య... ఆ జిల్లాలో ఆర్డీవోగా, ఆర్వోగా, డీఆర్డీఏ పీవోగా పని చేశారు. అదనపు కలెక్టగా ప్రమోషన్ వచ్చాక కొంత కాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్నారు. అంజయ్య మృతితో సిరిసిల్ల జిల్లా ఉద్యోగులు విషాదం మునిగిపోయారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య  మృతి బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. మంచి అధికారిని కోల్పోయామని మంత్రి కేటీఆర్ అంజయ్య మృతిపట్ల  సంతాపం  ప్రకటించారు.  కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్ది కాలంలోనే జిల్లాలో విస్తృత  సేవలు అందించారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ సౌమ్యుడుగా అందరి మనస్సుల్లో స్థానం సంపాదించారన్నారు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో పని చేశారని గుర్తు చేశారు. ఒక మంచి అధికారిగా అర్జీదారులకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించిన అదనపు కలెక్టర్ అంజయ్య మరణించడం జిల్లాకు తీరని లోటని కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు మనోదైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అడిషనల్ కలెక్టర్ అంజయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ . రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఒక మంచి అధికారిని కోల్పోయిందన్నారు.  కలెక్టర్.   కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, ఆయన లేరనే వార్త నమ్మలేకపొతున్నామని విచారం వ్యక్తం చేశారు. అన్ని శాఖలతో సత్సంబంధాలు నెలకొల్పి అనతి కాలంలోనే మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారని చెప్పారు.

ఈటలను కలిస్తే తప్పేంటి! రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్ 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజేందర్ తో బీజేపీ నేతలు సమావేశమయ్యారని, ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ నేత ఒకరు హైదరాబాద్ వచ్చిన ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా రాజేందర్ కలిసి చర్చించారనే ప్రచారం సాగుతోంది.   రాజేందర్ తనను కలిశారని జరుగుతున్న ప్రచారంపై  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదు.. ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. అసెంబ్లీలో ఈటలతో కలసి 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ తో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఈటలను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని చెప్పారు. అందర్నీ కలుస్తున్నాను.. తనను కూడా  కలుస్తానని ఈటల తనతో అన్నారన్నారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని అధిష్ఠానంతో చర్చించలేదన్నారు.  తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారం నిజమేనని భావిస్తున్నారు. 

మ‌ద్యం సేల్స్‌ ఢ‌మాల్‌.. ప్ర‌భుత్వం ప‌రేషాన్‌!

మండు వేస‌విలో చ‌ల్ల‌టి బీరు గొంతులో జారుతుంటే ఆ కిక్కే వేర‌ప్పా.. అనేది మందుబాబుల మాట‌. అందుకే, ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు తెలుగురాష్ట్రాల్లో బీర్ల అమ్మ‌కాలు రాకెట్‌లా దూసుకుపోతుంటాయి. వ‌చ్చిన స్టాక్ వ‌చ్చిన‌ట్టే అమ్ముడైపోతుంటుంది. ఒక్క బీర్లు అనే కాదు.. బ్రాందీ, విస్కీల సేల్స్ కూడా స‌ర్రున ఎగ‌బాకుతుంటుంది. అయితే.. లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూల కార‌ణంగా ఈ ఏడాది మ‌ద్యం సేల్స్ భారీగా ప‌డిపోయాయి. స‌ర్కారు ఖ‌జానాకు పెద్ద చిల్లే ప‌డింది.  ఉద‌యం ఆరు గంట‌ల‌కే వైన్స్ ఓపెన్ చేస్తున్నారు. పాల ప్యాకెట్ల‌కు పోటీగా లిక్క‌ర్ అమ్మ‌కాలు సాగిపోతున్నాయి. మ‌ద్యం షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలైన్లు. ఇంకేం.. ఫుల్లు సేల్సు అనిపిస్తుంటుంది. పైపైన చూస్తే.. అలానే క‌నిపించినా.. లెక్క‌లేస్తే మాత్రం లిక్క‌ర్ సేల్స్.. బీరు చ‌ల్ల‌ద‌నం త‌గ్గిన‌ట్టు త‌గ్గిపోతున్నాయి. వైన్స్‌ అమ్మ‌కాలంతా సాయంత్రం, రాత్రి వేళ‌లోనే జ‌రుగుతుంటుంది. లాక్‌డౌన్‌తో పెంద‌లాడే స‌రుకు స‌ర్దేస్తుండ‌టంతో మ‌ద్యం అమ్మ‌కాలు మ‌స‌క‌బారుతున్నాయి. ఆ మేర‌కు ప్ర‌భుత్వానికి భారీగా రాబ‌డి త‌గ్గిపోయింది.  ఆంధ్రప్రదేశ్‌లో వైన్స్ సేల్స్‌ మ‌రీ వెల‌వెల‌పోతున్నాయి. షాపుల సంఖ్య తగ్గించడమో.. కర్ఫ్యూ ప్రభావమో తెలియదుగానీ రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాల సమయాలను తగ్గించడంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు.. ఏపీలో బీరు, లిక్కర్‌ కలిపి మొత్తం 21,31,558 కేసుల విక్రయాలు జరిగాయి. మే నెల వ‌చ్చే స‌రికి.. 1వ తేదీ నుంచి 23 వరకు 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. ఆ లెక్క‌న‌ మద్యం అమ్మకాలు 21.45 శాతం తగ్గినట్లు తేలింది. ఈసారి వేసవిలో బీరు జోరు బాగా త‌గ్గింది. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున కేవలం 13,423 బీరు కేసులే విక్రయించారు. దీంతో బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. బ్రాందీ, విస్కీ వంటి లిక్కర్‌ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 63,455 కేసుల లిక్కర్ విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. లిక్కర్‌ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.  ఇక మే నెలలో మద్యంపై వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది. ఏప్రిల్‌లో 1 నుంచి 23 వరకు మద్యం అమ్మకాలతో రూ.1,531.97 కోట్లు ఆదాయం వచ్చింది. అదే మే నెలలో అయితే 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. మద్యపాన నిషేధం దిశగా ఆడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం అమ్మకాల తగ్గుదలను పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనేది ప్రభుత్వ వర్గాల మాట‌.   

