ఆటో పట్టిన చిట్టి చేతులను ఆదుకున్న లోకేశ్‌..

ఈ కుర్రాడి వయసు ఏనిమిదేండ్లు. ఆటో సీట్లో కూర్చుంటే కాళ్లు సరిగా కింద కూడా అందవు. కాని ఆ కుర్రాడు ఆటో నడుపుతున్నారు. తన తల్లిదండ్రులను సాకడానికి.. ప్రమాదమైనా ఆటో లో రయ్ మని దూసుకెళ్తున్నాడు.తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో నడపాల్సి వస్తోందని పిల్లాడితో పాటు అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.  జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న 8 ఏండ్ల బాలుడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలుడి దుస్థితిని చూసి చాలా మంది కన్నీళ్లు కార్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన పాపిరెడ్డి, రేవతి దంపతులకు ముగ్గురు మగపిల్లలు. కానీ ఆ దంపతులిద్దరికీ కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు అంధులు కావడంతో.. పెద్ద కొడుకైనా ఎనిమిదేళ్ల గోపాల్ రెడ్డి.. చిన్న ప్రాయంలోనే కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. బ్యాటరీ ఆటో నడుపుతూ గ్రామంలో పప్పులు, బియ్యం విక్రయిస్తున్నాడు. ఆటోలో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని, నిత్యావసరాలు తీసుకుని సమీప గ్రామాల్లో తిరుగుతాడు. ఇలా సాగే వ్యాపారమే వారి కుటుంబానికి జీవనాధారం.  ఈ చిన్నారి కష్టాలు పడుతున్న కష్టం తెలుసుకుని చలించిన టీడీపీ నేత నారా లోకేశ్‌ వెంటనే గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. అతడి చదువు బాధ్యతనూ తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.  బ్యాటరీ ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు మరో రూ.2 లక్షలు టీడీపీ నుంచి అందిస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఇంత చిన్నపిల్లాడు ఆటో నడిపే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. మరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని కోరుతున్నారు. 

అధ్వాన్న రోడ్లపై 2 లక్షల ట్వీట్స్.. ట్రెండింగ్ లో జగనన్న సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని సమస్యలే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్యులకు కనీస అవసరాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఏపీలో రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓ వైపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్న జనాలను నరకకూపంగా మారిన రోడ్లు మరింత భయపెడుతున్నాయి.  ఏపీలో రోడ్లు ఎక్కడచూసినా గుంతలమయమే, అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయి. పట్నం, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా అధ్వాన్న రోడ్లపై. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కార్లు పడిపోయే సైజులో గంతులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించచ్చు. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది జనాలు హాస్పిటల్ పాలవుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై కొంత కాలంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోరాటం చేస్తోంది. రెండు రోజులుగా జనసేన కూడా రంగంలోకి దిగింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో జన సైనికులు అధ్వాన్న రోడ్లను బాగు చేయాలంటూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు కు విశేష స్పందన వచ్చింది. ఏపీలో అధ్వాన్నపు రహదారులపై లక్షల కొద్దీ ట్వీట్స్ వచ్చాయి. గుంతల మధ్య రోడ్లను కళ్ళకు కట్టేలా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో జనాలు అప్ లోడ్ చేశారు.  #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో రెండు రోజుల్లో దాదాపు 2 లక్షల ట్వీట్స్ వచ్చాయి. 200 మిలియన్లకు #JSPForAP_Roads ద్వారా రోడ్ల దుస్థితి రీచ్ అయిందని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం శనివారంతో ముగియనుండటంతో ట్వీట్లు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలనలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. రోడ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ప్రజలే చూపించారంటున్నారు జనసేన నేతలు. గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని  పవన్ కల్యాణ్ చెప్పిన విషయం అక్షర సత్యమని చెబుతున్నారు.  ఈ డిజిటల్ ఉద్యమంలో వస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తే ఏపీలో రహదారుల పరిస్థితి ఏంటో అందరకీ అర్థం అవుతుందని జనసైనికులు అంటున్నారు. నెల రోజుల్లో ఈ రోడ్ల ను ప్రభుత్వం బాగు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అక్టోబర్2వ తేదీ నుంచి శ్రమదానం తో జన సైనికులే బాగు చేయాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.   

12 ఏళ్ల పైబడిన వారికి కొవిడ్ టీకా! సెప్టెంబర్ 15 నుంచి మార్కెట్లోకి..

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల పైబడిన వారికే కొవిడ్‌ టీకా అందిస్తున్నారు. 19 ఏండ్ల లోపు వాళ్లకు వేసే కొవిడ్ టీకా కోసం కొన్ని ఫార్మా సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా 12 సంవత్సరాలు దాటిన వారూ పొందే టీకాను  సిద్ధం చేసినట్లు జైడిష్‌ క్యాడిలా సంస్థ ప్రకటించింది. ‘జైకోవ్‌-డి’ పేరిట ఉత్పత్తి చేసిన టీకా ఈ నెల 15వ తేదీ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉండబోతోంది. ఈ విషయాన్ని వైద్య వర్గాలు వెల్లడించాయి.  ప్రభుత్వ వైద్యంలో ఈ టీకా ఎప్పటి నుంచి లభ్యమవుతుంది అన్న అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరను కూడా నిర్ణయించిన తర్వాతే సర్కారు వైద్యంలో ప్రవేశపెడతారని, అందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జైడిష్‌ క్యాడిలా సంస్థ  రూపొంచిందిన ‘జైకోవ్‌-డి’ మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను రెండు డోసుల్లో పొందుతుండగా.. ‘జైకోవ్‌-డి’ను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్‌ తీసుకున్న 28 రోజులకు రెండో డోసు, రెండో డోసు పొందిన తరవాత 28 రోజులకు మూడో డోసు పొందాలి. ఈ లెక్కన తొలి డోసు నుంచి మూడో డోసు టీకా పొందడానికి మధ్య వ్యత్యాసం 56 రోజులు. ఈ టీకా వేయడానికి సూది వినియోగించరు. ‘ఫార్మాజెట్‌’ అనే పరికరం సాయంతో వ్యాక్సిన్‌ వేస్తారు. ఆ పరికరాన్ని చర్మంపై ఉంచి నొక్కడం ద్వారా టీకా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ‘జైకోవ్‌-డి’ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ప్రస్తుతం కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా ఈ టీకా రావడం విద్యార్థులకు ప్రయోజనకరమన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు సుమారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. అవసరమైన వారు ప్రైవేటులో సొంతంగా కొనుగోలుచేసి ఈ టీకాను పొందాల్సి ఉంటుంది. రెండేళ్ల పైబడిన వారి కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేయనున్న టీకా వచ్చే నవంబరులో అందుబాటులోకి రావచ్చని వైద్య వర్గాలు తెలిపాయి.  

