జగనన్న ఉత్తుత్తి ఉప సంహరణ ఎందుకంటే.. 

మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ, ఇది ఉపసంహరణ కాదు.ఇదొక ఎత్తుగడ. న్యాయస్థానాల కళ్ళు కప్పి మొట్టికాయల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించిన కుట్ర పురిట ఎత్తుగడ. చట్టాల మీద కోర్టులో దాఖలైన కేసుల విచారణ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో,ఇలాంటి నిర్ణయం కుట్రపూరిత నేరంగా భావించినా తప్పు లేదని న్యాయవ్యవస్థలో భాగమైన న్యాయవాదులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. చట్టాలు పూర్తిగా ఉపసంహరించుకుంటే అదో రకం, కానీ, ఉపసహరించుకున్న చట్టాల స్థానంలో సమగ్ర వివరాలతో మళ్ళీ బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన సభలో ప్రకటించారు. అంటే, వైసీపీ సర్కార్ మనసు మారలేదు. వ్యూహం మారింది. ఇలా న్యాయవ్యవస్థతో దాగుడుముట్లు ఆడడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా వినవస్తోంది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ‘చక్కటి’ సలహా ఎవరిచ్చారో, ఏమో కానీ, ఈ ‘ఉత్తుత్తి’ ఉపసంహరణతో ఏపీ నిర్దిష్ట రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మిగిలి పోతుందనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నేళ్ళు అనేది సప్ష్టంగా చెప్పలేక్ పోయినా, ఇప్పట్లో ఏపీ రాజధాని సమస్య పరిష్కారం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ‘అశ్వధామ హతః ... కుంజరః’ అన్నట్లుగా మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఉపసహరణ క్రతువును, చాలా గోప్యంగా కానిచ్చింది. సుమారు నాలుగు గంటలు ఉత్ఖంట భరితంగా నడిపించి చివరకు వైసీపే ప్రభుత్వం మార్కు డొల్ల తనాన్ని ముఖ్యమంత్రి బయట పెట్టరు.చివరకు, ముఖ్యమంత్రి కరిమింగిన వెలగ పండును బయటకు తీశారు. రాజధాని మిధ్య, ఉపసంహరణ మిధ్య అని తేల్చి చెప్పారు.  అయితే, ఇక్కడితో కథ కంచికి చేరినట్లు కాదు. నిజమే, మంత్రి ఒకరు అన్నట్లుగా, ఇది విరామమే .. శుభం కార్డు’ పడినట్లు కాదు. ఇల్లు అలకగానే పండగ రాదు... ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించు కానీ, న్యాయస్థానం ఇంకా ఉపసంహరణకు ఒకే చెప్పలేదు.ఈ కేసుకు సంబదించిన పిటీషనర్ల తరపు న్యాయవాదుల అభ్యర్ధన మేరకు ప్రభుత్వం మెమో’తో మమ అనిపిస్తే కుదరదని,చట్టాల రద్దు ప్రేరేపించిన అంశాలు, రద్దు ఉద్దేశాలు (దురుద్దేశాలు అనాలేమో, కానీ కోర్టు ఆ మాట అనలేదు) , తాజా బిల్లు ఎందుకు మ ఏ ఉద్దేశాల (దురుద్దేశాల)తో తెస్తున్నారో సవివరంగా వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని, న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, అఫిడవిట్’తో పాటుగా, మెమో, బిల్లును కూడా శుక్రవారం (నవంబర్ 26)లోగా కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సో ... చాట్ల ములుకు మాత్రమే కాదు, రద్దుకు కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే..రద్దు బిల్లును  శాసన సభ ఆమోదించినా ... న్యాయస్థానాల్లో ఉన్న ఉన్న కేసులు కొనసాగీ అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.  అయితే, న్యాయస్థానంలో చట్టాలను  ఉపసంహరించుకుంటే, ఆ చట్టాలను సవాలు చేస్తూ విచ్రన్లో ఉన్నకేసులు అన్నీ కూడా, ఇన్ఫ్రుక్ట్యస్ (infructious) నిర్వీర్యం, నిష్ఫలం అయిపోతాయని, నుడ్కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం  వ్యూహాత్మకంగా చట్టాలను ఉపసంహరించుకుందని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే, చట్టాల ఉపసంహరించుకున్నా, అందుకు సంబంధించి విచారణ దశలో ఉన్న పిటీషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే విచాక్షనాదికారం న్యాయస్థానాలకు ఉంటుందని, అంటున్నరు. అయితే ఏది ఏమైనా రాజధాని సమస్య మాత్రం ఇప్పట్లో పరిష్కారం కాదని, ఫలితంగా రాజధాని లేని రాష్ట్రంగా అవమానాలు ఎదుర్కొనవలసి రావడమే కాకుండా, అది రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రతిబంధకం అవుతుందని అంటున్నారు.