ఆన్‌లైన్ క్లాస్‌లో అస‌భ్య వేషాలు.. ట‌వ‌ల్ చుట్టుకొని పాఠాలు.. టీచ‌ర్ అరెస్ట్‌..

స్కూల్ మాట మ‌ర్చిపోయి చాలా రోజుల‌వుతోంది. ఇప్పుడంతా ఆన్‌లైన్ క్లాసెస్‌. ఎవ‌రు చెబుతున్నారో.. ఏం చెబుతున్నారో.. ఎవ‌రు వింటున్నారో.. అస‌లేం అర్థంకాని ప‌రిస్థితి. ఏ మొబైల్‌ఫోనో, లాప్‌టాపో ప‌ట్టుకొని.. ఓ రూమ్‌లో కూర్చొని పాఠాలు వింటున్న‌ట్టు యాక్ట్ చేస్తున్నారు పిల్ల‌లు. పెద్ద‌లు సైతం వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే అద‌నుగా.. ఓ టీచ‌ర్ పాఠాలు చెప్ప‌డానికి బ‌దులు.. వెకిలి వేశాలు వేయ‌డం స్టార్ట్ చేశాడు. ఆన్‌లైన్‌లో అస‌భ్య‌ కంటెంట్‌ను పంపించ‌డం, బ్యాడ్ మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఆల‌స్యంగా విష‌యం వెలుగు చూడ‌టంతో పోలీస్ కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.   ఆన్ లైన్ క్లాసుల బోధన సందర్భంగా అసభ్యంగా ప్రవర్తించిన 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని టాప్ స్కూళ్లలో ఒకటైన శేషాద్రి బాల విద్యా భవన్ లో ఈ దారుణం జరిగింది. అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. పోస్కో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను కాపాడే చట్టం) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ క్లాసుల్లో అసభ్య కంటెంట్‌తో పాటు కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని, తన ఛాతీని చూపిస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదులో తెలిపారు. ఆయన గురించి స్కూల్‌ యాజమాన్యానికి ముందే తెలిసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్టూడెంట్స్‌ ఆరోపించారు. ఈ ఉదంతం.. డీఎంకే ఎంపీ కనిమొళి దృష్టికి రావ‌డంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ టీచ‌ర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యానని ఆమె అన్నారు. విద్యార్థుల ఫిర్యాదుపై తగు విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఎంపీ కనిమొళి స్పందించిన వెంటనే స్కూల్ మేనేజ్‌మెంట్ ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. అత‌ని దుష్ప్రవర్తన గురించి తమకు ఇంత వరకు తెలియదని త‌మ‌ను తాము స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇక‌పై ఇలాంటి అంశాలపై తాము చాలా సీరియస్ గా ఉంటామని తెలిపింది. విద్యార్థుల మానసిక పరిస్థితి, భావోద్వేగాలకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పింది.