ఏపీలో పాలనంతా అవినీతిమయం! వైసీపీ ఎమ్మెల్యేల సంచలనం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోతుందని కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇసుక, లిక్కర్, మైనింగ్... ఇలా అన్నింటిలోనూ వైసీపీ ప్రజా ప్రతినిధులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై కొందరు కోర్టులకు కూడా వెళ్లారు. న్యాయస్థానాల ఆదేశాలతో విచారణలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం చెప్పడం కలకలం రేపుతోంది.  గుంటూరు జిల్లా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి పౌరసరఫరాలశాఖాధికారుల అక్రమాలకు అంతులేదని ఆరోపించారు. వారానికి రెండు, మూడు లారీల రేషన్ బియ్యం పట్టుబడుతోందని తెలిపారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పట్టుబడితే జిల్లా వ్యాప్తంగా ఎంత బియ్యం అక్రమంగా తరలుతోందని ప్రశ్నించారు. అక్రమ రేషన్ పట్టుబడితే నామమాత్రపు కేసులు పెడుతున్నారని విమర్శించారు మంగళగిరి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి మండిపడ్డారు.  ఇక వినుకొండ ఎమ్మెల్యే  ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని బహిరంగంగానే అంగీకరించారు. సాగునీటి అంశంపై డిఆర్సీలో ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చేతగాని తనం వల్ల ప్రజలతో మాటలు పడుతున్నామని వైసీపీ ఎమ్మెల్యే వాపోయారు. రైతులకు ఉన్న పరిజ్ఞానం కూడా ఇరిగేషన్ అధికారులకు లేదని తప్పుబట్టారు. నీళ్లు అంతా సముద్రం పాలు అవుతుందని, నీళ్లు లేనప్పుడు వారబందీ పెట్టాలన్నారు. వరదలు వస్తున్నప్పుడు వారబందీ ఏంటని అధికారులను బ్రహ్మనాయుడు నిలదీశారు. నీళ్లు ఇవ్వలేక పోవడంతో ఎమ్మెల్యేలను రైతులు పిచ్చోళ్లలా చూస్తున్నారని బ్రహ్మనాయుడు మండిపడ్డారు. అవినీతి, అక్రమాలపై ఇంతకాలం ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా  కౌంటరిచ్చింది వైసీపీ. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని కొందరు వైసీపీ నేతలు చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓపెన్ గానే అవినీతి జరుగుతుందని చెప్పడం కాక రేపుతోంది. తాము చెప్పిందో నిజమైందనని, వైసీపీ నేతలే అక్రమాలు జరుగుతున్నాయని అంగీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మంగళగిరి, వినుకొండ ఎమ్మెల్యేల కామెంట్లు వైసీపీని షేక్ చేస్తున్నాయి.   

కేసీఆర్ ప్రధాని మోడీని కలిసింది అందుకేనా? రేవంత్ రియాక్షన్ ఏంటో?

దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సడెన్ గా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు. మొత్తంగా 16 అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్‌ వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఐపీఎస్‌ల సంఖ్యపెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. పీఎంజీఎస్‌వైకి అదనపు నిధులు కేటాయింపు, కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు రూ.1,000 కోట్లు మంజూరు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి తగిన రీతిలో సహకరించాల్సిందిగా కేసీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ షెడ్యూల్ లో ప్రధానితో సమావేశం లేదు. ప్రధానిని కలవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు కూడా సమాచారం బయటికి రాలేదు. కాని సడెన్ గా ప్రధాని మోడీ నివాసంలో కేసీఆర్ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో  నిర్మించనున్న తెలంగాణ భవన్  భూమి పూజ కోసం బుధవారం హస్తినకు వెళ్లారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా భారీగా వెళ్లారు. గురువారం పార్టీ నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేయాలి. షెడ్యూల్ లో లేకున్నా ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.శనివారం కేంద్రం హోంమంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారని తెలుస్తోంది.  జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ కు సమాచారం రాలేదు. తమ కూటమిలోకి కేసీఆర్ ను తీసుకోవడానికి సోనియా ఇష్టంగా లేరని చెబుతున్నారు. కేసీఆర్ ను బీజేపీ మనిషిగానే ఆమె చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు కమలనాధులు. పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, రెండు పార్టీలు కావాలనే డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానితో జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ప్రధాని మోడీ, కేసీఆర్ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని జనంలోకి వెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

దీవెన అలా కుదరదు.. జగనన్నకు హైకోర్టు మరో షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. ఇది ఏపీలో ఇప్పుడు రోటీన్ గా మారింది. ప్రతి రోజూ ఏదో ఒక కేసులో జగన్ రెడ్డి ప్రభుత్వానికి న్యాయ స్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అనాలోచితంగా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవోలు ఇస్తోంది జగన్ ప్రభుత్వం. చట్ట విరుద్దమంటూ ఎవరో ఒకరు కోర్టుకు వెళుతున్నారు. విచారణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో కోర్టులు జీవోలను కొట్టివేస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. కోర్టుల్లో వరుసగా మొట్టికాయలు పడుతున్నా వైసీపీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. దీంతో తాజాగా మరో కేసులోనూ జగనన్నకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది.  జగనన్నవిద్యా దీవెన పథకం చెల్లింపులలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన కార్యక్రమం కింద తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. అయితే తల్లులు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం  స్పష్టం చేసింది. అయితే ఫీజులను కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లో జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును ఆశ్రయించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ అకౌంట్లలో జమ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. నేరుగా కాలేజీల అకౌంట్లలో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశించింది.

బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ప్రధానిని సమయం కోరుతూ తెలంగాణ సీఎంవో అధికారులు రెండో రోజుల క్రితమే పీఎంవోకు సమాచారం పంపించారు. అయితే కేసీఆర్ కు ఇవాళ అపాయింట్ మెంట్ ఖరారైంది. ప్రధానితో జరిగే సమావేశంలో రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ చర్చిస్తారని అంటున్నారు. ఏపీతో నెలకొన్న జల వివాదాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ భూమి పూజ కోసం బుధవారం హస్తినకు వెళ్లారు కేసీఆర్. గురువారం పార్టీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేయాలి. కేసీఆర్ షెడ్యూల్ లో ప్రధానితో సమావేశం కూడా లేదు. కాని ఇప్పుడు మోడీతో కేసీఆర్ సమావేశం అవుతుండటం ఆసక్తిగా మారింది. శనివారం కేంద్రం హోంమంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారని తెలుస్తోంది.  రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు కమలనాధులు. పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, రెండు పార్టీలు కావాలనే డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం అవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ కు బిగ్ షాక్.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా 

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక. వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేయించుకున్నారు. అయితే సీఎం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు నిత్యం వార్తల్లోకి వస్తోంది. వాలంటీర్లే రోడ్డెక్కుతున్నారు. వైసీపీ నేతల పెత్తనం పెరగడంతో తాము పని చేయలేమంటూ వాలంటీర్లపై ఆందోళనలకు దిగుతున్నారు. అధికారులు కూడా వాళ్లపై ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో వేధింపులు భరించలేక ఇప్పటికే కొందరు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లారు. కర్నూల్ జిల్లాలో ఓ వాలంటీర్ ఏకంగా లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు. తమపై వేధింపులు అపాలని వాలంటీర్లు మొరపెట్టుకుంటున్నా వైసీపీ నేతలు, అధికారుల తీరు మారడం లేదు. దీంతో చిత్తూరు జిల్లాలో ఏకంగా 74 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. పాకాల మండలంలో ఈవో, వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ 74 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అధికార పార్టీ నేతల వేధింపులకు నిరసనగా పాకాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈవో కుసుమకుమారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నేతల వేధింపులు ఆపాలని, నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల విశాఖ మన్యంలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మారుమూప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు, రవాణా సదుపాయాలు లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. గత్యంతరం లేక రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. ఏపీ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.  ప్రభుత్వ తీరు, వైసీపీ నేతల దౌర్జన్యాలు తగ్గకపోతే రాబోయే రోజుల్లో మరికొందరు వాలంటీర్లు రాజానామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థలో రాజీనామా కొనసాగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

