అఫీషియల్ రెండు పెళ్లిళ్లు.. అనఫీషియల్ గా మరో లేడీ.. 

ప్రతి మనిషి జీవితం లో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘటన. ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు పెళ్లి మాత్రం చేసుకోవాలి. చాలా మంది మన దేశంలో సీతారాముల ఆదర్శంతో పెళ్లి చేసుకుంటారు. మరి కొంత మంది వెంకన్న ని ఆదర్శం తీసుకుని రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు.. అఫ్కోర్స్ ఇంకొంత మంది శ్రీకృష్ణుడి కూడా ఫాలో అవుతారు.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వాడు మహా ముదురైంది. మరి ఇంకెందుకు ఈ ముదురుగురించి తెలుసుకుందాం పదండి..  ఓ వ్యక్తి అఫీషియల్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు లక్షణంగా ఉన్నారు. అయినా మనోడు స్పీడ్ తో మరో అడుగు ముందుగు వేశాడు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని అభాసుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆగ్రా సమీపంలోని గ్రామంలో చంద్రకుమార్ కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు కలగక పోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి కాపురం చేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన మరో వివాహిత మహిళ కోమల్ (పేరు మార్పు)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య పిల్లలకు బయటకు వెళ్తున్నాను అని చెప్పి కోమల్ ఇంటికి వెళ్లేవాడు. కోమల్ భర్త కూడా విదేశాల్లో ఉండటంతో చంద్రకుమార్ తోనే తన శారీరక సుఖాలు తీర్చుకునేది. అయితే ఈ తతంగం కొంత కాలం సాగింది. గత వారం చంద్రకుమార్ బావమరిది సూరజ్ కు అనుమానం కలిగి, తన బావ ఎక్కడికెళ్తున్నాడో చూశాడు. కోమల్ తో కలిసి వివాహేతర బంధం పెట్టుకున్నాడని నిర్ధారించుకున్నాడు. తన సోదరికి అసలు విషయం చెప్పేశాడు. ఇంకేముంది చంద్రకుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకొని, కోమల్ ఇంటి దగ్గరే ఇద్దరు భార్యలు కాపు కాచారు. ఇక అంతే చంద్రకుమార్ చెక్ పెట్టారు. తలపై ముసుగు వేసుకొని నెమ్మదిగా వెనుక వైపు తలుపు గుండా కోమల్ ఇంట్లోకి దూరాడు. కాసేపటికే బెడ్రూంలో లైట్ వెలిగింది. ఇద్దరూ ఒంటిపై నూలు పోగు లేకుండా శృంగారంలో మునిగి తేలడం ప్రారంభించారు. ఇంకేముంది కాసేపటికే చంద్రకుమార్ ఇద్దరు భార్యలు, తమ బంధువుల సహాయంతో గది తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి, చంద్రకుమార్, కోమల్ భాగోతాన్ని నగ్నంగా బయటపెట్టారు. అక్కడే ఇద్దరికి దేహ శుద్ధి చేశారు. అయితే పోలీసులకుల సమాచారం అందడంతో పరిస్థితిని అదుపులోకి తేవడంతో పాటు చంద్రకుమార్, కోమల్ లను ఆసుపత్రిలో చేర్పించారు.

సడెన్ గా రంగు మార్చిన ఈటల.. రాజకీయ వర్గాల్లో రచ్చ! 

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సడెన్ గా రంగు మార్చేశారు. ఈటల రంగు మార్చడం ఇప్పుడు సంచనంగా మారింది. ఇటీవలే కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురయ్యారు ఈటల. తనను కేసీఆర్ అవమానకరంగా తొలగించాలని ఆయన రగిలిపోతున్నారు. గులాబీ బాస్ పై రివేంజ్ తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారు. హుజురాబాద్ తో పాటు హైదరాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు ఈటెలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కౌంటర్ యాక్షన్ స్టార్ చేసింది. ఇంతలోనే ఈటల రంగు మార్చడం చర్చగా మారింది. ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.  కేసీఆర్ పై కారాలు మిరియాలు నూరుతున్న ఈటల రాజేందర్ సడెన్ గా ఏం చేశారో తెలుసా.. తన ట్విట్టర్ అకౌంట్ లో మార్పులు చేశారు. గులాబీ రంగులకు తిలోదకాలు ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన బొమ్మతోపాటు టీఆర్ఎస్  అధినేత కేసిఆర్ ఫొటో కనబడేది. వాల్ మొత్తం గులాబీ రంగుతో ఉండేది. కానీ ఇప్పుడువన్నీ మాయమై పోయాయి. ఈటల రాజేందర్ ట్విట్టర్ వాల్ మీద గులాబీ రంగు గయాబ్ అయింది. కేసిఆర్ బొమ్మను పీకి పడేశారు ఈటల. గులాబీ రంగును వదిలేసి ఆకుపచ్చ రంగు వాల్ ను పెట్టారు. వాల్ మీద మహానీయులైన పూలే, అంబేద్కర్, తెలంగాణ జాతి పిత జయశంకర్ సార్ ఫొటోలను ఒకవైపు.. తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం చిత్రాలు మరోవైపు పెట్టారు. మధ్యలో పిడికిలి బిగించిన చేతిని ఉంచారు ఈటల రాజేందర్.  ఈటల భూఅక్రమాలకు పాల్పడ్డారని ఆగమేఘాల మీద మంత్రివర్గం నుంచి తొలగించారు కేసీఆర్. విచారణ కమిటీలు ఏర్పాటు చేసి ఈటల అవినీతిని యుద్ధ ప్రాతిపదికన వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ టిఆర్ఎస్ తో పూర్తి స్థాయిలో తెగతెంపులకు సిద్ధపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేసిఆర్ బొమ్మలు పీకేసి తన దారి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు రాజేందర్. ‘‘సంధి లేదు మిత్రమా… సమరమే’’ అన్న ధోరణి ఈటల రాజేందర్ పెట్టిన చిత్రాన్ని చూస్తే తెలిసిపోతోంది. ఇక వాల్ మీద ఉన్న పూలే, అంబేద్కర్, జయశంకర్ సార్ చిత్రాలను పరిశీలిస్తే తెలంగాణలో పీడత వర్గాల రాజ్యం లేదు… దొరల రాజ్యం ఉందన్న భావనను కల్పించే రీతిలో ఈటల సమాజానికి సంకేతాలు పంపినట్లు తన సన్నిహితులు చెబుతున్నారు. పూలే, అంబేద్కర్ ఫోటోల ద్వారా.. బడుగు, బలహీన వర్గాల అజెండగానే ముందుకు వెళ్తాననే సందేశం ఈటల ఇచ్చారంటున్నారు. ఈటల తాజా అడుగులతో ఆయన బీసీ వాయిస్ గానే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  మరోవైపు ఈటల రాజేందర్ సొంత నియోజకర్గంలో హుజురాబాద్ లోనే రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ తీవ్ర ఫోకస్ చేయడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఇంతకాలం ఈటలకు మద్దతుగా ఉన్న నేతలు అధికార పార్టీలోనే ఉండేలా గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇదే పనిలో ఉన్నారు మంత్రి గంగుల కమాలకర్. మండలాలు, గ్రామాల వారీగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా రంగంలోకి దిగారని తెలుస్తోంది. హుజురాబాద్ నేతలతో హరీష్ రావు స్వయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఈటల రాజీనామా చేస్తే జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఇంచార్జ్ బాధ్యతలను హరీష్ రావుకే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది .టీఆర్ఎస్ స్పీడ్ పెంచడంతో రాజేందర్ కూడా అప్రమత్తమయ్యారని అంటున్నారు. అందుకే ట్విట్టర్ అంకౌంట్ లో ఫోటో మార్చి తన సందేశం చెప్పారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

భూకబ్జాపై హైకోర్టు సీరియస్.. ఎమ్మెల్యేపై కేసు

తెలంగాణలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే భు వివాదంలో చిక్కుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదైంది. భూ వివాదం కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కాప్రా MRO గౌతమ్ కుమార్‌పై కూడా  జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  కాప్రాలోని సర్వే నెంబర్. 152లో 90 ఎకరాల భూ వివాదంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో ఎమ్మెల్యే సుభాష్ డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1206,166A, 167, 168, 170, 171, 447, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడించారు.