ఎమ్మెల్యే బంధువులకు కాదు.. పేదలకు పంచండి! 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను.. ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే మందు చేయించుకుంటుంటే జిల్లా మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని నిలదీశారు. కనీసం కృష్ణపట్నం వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. అనధికారికంగా నిర్బంధంలో తయారుచేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.  టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశం కృష్ణపట్నంలో టీడీపీ బృందం పర్యటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,  పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివప్రసాద్ తదితరులు ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆనందయ్య లేకపోవడంతో ఆయన భార్యతో మాట్లాడి వచ్చారు. ఆనందయ్య ఆధ్వర్యంలో సాఫీగా జరిగిపోతున్న ఆయుర్వేదం మందు పంపిణీని ఈ నెల 17న ఆపివేశారని ఈ సందర్భంగా సోమిరెడ్డి ఆరోపించారు. మళ్లీ ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించడంతో 40 వేల మంది వరకు వచ్చారని...గొడవ చోటుచేసుకుని లాఠీచార్జీకి దారితీసిందని చెప్పారు.  ఆయుర్వేదం మందుకు మొదట ఐసీఎంఆర్ అనుమతి కావాలన్నారు..తర్వాత అవసరం లేదనన్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఆయుష్ బృందం  ఆనందయ్య ఆయుర్వేదానికి ఓకే చెప్పినా..  ఇప్పుడు మళ్లీ కేంద్ర బృందం నుంచి అనుమతులు రావాలంటున్నారని అన్నారు. అనుమతుల పేరుతో ఆనందయ్య మందును పేదలకు మాత్రం పంపిణీ చేయించకుండా అడ్డంకులు పెట్టారని మండిపడ్డారు.  ఇది కృష్ణపట్నం గ్రామానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదని జాతీయ స్థాయి అంశమని సోమిరెడ్డి అన్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్న దేవుడు ఆనందయ్య అని చెప్పారు. ఆనందయ్యకు మద్దతుగా విద్యార్థులు పోరాడాలని సోమిరెడ్డి పిలుపిచ్చారు. ఎమ్మెల్యేని కాదని ఆనందయ్య ఊరుకు వచ్చే దమ్ము మంత్రులు, ఎస్పీలకు లేదన్నారు. హెల్త్ మినిస్టర్ కు అసలు ఓపికే లేదన్నారు. అనధికారికంగా తయారుచేయించుకుని చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని ముఖ్యమంత్రిని కోరింది టీడీపీ బృందం ప్రత్యేక ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు మధ్య టైమ్ స్లాట్ ప్రకారం అందరికీ మందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆనందయ్యను నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది. 

భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి.. ప్రియుడికోసం పోలీస్ స్టేషన్ కి.. 

మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి ఈ రెండు ఎప్పుడు,ఎలా, ఎవరితో జరుగుతాయో తెలీదు. యువతీ యువకుల్లో  ప్రేమ పుట్టాం సహజం. కానీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లకు ప్రేమ పుట్టడం కూడా సహజం అని అంటుంది సుజాత.. అలా అని పెళ్లి అయినా వాళ్లకు ప్రేమ పుటుతోందని కాదు. ఆ వారి నిర్ణయాల వాళ్ళ ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఆలోచించాలి. అయినా నేటి  జనాలు  ప్రేమ ముసుగులో చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ ముసుగులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. భాద్యతగా పిల్లల జీవితాలను సక్కదిద్దాల్సిన వాళ్ళు, భాద్యత మరిచి, వారి సొంత సొంత ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నారు.  అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ..?  ఓపెన్ చేస్తే.. అది తెలంగాణ. వనపర్తి జిల్లా. అమరచింత మండలం.  ఆమె పేరు  సుజాత. ఆమెకు పెళ్లి అయింది. భర్త, పదేళ్ల వయసున్న కొడుకు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే, అమరచింతలో వారు ఉండే కాలనీకి చెందిన రాకేశ్​అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడి కోసం ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి నెల రోజుల కింద రాకేశ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది.  కట్ చేస్తే.. ఇద్దరు  భార్యాభర్తలమని చెప్పి వరంగల్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వాళ్లిద్దరి కోసం ఇరు కుంటుంబాలు తీవ్రంగా గాలించాయి. చివరికి వరంగల్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఈనెల 21న రాకేశ్ కుటుంబ సభ్యులు వరంగల్ వెళ్లి.. ఇద్దరిని ఒప్పించి అమరచింతకు తీసుకువచ్చారు. భర్త ఇంటి వద్ద సుజాతను వదిలేశారు. అక్కడితో ఆగని సుజాత తన ప్రియుడితోనే చావైనా బతుకైనా అని చెప్పి చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. సుజాత సోమవారం అమరచింత పోలీస్స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపింది. తాను ప్రియుడు రాకేశ్‌తోనే ఉంటానని స్టేషన్ ముందు బైఠాయించింది. వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని కూడా తెలిపింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. రాకేశ్‌పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని, రాకేశ్‌ను ఎక్కడ దాచి పెట్టారో చెప్పాలని పోలీసులను కోరింది. ఈ మేరకు వినతి పత్రం పోలీసులకు ఇచ్చింది. అతని మొబైల్ కూడాఅందుబాటులో లేకుండా చేశారని ఆరోపించింది. అనంతరం సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.  

యువ‌కుడి కొట్టిన మ‌రో క‌లెక్ట‌ర్‌.. ఈ పెద్దోళ్ల‌కి ఏమైంది?