జనసేన కార్యకర్తలను తాలిబన్లతో పోల్చిన వైసీపీ ఎమ్మెల్యే

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైసీపీ, జనసేన మధ్య వివాదం ముదురుతోంది. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు పోస్టులు. బ్యానర్లు వేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేయడంతో వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు, నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరైనా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే చాలు... జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. భీమవరంలోనే కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. జనసేన కార్యకర్తలకు, తాలిబన్లకు తేడా ఏమీలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం కాదు... జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు స్వయంగా చెప్పారు. జనసేన నేతలు పిల్లచేష్టలకు పాల్పడుతున్నారు" అని గ్రంథి శ్రీనివాస్ వివరించారు.గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ భీమవరం ప్రజలకు కనిపించలేదని, ఆయన ఎందుకు కనిపించలేదన్న విషయాన్ని జనసేన కార్యకర్తలు ఓ బ్యానర్ వేసి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని హితవు పలికారు. 

జగనన్న దెబ్బకు పెట్టుబడులు బంద్.. 4 నుంచి 13వ స్థానానికి ఏపీ డమాల్ 

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు హడిలిపోతున్నారా? రాయితీలు ఇస్తామంటున్నా మీకో దండం అంటూ ముఖం చాటేస్తున్నారా? అంటే కేంద్ర సర్కార్ లెక్కలు అవుననే చెబుతున్నాయి. ఏపీకి గత రెండేండ్లుగా కొత్త పెట్టుబడులు అనుకున్నంతగా రావడం లేదు. అసలు ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇందుకు జగన్ సర్కార్ విధానాలే కారణమంటున్నారు. ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందేమోనన్న  అసూయతో.. గత ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలను టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో పెట్టుబడులకు గతంలో ముందుకు వచ్చిన లులూ గ్రూప్ అలానే వెనక్కి వెళ్లిపోయిందనే విమర్శలు వచ్చాయి. లులూతో పాటు పలు దిగ్గజ సంస్థలు ఏపీకి గుడ్ బై చెప్పేశాయి. అనంతపురంలో ఏర్పాటైన ప్రతిష్టాత్మక కియా సంస్థ ప్రతినిధులను స్థానిక వైసీపీ ఎంపీ బెదిరించడం పారిశ్రామిక వర్గాలను షాక్ కు గురి చేసింది. అందుకే జగన్ రెడ్డి  ప్రభుత్వం పేరు చెబితేనే వ్యాపార వేత్తలు పరార్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జగన్ రెడ్డి సర్కార్ తీరుతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని, పెట్టుబడులు రావడం లేదని విపక్షాలు ఆరోపిస్తుండగా.. మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి లేదని చెబుతూ వస్తున్నారు. గతంలో కంటే ఏపీకి పెట్టుబడులు పెరిగాయని అంటున్నారు. కాని  జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీకి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు దారుణంగా ప‌డిపోయాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ద్వారా స్పష్టమైంది. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు సంబంధించి గురువారం రాత్రి కేంద్రం విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం..2019 అక్టోబ‌ర్ నుంచి 2021 జూన్ వ‌ర‌కు ఏపీకి కేవ‌లం రూ.2,577.1 కోట్ల మేర విదేశీ పెట్టుబ‌డులు వ‌చ్చాయి. విదేశీ పెట్టుబడుల విషయంలో దేశంలో 13 వ స్థానానికి పడిపోయింది ఏపీ.  చంద్ర‌బాబు హయాంలో విదేశీ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో టాప్ 4లో కొన‌సాగింది ఆంధ్రప్రదేశ్.  కేంద్ర లెక్కల ప్రకారం విదేశీ పెట్టుబడుల ద్వారా తెలంగాణ‌కు రూ.17,709.15 కోట్లు వ‌చ్చాయి. ఏపీ కంటే తెలంగాణ‌కు ఏకంగా 8 రెట్ల మేర విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఇక టాప్ 3లో చోటు ద‌క్కించుకున్న ద‌క్షిణాది రాష్ట్రం క‌ర్ణాట‌క రూ.1,49, 715.38 కోట్ల‌ను సాధించింది. రాజ‌కీయంగా అత్యంత విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. క‌ర్ణాట‌క  స‌త్తా చాటింది.రూ.30,078.87 కోట్ట మేర విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను సాధించి తమిళనాడు ఐదో స్థానంలో నిలిచింది. అటు జ‌య‌లలిత‌, ఇటు క‌రుణానిధి మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడులోనూ రాజ‌కీయ అస్థిర‌త్వ‌మే రాజ్యమేలుతోంది. అయినా కూడా ఆ రాష్ట్రం కూడా స‌త్తా చాటింది. ఏపీలో 51 మంది ఎమ్మెల్యేల‌తో స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినీ కూడా జ‌గ‌న్‌ సర్కార్ పెట్టుబడులు తీసుకురాలేకపోయింది. వైసీపీ సర్కార్ విధానాలే ఇందుకు కారణమని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరుల్లో బాగానే ఉండేది. ఉమ్మడి ఏపీకి రాబడిలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచే వచ్చేంది. రాష్ట్ర విభ‌జ‌న‌తో హైద‌రాబాద్ కేపిట‌ల్‌గా ఏర్ప‌డ్డ కొత్త రాష్ట్రం తెలంగాణ‌కు ఎలాంటి ఇబ్బంది లేక‌పోయినా.. క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా కొత్త ప్ర‌స్థానం మొద‌లెట్టిన ఏపీ తీవ్ర కష్టాలు వచ్చాయి. అప్పుల్లో కూరుపోయిన ఏపీని గ‌ట్టెక్కించేందుకు టీడీపీ ప్రభుత్వం ఎంతో శ్రమించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీని అగ్ర‌స్థానంలో నిలిపారు చంద్రబాబు. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో రాష్ట్రాన్ని టాప్ 4లో కొన‌సాగేలా చేశారు. అయితే ఒక్క ఛాన్స్ అంటూ వ‌చ్చిన జ‌గ‌న్ కు జ‌నం ఓటేశారు. అయితే త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను అడియాశ‌లు చేస్తూ రాష్ట్రాన్ని జ‌గ‌న్ అధోఃగ‌తి బాట ప‌ట్టించేశారు.  ఏ రాష్ట్రం, దేశ‌మైనా త‌న‌కు వ‌చ్చే రాబ‌డిని పెంచుకునే దిశ‌గానే ఆలోచ‌న చేస్తాయి. ఆదాయం పెంపున‌కు చర్యలు తీసుకుంటాయి. కాని జ‌గ‌న్ జ‌మానా  ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. సంక్షేమ పథకాల పేరుతో అడ్డగోలుగా పంచుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఓ వైపు ఆర్థిక వేత్త‌లు హెచ్చ‌రిస్తూనే ఉన్నా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. రాష్ట్ర ఆదాయానికి మించి నాలుగైదు రెట్ల నిధులు అవ‌స‌ర‌మ‌య్యే సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి.. వాటి అమ‌లు కోసం అప్పుల మీద పడ్డారు. కొత్త రుణాల కోసం నిత్యం పాకులాడున్నారు. అప్పుల కోసం వెతుక్కోవడానికే టైం స‌రిపోతుంటే.. ఇక విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులపై దృష్టి సారించే అవ‌కాశం ఎక్క‌డిదనే విమర్శలు వస్తున్నాయి.ఈ కార‌ణంగానే చంద్రబాబు హ‌యాంలో అభివృద్ధి బాట‌లో దూసుకుపోయిన న‌వ్యాంధ్ర జ‌గ‌న్ జ‌మానాలో తిరోగ‌మ‌న దిశ‌గా ప‌య‌నిస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన నివేదికపై స్పంందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖం చూసి, మంత్రి  గౌతమ్ రెడ్డి మాయ మాటలు విని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వారెవ్వరూ లేరని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.  చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీని మొదటి 5 స్థానాల్లో నిలుపుతూ వచ్చారన్నారు.  జగన్ రెడ్డి దరిద్ర పాదానికి అరాచకం తోడయ్యి ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో మనం 13వ స్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. పక్కన  రాష్ట్రాలన్నీ, ఉన్నతస్థానంలోకి చేరుతుంటే...ఏపీ మాత్రం  దిగజారిపోతోందని లోకేష్ అన్నారు.  