కోస్తాంధ్ర అల‌ర్ట్‌.. దూసుకొస్తున్న యాస్‌..

తౌక్తే పోయింది. యాస్ వ‌చ్చింది. ఎండాకాలం తుఫానుల సీజ‌న్‌గా మారింది. వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి తీరంపై దాడి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌పైనా ఆ తుఫానుల‌ ప్ర‌భావం ప‌డుతోంది. తెలంగాణ‌, ఏపీలో అకాల వ‌ర్షాల‌తో రైత‌న్న తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాడు.  తాజాగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ‘యాస్’గా నామకరణం చేయ‌బ‌డిన తుఫాను.. పారాదీప్‌కు 540 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై.. క్రమంగా బలపడి తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫానుగా మారనుంది. ఈనెల 26వ తేదీన సాయంత్రం బాలాసోర్, సాగర్ దీవుల మధ్యలో తీరం దాటనుంది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సోమవారం గాలుల తీవ్రత పెరిగింద‌ని.. మత్య్సకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలను గుర్తించారు.  రానున్న 2 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ స్టెల్లా తెలిపారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, విజయనగరం నుంచి గుంటూరు వరకు అనేక మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 37.9 నుంచి 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలో అక్కడక్కడా ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి.  యాస్ తుఫాన్‌ ప్రభావంతో ఒడిసా, బెంగాల్‌లలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుఫాను కార‌ణంగా పలు రైళ్లను రద్దు చేశారు. 46 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించగా, మరో 13 బృందాలను తరలించారు. సహాయక చర్యల్లో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్ట్‌ గార్డు సిబ్బంది పాల్గొంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ మొత్తం 36 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. 57 టన్నుల సామాగ్రిని, 606 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తరలించింది.  కాగా, తుఫాను ప్ర‌భావంతో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌- నికోబార్‌ దీవుల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. 

క్షమించు దీదీ.. మమతా  బెనర్జీకి మాజీల వినతి

పశ్చిమ్ బెంగాల్లో సీన్ రివర్స్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికలకు  ముందు క్యూకట్టి కమలదళంలో చేరిన తృణమూల్ నాయకులు, ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ పంచన చేరేందుకు సిద్డంవుతున్నారా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అందరూ కాకపోయినా, కొందరు, ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్ల్యేలు, అలాగే,  ద్వితీయ శ్రేణి నాయకులు తొందరపడితప్పు చేశామనే ఆలోచనకు చేరుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తప్పు ఒప్పుకుని దీదీకి దాసోహం అనేందుకు సైతం సిద్డమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి లేఖ రూపంలో అభ్యర్ధన పంపారు. తప్పు చేశానని తొందర పడ్డానని ఒప్పుకుంటూ, ప్లీజ్, దయచేసి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, మీకు, పార్టీకి విధేయంగా ఉంటాను, పార్టీ అభివృధికి కృషి చేస్తాను, అంటూ ఆమె ప్రాదేహపూర్వకంగా అభ్యర్దించారు.  సోనాలీ గుహ బాటలో ఇప్పుడు, మరో నాయకురాలు సరళా ముర్ముకూడా తనను కూడా తిరిగి పార్టీలోకి తీసుకోవాలని  ప్రాధేయ పూర్వకంగా కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇచ్చిన హబీబ్పుర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక ఆమె, ఆఖరి నిముషంలో బీజేపీలో చేరారు.  సొంత నియోజక వర్గం మాల్దా నుంచి పోటీ చేశారు. అయినా ఓడి పోయారు. దీంతో ఆమెకు జ్ఞానోదయం అయిందో ఏమో,తనను క్షమించాలని దీదీని కోరారు. బీజేపీలో చేరి తప్పు చేశానని, మళ్లీ ఇప్పుడు టీఎంసీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశమివ్వాలని అభ్యర్థించారు.అంతే కాదు, మమతా దీదీ దయతో తనను తిరిగి పార్టీలో చేర్చుకుంటే, చేసిన తప్పు దిద్దుకుని దీదీతో కలిసి పనిచేస్తాననిం ముర్ము స్పష్టం చేశారు.  ఈ రివర్స్ వరద ఎంతవరకు వెళుతుందనే   విషయంలో, ఎవరి అంచనాలు వారికున్నాయి. నిజానికి బీజేపీ ఈ పరిణామాన్ని ముందుగానే గమనించింది. అందుకే, నారద కుంభకోణం కేసును తెరమీదకు తెచ్చింది. సెలెక్టివ్’గా తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి సహా, ఇతర నేతలను వదిలేసి, ఇద్దరు తృణమూల్ మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, తృణమూల్‌ మాజీ నాయకుడు సోవన్‌ ఛటర్జీలను సీబీఐ అరెస్ట్ చేసింది.అంటే, బీజేపీలో చేరి మళ్ళీ మమత వైపు వెళ్ళే ఆలోచన చేస్తే,కేసులు, వేధింపులు, అరెస్టులు తప్పవని హెచ్చరిక చేసింది. ఆ విధంగా,  రివర్స్ ఫిరాయింపులకు కొంత వరకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తోంది. మరో వంక, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన   తృణమూల్ కాంగ్రెస్’కు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. కాబట్టి, ఇప్పటికిప్పుడు ఫిరాయింపుల జోరు ఉండక పోవచ్చును అని పరిశీలకులు భావిస్తున్నారు.  సోమవారం నారద కుంభకోణం కేసు సుప్రీం కోర్టుకు చేరింది.. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు, మరో ఇద్దరు నేతలను గృహనిర్బంధంలో ఉంచాలన్న కోల్‌కతా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరో మరో వంక సోమవారమే ఈ నలుగురు నేతల బెయిల్‌ పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది.. ఇటు సుప్రీం కోర్టు అటు రాష్ట్ర హై కోర్టువిచారణలో ఉన్న ఈ కేసు ఇంకెన్ని మలుపులు  తీసుకుంటుందో చూడవలసి వుంది.

సంకెళ్లు తెంచుకున్న న్యాయం.. జ‌గ‌న్‌రెడ్డికి గుణ‌పాఠం!