పోలీసులు కొట్ట‌డం కామ‌న్‌. ఖాకీలు కొడితే జ‌నాలు సైతం పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అదే క‌లెక్ట‌ర్ కొడితే మాత్రం. సీన్ సితార్ అయిపోతుంది. వెంట‌నే ముఖ్య‌మంత్రి సైతం స్పందిస్తారు. వెంట‌నే క‌లెక్ట‌ర్‌పై యాక్ష‌న్ తీసుకుంటారు. ఇటీవ‌ల ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అలానే జ‌రిగింది. లాక్‌డౌన్ టైమ్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ యువ‌కుడి సెల్‌ఫోన్ ప‌గ‌ల‌గొట్టి.. అత‌డి చెంప చెల్లుమ‌నిపించిన క‌లెక్ట‌ర్‌ను స‌స్పెండ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తాజాగా, మ‌రో అద‌న‌పు క‌లెక్ట‌ర్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఎప్ప‌టిలానే విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ స‌మ‌యంలో చెప్పుల షాప్ తెరిచిన ఓ యువ‌కుడిపై  షాజాపూర్ అదనపు కలెక్టర్‌ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. షాప్ ఎందుకు తెరిచావంటూ.. ఆగ్ర‌హంతో ఆ యువ‌కుడి త‌ల‌పై ఒక్క‌టిచ్చారు. అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆ షాపు పిల్లాడిని కొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇక అంతే. ఆ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌ను కామెంట్ల‌తో ఆటాడుకున్నారు నెటిజ‌న్లు.  క‌ట్ చేస్తే.. ఆ విష‌యం ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ వ‌ర‌కూ చేరింది. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని మంత్రి తెలిపారు.  క‌లెక్ట‌ర్ అంటే వైట్ కాల‌ర్ జాబ్‌. ఎంచ‌క్కా ఏసీ ఛాంబ‌ర్‌లో కూర్చొని పాలించ‌డం వారి విధి. అధికారుల‌తో స‌రైన రీతిలో ప‌ని చేయిస్తూ.. జిల్లా అభివృద్ధికి పాటుప‌డ‌టం వారి క‌ర్త‌వ్యం. అందుకే, క‌లెక్ట‌ర్లు చాలామంది ప్ర‌శాంతంగా క‌నిపిస్తారు. వారిలో కోపం క‌నిపించ‌డం చాలా అరుదు. అదే క‌లెక్ట‌ర్‌ రోడ్డు మీద‌కు వ‌స్తే.. తేడా వ‌చ్చేస్తోంది. క‌ళ్ల ముందు త‌ప్పు క‌నిపిస్తే.. వారిలో శాంతం న‌శిస్తోంది. లాక్‌డౌన్ అని చెప్పినా.. షాపులు తెర‌వ‌ద్దు అని సూచించినా.. అన‌వ‌స‌రంగా బ‌య‌టకు రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసినా.. ప్ర‌జ‌లు రూల్స్ పాటించ‌డం లేదు. అందుకే క‌రోనా ఏమాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. కాబ‌ట్టే.. రోడ్డు మీద‌క వ‌చ్చిన ఆ యువ‌కుడిని చూసి ఛ‌త్తీస్‌గ‌ఢ్ క‌లెక్ట‌ర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు అనే వారు ఉన్నారు. కోపం వ‌స్తే మాట‌ల‌తో మంద‌లించాలి కానీ, ఖ‌రీదైన‌ సెల్‌ఫోన్ ప‌గ‌ల‌గొట్ట‌డం, చెంప మీద కొట్ట‌డం ఏంట‌ని మ‌రికొంద‌రు మండిప‌డుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ అలానే జ‌రిగింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను గాలికి వ‌దిద‌లేసి.. చెప్పుల షాపు తెర‌చిన యువ‌కుడికి అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఒక్క‌టిచ్చారు. అదేమంత త‌ప్పు కాద‌నేది మ‌రికొంద‌రి మాట‌. ఇలా ఎవ‌రి వాద‌న వారిదే. 

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో  మంటలు

విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్‌ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటల సమయంలో భారీగా పేలుడు శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. భయంతో కొందరు పరుగులు తీశారు.  13 ఫైర్ ఇంజన్లతో హెచ్‌పీసీఎల్‌లో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రమించారు. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఎటువంటి ప్రాణహాని, గాయాలు జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

తెలంగాణలో 18 ఏళ్ల పైవారికి వ్యాక్సిన్.. సూపర్ స్ప్రెడర్స్ కు ఫస్ట్ 

తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారికి  కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు రూపొందించింది ఆరోగ్య శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 25  లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని ఇప్పటికే అంచనా వేసింది. ఎక్కువగా జనంతో ఇంటరాక్ట్ అయ్యేవారిని... సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించారు. ఇలాంటి గ్రూపులు 25 ఉంటాయని.. ఒక్కో గ్రూప్ లో లక్ష మంది ఉంటారని లెక్క కట్టింది. ఇందులో ఆటో డ్రైవర్స్ సుమారు లక్ష మంది ఉంటారు. వీరికే మొదటగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తర్వాత వెజిటబుల్...మటన్...చికెన్ వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్స్, ఇస్త్రీ షాపులు, కిరాణా షాపు వ్యాపారులు, డెలివరీ బాయిస్, బార్బర్ షాప్స్.. ఇలా  సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించిన అందరికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని విదివిధానాలు రూపొందించింది తెలంగాణ ఆరోగ్య శాఖ.  