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్?

రాష్ట్రం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం చల్లబడింది. అయితే హుజూరాబాద్ నియోజక వర్గంలో మాత్రం ఎన్నికల వేడి భగ్గుమంటోంది. మండు వేసవిని మరిపిస్తోంది. రోజులు గడించే కొద్ది వేడి మరింతగా పెరుగుతోంది, మాటలు గీత దాటుతున్నాయి. రాష్ట్రంలో ఇంతలా రాజకీయ వేడిన రాజేసిన హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇప్పటికే, ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితితో పాటుగా ఎన్నికల నిర్వహరణ ఏర్పాట్లు, సంసిద్ధత అడిగి తెలుసుకుంది.  గత నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కరోనా కారణంగా చూపించి, ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి  లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపిన తెరాస ప్రభుత్వం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  మాత్రం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. దీంతో ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడన్న ఉత్కంఠకు తెరపడినట్లే అంటున్నారు.  రోజుల్లోనే ముహూర్తం ఖరారు కావడం, షెడ్యూలు విడుదల ఖాయమని అంటున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ ఏడాది జూన్‌లో రాజీనామా చేయటంతో ఖాళీ అయిన స్థానానానికి  నిబంధనల మేరకు ఈ ఏడాది డిసెంబరు 12 లోగా   ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే, పొరుగు రాష్ట్రం ఏపేలోని బుద్వేల్ శాసనసభ నియోజకవర్గం సిట్టింగ్  శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన స్థానానికి, సెప్టెంబర్ 28 లోగా ఉపఎన్నిక జరగవలసివున్ననేపధ్యంలో సెప్టెంబర్’లోనే ఉపఎన్నిక జరుగుతుందని లేదంటే, అక్టోబర్, నవంబర్ మాసాలలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే ఉప ఎన్నిక ముహూర్తం ఖరారయ్యే పక్షంలో ఈవారంలోనే  షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.  హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా, చాలా పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు బరిలో నిలిచే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే, తమకు జరుగతున్న అన్యాయయానికి నిరసనగా, వివిద సంఘాలు తమ ప్రతినిధులను పెద్ద సంఖ్యలో బరిలో దించుతున్నట్లు ప్రకటించాయి.మరో వంక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేస్తే ఆర్థిక సహాయం చేస్తామంటూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. గత (2018) ఎన్నికల్లో మొత్తం పది మంది సభ్యులు మాత్రమే పోటీ చేశారు. అయితే ఈ సారి ఈ సంఖ్య ఎందాకా పోతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఒక వేళ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల సంఖ్య 384 దాటితే, ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ ఉపయోగించక తప్పదని అధికారులు అంటున్నారు. గతంలో 1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 477 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో 50 పేజీల బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించి పోలింగు నిర్వహించారు. 2019లో నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో ఎం3 రకం ఈవీఎంలతో పోలింగు నిర్వహించారు.తొలిసారిగా ఆ అత్యాధునిక ఈవీఎంలను నిజామాబాద్‌లోనే వినియోగించటం విశేషం. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈవీఎంలా? బ్యాలెట్‌ బాక్సులా? ఏ పద్దతిలో జరుగుతుంది అనేది,  నామినేషన్ల ఉపసంహరణ తరవాతనే  తెలుస్తుంది.  నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. బీజేపీ తమ అభ్యర్ధిని ఇంకా అధికారకంగా ప్రకటించక పోయినా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఆయనకు పోటీగా మాజీ మిత్రుడు, మంత్రివర్గ సహచరుడు, ఈ అన్నిటినీ మించి  సహా బాదితుడు మంత్రి హరీష్ రావు, తెరాస  అభ్యర్ధి గెల్లు శ్రీనివాస యాదవ్ విజయం కోసం సర్వతానై ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు .. కారణాలు ఏవైనా ప్రచారంలోనూ పెద్దగా శ్రద్ద  చూపడం లేదు. ఎన్నికల కమిషన్ ముహూర్తం ఖరారు చేసిన తర్వాతగానీ, కాంగ్రెస్ వ్యూహం ఏమిటన్నది తెలియదు. అది తెలిస్తే ప్రధాన పోటీ ద్విముఖమా ? త్రిముఖమా అన్నది తేలదు.

బీజేపీకి పవన్ కల్యాణ్ కటీఫ్? స్టాలిన్ ను పొగుడుతూ సిగ్నల్ ? 