జగనన్న మరో బాదుడు.. ట్యాక్స్ పెంచి జనం జేబుకు చిల్లు 

ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది జగన్ రెడ్డి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై అదనపు ట్యాక్సులు వసూల్ చేస్తోంది. ఆస్తి పన్నును పంచేసింది. విద్యుత్ చార్జీలను అడ్డగోలుగా వసూల్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ చాలవన్నట్లు తాజాగా వాహ‌నాల లైఫ్‌టాక్స్, గ్రీన్‌టాక్స్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.  మోటారు వాహ‌నాల ప‌న్ను చ‌ట్టం 1963లో స‌వ‌ర‌ణ‌లకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. కొత్త చట్టం ద్వారా నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో... ఇక‌పై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించబోతోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అద‌న‌పు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21లో ర‌వాణా శాఖ‌కు రూ. 3,181 కోట్ల ఆదాయం  లభించింది. టాక్స్‌ల పెంపుతో ల‌క్ష‌ల‌ మందిపై వంద‌ల కోట్ల భారం మోపనుంది.  రాష్ట్రంలో ఇప్ప‌టికే కోటి 31 ల‌క్ష‌ల వాహ‌నాలు - 1.15 కోట్ల ర‌వాణాయేత‌ర వాహ‌నాలున్నాయి. 2010లో చివ‌రి సారిగా ప‌న్నుల్లో స‌వర‌ణ‌ చేశారు. ర‌హ‌దారుల నిర్మాణం, మౌలిక స‌దుపాయాల్లో ర‌వాణా శాఖ ఆదాయ‌మే కీలకమని ప్ర‌భుత్వం భావిస్తోంది. ద్ర‌వ్యోల్బ‌ణం, ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌, కాలుష్య నియంత్ర‌ణ కోసం టాక్స్‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జగన్ సర్కార్ తాజా బాదుడుపై జనాలు భగ్గుమంటున్నారు. వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేన్ని వదలవా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. 

వ‌న్ బిల్‌- 3 టార్గెట్స్‌.. మూడు ప్రాంతాల‌నూ ముంచేసే స్కెచ్‌!

