తండ్రి శవం ముందు.. తనయుల గొడవ..

తండ్రి శవం ఒక వైపు. ఆ శవం ముందు ఇద్దరు అన్నదమ్ముల గొడవ మరోవైపు. అందరు కలిసి ఆ తండ్రిని స్మశానానికి పంపించాల్సింది పోయి. తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని తగులతకు దిగారు ఇద్దరు తనయులు. వాళ్ళు అలా చేయడం చూసి ఒకసారిగా  అక్కడ ఉన్న స్థానికుల్లో ఆందోళన కలిగించడంతో పాటు, శవాన్ని ముందు పెట్టుకుని ఈ అన్నదమ్ములు గొడవ పడడం ఏంటని, అసలు ఈ కొడుకులకు తండ్రి మీద ఏమైనా ప్రేముందా.. అసలు వీళ్ళను కొడుకులు అని అంటారా అని  అందరు నోటిమీద వేలు వేసుకున్నారు. ఆ కొద్దిసేపట్లో ఆ ఇద్దరు కొడుకులు మానవత్వం మరిచారు. తండ్రి అంతిమయాత్రలో ఎవరైనా ఒక కుమారుడు ముందు నడిచి క్రియా కార్యక్రమాలను పూర్తి చేయడం ఆనవాయితీ. కానీ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలో తండ్రి శవానికి నిర్వహించే అంతిమ యాత్రలో ముందు నేను నడుస్తా అంటే కాదు.. నేను నడుస్తాను అని అన్నదమ్ములిద్దరూ పోటీపడి చివరకు పంచాయతీని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఎటూ తేలకపోవడంతో ఇద్దరు అన్నదమ్ములు అంతిమ యాత్ర ముందు ఎవరికి వారుగా నడిచి అంత్యక్రియల తతంగాన్ని ముగించారు. వివరాల్లోకి వెళితే.. గన్ముక్ల గ్రామ మాజీ సర్పంచ్ సాలే కతాలప్పకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ప్రస్తుత గ్రామ సర్పంచ్ చంద్రయ్య, తిమ్మయ్య, మరో కూతురు ఉండగా రెండో భార్యకు కుమారుడు కృష్ణమోహన్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుధవారం మృతి చెందిన కతాలప్ప అంత్యక్రియలను నిర్వహించేందుకు బంధువులు, మిత్రులకు సమాచారం ఇచ్చారు. అంతిమ యాత్ర సందర్భంగా చంద్రయ్య, కృష్ణమోహన్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ విషయంపై కుల పెద్దలు చెప్పినా అన్నదమ్ములు అంగీకరించలేదు. చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి చక్కపడకపోవడంతో అన్నదమ్ములు ఇరువురు తండ్రి అంతిమయాత్ర ముందు చేతిలో చెంబు పట్టుకొని బయలుదేరారు. అంత్యక్రియల కార్యక్రమాలను ఎవరికివారుగా నిర్వహించుకొని వెళ్లిపోయారు. అంతిమయాత్ర విషయంలో అన్నదమ్ములు పోటీపడడం చుట్టుపక్కల గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది.

మెహుల్‌ చోక్సీ దొరికాడు.. భారత్ కు అప్పగిస్తారా? 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ జాడ ఎట్టకేలకు తెలిసింది. అంటిగ్వా నుంచి క్యూబా పారిపోతున్న మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటిగ్వా నుంచి క్యూబాకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా మెహుల్ చోక్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం అంటిగ్వాలో ఆయన మిస్సయ్యారు.  విందు కోసం రెస్టారెంట్ కు వెళ్లిన మెహుల్‌ చోక్సీ.. కనిపించకుండా పోయారు. ఆయన కారు మాత్రం సముద్రం దగ్గరలో కనిపించింది. దీంతో సముద్ర మార్గం ద్వారా క్యూబాకు వెళ్లిపోయి ఉంటారని భావించారు.  పీఎన్‌బీ కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన అనంతరం మెహుల్‌ చోక్సీ భారత్‌ను వీడి అటిగ్వా, బార్బుడాకి పారిపోయారు. రూ.13,500 కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మోహుల్‌ చోక్సీ అదృశ్యంపై ఇప్పటికే ఇంటర్​పోల్​ నోటీసులు జారీ చేసింది. చోక్సీ.. కరేబియన్‌లోని చిన్న ద్వీప దేశమైన డొమినికాకు సముద్రంలో పడవ ద్వారా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అంటిగ్వా అధికారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ మేరకు సీబీఐ, ఈడీకి సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చోక్సీ అప్పగింతపై అంటిగ్వా, భారత్‌కు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని డొమినికా ప్రధాని వెల్లడించారు. అంటిగ్వాతో చర్చల అనంతరం భారత్‌కు అప్పగించేందుకు సహకరిస్తామని వెల్లడించారు.  2018లో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే మెహుల్‌ చోక్సీ, అతని మేనల్లుడు, ప్రముఖ ఆభరణాల వ్యాపారి అయిన నీరవ్‌ మోదీ భారత్‌ నుంచి పరారైన విషయం తెలిసిందే. మెహుల్‌ ఆంటిగ్వా పౌరసత్వం తీసుకోగా.. నీరవ్‌ మోదీ లండన్‌కు పారిపోయాడు. ప్రస్తుతం వారిని దేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  

కొడుకు ఫ్రెండ్ తో తల్లి.. వామ్మో ఇంత దారుణమా..?