కిలాడీ యాక్ట‌ర్‌.. స్మ‌గ్లింగ్ లింకులు.. నాటు తుపాకులు సీజ్‌..

జ‌బర్ద‌స్త్‌. బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ కామెడీ షో. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఛాన్స్ రావ‌డ‌మే చాలా క‌ష్టం. అందులో న‌టించే వారికి ఫుల్ క్రేజ్‌. న‌వ్వుతూ, న‌వ్విస్తూ.. సంపాదించేది స‌రిపోక‌.. కొంత‌మంది కమెడియ‌న్లు అడ్డ‌దారులు తొక్కుతున్నారు. ఆ త‌ర్వాత పోలీసుల‌కు అడ్డంగా బుక్క‌వుతున్నారు.  గ‌తంలో ఓ జబర్దస్త్ నటడు వ్యభిచారం కేసులో చిక్కుకున్నాడు. తాజాగా, జబర్దస్త్‌లో న‌టించే మరో నటుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. ఆ న‌టుడు ఇంత‌కు ముందు కూడా ఓ సారి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కేసులో అరెస్ట్ కావ‌డం ఆస‌క్తిక‌రం.  చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తుండ‌గా 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల‌కు దొరికిపోయారు వారంద‌రిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. స్మ‌గ్ల‌ర్ల‌ నుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.  3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు పోలీసులు.  అయితే, విచార‌ణ‌లో భాగంగా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌కు జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు హరికి సంబంధాలు ఉన్నాయని తెలిసింద‌ని పోలీసులు చెబుతున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఈ అంశంపై న‌టుడు హరి సైతం స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని.. ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని ఆరోపించాడు హ‌రి. వీరిలో ఎవ‌రు చెప్పేది నిజ‌మో త‌దుప‌రి ద‌ర్యాప్తులో వెల్ల‌డికానుంది.   

మూడు రకాల ఆకులతో కొత్త మాస్క్.. భలే ఐడియా గురు.. 

ఎలాంటి టైములో అయినా కొంత మంది ఐడియాలు చూస్తే వాట్ ఏ ఐడియా గురు అనాల్సిందే.. కొంతమంది  ఐడియాలు చాలా యూనిక్ గా ఉంటాయి. మరి కొంత మంది ఆలోచన చూస్తే భలే ఐడియా అనిపిస్తుంది.  ఇతని ఐడియాను చూస్తే హవాక్ అవ్వాల్సిందే.. దేశంలో కరోనా వైరస్ మనుషులకు నేర్పుతున్న గుణపాఠం అంత ఇంత కాదు. మనుషులు రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు అంత పాత పద్ధతులు అవలంబిస్తున్నారు. తాజాగా కరోనా సోకకుండా రెండేసి మాస్కులు వేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటే.. ఈ సాధువు మాత్రం తానూ పెట్టుకున్న మాస్క్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇంతకీ ఆ సాధువు తయారు చేసిన మాస్క్ ఏంటి..? ఏ ఏ చెట్టు ఆకులతో ఆ మాస్క్ తయారు చేశాడు అని అనుకుంటున్నారా.. అయితే మారేందుకు ఆలస్యం..  దేశాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖానికి మాస్క్‌, ఫేస్‌షీల్డ్ ధరించమే కాకుండా చేతులను ఎప్పటికప్పుడు సానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో రెండేసి మాస్కులు, ఫేస్‌షీల్డ్ సైతం పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఓ సాధువు.. ప్రకృతిసిద్ధమైన మాస్క్ తయారు చేసుకుని ధరిస్తున్నాడు. జనపనారత తాళ్లతో తయారు చేసిన ఈ మాస్క్‌‌ను వేప, తులసి ఆకులతో నింపేశాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్వీట్ చేసిన ఈ సాధువు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఈ మాస్క్ పనిచేస్తుందనే గ్యారంటీ లేదు’’ అంటూ ఈ వీడియో పోస్టు చేశారు. ఆ సాధువు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని తెలిసింది. వీడియో తీసిన వ్యక్తితో ఆ సాధువు మాట్లాడుతూ.. ‘‘దీన్ని తులసి, వేప ఆకులతో తయారు చేశాను. ఈ ఆకుల్లో ఔషద గుణాలు ఉన్నాయి. సర్జికల్, క్లాత్ మాస్కుల కంటే ఈ మాస్కు బాగా పనిచేస్తుంది. తులసి, వేప.. ఎలాంటి రోగలనైనా నయం చేస్తాయి’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, మీరు మాత్రం ఆ సాధువులా ఆకుల మాస్కును పెట్టుకొనే ప్రయత్నం చేయకండి. వైద్యుల సూచనల ప్రకారం.. సర్జికల్, ఎన్-95, క్లాస్ మాస్కులను, ఫేస్‌షీల్ట్‌లను పెట్టుకోండి. ఇతరుల నుంచి భౌతిక దూరం పాటించండి.   