జ‌గ‌న్‌రెడ్డి. మోస్ట్ టెరిఫిక్ పొలిటీషియ‌న్‌. న‌మ్మించి న‌ట్టేట ముంచ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్‌. క‌క్ష్య సాధింపు కోసం ఇంట్లో మ‌హిళ‌ల‌నూ కించ‌ప‌రిచే మ‌న‌స్త‌త్వం. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తికి జై అన్నారు. అంద‌ల మెక్క‌గానే మూడు రాజ‌ధానుల డ్రామా మొద‌లుపెట్టారు. అమ‌రావ‌తిని ఆగం చేశారు. రైతుల‌కు చుక్క‌లు చూపించారు. విశాఖ‌, క‌ర్నూలుల‌ను త్రిశంఖు స్వ‌ర్గంలో విహ‌రింప‌జేశారు. క‌ట్ చేస్తే.. మూడు రాజ‌ధానుల బిల్లుకు ప‌వ‌ర్ లేదు. హైకోర్టులో వీగిపోవ‌డం ఖాయం. ఇక రెండేళ్ల‌వుతున్నా.. విశాఖ‌లో కానీ, క‌ర్నూలులో కానీ.. కొత్త‌గా వ‌చ్చిన మార్పేమీ లేదు. రాజ‌ధాని అంటూ ఊరించ‌డం మిన‌హా.. ఒక్క పునాది రాయి వేసింది లేదు.. ఒక్క రూపాయి ప‌ని చేసింది లేదు. ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ అని విశాఖ వాసులు.. జ్యుడీషియ‌ల్ కేపిట‌ల్ అంటూ క‌ర్నూలు వాసులు.. కాల‌ర్ ఎగ‌రేశారే గానీ.. కాలం గ‌డుస్తున్నా.. ఏమాత్రం ఎదుగూబొదుగూ లేక‌పోవ‌డంతో ఆల‌స్యంగానైనా త‌త్వం బోధ‌ప‌డింది. జ‌గ‌న్‌రెడ్డి నిజ స్వ‌రూపం తెలిసొచ్చింది.  ఇక విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని పేరు చెప్పి.. ఆస్తుల విధ్వంసాల‌కు పాల్ప‌డ‌టం, వైసీపీ నేత‌ల రియ‌ల్ ఎస్టేట్ దందాల‌పై ప్ర‌జ‌లు విసిగి వేశారి పోయారు. విజ‌య‌సాయిరెడ్డి అరాచ‌కాల‌తో అల‌సిపోయారు. ఇక తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్‌రెడ్డి గుర్తించారు. ఇటు అమ‌రావ‌తిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తుండ‌టం.. అటు విశాఖ‌, క‌ర్నూలులో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టం.. నిధులు లేక‌ ఖ‌జానా ఖాళీ కావ‌డం, రాష్ట్రం అప్పుల పాలు అవ‌డం.. ఇలా అన్నిటినీ లెక్క‌లేసుకున్నాక‌.. జ‌గ‌న్‌రెడ్డి మూడు ప్రాంతాల వ్య‌తిరేక‌త‌ను ఒక్క బిల్లుతో తుడిచిపెట్టాల‌నే స్కెచ్ వేశార‌ని అంటున్నారు. అందులో కొంచెం స‌క్సెస్‌.. కొంచెం ఫెయిల్యూర్‌.  జ‌గ‌న్‌ ఫ‌స్ట్ టార్గెట్ అమ‌రావ‌తి. మూడు రాజ‌ధాని బిల్లును వెన‌క్కి తీసుకొని, సీఆర్‌డీఏ బిల్లు పున‌రుద్ద‌రించ‌డంతో రాజ‌ధాని రైతులు పాక్షిక విజ‌యం సాధించిన‌ట్టే. మ‌ళ్లీ మ‌రోసారి కొత్త బిల్లు తీసుకొస్తేనే ప్రాబ్ల‌మ్‌. లేదంటే అప్ప‌టి వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతుల మంట కాసింత త‌గ్గిన‌ట్టే. వైసీపీ నాయ‌కులకు అమ‌రావ‌తిలో భ‌యం, బెద‌రు, నిర‌స‌న‌లు లేకుండా తిరిగే అవ‌కాశం చిక్కిన‌ట్టే. అయితే, అమ‌రావ‌తిని ఇప్పుడు ఉన్న‌ట్టు అలానే ఉంచితే ఏం లాభం?  రాజ‌ధానికి నిధులు కేటాయించి.. అభివృద్ధి చేస్తేనే క‌దా ఉప‌యోగం. మ‌రి, జ‌గ‌న్‌రెడ్డి అమ‌రావ‌తిని ఏమాత్రం డెవ‌ల‌ప్ చేయ‌ర‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ అని ప్ర‌క‌టించారే కానీ, నిధులు విదిల్చింది లేదు. ఒక్క అభివృద్ధి ప‌నీ చేసింది లేదు. కేపిట‌ల్ పేరు చెప్పి భూముల ధ‌ర‌లు పెంచేశారే కానీ, రియ‌ల్ ఎస్టేట్ దందాల‌తో దోచుకున్నారే కానీ.. విశాఖ‌ను ప‌ట్టించుకున్న పాపాన లేదు. ఇక‌, క‌ర్నూలు దుర్గ‌తి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. న్యాయ రాజ‌ధానా? అంటే ఏంటి? అనేట్టే ఉంది ఇప్ప‌టికీ ప‌రిస్థితి. ప్ర‌క‌ట‌న‌లైతే వ‌చ్చాయి కానీ, వాటివ‌ల్ల న‌ష్ట‌మే కానీ, ఏమాత్రం లాభం లేకుండా పోయింద‌నేది అక్క‌డి ప్ర‌జ‌ల ఆక్రంద‌న‌. అందుకే, ఆ ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకే, మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకొని.. వారి ఆశ‌ల‌పై నీల్లు చ‌ల్లి.. ఆ మంట‌ను కాస్త త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలా, మూడు రాజ‌ధానుల పేరుతో రెండేళ్లుగా మూడు ప్రాంతాల‌కు తీవ్ర న‌ష్టం చేసిన జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం.. ఇప్పుడు హ్యాండ్స‌ప్ అంటూ చేతులెత్తేసి.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే న‌ష్టం అయితే జ‌రిగింది. ఆ న‌ష్టం మ‌రింత క‌ష్టం తీసుకురాకుండా ఇప్పుడు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది వైసీపీ స‌ర్కారు. 