భారతీయ జనతా పార్టీకి జనసేన టాటా చెప్ప బోతోందా? పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీలో కీలక మలుపు జరగబోతోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీకి వకీల్ సాబ్ బైబై చెప్పబోతున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యేలా తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తును తెగ తెంపులు చేసుకోవడానికి భీమ్లా నాయక్ రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్ఠాలిన్ ను ఆకాశానికెత్తుతూ ట్వీట్ చేయడం ద్వారా పవన్ కల్యాణ్ ఆ దిశగా సంకేతం ఇచ్చారని అంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ అయిన స్టాలిన్.. ప్రస్తుతం యూపీఏ కూటమిలో ఉన్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు స్టాలిన్. అంతేకాదు గత ఏప్రిల్ లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ కూటమితోనే పోరాడారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ... స్టాలిన్ ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసింది. తమిళనాట రజనీకాంత్ పొలిటికల్ ఎపిసోడ్, శశికల రాజకీయ సన్యాసం వెనుక స్ఠాలిన్ ను ఓడించాలనే బీజేపీ ఎత్తుగడ ఉందని అంటారు. కమలనాధులు ఎన్ని కుట్రలు చేసినా బంపర్ మెజార్టీతో గెలిచి సీఎం సీటులో కూర్చున్నారు స్టాలిన్. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి  సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టాలిన్. ఆయన నిర్ణయాలు అందరూ హర్షించేలా.. అధినేత అనేవాడు ఇలా ఉండాలన్నట్లుగా ఉంటోంది. తమిళనాడు అంటేనే వ్యక్తిపూజ ఎక్కువ. రాజకీయాల్లో మరీ ఎక్కువ. అధికారంలో ఉన్న అధినేత అడుగులకు మడుగులు ఒత్తటం తమిళ తంబీల్లో చూస్తుంటాం. అలాంటిది ఇటీవల తన పార్టీ నేతలకు షాకిచ్చారు స్టాలిన్. అసెంబ్లీలో తనను అదే పనిగా పొగడొద్దని చెప్పారు.తనను పొగిడే వారి మీద చర్యలు తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రెస్ నోట్ ను తన చేతి సంతకంతో రిలీజ్ చేశారు. అందులో స్టాలిన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశారు. బీజేపీకి బద్ద వ్యతిరేకిగా ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ ను పవన్ కల్యాణ్ ప్రశంసించడం ఇప్పుడు చర్చగా మారింది. ఏపీ రాజకీయాల్లో పవన్ చర్చ మరింత పెరిగేలా చేసింది. స్టాలిన్ ను ఒక రేంజ్ లో పొగిడేసిన పవన్.. ‘మీరు రాజకీయ నేతలందరికి ఆదర్శం. మీ పాలన.. మీ ప్రభుత్వ పనితీరు ఒక్క రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు.. రాజకీయ పార్టీలకు మార్గదర్శకంగా నిలిచారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ తీరు ఏపీ బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది. తమ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ.. తమకు ప్రత్యర్థి పార్టీ విధానాల్ని.. ముఖ్యంగా కేంద్ర సర్కారు తీసుకొచ్చిన చట్టాన్ని దెబ్బ తీసేలా ఉండే తీర్మానంపై జగన్ రియాక్టు కావటాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు తోక పార్టీగా ఉండాల్సిన జనసేన అందుకు భిన్నంగా తమకు రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎంకేను జనసేనాని పొగడటంపై బీజేపీ నేతలు కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు. స్ఠాలిన్ విషయంలో  పవన్ కల్యాణ్ కామెంట్లు తమను దెబ్బ తీసేలా ఉన్నాయని ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు  స్టాలిన్ పై పవన్ పొగడ్తల విషయంలో బీజేపీ లైన్ ను ధిక్కరించారని చెబుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ ను వివరణ అడగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే  తన స్వేచ్ఛ విషయంలో బీజేపీ నేతలు అడ్డు వస్తే.. వారికి కటీఫ్ చెప్పేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీ అగ్రనాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్న పవన్.. తను అనుసరించే సిద్దాంతానికి భిన్నంగా బీజేపీ తీరు ఉందన్నట్లుగా ఆయన భావన ఉందంటున్నారు. ఇందుకు తగ్గట్లు సమయానికి తగ్గట్లు తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేందుకు పవన్ వెనుకాడటం లేదంటున్నారు. అందులో భాగాంగనే స్టాలిన్ ను పొగుడుతూ బీజేపీకి కటీఫ్ చెప్పబోతున్నాననే సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.   

సోషల్ మీడియా సంస్థలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. వైసీపీలో కలవరం? 

దేశంలో సోషల్ మీడియా అరాచక శక్తులకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇది మరింతగా శృతి మించింది. ఏకంగా న్యాయమూర్తులనే టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలు అసహనానికి గురై…కోర్టులు, జడ్జిలపై నేరుగానే విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోవడంతో  వైసీపీ నేతలపై పలు న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు కూడా జారీ  అయ్యాయి.  ఆ 49 మందిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు.  తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరుపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెప్పినా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు.  జవాబుదారీతనం, సరైన నియంత్రణ లేకపోవడంతో వ్యక్తుల పరువుకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇది, దేశానికి ఎంతో ప్రమాదకరమని, ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో అలజడులకు ఇదే కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా అని, మంచికి వాడితే అదో మంచి ఆయుధమని, కొందరు దానిని దుర్వినియోగపరుస్తూ సమాజంలో చిచ్చు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు.దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తికి తబ్లిగ్ జమాత్ సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికే ప్రమాదకరమని జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు. సోషల్ మీడియా కేసులకు సంబంధించిన వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాత లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. సోషల్ మీడియా సంస్థలపై  సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి .ఆంధ్రప్రదేశ్ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

హైదరాబాద్ కు సెప్టెంబర్ గండం.. ముంపు భయంలో లోతట్టు జనం

సెప్టెంబర్ మాసం అంటనే హైదరాబాదీలు వణికిపోతున్నారు. వరద గండం ముంచుకొస్తుందేమోనన్న భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. రికార్డ్ స్థాయిలో కుండపోతగా వర్షం కురియడంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వంద లాది కాలనీలు రెండు, మూడు రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయారు. బైకులు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఊహించవచ్చు. కొన్ని కాలనీలు వారం రోజుల తర్వాత కూడా వరద నుంచి బయటపడలేకపోయాయి. గత సెప్టెంబర్ లో వరద స్పష్టించిన బీభత్సాన్ని మరిచిపోకముందే మరోసారి హైదరాబాద్ పై వరుణుడు ప్రతాపం చూపించాడు. గురువారం రాత్రి రెండు గంటల పాటు బీభత్సంగా కురిసిన వర్షానికి మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా కురిసిన వర్షంతో రాజధాని రోడ్లన్నీ కాల్వలను తలపించాయి. కాలనీలు చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గురువారం సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు కురిసిన భారీ వర్షంతో   జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌.. ఇలా ప్రధాన కూడలన్నీ చెరువుల్లా మారాయి. మైత్రీవనం మెట్రోస్టేషన్‌ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అమీర్‌పేట సత్యం థియేటర్‌ వరకు ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రధాన కారిడార్లలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.  లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరింది. కృష్ణానగర్‌ ఎ-బ్లాక్‌ వద్ద వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోగా.. స్థానికులు కాపాడారు. నాలుగైదు గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడి అంధకారం అలుముకుంది. వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోరులు నిండిపోవడంతో పై అంతస్తుకు వెళ్లి ప్రజలు కాపాడుకున్నారు. రాత్రి ఎలా గడుస్తుందోనని బస్తీవాసులు హడలిపోయారు. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసరాలు సహా ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన యూసుఫ్ గూడ, కృష్ణా నగర్ తో పాటు పలు బస్తీలు దారుణ పరిస్థితులు కనిపించాయి.  జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 9.78 సెంటీమీటర్లు, అల్లాపూర్‌లో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాదాపూర్‌లో 8.75, మోతీనగర్‌లో 7.98 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపగా.. విద్యుత్తు అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు చేశారు. భారీ వర్షం బీభత్సంతో ప్రజలెవరు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. 11 గంటల తర్వాత వాన తగ్గినా... ఉదయం వరకు రోడ్లపై వరద ప్రవహిస్తూనే ఉంది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురుస్తాయని, శనివారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాదీలు అల్లాడిపోతున్నారు. సెప్టెంబర్ నెల గడిచే వరకు తమకు వరద గండం తప్పదనే భయంలో ఉన్నారు. 

పీకే.. బహుజనవాదంలో నిజాయతీ లేదా?