ఆనందయ్య మందుతో మ‌రో అద్భుతం.. నేత‌ల ముందే మిరాకిల్‌..

అత‌ను ఓ స్టూడెంట్‌. క‌రీంన‌గ‌ర్ జిల్లా పెద్ద‌ప‌ల్లి అత‌ని ఊరు. క‌రోనా సోకి అత‌ని ప‌రిస్థితి విష‌మంగా మారింది. ఆసుప‌త్రి వ‌ర్గాలు చేతులెత్తేశాయి. కుటుంబ స‌భ్యులూ ఆశ‌లు వ‌దులుకున్నారు. కానీ, చివ‌రి ప్ర‌య‌త్నం ఒక‌టి చేసి చూద్ధామ‌నుకున్నారు. ఆనంద‌య్య మందు ఇస్తే త‌మ పిల్లాడు బ‌తుకుతాడ‌నుకున్నారు. కానీ, ప్ర‌స్తుతం ఏపీలో ఆనంద‌య్య మందు నిలిపేశార‌ని ఎవ‌రో చెప్పారు. అయితేనేం.. ఇక్క‌డ ఉన్నా ఎలానూ చ‌నిపోయేదే.. అదేదో అక్క‌డికెల్లి అదృష్టాన్ని ప‌రీక్షించుకుందామ‌నుకున్నారు. వెంట‌నే అంబులెన్స్ వేసుకొని.. క‌రీంన‌గ‌ర్ నుంచి కృష్ణ‌ప‌ట్టం వ‌చ్చేశారు.  అదే స‌మ‌యంలో ఆనంద‌య్య మందు త‌యారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్ర‌తినిధి బృందం సంద‌ర్శించింది. సీనియ‌ర్ నేత సోమిరెడ్డి, బీద ర‌విచంద్ర ఆధ్వ‌ర్యంలో టీడీపీ నేత‌లు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. అదే టైమ్‌లో విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ తెలంగాణ స్టూడెంట్‌ను సైతం అక్క‌డికి తీసుకొచ్చారు. సోమిరెడ్డి సమక్షంలోనే ఆ బాధితుడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు మందు చుక్కలు వేశారు.  ఆశ్చ‌ర్యం. అద్భుతం. 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చున్నాడు. అక్కడున్న వారంతా ఆశ్య‌ర్య‌పోయారు. కోలుకున్న విద్యార్థి సైతం జ‌రిగిన మిరాకిల్‌ను కాసేపు న‌మ్మ‌లేక‌పోయాడు. త‌న‌లాంటి ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న బాధితుల పాలిట అప‌ర‌సంజీవ‌ని.. ఆనంద‌య్య మందు అంటూ కొనియాడాడు. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించాడు.  టీడీపీ నేత సోమిరెడ్డి సైతం త‌న క‌ళ్ల ముందే జ‌రిగిన ఘ‌ట‌న చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంత‌టి మ‌హ‌త్యం ఉన్న ఆనంద‌య్య మందును పంపిణీ చేయ‌కుండా.. ప‌రీక్ష‌లు, ప్రామాణికాలంటూ ప్ర‌భుత్వం నిలిపివేయ‌డం త‌గ‌దంటూ మండిప‌డ్డారు. పాల‌కులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ వెంట‌నే జరిగేలా సీఎం చొరవ తీసుకోవాలన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని, మళ్లీ నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద ర‌విచంద్ర అన్నారు.  ఇలా ఒక‌టా, రెండా.. ఆనంద‌య్య మందు ప్ర‌భావం, ఫ‌లితం వ‌ల్ల ఇప్ప‌టికే వేలాది మంది క‌రోనా బారి నుంచి ర‌క్షించ‌బ‌డ్డారు. కేవ‌లం ఆయుర్వేద ప్రామాణికం ప‌రంగా త‌యారీ విధానం లేద‌నే ఏకైకా కార‌ణంతో  ఆనంద‌య్య మందును అడ్డుకోవ‌డం ప్ర‌భుత్వ దుర్నీతికి నిద‌ర్శ‌నం. మందు తీసుకున్న వారంతా త‌మ‌కు బాగుంద‌ని చెబుతున్నారు. అధికారులు, ఆయుష్ అధిప‌తి సైతం.. ఈ మందులో త‌ప్పుబ‌ట్టాల్సింది ఏమీ లేదంటున్నారు. ఇచ్చేవారు సిద్ధంగా ఉన్నారు. తీసుకునే వారు ఎప్పుడెప్పుడా అని ఆరాట‌ప‌డుతున్నారు. మ‌రి ఎందుకు ఆల‌స్యం? జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఆనంద‌య్య మందును ఎందుకు ఆపేసింది?  పేద‌ల‌కు సంజీవ‌ని లాంటి ఆనంద‌య్య మందు అందించ‌కుండా స‌ర్కారు ఎందుకు అడ్డుకుంటోంది? 

