భలే అనిపించిన భర్త.. కిలో గోల్డ్ తో భార్యకు మంగళసూత్రం..
posted on May 25, 2021 @ 2:53PM
మనుషులంటే విలువ ఇస్తారో ఇవ్వరేమో గానీ. బంగారానికి చాలా మంది విలువ ఇస్తారు. ఏ మనిషైనా తన వంటి మీద అప్పుడో ఎప్పుడో కొంత బంగారాన్ని పెట్టుకోవాలనుకుంటాడు. ఇక ఇంట్లో అడవాళ్ల గురించి చెప్పనవసరం లేదు. బంగారం అంటే పిచ్చి. అందరికంటే నా సగ్గరే ఎక్కువ బంగారం ఉందని, ఎక్కువ డిసైన్స్ ఉన్నాయాని. అనిపించుకోవడానికి ప్రతి ఆడవాళ్లు ట్రై చేస్తుంటారు. ఎవరైనా బంగారం ఒక తులం కొంటారు. లేదంటే రెండు తులాలు, మహా అయితే పది తులాలు తీసుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా తన భార్యకు ఒక కేజీ బంగారంతో మంగళసూత్రం చేయించాడు.
పెళ్లైన హిందూ మహిళలు మంగళసూత్రం ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి తులమో.. 5 తులాలో.. మరీ డబ్బులు ఎక్కువగా ఉంటే 10 తులాలబంగారు మంగళసూత్రాన్ని చేయించుకుని దర్జాగా మెడలో వేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కేజీ బంగారంతో తయారు చేయించిన తాళి ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దాన్ని ఆ మహిళ మెడలో ధరించి వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు.
‘కేజీ బంగారు తాళి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అధికంగా బంగారాన్ని కలిగి ఉండటం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడమంటే దొంగలకు వెల్‌కమ్ చెప్పడమే. అందుకే బాలాను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించాం. అది నకిలీ బంగారమని చెప్పాడు. సదరు షాపులో ఎంక్వైరీ చేయగా అది ఫేక్ అని తేలింది’ అని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని భీవాండికీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో మంగళసూత్రం చేయించాడు. ఆ మంగళ సూత్రం అంత ఇంత కాదు తన భార్య మోకాళ్ళ వరకు ఉంది. ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు బాలాను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడు చెప్పిన విషయం విని అంతా షాకయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని, దాన్ని ఓ బంగారు షాపు నుంచి రూ.38వేలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగారు షాపు నిర్వాహకులను విచారించగా వారు కూడా అదే చెప్పడంతో పోలీసులు బాలాను విడిచిపెట్టారు.