మనసులో ఉండేది ఒకటి.. మాట్లాడేది మరొకటి. ఫక్తు రాజకీయ నాయకులు బాగా ఒంట పట్టించుకున్న రాజకీయ సూత్రం ఇదే. అయితే ఈ వైఖరి నడిచినంత కాలం నడుస్తుంది. ఆ తరువాత కూడా నడవడం అంటే అది జరిగేపని కాదు. ఎన్నో పార్టీలు పెట్టిన ఎందరో నాయకులు ఒక తుఫానులా వచ్చి ఆ తరువాత పిల్లగాలి కూడా కాలేకపోయారు. అందుక్కారణం వారు మాట్లాడే మాటల్లో నిజాయతీ లేకపోవడమేనంటున్నారు సామాజికవేత్తలు.  ప్రజలకు అసలు విషయం తెలిసిన తరువాత అలాంటి రాజకీయ నాయకులను ప్రజలే పక్కన పెట్టేస్తారు. అయితే ఇవే అనుమానాలు బహుజన రాజ్యం తెస్తానంటున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ కూడా ముసురుకుంటున్నాయి. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు, సర్కారు వైఫల్యాలు, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానాలు.. ఇలా అనేక కారణాల వల్ల పీకే బహిరంగ సభలకు భారీ స్పందన వస్తుందే తప్ప... ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వం వల్ల కానీ, మెజార్టీ ప్రజాశ్రేణుల్లో ఉన్న సెంటిమెంట్లను గౌరవించినందు వల్ల కానీ ఆయన మాటలకు మైలేజీ రావడం లేదన్న అభిప్రాయాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.  ప్రజాక్షేత్రంలో రాణించాలంటే ఒకరి బలహీనత మీద కాకుండా స్వీయ బలాలపైనే నిలబడి గెలవాల్సి ఉంటుందని, ఆ బలమే పది కాలాలపాటు ప్రజల్లో నాయకుడిగా నిలబెడుతుందన్న వ్యాఖ్యానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఇందుకు పీకే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో ఏనాడు కూడా పారదర్శకంగా వ్యవహరించలేదని ఆయన చేతిలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న చాలా మంది బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పుడు బహుజనవాదం వినిపిస్తున్న పీకే... తాను కీలకమైన పోస్టులో ఉన్నప్పుడు ఎంతమంది బీసీ విద్యార్థులకు సీటిచ్చి మేలు చేశాడో చెప్పాలన్న బహిరంగ విమర్శలు బలం పుంజుకుంటున్నాయి. స్వల్పంగా ఉన్న ఓపెన్ కోటాలో కూడా ఎస్సీలకు అందులోనూ మాదిగలకు తప్ప మరో సామాజికవర్గాన్ని ఎప్పుడూ చేరదీయలేదని పలువురు బీసీ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో వివిధ రకాల వస్తువులు సమకూర్చే కాంట్రాక్టులు కూడా స్వేరో సంస్థ సభ్యులకే ఇచ్చారని, ఎప్పుడూ దీనిమీద బహిరంగ కొటేషన్లు కోరలేదని.. గతంలో కాంట్రాక్టు కోసం ప్రయత్నించి విఫలమైన కొందరు బీసీలు, ఎస్సీల్లోని మాలలు స్వయంగా చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనారిటీల ఐక్యత అంటున్న పీకే.. ఎస్సీ మాదిగలు మినహా ఏ ఒక్క సామాజికవర్గానికి కూడా గురుకులాల నుంచి కాంట్రాక్టులు అందలేని వారు పాతరోజులు గుర్తు చేసుకుంటున్నారు.  అంతేకాదు.. ఇప్పుడు నుదుటికి బొట్టు పెట్టుకొని నీలిరంగు కండువాలతో యువతతో ర్యాలీలు తీస్తున్న పీకే... గత మార్చిలో చేసిన వివాదాస్పద ప్రతిజ్ఞను వారిప్పుడు గుర్తు చేస్తున్నారు. హిందూ దేవీ-దేవతలను ఎప్పుడూ కొలిచేది లేదని ఒక సమావేశంలో ప్రతిజ్ఞ చేయించిన పీకే.. తన మీద వచ్చిన విమర్శలకు జడిసే పోచమ్మ, ఎల్లమ్మ గుళ్లకు వెళ్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని అసలు విషయం చెబుతున్నారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వేసే చిల్లర గిమ్మిక్కులే ఉన్నతమైన చదువులు చదువుకున్న పీకే కూడా చేస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వెల్లువెత్తుతున్నాయి. తాను గురుకుల కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఎస్సీ-మాదిగల కోసమే తప్ప ఏనాడూ బీసీలకు మేలు చేయలేదని, అంతేగాక.. బీసీలెప్పుడూ ఐక్యంగా ఉండరని, వారు అగ్రవర్ణాల అడుగుజాడల్లోనే నడుస్తారు తప్ప ఎస్సీల సమస్యల పట్ల వారెప్పుడూ సానుకూలంగా స్పందించరని, అలాంటివారిని తాము ప్రోత్సహించాల్సిన అవసరం లేదని అనేవారని గుర్తు చేస్తున్నారు. అలాంటి పీకే ఇప్పుడు హఠాత్తుగా ఎస్సీ, బీసీ, ఎస్టీ ల అభివృద్ధి అంటూ ఐక్యతారాగం తీస్తే అందులో చిత్తశుద్ధి ఎంతుందో కచ్చితంగా అనుమానాలు కలుగుతున్నాయన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా వడ్రంగి పనిచేసుకునే ఓ కార్మికుడితో మాటామాటాల కలిపారు. వృత్తిపనిలో తమకు ఎన్నో ప్రమాదాలు ఎదురవుతున్నాయని, కట్టెకోత మిషన్లలో, దూగోడ మిషన్లలో వేళ్లు, చేతులు కోల్పోయిన జీవచ్ఛవాలుగా బతుకుతున్న ఎందరో వడ్రంగులు ఉన్నారని, అలాంటివారిని కూడా ఈ సర్కారు ఏనాడూ పట్టించుకోలేదని పీకే దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వేలు కట్టయిన ఫొటోను హైలైట్ చేసిన పీకే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే పీకే తీసుకున్న తాజా వైఖరిలో చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని, ఎస్సీలతో సమానంగా ఆర్థికపరమైన స్వాతంత్య్రం  కోసం పనిచేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.  అలాగే హుజూరాబాద్ లో జరిగే ఉపఎన్నికలో కూడా ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్.కృష్ణయ్యతో భేటీలో చాలా కీలకమైన చర్చే జరిగిందన్న వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఇప్పటివరకూ అసలు మనిషిని దాచిపెట్టిన పీకే.. ఇకపై ఆ మనిషిని బయటకు చాటుకోక తప్పదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

త‌ప్పు మీద త‌ప్పు.. కోమ‌టిరెడ్డిని క్ష‌మిస్తారా? శిక్షిస్తారా?