అన్యాయానిది తాత్కాలికంగానే ఆధిప‌త్యం. శాశ్వ‌త విజ‌యం మాత్రం ఎప్ప‌టికీ న్యాయానిదే. వేరు వేరు కేసుల్లో ధూళిపాళ్ల‌, ర‌ఘురామ‌ల‌కు బెయిల్ రావ‌డం జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు చెంప‌పెట్టు లాంటిదే. టీడీపీ మౌత్‌పీస్‌గా ఉన్న ధూళిపాళ్ల న‌రేంద్ర నోరు మూయించేందుకే సంగం డెయిరీకి చెంద‌ని పాత ఎపిసోడ్‌ను త‌వ్వి.. న‌రేంద్ర‌పై కొత్త‌గా కేసు పెట్టి.. కుట్ర చేశార‌నేది ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌. సంగం డెయిరీ ఆస్తుల‌ను మొత్తానికి మొత్తంగా స్వాధీనం చేసుకొని.. న‌రేంద్రను దెబ్బ కొట్టాల‌నే ప్ర‌య‌త్నం పెద్ద ఎత్తున చేసింది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. అమూల్‌ను రంగంలోకి దింపింది సంగం టార్గెట్‌గానే అంటారు. అటు, ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. వైసీపీ ఎంపీగా గెలిచినా.. జ‌గ‌న్‌రెడ్డి విధానాలు న‌చ్చ‌క‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చారు ర‌ఘురామ‌. త‌ప్పులు స‌రికాదంటూ.. స‌రి చేసుకోమంటూ.. స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌డ‌మే ర‌ఘురామ చేసిన త‌ప్పు. అందుకే, ఆయ‌న‌పై జ‌గ‌న్‌రెడ్డి క‌క్ష క‌ట్టార‌ని చెబుతారు. కేవ‌లం విమ‌ర్శ‌లు చేసినందుకే, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ.. రాజ‌ద్రోహం కేసు పెట్టి మ‌రీ.. జైలుకు పంపించే కుట్ర చేశార‌ని చెబుతారు.  విప‌క్షం ఆరోపిస్తున్న‌ట్టుగా.. ఈ రెండూ క‌క్ష పూరిత కేసులే అనేది ప్ర‌జ‌ల అభిప్రాయం. అమ‌రావ‌తిలో అసైన్డ్ భూముల వ్య‌వ‌హారంపై ఏకంగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపైనే కేసు పెట్టి వ‌ర‌కూ వ‌చ్చారు ఈ పాల‌కులు. అయితే, ఎవ‌రి ఫిర్యాదు మేర‌కైతే ఆ కేసు పెట్టారో ఆ ఫిర్యాదుదారుల‌కే ఆ కేసు సంగ‌తి తెలీక పోవ‌డం విచిత్రం. ఫిర్యాదుదారుల సంభాష‌ణ‌ వీడియో రికార్డింగ్‌తో ఆ విష‌యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ధూళిపాళ్ల న‌రేంద్ర‌నే. అందుకే, జ‌గ‌న్‌రెడ్డి న‌రేంద్ర‌ను టార్గెట్ చేశార‌ని చెబుతారు. చంద్ర‌బాబుపై ప‌న్నిన కుతంత్రానికి.. ధూళిపాళ్ల అడ్డుగా నిలుస్తున్నార‌ని.. ఆయ‌న్ను, ఆయ‌న‌కు ద‌న్నుగా ఉన్న సంగం డెయిరీని అడ్ర‌స్ లేకుండా చేసేందుకు.. న‌రేంద్ర‌పై కేసు పెట్టి.. అరెస్ట్ చేసి.. జైలుకు త‌ర‌లించి.. పైశాచిక ఆనందం పొందారు. కానీ, కోర్టుల రూపంలో న్యాయం అనేది ఒక‌టి ఉంటుంది. అందుకే, సంగం డెయిరీ ఆస్తుల‌ను, కార్య‌క‌లాపాల‌ను.. ప్ర‌భుత్వ డెయిరీకి బ‌దలాయిస్తూ.. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు అడ్డంగా కొట్టేసింది. ఇక‌, కాస్త ఆల‌స్య‌మైనా.. ధూళిపాళ్ల‌కు బెయిల్ రూపంలో న్యాయం జ‌రిగింది.  అటు, ర‌ఘురామ ఎపిసోడ్ ఇంత‌కన్నా దారుణం. ఏకంగా నాన్‌బెయిల‌బుల్ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. బెయిల్ వ‌చ్చింది కాబ‌ట్టి.. న్యాయం నిల‌బ‌డింది. లేదంటే.. ర‌ఘురామ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉండిఉండేదో ఊహించుకోవ‌చ్చు. ఆయ‌న ఆరోపించిన‌ట్టు క‌స్ట‌డీలోనే.. కాళ్లు కట్టేసి.. పాదాలు వాచేలా, కాలి వేలు ఎముక విరిగేలా కొట్టారంటే.. ర‌ఘురామ‌తో ఎంత క్రూరంగా వ్య‌వ‌హ‌రించి ఉంటారో తెలుస్తోంది. ఇక‌, ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి ఆరోపించిన‌ట్టు.. జైలులోనే ర‌ఘురామ‌ను చంపేసినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.  ధూళిపాళ్ల అయినా, ర‌ఘురామ అయినా.. జ‌స్ట్‌.. జ‌గ‌న్‌రెడ్డిపై విమ‌ర్శలు చేసినందునే.. కేసులు క‌ట్టి, వేధించి, జైల్లో పెట్టడం.. నియంతృత్వ పోక‌డ కాక మ‌రొక‌టి కాదు అంటున్నారు ప్ర‌జాస్వామ్య‌వాదులు. ఇప్ప‌టికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాలాంటి వాళ్ల‌ను సైతం టార్గెట్ చేశారు. ఎవ‌రు నోరు మెదిపితే.. వారిని లోప‌లేస్తాం.. అన్న‌ట్టు అరాచ‌క పాల‌న కొన‌సాగిస్తున్నారు. పాల‌కులు ఎంత ప్ర‌కోపం ప్ర‌ద‌ర్శించినా.. చివ‌రాఖ‌రికి అంతిమ విజ‌యం న్యాయానిదే. న్యాయస్థానాలు ఉన్న‌ది అందుకే, ధూళిపాళ్ల‌, ర‌ఘురామ‌ల‌కు బెయిల్ రావ‌డం.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు ఎదురుదెబ్బ‌లే. నాటి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఎపిసోడ్ నుంచి.. నేటి ధూళిపాళ్ల, ర‌ఘురామ కేసుల వ‌ర‌కూ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి కోర్టు ప‌దే ప‌దే మొట్టికాయ‌లు వేస్తున్నా.. త‌ల బొప్పి క‌డుతున్నా.. స‌ర్కారు తీరు మార‌డం లేదు. తాజాగా, క‌ర్నూల్ జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన‌ జనార్ధన్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి.. ఆయ‌న‌పై ఎస్సీ, ,ఎస్టీ కేసులు పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ దుర్నీతికి నిద‌ర్శ‌నం అని మండిప‌డుతున్నారు. ఏపీలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా.. అంతం చేయాల‌నే కుట్ర‌లో జ‌గ‌న్‌రెడ్డి ఎన్న‌టికీ స‌ఫ‌లం కాలేరని స‌వాల్ విసురుతున్నారు. ఆయ‌న తండ్రి వైఎస్సార్ వ‌ల్లే కాలేదు. ఈయ‌నెంత అంటున్నారు విప‌క్షనేత‌లు.  

గ్యాంగ్రిన్ గండం.. క‌రోనా బాధితుల‌కు మ‌రో ప్ర‌మాదం

క‌రోనా వ‌చ్చింది. త‌గ్గింది. హ‌మ్మ‌య్యా అని ప్ర‌శాంతంగా ఉండ‌లేని ప‌రిస్థితి. కొంద‌రికి అంత‌ర్గ‌త అవ‌య‌వాలు దెబ్బ‌తింటున్నాయి. మ‌రికొంద‌రికి ర‌క్తం చిక్క‌బ‌డి గుండెపోటుకు దారి తీస్తోంది. ఇంకొంద‌రు ఊపిరితిత్తులు చెడిపోయి చ‌నిపోతున్నారు. ఒక‌వేళ‌.. బ‌తుకు జీవుడా అంటూ ఈ గండాల‌న్నిటినీ త‌ప్పించుకున్నా.. బ్లాక్ ఫంగ‌స్ రూపంలో మ‌రో మ‌హ‌మ్మారి ముంచేస్తోంది. బ్లాక్ ఫంగ‌స్‌కు వైట్ ఫంగ‌స్ కూడా జ‌త‌క‌లిసి.. జ‌నాల‌పై విరుచుకుప‌డుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరుగుతుండ‌టం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఇలా.. ఇన్ని స‌మ‌స్య‌లున్నా చాల‌వ‌న్న‌ట్టు.. తాజాగా మ‌రో కొత్త ముప్పు పొంచి ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రించ‌డం మ‌రింత ఆందోళ‌న‌క‌రం.  కరోనా నుంచి కోలుకున్న వారికి ‘గ్యాంగ్రిన్‌’ రూపంలో మరో గండం ఎదురవుతోంది. ‘బ్లాక్‌ ఫంగస్‌’ సోకితే.. కంటి చూపును కోల్పోయే ముప్పుతో పాటు మొత్తం దవడనే తీసేయాల్సి రావచ్చు. ‘గ్యాంగ్రిన్‌’ చుట్టుముడితే.. అది వ్యాపించిన కాళ్లు, చేతులను మొత్తానికి మొత్తం తొలగించాల్సి వస్తుంది. ఈ సమస్యతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య మార్చి నుంచే క్రమంగా పెరుగుతోందని అహ్మదాబాద్‌కు చెందిన వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ మనీశ్‌ రావల్ హెచ్చ‌రించారు.  గ్యాంగ్రిన్‌ బాధితుల్లో ఎక్కువ మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనన్నారు. ఈ ఆరోగ్య సమస్యకు ప్రధాన కారణం ‘త్రాంబోసిస్‌’ అని ఆయన తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు క్షీణించి త్రాంబోసిస్‌కు దారితీస్తోందన్నారు. ఫలితంగా బాధితుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని వివ‌రించారు. గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు దెబ్బ‌తింటున్నాయి.  ‘‘ఉదాహరణకు కాలిలోని ఒక ధమని త్రాంబోసిస్‌తో ప్రభావితమైతే.. మొత్తం కాలు బరువుగా, మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత కాలు పూర్తిగా చల్లబడిపోతుంది. కాలు తొలుత నీలిరంగుకు, తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఈ స్థితినే గ్యాంగ్రిన్‌ అంటారు. దీని లక్షణాలను గుర్తించిన గంట నుంచి ఆరు గంటల్లోగా చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఆ కాలును తీసేయాల్సి రావచ్చు’’ అని వైద్యులు అంటున్నారు. శరీరంలోని ఏ భాగాన్నైనా గ్యాంగ్రిన్‌ ప్రభావితం చేయగలదని హెచ్చరించారు. త్రాంబోసిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ముప్పు నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. క‌రోనా నుంచి కోలుకున్న వారిలో.. ఈ గ్యాంగ్రిన్ కేసులు ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌టంతో.. బాధితులు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. 