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. హైకోర్టుకు సీబీఐ సీల్డ్ కవర్ రిపోర్టు.. పంచ్ ప‌డిన‌ట్టేనా!

ఆంధ్రప్రదేశ్ తీవ్ర దుమారం రేపిన న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించింది. కేసు వివరాలతో కూడిన నివేదికను సీబీఐ డైరెక్టర్ హైకోర్టుకు సమర్పించారు. న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చుతూ అనుచిత పోస్టులు పెట్టిన కేసులో దర్యాప్తు వివరాలను అందులో పొందు పరిచి సీల్డ్ కవర్ లో అందించారు. ఆ నివేదికను పిటిషనర్‌కు (రిజిస్ట్రార్‌ జనరల్‌) అందజేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 13వ తేదీకి వాయిదావేసింది.  ఈ కేసు విచారణ ప్రారంభమైన దగ్గర నుంచి ఏమి చేశారో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా.. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ... ‘‘న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులకు సంబంధించిన వీడియోల యూఆర్‌ఎల్‌ వివరాలను సామాజిక మాధ్యమాల గ్రీవెన్స్‌ అధికారులకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అందజేస్తున్నారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన యూఆర్‌ఎల్‌ వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు వీడియోలను తొలగిస్తున్నాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐ డైరెక్టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సీల్డ్‌ కవర్‌లో ఉన్న ఆ రిపోర్టును పరిశీలించకుండా వాదనలు కొనసాగించడం సాధ్యం కాదు.’ అని అన్నారు. సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు స్పందిస్తూ.. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ దశలో వివరాలను నిందితులకు అందజేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, కోర్టు ఆదేశిస్తే వివరాలను పిటిషనర్‌కు అందజేస్తామన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. వీడియోలను తొలగించాలని సీబీఐ నేరుగా సామాజిక మాధ్యమాలను కోరలేదన్నారు.  రిజిస్ట్రార్‌ జనరల్‌ ద్వారా వివరాలు అందజేస్తే వీడియోలు తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. న్యాయవ్యవస్థను దూషిస్తూ పెట్టిన పోస్టులకు  సంబంధించిన యూఆర్‌ఎల్‌ను అందజేస్తే సంబంధిత వీడియోను తొలగిస్తామని చెప్పారు. అయితే, సంబంధిత వ్యక్తి ప్రొఫైల్‌ను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. 

అమరావతి... ఏ రోజున ఏం జరిగిందంటే..

ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ప్రకటించింది మొదలు అమరావతి నిర్మాణ పనులు చకచకా జరిగిపోయాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రైతుల నుంచి 30 వేల ఎకరాలు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోని ప్రముఖలంతా విచ్చేసి అమరావతికి ఆశిస్సులు అందించారు. కాని 2019లో సీన్ మారిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడం అమరావతికి గండంగా మారింది. ఆంధ్రుల కోటి ఆశ... మూడు ముక్కలాటలుగా మారిపోయింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన సంచలనమైంది.  జగన్ రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఏడు వందలకు పైగా రోజులుగా రోడ్డుపైనే ఉన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినదిస్తున్నారు. సోమవారం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది జగన్ రెడ్డి సర్కార్. దీంతో అమరావతిపై శంకుస్థాపన నుంచి ఉపసంహరణ వరకు అన్నీ సంచలనమే.. అమరావతిపై ఏ రోజున ఏం జరిగిందో చూద్దాం..    2014 సెప్టెంబరు 3:  రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీ తీర్మానం    డిసెంబరు 23:   ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ    డిసెంబరు 30:   సీఆర్‌డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ. విస్తీర్ణంలో కేపిటల్‌ రీజియన్‌ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం    2015 ఫిబ్రవరి 28:  కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు    అక్టోబరు 22:  ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన    2016 ఏప్రిల్‌ 25:  వెలగపూడి సచివాలయం ప్రారంభం.    జూన్‌ 6:  సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం    అక్టోబరు 28:  పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన    2017 మార్చి 2:   వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు    డిసెంబరు 27:  రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌    2019 ఫిబ్రవరి 3:  జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌  ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌    డిసెంబరు 17:  మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన    డిసెంబరు 18:  సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు    2020 జనవరి 3:  మూడు రాజధానుల్ని సిఫారసు చేస్తూ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక    జనవరి 20:  నిరసనగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న రైతులపై లాఠీఛార్జి    జనవరి 20:  మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ    ఫిబ్రవరి 10:  ప్రొసీజర్‌ ఫాలో అవ్వనందున బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపలేనంటూ మండలి ఛైర్మన్‌కు తిప్పి పంపిన ఇన్‌ఛార్జి సెక్రటరీ    జూన్‌ 16:  ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం    జూన్‌ 17:  కౌన్సిల్‌లో తెదేపాఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు    జులై 31:   బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌    2021 నవంబరు 1:  తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు    నవంబరు 22:  కొత్త బిల్లులు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన  ప్రభుత్వం   

మండలిపైనా మడమ తిప్పేయడమేనా? జగన్ రెడ్డి మరో యూ టర్న్? 