అధిష్టానం వ‌ద్దంది. అక్క‌డ‌కు వెళ్లొద్ద‌ని హుకుం జారీ చేసింది. వెళితే మంచిగుండ‌ద‌ని హెచ్చ‌రించింది. అంతా హైకమాండ్ మాట విన్నారు. కానీ, ఒక్క‌రు మాత్రం రెబెల్ జెండా ఎగ‌రేశారు. తాను అక్క‌డ‌కు వెళ్లి తీరుతానంటూ ఉద‌య‌మే మెసేజ్ ఇచ్చేశారు. సాయంత్రం అన్న‌ట్టుగానే ఆ స‌భ‌కు వెళ్లారు. వైఎస్సార్‌ను వేనోళ్ల పొగిడారు. ఆయ‌నే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. విజ‌య‌మ్మ నిర్వ‌హించిన‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 12వ వ‌ర్ధంతి సంస్మ‌ర‌ణ‌ స‌భ‌కు కోమ‌టిరెడ్డి హాజ‌రుకావ‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ప‌దే ప‌దే పార్టీ లైన్‌ను ఉల్లంఘిస్తూ.. ప‌దే ప‌దే రెబెల్ వాయిస్ వినిపిస్తున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీరుపై హ‌స్తం పార్టీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంద‌ని అంటున్నారు. ఏఐసీసీతో చ‌ర్చించి ఉద‌య‌మే పీసీసీ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ష‌ర్మిల పార్టీ పెట్టిందే కాంగ్రెస్‌ను దెబ్బ తీయ‌డానికి కాబ‌ట్టి.. ఆమె ఆధ్వ‌ర్యంలో జ‌రిగే వైఎస్సార్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు కాంగ్రెస్ నేత‌లెవ‌రూ వెళ్లొద్ద‌ని హుకూం జారీ చేసింది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాత్రం తాను వెళ్లితీరుతాన‌ని ఆ వెంట‌నే ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. పార్టీ ఆదేశాల‌ను ధిక్క‌రించి.. అన్న‌ట్టుగానే విజ‌య‌మ్మ‌-ష‌ర్మిల నిర్వ‌హించిన స‌భ‌కు హాజ‌రయ్యారు. వైఎస్‌ఆర్‌ శిష్యుడిగా చెప్పుకోడానికి తాను గర్వపడుతున్నాన‌ని ఘ‌నంగా చాటొచ్చి.. కాంగ్రెస్‌లో మ‌రోసారి ర‌చ్చ రాజేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.  వైఎస్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు వ‌ద్ద‌న్నా వెళ్ల‌డం ముమ్మాటికీ క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్య‌మ‌ని మండిప‌డుతున్నారు పీసీసీ స‌భ్యులు. ఓపిక ప‌డుతున్నా కొద్దీ.. కోమ‌టిరెడ్డి మరింత ఓవ‌ర్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఎడ్డం అంటే.. కోమ‌టిరెడ్డి తెడ్డం అంటున్నార‌ని.. పార్టీ లైన్‌ను కావాల‌నే కాల‌రాస్తున్నార‌ని అంటున్నారు. కీల‌క నేత కాబ‌ట్టి.. ఇప్ప‌టికే చాలాసార్లు ఉపేక్షించామ‌ని.. అయినా కోమ‌టిరెడ్డి తీరు మార‌టం లేద‌ని.. ఇలాగైతే యాక్ష‌న్ తీసుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కోమ‌టిరెడ్డి తీరు ఇటీవ‌ల కాలంలో బాగా వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచీ కోమ‌టిరెడ్డి కావాల‌నే మ‌రింత ఓవ‌ర్ చేస్తున్నార‌ని అంటున్నారు. త‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి రాలేద‌నే అక్క‌సుతో.. రేవంత్‌రెడ్డి ఆ ప‌ద‌వి డ‌బ్బులిచ్చి కొనుక్కున్నారంటూ గ‌తంలో తీవ్ర క‌ల‌క‌లం రేపారు. ఆ త‌ర్వాత యాద‌గిరిగుట్ట ఏరియాలో రేవంత్‌రెడ్డి ద‌ళిత‌-గిరిజ‌న దండోరా పెడ‌తానంటే.. తాను అందుబాటులో ఉండ‌నంటూ ఆ స‌భ పెట్ట‌కుండా స‌హాయ నిరాక‌ర‌ణ చేశారు. ఇప్పుడు పీసీసీ వ‌ద్ద‌ని చెప్పినా.. వైఎస్సార్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు హాజ‌రై పార్టీపై ధిక్కార ధోర‌ణ ప్ర‌ద‌ర్శించారు. పైగా వెళితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించ‌డం పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించ‌డ‌మే అంటున్నారు. శిశుపాలుడిలా వంద త‌ప్పుల వ‌ర‌కూ ఉపేక్షించే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. గ‌తంలో కోమ‌టిరెడ్డి పార్టీకి చేసిన సేవ‌ల‌ను దృష్టిలో ఉంచుకొని.. ఆయ‌న‌కు ఇప్ప‌టికీ గౌర‌విస్తున్నామ‌ని.. మ‌రీ ఇంత‌లా ఓవ‌రాక్ష‌న్ చేస్తే వేటు ప‌డ‌క త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.  

జగన్ కేబినెట్ లో మరొకరికి గండం.. రాజీనామా చేయాల్సిందే? 

ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి వరుస గండాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పాలన అస్తవ్యస్థమైందనే ఆరోపణలు వస్తుండగా... కేబినెట్ మంత్రులు చిక్కుల్లో పడుతున్నారు. ఇటీవలే హోంమంత్రి మేకతోటి సుచరితపై వచ్చిన ఫిర్యాదులపై  విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. కలెక్టర్ విచారణలో ఫిర్యాదులో ఉన్నది నిజమని తేలితే సుచరిత పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. తాజాగా మరో ఏపీ మంత్రి పదవి గండం తలెత్తింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనంఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  ఐఆర్ఎస్ గా పనిచేసిన ఆదిమూలపు సురేశ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ అధికారులపై సీబీఐ 2016లో దాడులు చేసింది. ఈ క్రమంలోనే 2017లో సురేశ్, ఆయన భార్య విజయలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో విజయలక్ష్మిని ఏ1గా, సురేశ్ ను ఏ2గా పేర్కొన్నారు.  అయితే.. తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేశ్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై బుధవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని, ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ భావించిందా? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు వర్చువల్‌ విధానంలో ఈ కేసును విచారించిందని పేర్కొన్న ధర్మాసనం.. ఆతీర్పును పక్కన పెడుతున్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరిపారో లేదో సమాధానం చెప్పాలని సీబీఐని కోరింది. అదేసమయంలో మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది.  మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన సతీమణి విజయలక్ష్మి అక్రమాస్తులు కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గతంలో సురేశ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు.సుప్రీంకోర్టు ఆయన అవినీతి, అక్రమాస్తులపై స్పందించిన నేపథ్యంలో మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. ప్రతి దానికి సీబీసీఐడీ విచారణలు జరిపించే ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆయన భార్య అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. సురేశ్ అవినీతి  తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమన్నారు. సురేశ్ లాంటి వ్యక్తులు మంత్రిగా ఉంటే భావిభారత పౌరులుగా మారాల్సిన విద్యార్థులు దారి తప్పే ప్రమాదముందని వీరాంజనేయస్వామి అన్నారు. 

పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనా?  