అగ్గిపెట్టె కోసం గ్యాంగ్ వార్.. ఒక్కరు మర్డర్ 

గొడవ చల్ గొడవ.. ఇది సినిమా లో సాంగ్. ఈ సినిమాలో చూపించినట్లు కొంత మంది ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. రీజన్  ఏదైనా కావచ్చు ఫైట్  చెయ్యడమే వాళ్ళ పని, ఒక్క మాటలో చెప్పాలంటే  అరవింద సామెత వీరరాఘవ సినిమాలో 5 రూపాయల ఫ్యాక్షన్ లాగ.. ఒక్కోసారి ఈ గొడవలు వల్ల చాలా పెద్ద నష్టాలకు దారితీస్తుంటాయి. 20 రూపాయల అప్పు అప్పు ఇవ్వలేదని, టీ కొట్టు టీ ఇవ్వలేదని, బిర్యానీ పొట్లం కోసం , బీర్ కోసం ఇలా చాలా సిల్లీ రీజన్స్ తో  చివరికి దారుణమైన హత్యలకు దారితీస్తుంటాయి. మరి అగ్గిపెట్టె కోసం గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా..? అయితే చూడండి..  అది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలి టూటౌన్ పరిధిలోని కచ్చేరిమిట్ట వద్ద ఉన్న కాలేజీ గ్రాండ్స్ కు ఆదివారం మధ్యాహ్నం కొంతమంది యువకులు మద్యం తాగి వచ్చారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన జమీరుద్దీన్ అనే యువకుడు.. అక్కడే ఉన్న మరో గ్యాంగ్ వద్దకు వెళ్లి అగ్గిపెట్టే కావాలని అడిగాడు. దీంతో తమనే అగ్గిపెట్టె అడువుతావా అంటూ అవతలి గ్యాంగ్ జమీరుద్దీన్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.ఘర్షణ జరుగుతుండగానే జమీరుద్దీన్ ప్రత్యర్థి వర్గంలోని యువకులు బీర్ సీసాతో అతడిపై దాడి చేశారు. అంతేకాకుండా అతడి గొంతులో పొడిచారు. దీంతో జమీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన జమీర్ స్నేహితులు చంద్ర, పృథ్వీ కూడా గాయపడ్డారు. రెండు గ్రూపులు చాలా సేపు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకోవడం, కొట్లాడుకోవడంతో తీవ్రఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనపై జమీరుద్దీన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రధాన కారకులుగా భావిస్తున్నరాహుల్, నిఖిల్ అనే యువకుల కోసం గాలిస్తున్నారు. ఐతే హత్యకు కారణం కేవలం అగ్గిపెట్టె కోసం జరిగిన గొడవేనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలను, హత్యకు వాడిన బీరుసీసాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు హత్యకు గురికావడంతో జమీరుద్దీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంబీఏ చదువుకున్న జమీర్.. ప్రస్తుతం జాబ్ కోసం చూస్తున్నాడు. అతడి తండ్రి గౌస్ మొహిద్దీన్ కావలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. క్షణికావేశం, పంతాలు, అధిపత్య ధోరణి వెరసి ఓ యువకుడి నిండుజీవితాన్ని బలితీసుకున్నాయి. అగ్గిపెట్ట దగ్గర వచ్చిన కొడవ ఓ కుటుంబానికి కొడుకును దూరం చేసింది.

టీడీపీ నేతల గృహ నిర్బంధం.. పోలీసు రాజ్యమన్న చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్ కట్టడి, రోగులకు చికిత్స అందించడంలో జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్న టీడీపీ..  కొవిడ్‌ బాధితులకు భరోసా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల్లోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలను ముందుగానే ఎక్కడికక్కడ నిర్బంధించారు పోలీసులు.   పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఉంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరులో బడేటి రాధాకృష్ణ, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి,  ప్రొద్దుటూరులో సీనియర్‌ నేత లింగారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.  తమను వదిలేయాంటూ కొన్ని చోట్ల టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.  రాష్ట్రంలోని కరోనా రోగులకు ధైర్యం చెప్పి భరోసా నింపేందుకు ఆస్పత్రులను సందర్శించనున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని, ముఖ్యమంత్రి గడపదాటి బయటకు రారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఆస్పత్రులను ఎందుకు  సందర్శించడం లేదని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా? అని అన్నారు. ఏడాది నుంచి కరోనా విలయతాండవం చేస్తున్నా ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, 45 ఏళ్ళు నిండిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్షిన్ ఇవ్వలేదని ఆరోపించారు. నిరుపేద రోగుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్  ఆస్పత్రులపై నియంత్రణ చర్యలు లేవని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో బిజీగా ఉన్నార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ విమ‌ర్శించారు. మాజీ ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఇత‌ర టీడీపీ నేత‌ల అరెస్టుల‌ను ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. వారిపై బ‌నాయించిన అక్ర‌మ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకొని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. జ‌గ‌న్ కొవిడ్ క‌ట్ట‌డిని వ‌దిలేసి క‌క్ష సాధింపులకే ప‌రిమితం అయ్యారని ఏపీ టీడీపీ  అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. 

మిస్ యూనివర్స్ రన్నరప్ గా  ఇండియా భామ.. ఇదిగో బొమ్మ.. 

