మూడు రకాల ఆకులతో కొత్త మాస్క్.. భలే ఐడియా గురు..
posted on May 25, 2021 @ 3:43PM
ఎలాంటి టైములో అయినా కొంత మంది ఐడియాలు చూస్తే వాట్ ఏ ఐడియా గురు అనాల్సిందే.. కొంతమంది ఐడియాలు చాలా యూనిక్ గా ఉంటాయి. మరి కొంత మంది ఆలోచన చూస్తే భలే ఐడియా అనిపిస్తుంది. ఇతని ఐడియాను చూస్తే హవాక్ అవ్వాల్సిందే.. దేశంలో కరోనా వైరస్ మనుషులకు నేర్పుతున్న గుణపాఠం అంత ఇంత కాదు. మనుషులు రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు అంత పాత పద్ధతులు అవలంబిస్తున్నారు. తాజాగా కరోనా సోకకుండా రెండేసి మాస్కులు వేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటే.. ఈ సాధువు మాత్రం తానూ పెట్టుకున్న మాస్క్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇంతకీ ఆ సాధువు తయారు చేసిన మాస్క్ ఏంటి..? ఏ ఏ చెట్టు ఆకులతో ఆ మాస్క్ తయారు చేశాడు అని అనుకుంటున్నారా.. అయితే మారేందుకు ఆలస్యం..
దేశాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖానికి మాస్క్, ఫేస్‌షీల్డ్ ధరించమే కాకుండా చేతులను ఎప్పటికప్పుడు సానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో రెండేసి మాస్కులు, ఫేస్‌షీల్డ్ సైతం పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఓ సాధువు.. ప్రకృతిసిద్ధమైన మాస్క్ తయారు చేసుకుని ధరిస్తున్నాడు. జనపనారత తాళ్లతో తయారు చేసిన ఈ మాస్క్‌ను వేప, తులసి ఆకులతో నింపేశాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్వీట్ చేసిన ఈ సాధువు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఈ మాస్క్ పనిచేస్తుందనే గ్యారంటీ లేదు’’ అంటూ ఈ వీడియో పోస్టు చేశారు. ఆ సాధువు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని తెలిసింది.
వీడియో తీసిన వ్యక్తితో ఆ సాధువు మాట్లాడుతూ.. ‘‘దీన్ని తులసి, వేప ఆకులతో తయారు చేశాను. ఈ ఆకుల్లో ఔషద గుణాలు ఉన్నాయి. సర్జికల్, క్లాత్ మాస్కుల కంటే ఈ మాస్కు బాగా పనిచేస్తుంది. తులసి, వేప.. ఎలాంటి రోగలనైనా నయం చేస్తాయి’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, మీరు మాత్రం ఆ సాధువులా ఆకుల మాస్కును పెట్టుకొనే ప్రయత్నం చేయకండి. వైద్యుల సూచనల ప్రకారం.. సర్జికల్, ఎన్-95, క్లాస్ మాస్కులను, ఫేస్‌షీల్ట్‌లను పెట్టుకోండి. ఇతరుల నుంచి భౌతిక దూరం పాటించండి.