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన (?) ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిశోర్ పేరు దేశ రాజకీయాలలో మారు మ్రోగి పోయింది. అదే సమయంలో ఆయన ఇదీ అని ఏదీ చెప్పకుండానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో మొదలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంకావాద్రా వరకు వివిధ పార్టీల నాయకులను కలిశారు. మోడీని ఓడించడం ఎలా, అనే విషయంలో విపక్షాలకు బోలెడంత జ్ఞాన బోధ చేశారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్షాలు సాగించిన  ఐక్యత క్రతువుకు తెరవెనక సూత్రధారిగా వ్యవహరించారు. పౌరోహిత్యం నెరిపారు. అ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ ఆగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షాల ఐక్యత అనే ఎండమావి, ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నట్లుంది. పక్షం రోజుల క్రితం ఎప్పుడో సోనియా గాంధీ ఒక వర్చువల్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు, ఎవరి రాజకీయం వారిది, అన్నట్లుగా పనిలో పడిపోయారు.   బీజేపీకీ, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా  వ్యూహ రచన సాగిస్తూనే, మరో వంక కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేశారు, ఆ కోణంలోనూ సోనియా, రాహుల్, ప్రియాంక త్రయంతో చర్చలు జరిపారని, అప్పట్లో వార్తలొచ్చాయి. అలాగే,  ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనపై కమల్ నాథ్, తదితర సీనియర్ నాయకులతో సొనియా,రాహుల్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ సమావేశంలోనే పీకే ఎంట్రీకి కాంగ్రెస్ నాయకులు ఓకే చెప్పారు. ఆయనకు ఏ బాధ్యతలు ఇవ్వాలి, అయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే,అ తర్వాత ఏమైందో ఏమో కానీ, పీకీ కాంగ్రెస్ ఎంట్రీ స్టొరీ బ్రేక్ తీసుకుంది. ఇప్పడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, సోనియా గాంధీ, పీకేకు గ్రీన్ సింగల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ లో ఒక వర్గం మాత్రం పీకే ఎంట్రీనే వ్యతిరేకిస్తుంటే, మరికొందరు, ఆయనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వేలులేదని అంటున్నట్లు సమాచారం. గతంలో జేడీయూలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా, పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్’తో విబేధించి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  అదీగాక తానూ రాజకీయలకు పనికిరానని స్వయంగా ప్రకటించుకున్న ఆయనకు పార్టీ పెద్ద పీట వేయడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెపుతున్నారు. మరో వంక కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ విధానలను అవలంబించడం అంత తేలికైన విషయం కాదని, స్వయంగా ప్రశాంత్ కిశోర్ ఓపెన్’గానే కామెంట్ చేశారు.   ఇక  ప్రశాంత్ కిశోర్ వద్ద మంత్రం దండం ఏమీ లేదు. జాతీయ స్థాయిలో 2014లో బీజేపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం కంటే  అంతకు ముందు పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇతరత్రా కారణాలు కీలక పాత్రను పోషించాయని  కాంగ్రెస్ నాయకులే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అదే సమయంలో, ఉత్త ప్రదేశ్, బీహార్ , ఢిల్లీలో  ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు పనిచేయని విషయాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి, పీకే ఇంతవరకు గెలిపించిన(?) పార్టీలు అన్నీ కూడా, ఆయన వ్యూహం లేకున్నా గెలిచేవే అని అంటున్నారు. నిజంగా, ప్రశాంత్ కిశోర్’ కు తమ  వ్యూహ చతురత మీద నమ్మకం ఉంటే, రేపటి యూపీ అసెంబ్లీ ఎన్నుకలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ నాయకులే సవాలు విసురుతున్నారు. రాజకీయాలలో ఎన్నికల వ్యూహాలు ఎత్తుగడలు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. పార్టీ నిర్మాణమే సరిగా లేని చోట, పీకే అయినా ఇంకెవరైనా పీకేది ఏమీ ఉండదని ,అంటున్నారు. అయితే. పేకే వ్యూహం అసలే పనిచేయదని కాదు, అదొక్కటే, గట్టేకించలేదు. ఇతర అంశాలన్నీ సానుకూలంగా ఉన్నప్పుదు మాత్రమే పేకే వ్యూహం పనికొస్తుందని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. అందుకే ఆయన్ని అంతగా ఎత్తుకోవలసిన అవసరం లేదని అన్నారు

తాలిబ‌న్ల తాత‌ల్లా వైసీపీబ‌న్లు.. నాటుతుపాకీల‌ త‌యారీ కేంద్రంగా ఏపీ..

తాలిబ‌న్లు తెలుసుగా. అఫ్ఘ‌నిస్తాన్‌లో అరాచ‌క పాల‌న‌కు మ‌ళ్లీ శ్రీకారం చుట్టిన ముష్క‌రులు. తాలిబ‌న్ల రాజ్యం వ‌స్తుంద‌న‌గానే అఫ్గ‌న్ ప్ర‌జ‌లంతా భ‌యంతో దేశం వ‌దిలి పారిపోతున్నారు. గ‌తంలో తాలిబ‌న్లు చేసిన అరాచ‌కాలు అలాంటివి మ‌రి. ఏపీలోనూ వైసీపీ పాల‌కులు, నాయ‌కులు... తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. వైసీపీ శ్రేణుల‌ను తాలిబ‌న్ల‌తో పోలుస్తూ.. వైసీపీబ‌న్లు అంటూ పేరుపెట్టారు. అధికార పార్టీ అరాచ‌కాల‌ను తాలిబ‌న్ల‌తో పోల్చుతూ.. సెటైరిక‌ల్‌గా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.   తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. వాళ్లు ఓపీయం (న‌ల్లమందు) ఒక్కటే పండిస్తారని అననారు. వైసీపీబ‌న్ల పాలనలో వాలంటీర్ వాసు సారా త‌యారీ నుంచి మొద‌లై నేడు నాటు తుపాకుల త‌యారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నెల‌కొల్పిన‌ మెడ్‌టెక్‌ జోన్‌లో క‌రోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే... జ‌గ‌న్ విధ్వంస‌క పాల‌న‌లో ఫ్యాక్షన్‌ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయంటూ ఆరోపించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వెంక‌టేశ్ అనే వ్య‌క్తి 18 నాటు తుపాకులు త‌యారు చేయ‌గా.. అత‌న్ని పోలీసులు ప‌ట్టుకున్న న్యూస్ క్లిప్పింగ్‌ను త‌న ట్వీట్‌కు జ‌త చేశారు నారా లోకేశ్‌. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళలకున్న నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందంటో మ‌రో ట్వీట్ కూడా చేశారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకుల నిర్బంధం, అక్రమ అరెస్టుల పై పెడుతున్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం పెట్టాలంటూ మండిప‌డ్డతూ కొన్ని ఫోటోలు జ‌త చేశారు. మ‌రోవైపు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. రెండేళ్లుగా ప్రభుత్వం టీడీపీ నేతల్ని వేధిస్తూనే ఉందని మండిప‌డ్డారు. కేసులు పెట్టి ఉన్మాదుల్లా పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేసినందుకు చింతమనేని ప్రభాకర్‌ని అరెస్ట్ చేశారన్నారు. దేవాలయానికి వెళితే గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా.. టీడీపీ నేతల్ని వేధిస్తున్నారన్నారు. తిరగబడితే ప్రభుత్వం తోకముడుస్తోందన్నారు. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. తప్పులు బయటపడతాయనే భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారును దుయ్య‌బ‌ట్టారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.