మాట తప్పను... మడమ తిప్పను. ఇది ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నినాదం. కాని అధికారంలోకి వచ్చాకా మాట తప్పుతూనే ఉన్నారు జగన్ రెడ్డి. మడమ తిప్పుతూనే ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో సోమవారం టర్న్ తీసుకునంది జగన్ సర్కారు. ఇటీవలే నిన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం విషయంలోనూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుుకంది. తాజాగా  మరో విషయంలో మడమ తిప్పేయబోతోందని తెలిసింది.  శాసనమండలిని రద్దుచేయాలని గతంలో చేసిన తీర్మానాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. మంగళవారం ఈ మేరకు శాసనసభలో కొత్త తీర్మానం చేయనున్నారని తెలుస్తోంది. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని అందులో కేంద్రాన్ని కోరుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. శాసనమండలిని ద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27వ తేదీన శాసనసభలో తీర్మానం పెట్టారు. 2020,  జనవరిలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను శాసన మండలి వ్యతిరేకించింది. అయితే 151 స్థానాలున్న అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని, ప్రజాబలంతో గెలిచిన శాసనసభ నిర్ణయాన్ని టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలి వ్యతిరేకించిందని సీఎం జగన్‌ ఆగ్రహించారు. మండలి నిర్వహణకు రోజూ రూ.లక్షల్లో భారం మోయాల్సి వస్తోందని.. అసలీ వ్యవస్థే వద్దని.. రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27వ తేదీన శాసనసభలో తీర్మానం పెట్టారు. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే కొంద రు మంత్రులు జగన్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడాది వేచి చూస్తే.. మండలిలోనూ వైసీపీకి ఆధిక్యం వస్తుందని సర్దిచెప్పాలని చూశారు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీకి మండలిలో ఆధిక్యం లభించింది. ఇదే సమయంలో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మం డలి రద్దు తీర్మానం ప్రస్తావనకు రానున్నట్లు ఉప్పందింది. ఇది వైసీపీ నేతలకు కలవరం కలిగించింది. దీంతో శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని చేసి తక్షణమే కేంద్రానికి పంపాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతేనని వైసీపీ నేతలు ఇన్నాళ్లు ఇస్తున్న నినాదం క్రమంగా మసకబారుతోందని చెబుతున్నారు. మడమ తిప్పడమే ప్రస్తుతం జగన్ నినాదంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

పెట్రోల్ తో టామోటా పోటీ.. ధర దడదడ..

రాయలసీమను ముంచెత్తిన కుండపోత వర్షాలు కూరగాయలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు జలమయం కావడంతో మార్కెట్లకు దిగుబడి తగ్గిపోయింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూరగాయల పంటలు భారీగా ధ్వంసం అయ్యాయి. దీంతో మదనపల్లి మార్కెట్ లో కొరత ఏర్పడింది. ముఖ్యంగా టమోటా ధరలు రోజుకు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో కిలో టమోటా రేట్ సెంచరీ క్రాస్ చేసింది.  మదనపల్లె మార్కెట్‌లో సోమవారం నాణ్యమైన మొదటి రకం టమోటా గరిష్ఠంగా కిలో రూ.104 పలికింది. గత పదిహేను ఏళ్లలో ఇదే్ రికార్డుస్థాయి రేట్ అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రెండో రకం కనిష్ఠ ధర కిలో రూ.18 పలికింది. మార్కెట్‌కు 260 మెట్రిక్‌ టన్నుల టమోటా విక్రయానికి వచ్చినా దూరప్రాంతాల వ్యాపారులు రావడంతో ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాలో టమోటా ధరలు వేలాది ఎకరాల్లో నాశనమయ్యాయని, రానున్న రోజుల్లో టమోటా ధరలు మరింతగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ధరలు భారీగా పలకడంతో టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   ఓ వైపు వర్షాలతో టమోటా పంట దెబ్బతిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరో వైపు టమోటా కోత వస్తున్న రైతులు సంతోషంగా వున్నారు. వినియోగదారులకు మాత్రం టామోటా భారంగా మారింది. 