కరోనాతో చ‌నిపోతే కుటుంబీకులకు జీతం.. టాటా స్టీల్ ఔదార్యం..

క‌రోనా, లాక్‌డౌన్‌ కార‌ణంగా కంపెనీల‌కు, వ్యాపారాల‌కు తాళాలు వేస్తున్నారు. బిజినెస్ దెబ్బ‌తిన్న‌దంటూ ఉద్యోగుల‌కు, కార్మికుల‌ను తీసేస్తున్నారు. 10 మంది ప‌ని చేయాల్సిన చోట ముగ్గురు సిబ్బందితోనే ప‌ని కానిచ్చేస్తున్నారు. కొవిడ్‌తో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి దేశంలో ల‌క్ష‌లాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మ‌వుతోంది చాలా మందికి. క‌రోనా కార‌ణంతో ఉద్యోగాల నుంచి అర్థాంత‌రంగా తీసేయ‌డంతో.. కొంద‌రు స్కూల్ టీచ‌ర్లు కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నారు. ప్రైవేటు ఉద్యోగులు కూలి ప‌నికి పోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌ల‌ను దేశ‌వ్యాప్తంగా అనేకం చూస్తున్నాము.  ఇంత‌టి క‌రోనా సంక్లిష్ట స‌మ‌యంలోనూ తమ ఔదార్యంతో అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంది టాటా స్టీల్ కంపెనీ. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నెల నెల జీతం య‌ధావిధిగా అందించాల‌ని నిర్ణ‌యించింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్‌ వయసు వచ్చే వరకు ప్రతి నెలా సాల‌రీ ఇవ్వ‌నుంది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా ఎప్ప‌టిలానే అందిస్తామ‌ని ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించింది.    కంపెనీలో ప‌నిచేస్తూ కరోనా బారిన పడి మరణించిన ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల పిల్ల‌ల గ్రాడ్యుయేషన్‌ చ‌దువుల‌ వరకు కంపెనీయే మొత్తం ఖర్చును భ‌రించ‌నున్న‌ది. నెల వేతనం అందించడంతో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. జంషేడ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ కంపెనీ ప్ర‌క‌ట‌న‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా నెటిజన్లు టాటా స్టీల్ నిర్ణ‌యాన్ని కొనియాడుతున్నారు. 

భలే అనిపించిన భర్త.. కిలో గోల్డ్ తో భార్యకు మంగళసూత్రం.. 

మనుషులంటే విలువ ఇస్తారో ఇవ్వరేమో గానీ. బంగారానికి చాలా మంది విలువ ఇస్తారు. ఏ మనిషైనా తన వంటి మీద అప్పుడో ఎప్పుడో కొంత బంగారాన్ని పెట్టుకోవాలనుకుంటాడు. ఇక ఇంట్లో అడవాళ్ల గురించి చెప్పనవసరం లేదు. బంగారం అంటే పిచ్చి. అందరికంటే నా సగ్గరే ఎక్కువ బంగారం ఉందని, ఎక్కువ డిసైన్స్ ఉన్నాయాని. అనిపించుకోవడానికి ప్రతి ఆడవాళ్లు ట్రై చేస్తుంటారు. ఎవరైనా బంగారం ఒక తులం కొంటారు. లేదంటే రెండు తులాలు, మహా అయితే పది తులాలు తీసుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా తన భార్యకు ఒక కేజీ బంగారంతో మంగళసూత్రం చేయించాడు.  పెళ్లైన హిందూ మహిళలు మంగళసూత్రం ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి తులమో.. 5 తులాలో.. మరీ డబ్బులు ఎక్కువగా ఉంటే 10 తులాలబంగారు మంగళసూత్రాన్ని చేయించుకుని దర్జాగా మెడలో వేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కేజీ బంగారంతో తయారు చేయించిన తాళి ని  గిఫ్ట్ గా  ఇచ్చాడు. దాన్ని ఆ మహిళ మెడలో ధరించి వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ‘కేజీ బంగారు తాళి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అధికంగా బంగారాన్ని కలిగి ఉండటం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడమంటే దొంగలకు వెల్‌కమ్ చెప్పడమే. అందుకే బాలాను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించాం. అది నకిలీ బంగారమని చెప్పాడు. సదరు షాపులో ఎంక్వైరీ చేయగా అది ఫేక్ అని తేలింది’ అని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని భీవాండికీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో మంగళసూత్రం చేయించాడు. ఆ మంగళ సూత్రం అంత ఇంత కాదు తన భార్య మోకాళ్ళ వరకు ఉంది. ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు బాలాను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడు చెప్పిన విషయం విని అంతా షాకయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని, దాన్ని ఓ బంగారు షాపు నుంచి రూ.38వేలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగారు షాపు నిర్వాహకులను విచారించగా వారు కూడా అదే చెప్పడంతో పోలీసులు బాలాను విడిచిపెట్టారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా! కేంద్ర హోంశాఖ మంత్రికి లోకేష్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు  వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెల రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను విద్యాశాఖ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేయగా.., కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గోవా, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలు వాయిదా వేశాయి.  ఈ విషయాన్ని కూడా తమ నివేదికలో విద్యాశాఖ వివరించిందని తెలుస్తోంది.  విద్యాశాఖ ఇచ్చిన నివేదికతో  టెన్త్ పరీక్షల వాయిదాపై రెండు, మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశముంది. కరోనా కట్టడి దృష్ట్యా ఈనెల 31 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండటం, కొన్ని స్కూళ్లను ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. దీంతో పరీక్షలకు ఏర్పాటు చేయడం కష్టమని విద్యాశాఖ భావిస్తోంది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని ఏపీ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో అంతర్గత పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని హెచ్ఎంలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.   ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజా విసురుతుండటంతో  టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తీవ్ర చర్చనీయాంశమైంది. పరీక్షలను రద్దు చేయాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు కూడా పరీక్షలను రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరాయి.  విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పడం లేదని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభం కావాల్సిన ఇంటర్ పరీక్షలు హైకోర్టు జోక్యంతో వాయిదా పడ్డాయి.  పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి ఏపీలో పరీక్షలు రద్దు చేయాలని మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తాజాగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో హోంమంత్రిని కోరారు నారా లోకేష్. కరోనా కల్లోల సమయంలోనూ విద్యార్థుల జీవితాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడే ప్రయత్నం చేస్తుందని లోకేష్ ఆరోపించారు. 