పోటీలు అనేది  ఏ ఎక్సమ్ లోనో,  గేమ్స్ లోనో .. ఏ ప్రభుత్వ పోటీపరీక్షలలోనో మాత్రమే కాదు. ఒక మనిషి అందానికి కూడా పోటీలు ఉంటాయి. ఆ విషయం అందరికి తెలిసిందే.. అయితే  ఈ అపురూప అందాల తారలకు ప్రతి సంవత్సరం జరిగే మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహిస్తారు.ఆ విషయం కూడా అందరికి తెలిసిందే.. అయితే తాజాగా  మిస్ యూనివర్స్ 2020-21 పోటీలు మే 16న ఫ్లోరిడాలో జరిగాయి. ఈసారి మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా కిరీటాన్ని దక్కించుకుంది. అయితే... మిస్ ఇండియా 24 ఏళ్ల అడెలిన్ కాస్టెలినో... ఈ పోటీల్లో టాప్ 4లో నిలిచింది. ఫలితంగా మూడో రన్నరప్ అయ్యింది. 74 మంది అమ్మాయిలతో పోటీ పడి... టాప్ 4లో నిలవడం ఈజీ కాదు. ఆమె టాలెంట్ గుర్తించిన శ్రీలంక ఆర్టిస్ట్... అచ్చం ఆమె లాంటి బొమ్మను తయారుచేశాడు. ఆ బ్యూటీ పేజెంట్‌లో కాస్టెలినో... వేసుకున్న శారీ కాస్టూమ్‌ ఆధారంగా ఈ బొమ్మను తయారుచేశాడు. ఆ పోటీల్లో కాస్టెలినో పింక్ శారీ ధరించింది. ఇండియాలో కమలం పువ్వును ఆమె ఆదర్శంగా తీసుకుంది. పింక్ కలర్ కమలం పువ్వును గుర్తు చేస్తూ... ఆ కాస్ట్యూమ్ వేసుకుంది. అదే పింక్ కలర్ కాస్ట్యూమ్‌తో బొమ్మను తయారుచేసి... ఇన్‌స్టాగ్రామ్‌లోని నైగీడాల్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు ఆర్టిస్ట్. కాస్టెలినోకి శుభాకాంక్షలు తెలిపిన ఆర్టిస్ట్... శ్రీలంక నుంచి అభిమానిస్తున్నట్లు తెలిపాడు. "ఈ కాస్ట్యూమ్ భారతీయ మహిళను గుర్తుచేస్తోంది. ఈ శారీ సంప్రదాయకమైనది. ఇది మొత్తం దేశాన్ని ఐక్యం చేస్తుంది. దీని రంగు... జాతీయ పుష్పాన్ని గుర్తుచేస్తోంది" అని తెలిపాడు. ఇప్ప్పుడు శ్రీలంక ఆర్టిస్ట్ గీసిన ఈ మిస్ ఇండియా బొమ్మ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

పంజాబ్ కాంగ్రెస్’లో  సీఎం వర్సెస్ సిద్దూ  ఓపెన్ వార్ 

పంజాబ్ శాసన సభ ఎన్నికల గడవు దగ్గర పడుతోంది.  మరో ఆరేడు నెలల్లో ఎన్నికల జరుగుతాయి. అయితే, ఇలాంటి కీలక సమయంలో, రాష్ట్రంలో అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మధ్య, ఎంతో కాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇంకా అంతో ఇంతో పట్టు, పలుకుబడి మిగిలి ఉన్న మూడు నాలుగు రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రత్యర్ధి పార్టీలకు గట్టిపోటీ ఇవ్వలేక పోయింది. అస్సాం, కేరళల రాష్ట్రాలలో దక్కుతుందనుకున్నఅధికారం చిక్కకుండా పోయింది. పుదుచ్చేరిలో అధికారం చేజారి పోయింది. బెంగాల్’ లో ఘోరంగా ఒక్క సీటూ దక్కలేదు. తమిళనాడులో, మిత్ర పక్షం, డిఎంకే పుణ్యాన హస్తం పార్టీకి  అబోరు దక్కింది. మొత్తానికి ఓ 18 సీట్లు గెలుచుకుంది. ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చాలా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మపరిశీలన చేసుకోవాలని, మందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలని పార్టీ నాయకులకు ఉద్బోదించారు.  అయితే, ఆమె చేసిన ఉద్భోద ఏమైందో ఏమో కానీ,వచ్చే సంవత్సరం ఆరంభంలో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల శాసన సభల ఎన్నికలతో పాటుగా ఎన్నికలు జరిగే పంజాబ్’లో మాత్రం, ‘కాంగ్రెస్ కల్చర్’లో ఏ మాత్రం మార్పు రాలేదు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీమంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్ధూల మధ్య వివాదం రోజు రోజుకు ముదిరి మరింత పాకాన పడుతోంది.నిజానికి కెప్టెన్ సింగ్, సిద్దూ మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పుడు ఇద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయానికి  ఇది ఎటువైపు దారి తీస్తుందనేది, కాంగ్రెస్ అధిష్టానికి కూడా మింగుడు  పడని సమస్యగా మారింది. అదలా ఉంటే, సిద్దూ అదలా ఉంటే, 2015లో ఫరిద్‌కోట్‌లోని కొట్కాపుర్‌లో గురు గ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేశారని నిరసన తెలిపిన ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని సిద్దూ గురు గ్రంథ్‌ సాహిబ్‌  కోసం ప్రాణత్యాగం చేసిన వారికీ న్యాయజరగాలన్న డిమాండ్’తో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు.   ఆలా  ప్రారంభమైన వివాదం, ఒక విధంగా చిలికి చిలికి పార్టీలో చీలికకు దారి తీసే పరిస్థితులను సృష్టించింది.  ఎమ్మెల్ల్యేలు ముఖ్యమంత్రి వర్గం, సిద్దూ వర్గంగా చీలిపోయారు. ఈ నేపధ్యంలో కొట్కాపుర్‌ కాల్పుల కేసులో హైకోర్టు పోలీసులకు అనుకుఅలంగా వచ్చింది. ఈ తీర్పుతో  సిద్ధూ అనుకూలవర్గం ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలకు దిగారు. ఈ అంశాన్ని ప్రధానంగా చూపుతూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు సిద్ధూ. దోషులను శిక్షించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అందుకే ఉద్దేస పూర్వకంగా కేసు వీగిపోఎలా చేసారని ఆరోపించారు.  ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం, ఎమ్మెల్యేలతో భేటీల్లో.. ఈ అంశాన్ని నేతలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనలో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని ఆరోపించారు. ఈ అంశంపై పీసీసీ చీఫ్‌ సునీల్‌ జఖర్‌ రాజీనామా చేస్తానని తెలపగా.. దానిని సీఎం తిరస్కరించారు. ప్రస్తుతం సీఎంపై విమర్శలను విస్తృతం చేశారు సిద్ధూ. దీంతో పార్టీ సంక్షోభంలోకి కూరుకుపోతోందని, చేయి దాటకముందే పార్టీ హైకమాండ్‌ కలుగజేసుకోవాలని పలువురు నేతలు కోరుతున్నారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఇద్దరు అగ్ర నేతల మధ్య గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే విబేధాలు మొదలయ్యాయి. 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ అమృత్‌సర్‌ తూర్పు స్థానం నుంచి గెలిచారు తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కింది. 2018లో పాకిస్థాన్‌ పర్యటన చేపట్టి ఆ దేశ ఆర్మీ అధినేత కమార్‌ జావేద్‌ బజ్వాను కౌగిలించుకొని.. అత్యంత సన్నిహతంగా కనిపించటంపై కెప్టెన్ అమరీందర్ నేరుగానే సిద్దూపై విమర్శలు గుప్పించారు. ఆ వివాదం అలా కొనసాగుతున్న సమయంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దూ భార్య, సిట్టింగ్ ఎంపీ  నవజోత్‌ కౌర్‌ సిద్ధూకు టికెట్‌ నిరాకరించారు. ఈ నేపథ్యంలో.. 2019 జులైల సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అయినా ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితులే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పడు ఇలా బయట పడ్డాయి. చివరకు వ్యక్తిగత విమర్శలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళ వరకు వెళ్ళింది. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా నుంచి పోటీ చేయాలని, సిద్దూకు సింగ్ సవాల్‌ విసిరారు. సిద్ధూకు కనీస డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో చేరాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు.. సునీల్‌ జఖర్‌ స్థానంలో పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించే అంశాన్ని తోసిపుచ్చారు. సిద్ధూకు ఉన్నత పదవి ఇవ్వాలన్న అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వాదనలనూ తోసిపుచ్చారు. అంతే కాదు, సిద్దూ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇలా ఇద్దరి మధ్య సాగుతున్న వివాదం చివరకు ఎందాక పోతుందో .. ఎక్కడ తేలుతుందో .. ప్రస్తుతానికి అయితే ఊహకు అందని విషయంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ హై కమాండ్ ముందెన్నడూ లేనంత బలహీనంగా ఉండడం  వల్లనే పరిస్థితి చేయి దాటిపోయే వరకు వచ్చిందని పార్టీ నాయకులే అంటున్నారు.

ధూళిపాళ్ల‌కు బెయిల్‌.. జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రో ఝ‌ల‌క్‌..

సంగం డెయిరీ కేసులో టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న‌రేంద్ర‌తో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల‌కృష్ణ‌న్‌కు కూడా బెయిల్ వ‌చ్చింది. అయితే, 4 వారాల పాటు విజ‌య‌వాడ ప‌రిధిలోనే ఉండాల‌ని ష‌ర‌తు విధించింది. వాళ్లు ఉండే అడ్ర‌స్ విచార‌ణాధికారికి ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. వారిని విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని పోలీసుల‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  గత నెల 23న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉద‌యాన్నే వంద మందికి పైగా పోలీసులు ఆయ‌న ఇంటిపై దాడి చేసి.. న‌రేంద్ర‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు. సంగం డెయిరీని కంపెనీ చ‌ట్టంలోకి మార్చే స‌మ‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ గ‌తంలో జ‌రిగిన వ్య‌వ‌హారంపై తాజాగా కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసి.. జైలుకు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత సంగం డెయిరీని ప్ర‌భుత్వ డెయిరీకి స్వాధీనం చేశారు. అయితే, హైకోర్టు ఆ ఉత్త‌ర్యుల‌ను కొట్టివేసింది. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందుతున్నారు.  ఇప్ప‌టికే స‌ర్కారు టార్గెట్ చేసి, కేసులు పెట్టి.. జైలుకు పంపిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సైతం బెయిల్ సాధించారు. తాజాగా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు కూడా బెయిల్ రావ‌డంతో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు వ‌రుస షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప‌స లేని కేసులు పెట్టి.. క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తే.. న్యాయస్థానాలు చేస్తూ ఊరుకోవంటూ ప్ర‌తిప‌క్షం మండిప‌డుతోంది. కోర్టుల్లో వ‌రుస ఎదురు దెబ్బ‌ల త‌ర్వాత‌నైనా జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నాయి. 

అర్ధరాత్రి టీడీపీ సీనియర్ నేత అరెస్ట్.. ఇంత అరాచకమా..

కరోనా కల్లోలం రేపుతున్నా.. బ్లాక్ ఫంగస్ భయపెడుతున్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. కరోనా కట్టడి, చికిత్స కంటే కక్ష రాజకీయాలే తమకు ఇష్టమన్నట్లుగా వ్యవహరిస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా సాగుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ వివాదం చల్లారకుండానే మరో టీడీపీ నేతలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.  కర్నూల్ జిల్లా బనగానపల్లె టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని బనగానపల్లె పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి డోన్ రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  జనార్ధన్ రెడ్డిపై ఐపీసీ 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్లతోపాటు... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు. సోమవారం ఆయనను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్నారు.ఆదివారం మధ్యాహ్నం బీసీ జనార్ధన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో తిరిగిన... కాటసాని రామిరెడ్డి అనుచరులు ముగ్గురిని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. దీంతో జనార్థన్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. వారిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి ఘటనలో జనార్ధన్‌రెడ్డితో పాటు.. మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి అరెస్టుతో బనగానపల్లెలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అనుచరులే..  బీసీ జనార్ధన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో తిరిగినా.. పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బనగానపల్లె పోలీసుల చర్యలపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. రాజకీయ కక్షతోనే  బీసీ జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.  టీడీపీ బీసీ జనార్ధన్ రెడ్డి  అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఖండించారు. "క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులే ల‌క్ష్యంగా పాల‌న సాగిస్తున్నారు. బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఇతర నేతల అక్ర‌మ అరెస్టుల‌ను ఖండిస్తున్నా. అధికారం శాశ్వ‌తం కాద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ తెలుసుకోవాలి. వైకాపా పాల‌న మూడు అక్ర‌మ కేసులు, 6 అరాచ‌కాలు అన్న‌ట్లుగా సాగుతోంది. దాడికి పాల్ప‌డిన వైకాపా నేత‌ల‌ను వ‌దిలిపెట్టి జ‌నార్ధ‌న్‌రెడ్డిపై కేసు పెడ‌తారా.? తెదేపా నేత‌ల‌పై అక్ర‌మ కేసులు ఎత్తివేసి వెంట‌నే విడుద‌ల చేయాలి"  అని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.  

రూ.10కే క‌రోనా చికిత్స‌.. డాక్ట‌ర్ కాదు దేవుడు..

క‌రోనాన సోకి ఆసుప‌త్రిలో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి. రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ కావాలంటే 50వేల‌కు పైనే కట్టాలి. హాస్పిట‌ల్‌లో ఎన్ని రోజులుంటే అన్ని ల‌క్ష‌లు లాగేస్తున్నారు. క‌న్స‌ల్టెన్సీ కావాలంటే వంద‌ల‌కు వంద‌లు చెల్లించాల్సిందే. అది కూడా ఏ ఆన్‌లైన్లో పైపైన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొంద‌రు డాక్ట‌ర్లు సైతం క‌రోనా బాధితుల‌ను అంట‌రాని వారిగా చూస్తున్నారు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ వేల‌కు వేలు వ‌స‌లు చేస్తున్నారు. అలాంటిది, ఇలాంటి క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో ఓ వైద్యుడు క‌రోనా బాధితుల పాలిట దేవుడిలా మారాడు. 10 రూపాయ‌లు పెడితే మంచి టీ అయినా దొర‌క‌ని ఈ రోజుల్లో.. జ‌స్ట్‌.. 10 రూపాయ‌ల‌కే క‌రోనా చికిత్స చేస్తూ అంద‌రి అభిమానం చూర‌గొంటున్నారు. వైద్యో నారాయ‌ణో హ‌రి.. అనే మాట‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నారు డాక్ట‌ర్ విక్ట‌ర్ ఇమ్యాన్యుయెల్‌. కన్సల్టెన్సీ ఫీజుగా కేవ‌లం రూ. 10 తీసుకొని, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నాడు ఆ వైద్యుడు. బాధితులు నిరుపేదలైతే ఆ రూ.10 కూడా తీసుకోవడం లేదు. కరోనాకు సంబంధించిన వివిధ పరీక్షలను తక్కువ ధరకే చేస్తున్నారు. మందులనూ అందుబాటు ధరలకే ఇస్తున్నారు.  కొవిడ్‌ వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన పరిస్థితుల్లో హైద‌రాబాద్‌, పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయెల్ త‌క్కువ ధ‌ర‌కు మంచి చికిత్స అందిస్తూ మిగ‌తా వైద్యుల‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన జనరల్‌ మెడిసిన్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్‌ చేశారు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత సొంతంగా క్లినిక్‌ పెట్టుకున్నారు క్లినిక్‌ పెట్టినప్పటి నుంచి తన దగ్గరకు వచ్చే రోగులకు కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.200 తీసుకుంటున్నారు. పేదరోగుల నుంచి రూ.10 మాత్రమే తీసుకుంటున్నారు.  దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాథలు, దివ్యాంగులకు.. ఫీజు, మందులు అంతా ఉచితంగా అందిస్తున్నారు. కొందరు దాతలు సహకరిస్తే నిరుపేద రోగులకు టెస్టులు సహా మందులూ ఉచితంగానే అందిస్తున్నారు.  కొవిడ్‌ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్‌ పరీక్షలు, మందులు, ఆక్సిజ‌న్‌, రెమ్‌డెసివిర్ ఇంజ‌క్షన్‌లు తక్కువ ధరకే అందిస్తున్నారు. ర‌వాణా ఖ‌ర్చులు భ‌రిస్తే.. ఇంటి ద‌గ్గ‌ర‌ వైద్యం చేయించుకునే రోగుల కోసం నర్సులను సైతం పంపుతున్నారు.  పీర్జాదిగూడలోని ప్రజ్వల క్లినిక్‌లో అతి త‌క్కువ ధ‌ర‌కే ఇన్‌పేషెంట్ సేవ‌లు సైతం అందిస్తున్నారు డాక్ట‌ర్ ఇమ్మాన్యుయెల్‌. పేషెంట్ వ‌స్తే చాలు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు దోసుకునే ప్రైవేట్ హాస్పిట‌ల్స్ మాదిరి కాదు. రూ.15వేల నుంచి రూ.20లోపు ఖ‌ర్చుతోనే క‌రోనాకు ట్రీట్‌మెంట్ చేసి పంపిస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చవుతుండగా రూ.15 వేలకే కరోనా వైద్యం అందిస్తుండడంతో ఇమ్మాన్యుయెల్‌ నడిపిస్తున్న ప్రజ్వల క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య  రోజురోజుకి పెరుగుతోంది. హైద‌రాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్ర‌జ్వ‌ల క్లినిక్‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నారు. 10 రూపాయ‌ల డాక్ట‌ర్‌గా ఆయ‌న పేరు ఇప్పుడు ప్ర‌జ‌ల్లో మారిమోగిపోతోంది. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్‌లోనూ డాక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ ఏడాదిగా కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. తన వద్దకు వచ్చిన రోగుల్లో నిరుపేదలుంటే వారిని పీర్జాదిగూడ ఐసొలేసన్‌ సెంటర్‌లో చేర్పించి వారికి పూర్తిస్థాయిలో ఉచితంగానే వైద్యం చేయిస్తున్నారు. ప‌ది రూపాయ‌ల డాక్ట‌ర్‌గా.. క‌రోనా దేవుడిగా.. స్థానికులంతా ఆయ‌న్ను కొనియాడుతున్నారు. 

బ్లాక్ ఫంగస్ సోకడానికి కారణం ఇదేనా? ఆక్సిజన్ ను అడ్డగోలుగా వాడేస్తున్నారా! 

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ భయంకరంగా మారుతోంది.  దేశంలోని పెద్ద ఆసుపత్రుల్లో సైతం ఆక్సిజన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వైరస్ మ్యూటేషన్ మరింత విధ్వంసకారిగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నరోగులిప్పుడు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  డయాబెటిస్, హార్ట్ ఎటాక్, బ్లడ్ క్లాటింగ్ సమస్యతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి మనిషి శరీరంలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. రోగి బ్రెయిన్, ఊపిరితిత్తులు, చర్మంపై కూడా ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది. చాలామంది బ్లాక్ ఫంగస్ కారణంగా చూపు కోల్పోతున్నారు. కొందరప  రోగులకు నాసల్ బోన్ సమస్యలు వస్తున్నాయి. తగిన సమయంలో ఇవి నియంత్రించబడకపోతే రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.  ముకోర్మైకోసిస్ ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుంది. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.  ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది. కిడ్నీ వ్యాధులు, సైనస్, హెచ్ఐవీ, గుండె జబ్బులు కలవారిలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. క్యాన్సర్ చికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి జరిగిన వారు.. మోకాళ్ల నొప్పులు, ఆస్మా ఉన్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. అందుకే వారిలో కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతుంది.  కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్‌ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్‌ వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుంది. ఆక్సిజన్‌తో పాటు ఈ ఫంగస్ కూడా చేరడం వలన కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటితో పాటు బ్లాక్ ఫంగస్ సోకడానికి కొత్త కారణం ఉందని తెలుస్తోంది. హాస్పిటల్స్ లో రోగులకు అందిస్తున్న ఆక్సిజన్ ఇందుకు కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు.  దేశంలో ప్రస్తుతం విజృంభిస్తున్న సెకండ్ వేవ్ తో  వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటోంది. ఎక్కువ మంది రోగులు హాస్పిటల్ లో చేరాల్సి వస్తోంది. శ్వాస సమస్యలతో ఆక్సిజన్ అవసరమవుతోంది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో అత్యవసరం కావడంతో.. పారిశ్రామిక ఆక్సిజన్ ను ఉపయోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారిందంటున్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ ను అప్ గ్రేడ్ చేసి మెడికల్ ఆక్సిజన్ గా వాడాలి.. కాని ఎక్కువ రాష్ట్రాల్లో అలాంటిదేమి చేయకుండానే నేరుగా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇది కూడా బ్లాక్ ఫంగస్ రావడానికి ప్రధాన కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ వైద్య ఆక్సిజన్ కంటే 99.67% వద్ద స్వచ్ఛమైనప్పటికీ, పారిశ్రామిక సిలిండర్లు.. ఆక్సిజన్ సిలిండర్ల వలె శుభ్రంగా ఉండవు. పారిశ్రామిక ఆక్సిజన్  అనేక మైక్రో లీక్‌లకు గురవుతుంటుంది. పారిశ్రామిక గ్యాస్ సిలిండర్లలో దుమ్ము కణాలు, తేమ మరియు నీటి సీపేజ్ ఉన్నందున వాటిని వైద్య అవసరాల కోసం ఉపయోగించకూడదని వైద్యులు చెబుతున్నారు. అప్‌గ్రేడ్ చేయకుండా వాటిని మెడికల్ ఆక్సిజన్ గా ఉపయోగిస్తే సమస్యలు వస్తాయంటున్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ అప్‌గ్రేడేషన్‌కు కొంత సమయంతో డబ్బు అవసరం. దేశంలో ఆక్సిజన్ అవసరం పెరగడంతో అప్ గ్రేడ్ చేయడం  సాధ్యం కావడం లేదు. దీంతో పారిశ్రామిక సిలిండర్ల ద్వారా కలుషితం ఎక్కువగా ఉండటంతో బ్లాక్ ఫంగస్ ఈజీగా వస్తోందనే అభిప్రాయం వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది.  పారిశ్రామిక ఆక్సిజన్‌ను వైద్య వినియోగానికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అవి  నిల్వ చేయబడిన విధానం మరియు లీక్‌ల ద్వారా కలుషితమయ్యే అవకాశం ఉన్నందున శుభ్రపరచడం  అవసరం. అప్‌గ్రేడ్ చేయకుండా ఉపయోగించరాదు. ఇందులో లీకేజీలను గురించి ప్లగ్ చేయడం, కవాటాలను మార్చడం చేయాలి. ఇవన్ని పరిశీలించాక... వైద్యాధికారులు పరిశీలించి ధృవీకరించాకే మెడికల్ ఆక్సిజన్ గా ఉపయోగించాలి. కాని దేశంలో ప్రస్తుతం ఇదేమి జరగడం లేదు. దీంతో లోపల కలుషితమైన నీటితో ఆక్సిజన్ సిలిండర్లు ఫంగస్ నుండి ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి  ముప్పు కలిగిస్తున్నాయని అంటున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నందున ఇప్పటికైనా వైద్యాధికారులు, ప్రభుత్వాలు.. పారిశ్రామిక ఆక్సిజన్ వాడకంలో ఖచ్చితమైన మెడికల్ ప్రోటోకాల్ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  

సెకండ్ డోసుకు ఆలస్యమూ మంచిదే ... 

వాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకుని సెకండ్ డోస్’ డిలే అవుతోందని ఆందోళన చెందుతున్న వారికి, శుభ వార్త. ఒక తీపి కబురు ... వాక్సిన్, వన్ ..టూ ల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనే విషయంపై పరిశోధనలు జరిపిన, అమెరికాలోని మయో క్లినిక్‌ వ్యాక్సిన్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ డైరెక్టర్, వైరాలజిస్ట్‌ గ్రెగొరీ పోలండ్‌, ఆలస్యం అమృతం విషం ... కాదు, ఆలస్యమే అమృతం అంటున్నారు. ఫస్ట్ ,సెకండ్ డోసుల మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత మంచిదని, గ్యాప్ పెరగడం వలన యాంటీబాడీలు 20  నుంచి 300 శాతం ఎక్కువగా పెరుగుతాయని తేలిందని గ్రెగొరీ చెప్పారు. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఈ తరహా ఫలితాలే చూసినట్టు ఆయన  వెల్లడించారు.  మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసిన వారికి స్వల్ప కాలంలోనే రెండో డోసు కూడా వేస్తుండడంతో అందరికీ వ్యాక్సిన్‌ అందడం ఆలస్యమవుతోంది. అలా కాకుండా మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి రెండో డోసును ఆలస్యం చేసి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత పెరిగితే అంత మంచిదని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయ`ని గ్రెగొరీ అన్నారు.  అదలా ఉంటే ఈ గ్రెగొరీ ఎవరో కానీ, మన ప్రభుత్వాలకు చల్ల చల్లని స్వీట్ స్వీట్ కబురు చెప్పారు. గ్రెగొరీ పరిశోధన ఫలాలు, ‘రోగి కోరుకున్నది, వైద్యుడు ఇచ్చింది ఒకటే’ అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. దేశంలో,అవసరానికి సరిపడా వాక్సిన్ తయారు కావడం లేదు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కుటున్నాయి. అలాగే,  వాక్సిన్ పంపిణీలో వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి.  ఈ పరిస్థితిలో గ్రెగొరీ’ ప్రభుత్వాలకే కాదు, సెకండ్ డోసు లేటయితే, ఫస్ట్ డోసు వేస్ట్ అవుతుందని ఆందోళన  చెందుతున్న జనాలకు కూడా తీపి కబురు చెప్పింది.

 విద్యార్థులకు ఇంటివద్దే పరీక్షలు..

దేశంలో కరోనా విజృంభణలో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. కరోనా కల్లోలంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థలతో పాటు రాష్ట్రాల్లోనూ పరీక్షలు వాయిదా పడ్డాయి. కేంద్ర సర్కార్ సీబీఎస్ఈ, జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసింది. చాలా రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులంతా పాస్ అయినట్లు ప్రకటించాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేశాయి. అయితే తాజాగా కేంద్ర సర్కార్ వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆదివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం వర్చువల్ గా జరిగింది. ఇందులోనూ వాయిదా పడిన పరీక్షలను నిర్వహించాలనే ఆలోచనకు అన్ని రాష్ట్రాలు వచ్చాయి.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు చేపట్టేందుకు వీల్లేకపోవడంతో చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి విద్యార్థులకు ఇంటివద్ద నుంచే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 2.90 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఓపెన్ బుక్ పరీక్ష విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను చత్తీస్ గఢ్ ప్రభుత్వం నేడు విడుదల చేసింది చత్తీస్ గఢ్ సర్కార్ పరీక్షలు మార్గదర్శకాలు ఇవి..  ఓపెన్ బుక్ విధానంలో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. విద్యార్థి జూన్ 1 నుంచి 5వ తేదీ లోపు పరీక్ష పత్రాన్ని తీసుకెళ్లవచ్చు. పరీక్ష రాసిన 5 రోజులకు జవాబు పత్రాలను ఇన్విజిలేటర్ కు సమర్పించాలి. ఉదాహరణకు జూన్ 1న ప్రశ్నాపత్నం తీసుకెళ్లిన విద్యార్థి సమాధాన పత్రాలను జూన్ 6న సమర్పించాల్సి ఉంటుంది. సమాధాన పత్రాలను స్వయంగా తీసుకెళ్లి తమ స్కూళ్లలోని ఇన్విజిలేటర్ కు అందించాలి. పోస్టులో పంపడం నిషిద్ధం. జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్యలో ఆన్సర్ కీని కూడా పొందవచ్చు. 

బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై కేసు.. కారణం ఏంటో తెలుసా? 

ఇండియాలో రాజకీయ నేతల హవా అంతా ఇంతా ఉండదు. చట్టాలను వాళ్లు పట్టించుకోరు. అంతా తాము చెప్పినట్లే జరగాలంటారు. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి ఇండియాలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నది ఇండియాలోనే. మొత్తం వస్తున్న కేసుల్లో మూడో వంతు భారత్ లోనే వస్తున్నాయి. సెకండ్ వేవ్ విజృంభణకు ప్రభుత్వాలు, రాజకీయ నేతల నిర్లక్షమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా నేతల తీరు మారడం లేదు. మాస్కులు లేకుండానే జనంలోకి వెళుతున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా పట్టించుకోవడం లేదు. తమ అనుచరులను గుంపులుగా వెంటేసుకుని తిరుగుతున్నారు. అయినా వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. కాని ఒక దేశంలో మాత్రం కొవిడ్ రూల్స్ పాటించలేదంటూ ఆ దేశ అధ్యక్షుడిపైనే కేసు నమోదు చేశారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇప్పటివరకు అక్కడ 1.6 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 4.48 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్ తీవ్రత కారణంగా బ్రెజిల్ లో కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. మాస్కు ధరించకుండా ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. మారనావో రాష్ట్రంలో ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమం జరగ్గా, దేశాధ్యక్షుడు బోల్సొనారో చీఫ్ గెస్టుగా విచ్చేశారు. మాస్కు ధరించకపోగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దపై వ్యాఖ్యలు చేశారు. దేశాధినేత అయినా సరే మాస్కు లేకుండా కనిపించడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మారనావో గవర్నర్ ఫ్లావియో డైనో నిర్ధారించారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని డైనో స్పష్టం చేశారు. అధ్యక్షుడు బోల్సొనారో వైఖరి ఇప్పుడే కాదు, కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇలాగే ఉంది. ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా మాస్కు తీసేసి అందరినీ హడలగొట్టారు. దేశంలో కరోనా మార్గదర్శకాల అమలులో విఫలం అయ్యారంటూ బోల్సొనారో చెడ్డపేరు తెచ్చుకున్నారు. 

రాందేవ్ బాబాపై కేంద్రం సీరియస్.. 

అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. రాందేవ్ బాబా క్షమాపణకు ఆలిండియా వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్య జటిలమయ్యే పరిస్థితులు ఉండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. యోగా గురువు రాందేవ్ బాబాకు ఘాటు లేఖ రాశారు. అల్లోపతి వైద్య విధానంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని రాందేవ్ బాబాకు ఆయన సూచించారు. రాందేవ్ బాబా వ్యాఖ్యలు కరోనా వారియర్స్ మనోభావాలతో పాటు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హర్షవర్ధన్.. తన  లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.  కొవిడ్‌కు వ్యతిరేకంగా వైద్యులు అహోరాత్రాలు శ్రమించి పనిచేస్తున్నారని, వారికి మద్దతునిస్తూ ఆరోగ్య కార్యకర్తలు కూడా సేవలు చేస్తున్నారని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ కల్లోలంలో అల్లోపతి వైద్యులు అనేక లక్షల మంది ప్రాణాలను కాపాడారని, వారి వైద్య విధానంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని కేంద్రమంత్రి ఆక్షేపించారు. కోవిడ్‌ను సామూహికంగా మాత్రమే ఎదుర్కోగలమని హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ రోగులకు సేవలు చేస్తూ వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కూడా తమ ప్రాణాలను కోల్పోయారని, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందన్న విషయాన్ని కేంద్రమంత్రి తన లేఖలో గుర్తు చేశారు. ఇంతటి సేవ చేస్తున్న అల్లోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం భావ్యం కావని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.  ప్రస్తుతం దేశంలో రికవరి రేటు 88 శాతంగా ఉందని, మరణాల రేటు 1.13 శాతంగా ఉందని, ఇదంతా అల్లోపతి వైద్య విధానంతోనే సాధ్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఏ వ్యాఖ్యలనైనా చేసేటప్పుడు కాల, మాన, పరిస్థితులను బేరీజు వేసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఇంతటి క్లిష్ట సమయంలో అల్లోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ మాట్లాడటం వల్ల తత్సంబంధిత వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, అలా మాట్లాడటం ఏమాత్రం సముచితంగా లేదని కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలియా, ఇబోలా, టీబీ లాంటి మహమ్మారి రోగాలకు అల్లోపతి వారే టీకాలను కనిపెట్టారన్న విషయాన్ని మరిచిపోరాదని, తాజాగా వచ్చిన మహమ్మారి కరోనాకు సంబంధించిన టీకా కూడా అల్లోపతి వైద్య విధానం నుంచే వచ్చిందని హర్షవర్ధన్ తన లేఖలో రాందేవ్ బాబాకు గుర్తు చేశారు.