ఓటమి భయంతోనే జగన్ కొత్త నాటకం! 

మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ వెనక్కి తీసుకోవడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని అన్నారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని కేసులపై హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని  జనసేనాని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని పరిస్థితి ఉండటం దారుణమన్నారు పవన్ కల్యాణ్. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందనే భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని నిప్పులు చెరిగారు. 30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే జగన్ మరిచారని అన్నారు.  రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారని… మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని నిప్పులు చెరిగారు. ఉద్యమంలో ఉన్న ఎస్సీలపై ఎస్సీలతోనే ఫిర్యాదులు చేయించి అట్రాసిటీ కేసులు బనాయించి వికృత చర్యలకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. 

జ‌గ‌న్‌రెడ్డికి అంత సీన్ లేదా? ఇదంతా కేసీఆర్ వ్యూహ‌మా?

ఆదివారం ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌లు క‌లిశారు. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. కీల‌క రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించారు. ఇన్నాళ్లూ జ‌ల జ‌గ‌డంతో శ‌త్రువులుగా క‌త్తులు దూసి.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌ను రాజేసిన ఆ ఇద్ద‌రు.. ఆదివారం అలా ముచ్చ‌ట పెట్టుకోవ‌డం వెనుక ఏదో పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని అనుమానించారు. క‌ట్‌చేస్తే.. సోమ‌వారం ఉద‌యం నుంచీ ఏపీలో బ్రేకింగ్ న్యూస్‌. ప్ర‌జ‌ల‌ను షాక్‌కు గురి చేసే కేపిట‌ల్‌ న్యూస్. కేసీఆర్‌ను జ‌గ‌న్ క‌లిసొచ్చి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే.. ఏపీలో ఇలా అనూహ్య ప‌రిణామాలు జ‌ర‌గ‌డం.. ఇంత‌కు ముందెప్పుడూ లేన‌ట్టు.. ప్ర‌జ‌లెవ‌రూ వూహించ‌ని విధంగా మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సీఆర్‌డీఏ బిల్లును పున‌రుద్ద‌రించి.. మ‌ళ్లీ బ‌లంగా ముందుకొస్తామ‌ని చెప్ప‌డం.. అంతా రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మేనంటున్నారు. ఆ వ్యూహాన్ని అమ‌లు చేసింది జ‌గ‌నే అయినా.. ఆ వ్యూహాన్ని ర‌చించింది మాత్రం కేసీఆరే అంటున్నారు.  లేదంటే.. 700 రోజులుగా అమ‌రావ‌తి ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్నా.. అణువంతైనా వెన‌క్కి త‌గ్గ‌ని జ‌గ‌న్‌రెడ్డిలో స‌డెన్‌గా ఇలాంటి మార్పును ఎవరైనా ఊహించారా? ఎలాంటి ముంద‌స్తు లీకులు లేకుండా.. ఉద‌యానికల్లా అంత పెద్ద నిర్ణ‌యం ఎలా జ‌రిగుంటుందంటారు? జ‌గ‌న్‌రెడ్డికి దూకుడు ఎక్కువే అయినా.. ఈ స్థాయి వ్యూహాలు ఆయ‌న వ‌ల్ల కావ‌ని వైసీపీ వ‌ర్గాలే అంటున్నాయి. ఇదంతా మాయ‌ల మ‌రాఠీ, తెలంగాణ చాణ‌క్యుడు కేసీఆర్ చ‌ల‌వే అని చెబుతున్నారు.  "మోదీ లాంటోడే మూడు వ్య‌వ‌సాయ బిల్లుల‌పై మెడ‌లు వ‌చ్చిండు.. రైతుల‌కు సారీ చెప్పిండు.. నువ్వెంత‌? నీ రాజ‌కీయ అనుభ‌వమెంత‌? నేను చెబుతున్నాగా.. నా మాట విను.. నీకు తెలీకుండా నేను ఏపీలో సీక్రెట్‌గా స‌ర్వే చేయించా. ప్ర‌జ‌లు నీపై ఫుల్ గుస్సాతో ఉండ్రు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌య‌మే నీకు పెద్ద మైన‌స్‌. అది అమ‌లు చేయ‌డం కూడా అంత ఈజీ గాదు. కోర్టు ఎలాగైనా కొట్టేస్త‌ది. అది నిలిచేది కాదు.. పాడూ గాదు. నా మాట విను. నే చెప్పిన‌ట్టు చెయ్‌. మోదీలా.. ముందు నువ్వు త‌గ్గిన‌ట్టు చెయ్‌. జ‌నాన్ని కూల్ చెయ్‌. అస‌లే చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రి మేట‌ర్‌లో ప్ర‌జ‌లు నిన్ను నిల‌దీస్తుండ్రు. ఛీ కొడుతుండ్రు. అది మ‌రింత పెరిగితే అస‌లుకే ఎస‌రు. నే జెప్తున్నాగా.. చంద్ర‌బాబు టాపిక్ ఇప్ప‌టికిప్పుడు ప‌క్క‌కు పోవాల‌న్నా.. అమ‌రావ‌తి మంట కాసింతైనా త‌గ్గాల‌న్నా.. ముందు మోదీలా నువ్వో మెట్టు దిగు. ఆ త‌ర్వాత సంగ‌తి త‌ర్వాత చూసుకుందాం. కావాలంటే మ‌ళ్లెప్పుడైనా.. పెద్ద ప్రాబ్ల‌మ్ వ‌చ్చిన‌ప్పుడు మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లును బ‌య‌ట‌కు తీసుకురా. అందాకా.. అది వెన‌క్కి తీసుకో. నా మాట విను. న‌న్ను న‌మ్ము. నీకంతా మంచే అయిత‌ది. నేను కూడా హుజురాబాద్ ఓట‌మి, ద‌ళిత బంధు అమ‌లు విష‌యాల‌ను మ‌రుగున ప‌ర్చ‌డానికి బీజేపీపై, కేంద్రంపై ఫైట్ జేస్తున్నా. పెట్రో ధ‌ర‌లు, వ‌రి కొనుగోళ్ల‌పై దీక్ష చేశా. ఢిల్లీలోనూ ధ‌ర్నా చేస్తా. నువ్వుకుడా భువ‌నేశ్వ‌రి టాపిక్ డైవ‌ర్ట్ జేసేందుకు రాజ‌ధాని తేనెత‌ట్టు క‌దిలియ్‌." అంటూ సీఎం కేసీఆర్‌.. జ‌గ‌న్‌రెడ్డికి త‌న‌దైన స్టైల్‌లో బ్రెయిన్ వాష్ చేశార‌ని ఆ పెళ్లికి వెళ్లిన కొంద‌రు ఉన్న‌త స్థాయి వ్య‌క్తులు చెబుతున్న ర‌హ‌స్య స‌మాచారం.  కేసీఆర్ మాట‌లు తెగ న‌చ్చేసిన జ‌గ‌న్‌.. ఆయ‌న ట్రాప్‌లో ప‌డిపోయార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ నుంచి తాడేప‌ల్లికి తిరుగొచ్చి.. ప్యాలెస్‌లో నైట్ అంతా ఆలోచించి.. అర్థ‌రాత్రి జీస‌స్‌తో, దివంగ‌త‌ వైఎస్సార్‌తో చ‌ర్చించి.. ఉద‌యానిక‌ల్లా మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గే నిర్ణ‌యం బ‌య‌ట‌పెట్టేశార‌ని అంటున్నారు. అయినా, తాను రైతుల‌కు భ‌య‌పడిన‌ట్టు, పాద‌యాత్ర‌కు తోక‌ముడిచి వెన‌క్కి త‌గ్గిన‌ట్టు అనిపించ‌కుండా.. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో.. మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల‌పై కొత్త బిల్లు తీసుకొస్తామంటూ బిల్డ‌ప్‌గా ప్ర‌క‌టించి.. త‌న ప‌ర్స‌న‌ల్‌ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు. ఇదంతా, హైలెవెల్ పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో జ‌రుగుతున్న న‌డుస్తున్న టాక్.