కామం ప్రతి మనిషిలో ఉండే కోరిక.. కొంత మందికి  పెళ్లి అయి పిల్లలు పుట్టాక అన్ని మర్చిపోయి పిల్లలు కుటుంబం సర్వం అనుకుని ఉంటారు. ఇంకొంత మందికి పక్కింటి పప్పు రుచిగా ఉన్నట్లు ఇంట్లో ఎంత మంచి మొగుడు ఉన్న, లేదా పెళ్ళాం ఉన్న వేరేవాళ్లతో యవ్వారం నడుపాలనుకుంటారు. ఈ మధ్య కాలం లో ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి.   కట్టుకున్నవారిని కొంత మంది ఖతం చేస్తే, ఇంకొంత మంది  గాలికి వదిలేసి, మరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పెద్దా, చిన్నా అని కూడా తేడాలేకుండా  కామ క్రీడలలో మునిగితేలుతున్నారు. చివరికి ఈ సంబంధాల వలన సొంతవారి చేతిలోనే కొంతమంది హత్యకు గురవుతున్నారు. మరి కొంత మంది హత్యలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కొడుకు స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని కామ క్రీడలు నడిపిస్తుందని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ప్రముఖ పట్ణణంలో వ్యాపారస్తుడైన కరీం, అతని భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి 19ఏళ్ల  కుమారుడు ఉన్నాడు.  కరీం భార్య పెళ్లి చేసుకుందనే మాటేగాని ఎప్పుడు జల్సా చేస్తూ ఉండేది. తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండేది.  ఈ నేపథ్యంలోనే  కుమారుడు స్నేహితుడైన షఫీ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తువెళ్తూ ఉండేవాడు. ఇక అంతే షఫీపై ఆమె కన్నువేసింది. ఎలాగైనా ఆమెతో పక్క పక్కపంచుకోవాలనుకుంది. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా యువకుడు రెచ్చిపోయే విధంగా అర్ధ నగ్నంగా ఎక్స్ పోజ్ చేస్తూ అటుఇటు తిరుగుతూ  కనిపించేది. ఏ మగాడైనా ఎప్పుడో అప్పుడు ఆడదానికి పడినట్టు  ఆ యువకుడికి డబ్బు ఆశ చూపి, జల్సాలకు డబ్బు ఇస్తానని మాయమాటలు చెప్పి యువకుడిని లొంగతీసుకుంది. షఫీ కూడా డబ్బు రావడంతో మహిళతో సంబంధం కంటిన్యూ చేస్తూ  ఎంజాయ్ వస్తున్నాడు. వీరి యవ్వారం మలయాళం మల్లు ఆంటీ సినిమాల సాగుతుంది. అది అలా ఉండగా  వీరి సంబంధం గురుంచి చుట్టుపక్కల వారు కరీం చెవిన వేశారు.  కట్ చేస్తే కరీం భార్యపై నిఘా పెట్టాడు. ఓ రోజు పనిమీద బయటికి వెళ్లివస్తానని భర్త చెప్పడంతో భార్య, భర్తకు డోర్ మూసి ఆ  యువకుడికి డోర్ తెరిచింది. ఆ యువకుడు ఇంటికి వచ్చారు రాసలీలలు స్టార్ట్ చేశారు. అంటే అంతలో ప్లాన్ ప్రకారం బయటికి వెళ్లిన భర్త ఇంటికి వచ్చాడు. బెడ్ పై యువకుడితో నగ్నంగా ఉన్న భార్యను చూసి కోపంతో రగిలిపోయాడు. వెంటనే కిచెన్ లోని కత్తితో భార్యను పొడిచి హత్యచేశాడు. యువకుడిపై కూడా దాడి చేయబోతుండగా అతను  పరారయ్యాడు. అనంతరం భార్యను పొడిచిన కత్తితో పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన  బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ చోటు చేసుకుంది.

గాలి ద్వారా క‌రోనా.. ప్రోటోకాల్‌ మార్పు.. కొవిడ్ మందుల‌పై మ‌రింత‌ క్లారిటీ..

క‌రోనా వైర‌స్ ఏ ఒక్క‌రికీ అంతుచిక్క‌డం లేదు. ప్ర‌పంచ స్థాయి సైంటిస్టుల‌కూ చుక్క‌లు చూపిస్తోంది. అందుకే, ఎప్ప‌టిక‌ప్పుడు కొవిడ్ రూల్స్ మారిపోతున్నాయి. చికిత్సా విధానం, మందులు, జాగ్ర‌త్త‌లు, నిబంధ‌న‌లు అన్నిటినీ స‌వ‌రిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ను ప‌క్క‌న పడేశారు. అటు, క‌రోనా వ్యాప్తి పైనా మ‌రింత క్లారిటీ వ‌స్తోంది. మొద‌ట్లో గాలి ద్వారా క‌రోనా రాద‌న్నారు. కానీ, ఇటీవ‌ల అభిప్రాయం మార్చేసుకున్నారు. గాలి ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తుంద‌ని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశాన్ని కొవిడ్‌-19 క్లినికల్‌ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో చేర్చింది. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కొవిడ్‌ నియమాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.   ‘కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వైరస్‌ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య 1 మీటరు కంటే తక్కువ దూరం ఉన్న సమయంలో నోటి తుంపర్ల నుంచి ఎదుటివారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా సోకే ప్రమాదం ఉంటుంది. కానీ వెంటిలేషన్‌ తక్కువగా ఉన్న ప్రాంతాలు/రద్దీగా ఉండే ఇంటిలోపలి ప్రాంతాల్లో వైరస్‌ ఎక్కువ సమయం ఒకేచోట స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో వైరస్ మీటరు కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆస్కారం ఉంటుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనను కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ప్రోటోకాల్‌లో వెల్లడించింది.  గతేడాది జూన్‌లో విడుదల చేసిన ప్రోటోకాల్‌లో.. వైరస్‌ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం, తుమ్మడం, దగ్గడం వల్ల వచ్చే శ్వాసబిందువులతో వైరస్‌ వ్యాపిస్తుందని మాత్రమే వెల్లడించింది. తాజాగా గాలి ద్వారాను వైరస్‌ వ్యాపిస్తుందనే అంశాన్ని చేర్చింది.  గాలిలో వైరస్‌ వ్యాప్తిపై ఇటీవ‌ల‌ కేంద్ర ఆరోగ్యశాఖ శాస్త్రీయ సలహాదారు కూడా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ‘తుంపర్ల ద్వారా గాలిలో వైరస్‌ దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో వైర‌స్‌తో కూడిన‌ ఏరోసోల్స్‌ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇళ్లు, పని ప్రదేశాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి’ అని ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా చికిత్స, ఔషధాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా కొవిడ్‌ నియమాల్లో చేర్చింది. ఐవర్‌మెక్టిన్‌ మాత్రలు, స్టెరాయిడ్ల వాడకంపై స్పష్టతనిచ్చింది. స్వల్ప లక్షణాలున్న బాధితులకు ఐవర్‌మెక్టిన్‌ రోజుకు ఒకటిచొప్పున మూడు నుంచి ఐదు రోజుల వరకు తీసుకోవచ్చని సూచించింది. స్టెరాయిడ్ల వాడకంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా స్వల్ప లక్షణాలున్న వారికి ఇవి అవసరం లేదని సూచించింది. లక్షణాలు ఏడు రోజులకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు స్వల్ప డోసులో వాడవచ్చని తెలిపింది. రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ ఔషధాలను అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఆనందయ్య మందు వచ్చేది అప్పుడేనా? 

కృష్ణపట్నం ఆనందయ్య మందుపై అధ్యయనం కొనసాగుతోంది. ఈ మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు చేసిన నివేదిక అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నారు.  ఆనందయ్య మందుపై మరో రెండురోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి.. మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగించాలని శాస్త్రవేత్త భావిస్తున్నారు. సృజన లైఫ్‌ ల్యాబ్‌కు ప్రయోగాలకు అర్హతపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఆనందయ్య మందుపై అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని తెలిపారు. ప్రయోగాలకు 14 నుంచి 28 రోజులు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో.. తమ ల్యాబ్‌లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని, కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంతువుకు కరోనా సోకించి పరీక్ష చేసే వ్యవస్థ తమ దగ్గర లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనందయ్య మందును ప్రజలకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చే వ‌రకు ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది. 