జీపు డ్రైవర్.. డిఎస్పీ అవతారం.. 

అతని పేరు రాచర్ల శ్రీనివాస్.  2005 లో అనంతపురం జిల్లా కదిరి పోలీసుస్టేషన్ లో పోలీస్ జీపు డ్రైవర్‌గా పనిచేశాడు. అనంతరం వ్యసనాలకు బానిసై నేరాలబాట పట్టాడు. పోలీసుల మాట తీరు, విధి నిర్వహణపై ఉన్న అవగాహనతో అధికారినంటూ ప్రజలను సులభంగా నమ్మించేవాడు. చిత్తూరు, బెంగళూరులో ఆయనపై 50వరకు చైన్‌స్నాచింగ్‌ కేసులున్నాయి. గతంలో చిత్తూరు ఎస్పీ ఎదుట లొంగిపోయి ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించిన శ్రీనివాస్ జైలు నుంచి బయటికొచ్చాక మళ్లీ నేరాల బాట ఎంచుకున్నాడు. ఆ తర్వాత వేరే దుకాణం స్టార్ట్ చేశాడు. అదే డిఎస్పీ అవతారం. ఎక్సమ్ రాసి మాత్రం కోదండోయ్.. అలా మని లంచం ఇచ్చికూడా జాబ్ చేయలేదు. ఓన్లీ తన మాటతో అందరిని నమ్మించి.. అతను పధకం  వేస్తే పని అయిపోవాల్సిందే.. పక్కవాడి జేబులు చిల్లు పడాల్సిందే.. అదెలా..? అని  అనుకుంటున్నారా ..? అంతక ముండు పోలీస్ జీపుగా డ్రైవర్ గా పనిచేశాడు కదా.. అదే అతని బలం అయింది ఎదుటి వాడికి బలహీనత అయింది. ఎందుకంటే ఆ ఉద్యోగం మానేసిన తరువాత అతని యవ్వారం నడిపింది ఆ దైర్యం తోనే అనుకోవాలి ఒకరకంగా. ఉద్యోగం పోయిన అధికారులు, అతని టార్గెట్ అని చెప్పాలి ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..  ఏసీబీ కేసుల్లో ఉన్న, సస్పెండైన అధికారులే లక్ష్యంగా చేసుకుని తాను ఏసీబీ, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనంటూ వారిని నమ్మించేవాడు. కేసుల నుంచి విముక్తి కల్పిస్తానంటూ డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయేవాడు. కొన్నాళ్ల క్రితం సామర్లకోటలో గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడం వల్ల ఎద్దులు చనిపోగా.. బాధిత రైతుకు శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి డీఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. ఎద్దులకు రూ.45 లక్షల బీమా పరిహారం ఇప్పిస్తానంటూ ఆ రైతు నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. రాచపల్లి శ్రీనివాస్‌  తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 70కి పైగా కేసులున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోడ పోలీసులు అరెస్ట్ చేశారు. సామర్లకోట ఎస్ఐ సుమంత్‌ కథనం మేరకు.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వెలమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీనివాస్‌ ఏసీబీ, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనంటూ పరిచయం చేసుకొని పలువురిని మోసం చేశాడు. అతడిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 70కి పైగా కేసులున్నాయి. విజయవాడ జైలు నుంచి విడుదలై విశాఖపట్నానికి మకాం మార్చేందుకు వెళ్తున్న అతడిని సోమవారం ప్రత్తిపాడు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు.