భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి.. ప్రియుడికోసం పోలీస్ స్టేషన్ కి..
posted on May 25, 2021 @ 5:05PM
మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి ఈ రెండు ఎప్పుడు,ఎలా, ఎవరితో జరుగుతాయో తెలీదు. యువతీ యువకుల్లో ప్రేమ పుట్టాం సహజం. కానీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లకు ప్రేమ పుట్టడం కూడా సహజం అని అంటుంది సుజాత.. అలా అని పెళ్లి అయినా వాళ్లకు ప్రేమ పుటుతోందని కాదు. ఆ వారి నిర్ణయాల వాళ్ళ ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఆలోచించాలి. అయినా నేటి జనాలు ప్రేమ ముసుగులో చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ ముసుగులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. భాద్యతగా పిల్లల జీవితాలను సక్కదిద్దాల్సిన వాళ్ళు, భాద్యత మరిచి, వారి సొంత సొంత ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ..?
ఓపెన్ చేస్తే.. అది తెలంగాణ. వనపర్తి జిల్లా. అమరచింత మండలం. ఆమె పేరు సుజాత. ఆమెకు పెళ్లి అయింది. భర్త, పదేళ్ల వయసున్న కొడుకు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే, అమరచింతలో వారు ఉండే కాలనీకి చెందిన రాకేశ్అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడి కోసం ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి నెల రోజుల కింద రాకేశ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కట్ చేస్తే.. ఇద్దరు భార్యాభర్తలమని చెప్పి వరంగల్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వాళ్లిద్దరి కోసం ఇరు కుంటుంబాలు తీవ్రంగా గాలించాయి. చివరికి వరంగల్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఈనెల 21న రాకేశ్ కుటుంబ సభ్యులు వరంగల్ వెళ్లి.. ఇద్దరిని ఒప్పించి అమరచింతకు తీసుకువచ్చారు. భర్త ఇంటి వద్ద సుజాతను వదిలేశారు.
అక్కడితో ఆగని సుజాత తన ప్రియుడితోనే చావైనా బతుకైనా అని చెప్పి చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. సుజాత సోమవారం అమరచింత పోలీస్స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపింది. తాను ప్రియుడు రాకేశ్‌తోనే ఉంటానని స్టేషన్ ముందు బైఠాయించింది. వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని కూడా తెలిపింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. రాకేశ్‌పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని, రాకేశ్‌ను ఎక్కడ దాచి పెట్టారో చెప్పాలని పోలీసులను కోరింది. ఈ మేరకు వినతి పత్రం పోలీసులకు ఇచ్చింది. అతని మొబైల్ కూడాఅందుబాటులో లేకుండా చేశారని ఆరోపించింది. అనంతరం సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.