యుద్ధ ట్యాంకులు రాష్ట్రాలనే కొనుక్కోమంటారా? మోదీపై కేజ్రీవాల్ ఫైర్‌..

కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ స‌ర్కార్‌. పీఎం మోదీ వ‌ర్సెస్ సీఎం కేజ్రీవాల్‌. క‌రోనా స‌మ‌యంలో రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య వివాదం వార్‌గా మారుతోంది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో ఉదాసీన‌త‌పై కేంద్రాన్ని కేజ్రీవాల్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌డిగి పారేస్తున్నారు. కోర్టుకు వెళ్లి.. పోరాడి మ‌రీ.. ఢిల్లీకి కావ‌ల‌సిన ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను తెప్పించుకున్నారు. అయితే, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా మెరుగుప‌డినా.. వ్యాక్సినేష‌న్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. కేంద్ర అసంబ‌ద్ధ చ‌ర్య‌ల వ‌ల్లే.. వ్యాక్సినేష‌న్ విధానం అస్థ‌వ్య‌స్థంగా మారిందంటూ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు కేజ్రీవాల్‌.  ‘‘కేంద్రం వ్యాక్సిన్లను కొనడం లేదు. అలాగని రాష్ట్రాలకు స్వేచ్ఛనూ ఇవ్వడం లేదు. ప్రస్తుతం మనం కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒకవేళ పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా?.. సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా?’’ అంటూ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు.  ఇతర దేశాల లాగా కాకుండా భారత్‌లో ఆరు నెలల ఆలస్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు కేజ్రీవాల్‌. మొదటి వ్యాక్సిన్ భారతీయులే భారత్‌లో తయారు చేశారని, అప్పటి నుంచి టీకా నిల్వలు పెంచితే, సెకండ్ వేవ్‌ను సమర్థమంతంగా ఎదుర్కొని ఉండేవారని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ మాట‌లు తూటాల్లా కేంద్ర స‌ర్కారును తూట్లు పొడుస్తున్నాయి. 

భారత్ లోనే బ్లాక్ ఫంగస్ డేంజర్! మన వైద్య చికిత్సలోనే లోపమా? 

కరోనా సెకండ్ వేవ్‌ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కరోనా వైరస్ తో రోజూ వేలాది మంది చనిపోతున్నారు. లక్షలాది మంది మృతువు అంచు వరకు వెళ్లి బతికి బట్టకడుతున్నారు. కరోనాను జయించిన ఆనందం వాళ్లలో ఉండటం లేదు.  బ్లాక్ ఫంగస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారే ఎక్కువగా ఈ వ్యాధి భారీన పడుతున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ ఉధృతి పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బాగా వెలుగు చూశాయి. తాజాగా కర్ణాటకలో ఈ ఫంగస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయంలో పేషెంట్లపై ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఇంతకు ముందు కూడా దేశంలో ఈ ఫంగస్ వ్యాధి ఉంది. కానీ ఇంతలా కాదు. ఏడాది మొత్తం చూసుకుంటే అడపాదడపా ఓ వంద కేసులు కనిపించేవి.  కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరోనా కారణంగా బలహీనంగా మారిన పేషెంట్లపై ఈ ఫంగస్ దాడి చేస్తోంది. ఇదే ఇప్పుడు  ప్రజలను, వైద్యులను  భయపెడుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించింది. భారత్ కంటే అమెరికాలో ఎక్కువ మందికి కరోనా సోకింది. బ్రెజిల్ లో మన కంటే ఎక్కువ మరణాలు నమోద్యయాయి. చాలా దేశాలు కరోనాతో వణికిపోయాయి. అయితే బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం ఒక్క ఇండియాలోనే విపరీతంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ఇప్పుడు వైద్య నిపుణులకు అర్ధం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా.. ఇండియాలోనే కరోనా జయించిన వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎందుకు వస్తున్నాయన్నది మిస్టరీగా మారింది. విదేశాల్లో కరోనాకు అందించిన వైద్యానికి.. మన దేశంలో అందిస్తున్న చికిత్సకు తేడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన చికిత్సలో ఏదైనా లోపం ఉందా... ఆ కారణంగానే బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయా అన్న అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా కరోనా రోగులకు విపరీతంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు కొందరి నుంచి వస్తున్నాయి.  కర్ణాటక వైద్యులకు కూడా ఇదే అనుమానం వచ్చింది. దీంతో  దీనికి కారణాలు కనుక్కునే పనిలో పడ్డారు. బ్లాక్ ఫంగస్ లేక మ్యూకర్‌మైకాసిస్ అనే ఈ వ్యాధి గురించి చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీ ఎన్ అశ్వథనారాయణ్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యులందరూ అసలు బ్లాక్ ఫంగస్ ఎక్కడి నుంచి వ్యాపిస్తోంది? దీనికి కారణాలేంటి? అనే విషయంపై చర్చించారు. ఈ చర్చలో కీలకంగా మారిన అంశం కరోనా పేషెంట్లకు అందజేస్తున్న ఆక్సిజన్ సరఫరా విధానమే. హాస్పిటల్స్ కు సరఫరా అవుతున్న ఆక్సిజన్, పైపింగ్, సిలిండర్ల నాణ్యతే అయ్యుండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కలుషితమైన ఆక్సిజన్ కారణం అయ్యుండొచ్చని డాక్టర్లు అంటున్నారు. సిలిండర్లలోకానీ, లేదంటే ఆస్పత్రుల్లో ఐసీయూల్లో ఉన్న పైపింగ్ వ్యవస్థలోకానీ నాణ్యతా లోపం కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణం కావొచ్చంటున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల్లో కలుషిత పరిస్థితులు, అలాగే స్టెరిలైజేషన్ లోపం కూడా బ్లాక్ ఫంగస్‌కు ఆధారం కావొచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇలా ఎక్కడో ఒకచోట ఆక్సిజన్ సరఫరా కలుషితం కాకపోతే ఇన్ని బ్లాక్ ఫంగస్ కేసులు రావడం జరగదని, అదే జరిగితే పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లేనని వాళ్లు వివరించారు.  డాక్టర్లు లేవనెత్తిన మరో కలవరపరిచే అంశం ఆస్పత్రి వెంటిలేటర్లలో ట్యాప్ వాటర్ ఉపయోగించడం. అసలు ఇలా చేస్తారా? అని అనుమానాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు విపరీతంగా పెరగడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పరిశ్రమల నుంచి అధిక మొత్తాల్లో ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్టెరిలైజేషన్ సరిగా జరుగుతుందా? పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తున్నారా? అన్నది చూడకుండానే ఉపయోగిస్తున్నారు. ఆక్సిజన్ నాణ్యత పరిశీలించకుండానే రోగులకు అందిస్తున్నారు.ఇది కూడా బ్లాక్ ఫంగస్ కు కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి బ్లాక్ ఫంగస్ కేసులతో మన దేశ వైద్య వ్యవస్థ ఎంతటి దారుణ పరిస్థితుల్లో ఉందో అర్ధమవుతోంది. హాస్పిటల్స్ లో మౌలిక వసతుల లేమి, ఆక్సిజన్ సరఫరా సిస్టమ్ సరిగా లేకపోవడం, పైప్ లైన్ వ్యవస్థ గందరగోళంగా ఉండటం.. వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి లోపాలను ఎత్తి చూపుతున్నాయి. కొవిడ్ చికిత్సపై మార్గదర్శకాలు ఇస్తున్న ఐసీఎంఆర్ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం గందరగోళంగా మారింది. కొవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా వైద్య విధానంలోని లోపాల వల్లే విదేశాల్లో ఎక్కడా లేకుండా ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ విస్తరిస్తుందనే అభిప్రాయం వైద్య నిపుణుల నుంచి వస్తోంది. ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకొని ఇకనైనా హాస్పిటల్స్ లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది... 

జూడా సమ్మె  తప్పెవరిది?

నిజమే, రాష్ట్రమే కాదు మొత్తంగా దేశమే కరోనా మహామ్మారితో పోరాటం చేస్తున్న సమయంలో, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం సమంజసం కాదు. కానీ, అదే సమయంలో ఇలాంటి సమయంలో అయినా జూనియర్ డాక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అసలే సమంజసం కాదు. ఒక విధంగా అది అధికారుల  అపరాధం.  నిజానికి, కరోనాపై డాక్టర్లు (వాళ్ళు జూనియర్లే అయినా సీనియర్లే అయినా), వైద్య సిబ్బంది, నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు.డాక్టర్లే కాదు  ఫ్రంట్లైన్  వారియర్స్’ అందరూ కూడా   కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలకు విలువ కట్టడం అయ్యే పనికాదు. అలాంటిది ఇచ్చిన హామీని నెలలు గడచినా అమలు చేయక పోవడం అపరాధం మాత్రమే కాదు .. అందకు మించిన తప్పిదం, మహాపరాధం.   మాట ఇవ్వడం, ఇచ్చిన మాట తప్పడం పాలకులకు కొత్త కాదు. పాలకులు అందరికీ అది అలవాటే, ఈ విషయంలో  కేసీఆర్ మినహాయింపు కాదు. నిజం చెప్పాలంటే, ఆడిన మాట తప్పడంలో ఆయన అందరికంటే నాలుగు ఆకులు  ఎక్కువే చదివారు.అయితే, ఆ వివరాలలోకి వెళ్లేందుకు ఇది సమయం కాదు. కానీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జూనియర్ డాక్టర్ల సేవలను గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం పెంచుతామన్న 15 శాతం గౌరవ వేతనం తక్షణమే పెంచడంతో పాటుగా జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించమని అధికారులను ఆదేశించడం స్వాగతించదగిన పరిణామం. అయితే, జూనియర్ డాక్టర్లు ఎదో తప్పు చేశారనే బావనతో వారి పై ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం  సరికాదు,సమంజసం కాదు. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్లనే జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగారు కాబట్టే, సమస్య  మక్యమంత్రి  దృష్టికి మళ్ళీ వెళ్ళింది .. ఆయన  జూనియర్‌ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు బంతి అధికారుల కోర్టులో వుంది.

ఆర్థిక వ్యవస్థ పై  కరోనా దెబ్బ ...

లాక్ డౌన్ వలన కరోనా కాటు కొంత తగ్గుతుంది. ప్రజల ప్రాణాలకు కొంత భరోసా ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం క్షీణిస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్’లో అదే జరిగింది. ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్’లోనూ  అదే జరిగింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఇతర ఆంక్షలు విధించాయి. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, (2021-22) తొలి త్రైమాసికంలో, దేశ ఆర్థిక  వ్యవస్థ సుమారు రూ. 5 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అయితే, ఇది గత  సంవత్సరం తొలి త్రైమాసికంలో సంభవించిన నష్టం, రూ. 11లక్షల కోట్లలో సగానికంటే కూడా కొంచెం తక్కవ. గత సంవత్సరం, కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్, ఇతర ఆంక్షలు విధించింది. ఈ సారి, స్థానిక పరిస్థితి ఆధారంగా ఆంక్షలు విధించే అధికారాన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు వదిలివేయడంతో, ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావ భారం కొంత తగ్గింది.  స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధన నివేదిక ప్రకారం, ప్రస్తుత త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ. 6 లక్షల కోట్లుగా అంచాన వేశారు.బార్‌క్లేస్ అంచనా ప్రకారం, ఇది రూ.5.4 లక్షల కోట్లు. ఎస్‌బీఐ, బార్‌క్లేస్ అంచనాల ప్రకారం వాస్తవ జీడీపీ వృద్ధి 10 నుంచి 15 శాతం వరకు ఉంటుంది. అయితే ఇది 26.2 శాతం ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, భయపెడుతున్న విధంగా కొవిడ్ థర్డ్ వేవ్’ కూడా వస్తే  వృద్ధి రేటు ఇంకా దిగజారి పోతుందని  ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అదే జరిగితే మరో రూ.3 లక్షల కోట్లు నష్టపోవలసి వస్తుందని, ఫలితంగా వార్షిక వృద్ధి రేటు దాదాపు 3 శాతం తగ్గుతుందని, సుమారు 8 శాతానికి పరిమితమవుతుందని తెలిపారు.  కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్’కు కొంత ముందు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు 10 నుంచి 12 శాతంగా ఉండేవి. ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే, రెండో ప్రభంజనం ప్రభావం వాస్తవ ఆర్థిక వ్యవస్థపై పరిమితంగా ఉంటుందని మొదట్లో భావించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్ల వరకు ఉండవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి.2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్ల నష్టం జరిగింది. వాస్తవ జీడీపీ నష్టం  రూ.4.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది.  ఈ అష్ట దిగ్బంధనాలు జూన్ నెలాఖరు వరకు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమైతే, 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.5.4 లక్షల కోట్ల మేరకు నష్టం జరగవచ్చు. మూడో ప్రభంజనం కూడా వస్తే, దాదాపు ఎనిమిది వారాల పాటు అష్ట దిగ్బంధనం అమలు చేస్తే, మరొక రూ.3.1 లక్షల కోట్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

లాక్‌డౌన్ పొడిగింపు త‌ప్ప‌దా? కేబినెట్ భేటీ అందుకేనా?

తెలంగాణ‌లో లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లవుతోంది. రోజులో 20 గంట‌ల పాటు స‌క‌లం బంద్‌. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి ప‌ర్మిష‌న్‌ లేదు. అన‌వ‌స‌రంగా రోడ్డు మీద‌కు వ‌స్తే పోలీసులు తాట తీస్తున్నారు. వాహ‌నం సీజ్ చేసి.. భారీగా ఫైన్ వ‌సూలు చేస్తున్నారు. తెలంగాణ‌లో మే 30 వరకు ఇదే పరిస్థితి. ఆ తర్వాత ఏంటి? లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? కాస్త‌ సడలింపులు ఇస్తారా? అదే చర్చ  జరుగుతోంది. లాక్‌డౌన్‌పై మే 30న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జ‌ర‌గ‌నుంది.  రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా పరిస్థితి, లాక్ డౌన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వ్యవసాయంతో పాటు కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా పంటలన కోశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని సంబంధిత మంత్రులు, అధికారులను ఆరా తీయనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కాబోతుండ‌టంతో రైతులు ఇబ్బందులు పడకుండా విత్తనాలు, ఎరువుల లభ్యత గురించి కూడా చర్చిస్తారు. వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధాన ఎజెండా అయినా.. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపైనా కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కాస్త‌ తగ్గుముఖం పట్టింది. గతంలో 10వేలకు పైగా నమోదైన రోజూవారీ కరోనా కేసులు.. ఇప్పుడు 4వేల లోపే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 30వ లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇంకా ఏం చేయాలో మంత్రులు చర్చించనున్నారు. అనంతరం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారు. అయితే, లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సడలింపులు ఇస్తే.. జనం విచ్చల విడిగా రోడ్ల మీదకు వస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మళ్లీ కరోనా విజృంభింవచ్చని.. అందుకే మరికొన్నాళ్లు లాక్‌డౌన్ కొన‌సాగించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఆంక్ష‌ల‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటున్నా.. క‌రోనా క‌ట్ట‌డే అన్నిటికంటే ముఖ్యం కాబ‌ట్టి.. లాక్‌డౌన్ వైపే మంత్రిమండ‌లి మొగ్గు చూపే అవ‌కాశ‌మే ఎక్కువ‌. 

పినరయి క్యాబినెట్ లో కుబేరులు 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రి వర్గంలో ఉన్న 20 మంది మత్రులలో, ఓ 13 మంది మాత్రమే కోట్లకు పడగలెత్తిన కామ్రేడ్లు. మిగిలిన ఏడుగురు మరీ అంతకాదు కానీ, ఓ మోస్తరు బూర్జువాలు. సగటున ఒక్కొక్కమంత్రి ఆస్తుల విలువ, ఓ రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే.  అలాగే, ఆ 20 మంది మంత్రులలో 12 మంది మీదనే, క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఓ ఐదుగురిపై, చాల సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి.  సీరస్ కేసులంటే తెలుసుకదా, మర్డర్లు, మానభంగాలు కావచ్చు, కాదంటే దొమ్మీలు దోపీడీలు వంటి  ఇతర కేసులు కావచ్చును.  మిగిలిన ఎనిమిది మంది మీద ఇతరత్రా చిల్లర కేసులే కాని, క్రిమినల్ కేసులు లేవు.నిజం. ఇవ్వన్నీ, ఎవరో ఎర్ర జెండా పొడ గిట్టని వాళ్ళు లేదా బూర్జువ మీడియా బయట పెట్టిన రహస్యాలు కాదు, స్వయంగా సదరు మంత్రులు, తమ నామినేషన్ పత్రాలతో పాటుగా స్వహస్తాలతో సంతకం చేసి సమర్పించిన అఫిడవిట్స్’ సాక్షిగా సత్యాలు. అయితే వీటిని బయట పెట్టింది మాత్రం, ఎన్నికల నిఖా సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్). కేరళ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి పినరయి  విజయన్’తో కలిపి మొత్తం 21 మంది మంత్రులున్నారు. అందులో విజయన్ సహా 20 అఫిడవిట్లను విశ్లేషించి, ఏడీఆర్ ఈ వివరాలను నివేదిక రూపంలో ప్రచురించింది. ఇందులో తెలిపిన వివరాల ప్రకారం, సిపిఎంకు చెందిన మంత్రి వి. శివకుట్టి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉండడంతో, ఆయన ఆస్తుల విశ్లేషణ చేయలేదని , ఏడీఆర్ నివేదిక పేర్కొంది.  అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే, అయన నామినేషన్ ఎలా ఓకే చేశారు? అంటే అది... ఎలక్షన్ సంఘం వెబ్సైటులో స్పష్టంగా లేదు కానీ, సంఘాని సమర్పించిన పత్రాలలో అన్నీ సక్రమంమగానే ఉన్నాయని అనుకోవచ్చును.  ఇక కోట్లకు పడగలెత్తిన మంత్రులలో, కుబేర కామ్రేడ్ అనదగిన అందరి కంటే అధిక ధనవంతుడు వి.అబ్డురహిమన్. ఈయన తనూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్నికయయ్యారు. ఆయన ప్రకటిత ఆస్తుల విలువ అక్షరాల రూ. 17 కోట్ల 17 లక్షలు. ఇక మంత్రులు  అందరిలోకి పేద మంత్రి కామ్రేడ్ పి. ప్రసాద్. చేర్తల నియోజక వర్గం నుంచి ఎన్నికైనా  ఈయన ప్రకటిత ఆస్తుల విలువ రూ 14.18 లక్షలు. బహుశా పెదలో కోటాలో ఈయనకు మంత్రి పదవి ఇచ్చాఋ కావచ్చును.  పాత మంత్రులు అందరినీ పక్కకు నెట్టి ముఖ్యమంత్రి  విజయన్ ఎంపిక చేసుకున్న ఎర్ర ముత్యాల  విద్యా  ప్రమాణాలు కూడా చాలా చాలా ఉన్నతంగా ఉన్నాయి. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన కేరళ మంత్రి వర్గంలో ఎనిమిది మంది ఎనిమిది నుంచి 12 తరగతి వరకు చదువుకున్నవారైతే, మిగిలిన 12 మంది డిగ్రీ ఆపై చదువులు చదివినవారున్నారు. వయసు పరంగా చూస్తే, 13 మంది వయసు 41-60 సంవత్సరాలు, మిగిలిన ఏడుగురు 61-80ఎ ఏళ్ల మధ్య వయసు కుర్రాళ్ళు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా , ఆస్తుల విషయంలో కామ్రేడ్’లు ఎవరికీ తీసిపోరు, అని కామ్రేడ్ విజయన్ ఎంచక్కా నిరూపించారు

శ్రీవారి అలిపిరి నడక మార్గం మూసివేత! టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అలిపిరి నడకమార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గాన్ని మూసేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అలిపిరి నడకమార్గానికి ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. అలిపిరి నడకమార్గం పైకప్పు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ఎంతోమంది భక్తులు నడకమార్గం ద్వారా వెళ్లేందుకు ఇష్టపడతారు.  నడకమార్గం ద్వారానే వస్తామని స్వామికి భక్తులు మొక్కుకుంటారు. ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం మూతపడటంతో... అలాంటి భక్తులందరూ శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది.  హనుమంతుని జన్మస్థలంపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో టీటీడీ చర్చకు సిద్ధమైంది. గురువారం తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ఇరుపక్షాల మధ్య చర్చ  జరుగతుంది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి చర్చలో పాల్గొననున్నారు. టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొననున్నారు. శ్రీరామనవమి రోజున తిరుమలలోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించింది. టీటీడీ ప్రకటనపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యంతరం తెలిపింది. టీటీడీకి పరుష పదజాలంతో ట్రస్ట్‌ లేఖలు కూడా రాసింది. బహిరంగ చర్చకు రావాలంటూ టీటీడీకి హనుమద్‌ ట్రస్ట్‌ సవాల్‌ విసిరింది. దీంతో గురువారం హనుమంతుని జన్మస్థానంపై ఆధారాలను ఇరుపక్షాలు బయటపెట్టనున్నాయి.

కరోనా అనాథలకు కేంద్రం బాసట

కరోనా ప్రాణాలను తీయడమే కాదు, జీవితాలను ఛిద్రం చేస్తోంది. తల్లి తండ్రులు ఇద్దరూ కరోనా కాటుకు బలై అనాధలుగా మిగిలిన చిన్నారుల వ్యధలు గుండెలు పిండేస్తున్నాయి.ఇలా అనాధలుగా మిలిన వారిలో నెలల వయసు పసికందులున్నారు, పట్టుమని పదేళ్ళు లేని పసి పాపలున్నారు. కన్నవారిని కోల్పోయిన వారే కాదు, తాము కన్నపిల్లలను కోల్పోయి అనాధలైన వృద్ధులు ఉన్నారు. ఇలా కరోనా మహమ్మారి అనాధలుగా మిగిల్చిన అందరినీ, అన్ని విధాల ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తామని భరోసానిచ్చింది. అందుకోసం నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి మే 25 వరకు దేశవ్యాప్తంగా, కరోనా కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన 577 మంది చిన్నారులును  గుర్తించినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ అందరి ఆలనా పాలనా కేంద్ర మహిళా,శిశు సంక్షేమశాఖ చూసుకుంటుందని, ఆమె వివరించారు. అనాధలుగా గుర్తించిన పిల్లలు అందరూ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వారికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ నుంచి కౌన్సిలింగ్‌ ఇప్పంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. వీరి బాగోగులపై రాష్ట్ర, జిల్లా యంత్రాంగాల నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటోందని వెల్లడించాయి. కొవిడ్‌ సెకండ్ వేవ్’లో  తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులను, ఏ ఆసరా లేని వృద్ధులను ఇతర బాధిత వర్గాలను ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. వారికి అవసరమైన వైద్యం, భద్రత కల్పించాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ సాయం ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలని సూచించింది.

జగన్‌ను నమ్ముకుంటే  జైలే! పోలీసులకు చంద్రబాబు వార్నింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో  కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ రఘురామను కొట్టినందుకు సీబీఐ విచారణ ఎదుర్కుంటోందని అన్నారు. సీఎం జగన్‌రెడ్డి ఏమాత్రం సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను నమ్మకున్నవాళ్లు ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారని.. పోలీసులకూ ఇదే గతి పడుతుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు చంద్రబాబు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లించేరోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు అన్నారు. బీసీ జనార్ధన్‌రెడ్డి చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా జనార్ధన్‌రెడ్డి ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం ఆకాంక్షించారన్నారు. జనార్ధన్‌రెడ్డి ఇంటి దగ్గరకు కాటసాని రామిరెడ్డి అనుచరులు ఎందుకొచ్చారని బాబు నిలదీశారు. గొడవ చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ ముఠా రాజకీయాలకు దూరమని, జగన్‌ అధికారంలోకి వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు..జ‌నార్దన్‌రెడ్డి కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎలా వ‌ర్తిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారుయ టీడీపీ నేత అనుచ‌రుల‌ను పోలీస్ స్టేష‌న్‌లో పెట్టి కొట్ట‌డం నేరం.. టీడీపీ నేత‌ల‌ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.  జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ దాడులు మొద‌ల‌య్యాయ‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపుల‌కే ప్రాధాన్యం ఇస్తోంద‌ని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వ‌చ్చాక కొత్త రాజకీయాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఈ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.. అక్ర‌మ అరెస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పుడు కేసుల‌ను ఉప‌సంహ‌రించుకొని తమ పార్టీ నేత‌ల‌ను విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు.  టీడీపీ మ‌హానాడును ఈ సారి కూడా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. 'స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.   'మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే '#DigitalMahanadu2021'లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. 'డిజిటల్ మహానాడు 2021'ను విజయవంతం చేయండి' అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

య‌స్‌.. పున్న‌మి + సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఫుల్ మూన్ ఎఫెక్ట్‌..

య‌స్ తుఫాను తీరం దాటింది. ప్ర‌చండ వేగంతో తూర్పు తీరంపై విరుచుకుప‌డుతోంది. ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పైనా కాస్త ప్ర‌భావం చూపింది. తీరం దాటినా ముప్పు ఇంకా తొల‌గిపోలేదు. ప్ర‌మాదం పొంచే ఉంది. తుఫానుకు ‘పున్నమి’ తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.    బుధ‌వారం పౌర్ణమి.. దీనికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా ఉంటుంది. అందుకే, తీర ప్రాంతాల్లో తుఫాను మ‌రింత బీభత్సం సృష్టించనుందని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. బెంగాల్‌లోని ఐదు సబ్‌ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాక్‌లు నీట మునిగే ప్రమాదముందన్నారు.  ఉత్త‌ర కోస్తాకు వ‌ర్ష ముప్పు పొంచి ఉంది.  చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్‌ కన్పిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటు-పోట్లు విపరీతంగా ఉంటాయి. అలలు గరిష్ఠ ఎత్తులో ఎగసిప‌డుతుంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉంది. భారత్‌లో బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చంద్రగ్రహణం మొదలవనుంది. దీంతో సాయంత్రం తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  మ‌రోవైపు, యస్‌ తుపాను ధాటికి ఇప్పటికే బెంగాల్‌, ఒడిశాలోని తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ప్రచండ గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం తుఫాను వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది.   ​  

బాబా రాందేవ్‌పై రూ.1000,00,00,000 దావా.. ప‌రువు న‌ష్టమా? ఐఎంఏకు క‌ష్ట‌మా?

రాందేవ్‌బాబా వ‌ర్సెస్ అల్లోప‌తి. ఆయుర్వేదం వ‌ర్సెస్ ఇంగ్లీష్ మెడిసిన్‌. వివాదం చినికిచినికి కోర్టు కేసుకు దారి తీసింది. అల్లోప‌తి వైద్యంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం ఏకంగా వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాందేవ్‌ బాబా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాల‌ని.. లేదంటే రూ.1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌)-ఉత్తరాఖండ్‌ నోటీసులు పంపింది. రాందేవ్‌బాబాకి కోర్టు నోటీసుల‌తో పాటు.. ఆయనసై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్త‌రాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌కు సైతం లేఖ రాసింది ఆ రాష్ట్ర ఐఎంఏ.   అల్లోపతి వైద్యంపై ఇటీవల రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘అల్లోపతి పనికి మాలిన వైద్యం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. అలోపతి వైద్యం వైద్యమే కాదు. కరోనా మరణాలకు అలోపతి చికిత్సలో ఉన్న లోపాలే సగం కారణం.. అంటూ రామ్‌దేవ్ బాబా చేసిన‌ కామెంట్ల‌పై.. భారత వైద్య మండలితో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఆయన మీద చర్యలు తీసుకోకుంటే, అలోపతిని వైద్యాన్ని మొత్తానికి మొత్తంగా రద్దు చేయండని కొంచెం తీవ్ర స్వరంతో హెచ్చరికలాంటి అభ్యర్ధన చేసింది. ‘అల్లోపతి వైద్యంపై మీ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే. మీ మాటలు ఉపసంహరించుకోండి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌.. యోగా గురు రాందేవ్‌బాబాకు ఘాటుగా లేఖ రాశారు. దీంతో వెనక్కి తగ్గిన రాందేవ్‌.. తన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. అన్ని రకాల వైద్యాలను తాను గౌరవిస్తానని చెప్పారు.   అంతటితో ఆ వివాదం ముగిసి పోతుంది అనుకుంటే, ఆ త‌ర్వాత బాబా రాందేవ్ మరో బాంబు పేల్చారు. కొన్నింటికి అల్లోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఆ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ విడుద‌ల చేశారు.  బీపీ, మధుమేహానికి అల్లోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు? థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌, కోలిటిస్‌, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల ద‌గ్గ‌ర‌ మందులు ఉన్నాయా? కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్‌ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు? అంటూ ‘ఐఎంఏ’ ముందు తమ  సందేహాలను ఉంచారు. రాందేవ్ బాబా లేఖ‌తో ఆగ్ర‌హించిన ఐఎంఏ-ఉత్త‌రాఖండ్ తాజాగా ఆయ‌న‌పై వెయ్యి కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా వేయ‌డం క‌ల‌క‌లం రేపింది.  అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని రాందేవ్ బాబా గుర్తు చేశారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే.. వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. నిజానికి బాబా రాందేవ్‌ వ్యక్త పరిచిన అనుమానాలు, ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు, అనుమానాలే కాబట్టి, అందులో అల్లోపతి విధానాన్ని అవమానించడమో మరొకటో లేదు.  కారణాలు ఏవైనా విభిన్న వైద్య విధానాల మంచి చెడులు, బాగోగులపై చర్చకు కరోనా ఒక అవకాశాన్ని కలిపించింది. కాబట్టి, ఈ చర్చ మరింత నిర్మాణాత్మకంగా కొనసాగితే, విభిన్న వైద్య విధానాల విషయమలో గల విబేధాలు తొలిగిపోయి , అవగాహన పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాని కోర్టు కేసుల‌తో విష‌యాన్ని వివాదంగా మార్చ‌డం మిన‌హా మ‌రేమీ ప్ర‌యోజ‌నం ఉండ‌దంటున్నారు.

ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా ఎక్కువ.. మోడీకి షాకిచ్చిన కెప్టెన్ 

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోవిడ్-19 టీకా కోసం జనం ఎగబడుతున్నారు. కొన్నిచోట్ల వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అసలే కరోనా వ్యాక్సిన్ల కొరత ఉండగా, పలు రాష్ట్రాలు టీకాలు వేసే క్రమంలో వ్యాక్సిన్‌ను వృథా చేస్తున్నాయి. దేశంలో ఎక్కువగా జార్ఖండ్ రాష్ట్రంలో 37.3 శాతం వ్యాక్సిన్ వృథా చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో 30.2 శాతం, తమిళనాడులో 15.5 శాతం, జమ్మూకాశ్మీర్లో 10.8 శాతం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10.7 శాతం వ్యాక్సిన్‌ను వృథా చేశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ వృథాలో జాతీయ సగటు 6.3 శాతంగా ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వృథాను తగ్గించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటికీ రాష్ట్రాలకు సూచిస్తూనే ఉంది. అంతకు ముందు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వ్యాక్సిన్ వృధాను తగ్గించాలని రాష్ట్రాలను కోరారు.   కోవిడ్ వ్యాక్సినేషన్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తున్నారు.  జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మినహా.. అన్ని ప్రభుత్వాలు నరేంద్రమోదీ ఉన్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌నే మంజూరు చేస్తున్నాయి. గతంలో జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి పీఎం ఫొటోను తొలగించాయి. తాజాగా మరో రాష్ట్రం కూడా ప్రధాని మోదీ ఫొటోను తొలగించింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 18-44 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ సర్టిఫికెట్లలో మోదీ ఫొటోను తొలగించింది. పంజాబ్‌లో భవన నిర్మాణ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్లను వేగంగా వేస్తున్నారు. టీకాల రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ యాప్ కాకుండా పంజాబ్ కోవా యాప్‌లో నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. టీకాలు తీసుకున్న అనంతరం కేంద్ర కోవిన్ యాప్‌నకు బదులు పంజాబ్‌కు కోవా యాప్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ చిత్రం లేకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ప్రధాని చిత్రాన్ని తొలగించడంతోపాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చిత్రాన్ని కూడా సర్టిఫికెట్లలో చేర్చ లేదని అధికారులు వెల్లడించారు. ఎవరి చిత్రాలు లేకుండా కేవలం తాము టీకా సర్టిఫికెట్లను మాత్రమే జారీ చేస్తున్నామని అధికారులు వివరించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఆయా రాష్ట్రాల సీఎంల ఫొటోలు ఉంటాయని.. కానీ పంజాబ్‌లో అలా ఎవరి ఫొటోలను ఉంచడం లేదు. 

సమయం చూసి షాక్.. కేసీఆర్ సర్కార్ లో టెన్షన్! రంగంలోకి ఈటల..

దేశమంతా కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొవిడ్ జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోగులకు సరైన చికిత్స అందడం లేదు. తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజూ వేలాది కొత్త కేసులు నమోదవుతుండటంతో హాస్పిటల్స్ లో బెడ్లు దొరకడం లేదు. ఒత్తిడి పెరిగినా రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ సమయంలో తెలంగాణ సర్కార్ కు షాక్ తగిలింది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. సమయం చూసి మరీ దెబ్బ కొట్టారు. తెలంగాణవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు.పెంచిన స్టైఫండ్‌ను వెంట‌నే అమ‌లు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నేటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తామని జూడాలు ముందుగానే ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్‌ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు రెండు వారాల క్రితమే ప్రభుత్వాన్ని కోరారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన విధంగా 15 జీతం పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోగులకు వైద్యం చేస్తున్న చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారని.. వారిని అదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జుడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో హాస్పిటల్స్ లో కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తామని చెబుతుండటంతో ఆందోళన మరింత పెరిగిపోతోంది. జూనియర్ డాక్టర్ల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూడాల స‌మ్మెకు ఇది స‌రైన స‌మ‌యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. జూనియ‌ర్ డాక్టర్లు తక్షణమే స‌మ్మె విర‌మించి విధుల్లో చేరాల‌ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూడాల స‌మ‌స్యలను ప్రభుత్వం ప‌రిశీలిస్తోంద‌ని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.  జూనియర్ డాక్టర్ల సమ్మెపై ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. ఆయనే ఈ శాఖ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రులను కూడా సందర్శిస్తున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? వారి సమస్యల పరిష్కారానికి కచ్చితమైన హామీ ఇస్తారా ? అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కరోనా మహమ్మారి పూర్తిగా పోకముందే రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం భావ్యం కాదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని సమ్మెపై పునరాలోచించాలని డాక్టర్లను కోరారు. కరోనా కష్ట కాలంలో డాక్టర్లు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. పెంచిన స్టైఫండ్ వెంటనే అందించి సమ్మె విరమింపజేసేలా చూడాలన్నారు. తాను ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్నంతకాలం డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే స్పందించి వారితో చర్చలు జరపడం వల్ల పేదప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడ్డామని, ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలని రాజేందర్ అన్నారు.

ఈటల కండీషన్స్.. బీజేపీ పరేషాన్! కేసీఆర్ దిమ్మ తిరగనుందా? 

తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేందర్.. తన భవిష్యత్ కార్యాచరణ కోసం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతుండగానే... కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. రాజేందర్ కు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందనే చర్చ రెండు రోజులుగా హోరెత్తుతోంది. బీజేపీ జాతీయ నేత హైదరాబాద్ వచ్చి ఈటలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈటలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఆయనకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఈటల బీజేపీలో చేరిక ఖాయమైందని కూడా కొందరు ప్రచారం చేశారు.  బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై ఈటల స్పందించకపోవడంతో.. సమావేశం జరిగింది నిజమేనని తెలుస్తోంది.    బీజేపీ నేతలతో ఈటల రాజేందర్ సమావేశానికి సంబంధించి కీలక సమాచారం తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ జాతీయ నేత ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారన్నది స్పష్టమవుతోంది. అతను బీజేపీలోకి ఆహ్వానించినప్పటికి ఈటల.. ఇంకా నిర్ణయం చెప్పలేదని సమాచారం. బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ కొన్ని కండీషన్లను వాళ్ల ముందు ఉంచారట. వాటిని అంగీకరిస్తే బీజేపీలో చేరడానికి తనకు అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేశారట. ఈటల రాజేందర్ పెట్టిన కండీషన్లతో బీజేపీ నేతలు డైలామాలో పడ్డారని తెలుస్తోంది. హైకమాండ్ తో మాట్లాడి చెప్పాల్సిన విషయాలు కావడంతో.. వెంటనే హామీ ఇవ్వలేకపోయారట. హైకమాండ్ తో మాట్లాడి చెబుతామని రాజేందర్ కు బీజేపీ ముఖ్య నేత చెప్పారని సమాచారం.  బీజేపీ జాతీయ నేత ముందు ఈటల రాజేందర్ పెట్టిన షరతులను కూడా తెలుగు వన్ సంపాదించింది. మంత్రివర్గం నుంచి తనను అవమానకరంగా తొలగించారనే కసిగా ఉన్న ఈటల రాజేందర్... కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల ముందు కేసీఆర్ లక్ష్యంగానే షరతులు పెట్టారని తెలుస్తోంది. భవిష్యత్ లో టీఆర్ఎస్ తో ఎలాంటి రాజకీయ పొత్తు, సహకారం బీజేపీ తీసుకోవద్దన్నది రాజేందర్ ప్రధాన షరతట. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరిన తర్వాత... టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా, కేంద్రంలో సహకారం తీసుకున్నా తాను జీరోగా మారిపోతాననే విషయాన్ని ఈటల రాజేందర్... బీజేపీ నేత ముందు ఉంచారని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పై దూకుడుగా వెళ్లేలా తమకు పూర్తి స్వేఛ్చ కావాలని ఈటల కోరారని తెలుస్తోంది. రాజేందర్ పెట్టిన షరతులతో బీజేపీ జాతీయ నేత ఆలోచనలో పడ్డారని అంటున్నారు. బీజేపీకి ప్రస్తుతం లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉన్నా పెద్దల సభలో లేదు. అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అవుతున్నా రాజ్యసభలో ఇంకా మేజిక్ ఫిగర్ కు చేరుకోలేదు బీజేపీ. రాజ్యసభలో బీజేపీకి ప్రస్తుతం 91 మంది సభ్యులున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రాలేదు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగా.. బెంగాల్ లో మమత హ్యాట్రిక్ కొట్టారు. వచ్చే సంవత్సరం యూపీ, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. గత ఎన్నిక్లలో యూపీలో బంపర్ విక్టరీ కొట్టిన బీజేపీకి ఈసారి గెలుపు అంత ఈజీ కాదు.  వచ్చే సంవత్సరం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ మద్దతు బీజేపీకి అవసరం. పెద్దల సభలో ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ సహకారం తీసుకోబోమని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. అందుకే రాజేందర్ కు స్పష్టమైన హామీ ఇవ్వలేదంటున్నారు. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారనే చర్చ జరుగుతోంది.  బీజేపీ నేతల నుంచి సానుకూల ఫలితం రాకపోవడంతో ఇక సొంత పార్టీ దిశగా రాజేందర్ చకచకా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కొత్త పార్టీ పెట్టడం ఖాయమైందంటున్నారు. బీసీ నాయకత్వంలో కొత్త పార్టీ వస్తుందని, పూర్తిగా బీసీ పార్టీ కాదని ఈటల అనుచరులు కూడా చెబుతున్నారు. పార్టీలో కొండా కీలకంగా ఉండనున్నారు కాబట్టే అలా చెబుతున్నట్లు భావిస్తున్నారు. కొత్త పార్టీ కార్యాచరణ కూడా స్పష్టంగా ఉందంటున్నారు. బీజేపీతో టీఆర్ఎస్ కలిస్తే... కాంగ్రెస్ తో పొత్తుతో ముందుకు వెళ్లాలని ఈటల టీమ్ సిద్ధమవుతుందని తెలుస్తోంది.  ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోయే పరిస్థితి వస్తే.. బీజేపీ గ్రూపులో ఉంటారట. మొత్తానికి టీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్ గానే తమ రాజకీయ కార్యాచరణ ఉండేలా ఈటల రాజేందర్, కొండా టీమ్ రూట్ మ్యాప్ రెడీ చేసిందని తెలుస్తోంది.