ఏపీ రాజధాని ఎక్కడ? మళ్ళీ మొదటికొచ్చిన కథ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజదాని తేనే తుట్టెను మరో సారి కదిల్చారు. మూడు రాజధానులపై వెనకడుగు వేస్తున్న సంకేతాలిచ్చి... చివరకు ఎటూ తేల్చకుండా, ఏపీ రాజధాని ఏదీ అంటే దిక్కులు చూసే సందిగ్ధ పరిస్థితి సృష్టించారు. వికేంద్రీకరణ తప్పదని, అదొక్కటే రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రం అని పాత కథను మళ్ళీ వినిపించారు. అయితే మూడు రాజధానుల బిల్లును ఏ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను ఆశించిన జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏ ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రి మళ్ళీ అదే వికీద్రీకరణ  మంత్రం జపిస్తున్నారు. ఎందుకోసం వెనకడుగు తీసి ముందడుగు వేశారు ఇలా చాలా అనుమానాలు, అనేక ప్రశ్నలు రాజకీయ, మీడియా వర్గాల్లో  చర్చకు వస్తున్నాయి.  అదలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును దానితో పాటుగా సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టిన శాసన సభా వ్యవాహాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పదే పదే శ్రీకృష్ణ కమిటి నివేదికను ప్రస్తావించారు. అమరావతి కంటే ప్రకాశం జిల్లా దొనకొండకు కమిషన్ ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని ఒకటికి సార్లు  ప్రస్తావించారు. అలాగే, వెనక బడిన ప్రాంతల అభివృద్ధిని రాజధానితో ముడి పెట్టి నేక్ ఉదాహరణలిచ్చారు. అమరావతి – దొనకొండ రెంటిలో దేన్నీ రాజధాని చేయాలి అంటే నా ఓటు దొనకొండకే అన్నట్లు మాట్లాడారు. బుగ్గన ప్రసంగాన్ని బిట్వీన్ ద లైన్స్ చదివితే, ప్రకాశం జిల్లా దొనకొండ – మార్టూర్ మధ్యన మరో శిలాఫలకం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.  అలాగే  దొనకొండను శివరామకృష్ణ  కమిటి ప్రిఫర్ చేయడమే కాకుండా, రాజధానికి అవసరమైన హంగులన్నీ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉంది. అలాగే, ప్రస్తుతం వినుకొండ నుంచి విజయవాడకు మరో రైలు మార్గం నిర్మాణంలో ఉంది.  అలాగే, కేంద్ర రైల్వే శాఖ, ఈ ప్రాంతం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని అంటున్నారు.అలాగే, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎయిర్ పోర్ట్ ఒకటి సిద్డంగా ఉంది.. నాగార్జున సాగర్ నీరు పిలిస్తే పలికేందుకు రెడీగ ఉందని, ఈ అన్నిటినీ మించి దొనకొండ – మార్టూర్ మధ్యలో ప్రభుత్వ భూమే పుష్కలంగా ఉంది.. ఒక వేళ అంతో ఇంతో కొనవలసి వచ్చినా రాష్ట్రం మొత్తం మీద అత్యంత చౌకగా భూమి లభించేది ఇక్కడే..అంటున్నారు.అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ... ముఖ్యనేత ఒక్కరే,ఆప్రాంతంలో ఎప్పుడోనే ఏదో అలా పడుతుందని జస్ట్ ఓ 15 వేల ఎకరాలు భూమి  కొని పడేశారు. అలాగే, అస్మదీయులు కూడా ఎవరి శక్తి కొలది వారు ... 2014 కు ముందే పదులు లేదా వందల ఎకరాల్లో భూములు కొని పెట్టుకున్నారు..ట. సో.. బుగ్గన వ్యక్తపరిచిన అభిప్రాయాలను, అందుకు సప్లమెంట్’గా అధికార పార్టీ వర్గాల నుంచి దొనకొండకు జై కొడుతూ  వినవస్తున్న అనుకూల వాదనలను పరిగణలోకి తీసుకుంటే, అమరావతికి రెక్కలు రావడం, రాజధాని దొంకొండకు చేరడం ఇంచుమించుగా ఖరారు అయిందనే అంటున్నారు.        ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, శివరామకృష్ణ  కమిటి నివేదికను ప్రస్తావించడమే కాకుండా, ‘శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతేకాదు,, అమరావతి ప్రాంతంలో  క‌నీస వ‌స‌తుల క‌ల్పనకే ల‌క్ష కోట్లు అవుతుంది. ఈ రోజు ల‌క్ష కోట్లు ప‌దేళ్లకు 6 ల‌క్షల కోట్లు అవుతుంది. గ‌త ప్రభుత్వ లెక్కల ప్రకార‌మే లక్షల కోట్లు క‌నీస వ‌స‌తుల‌కు వెచ్చించాల్సి ఉందని అన్నారు. అటు బుగ్గన ఇటు సీఎం మళ్ళీ మూలాలలోకి వెళ్ళడంతో, అసలు ప్రభుత్వం ఆలోచన ఏమిటి? రాజధాని ఇష్యూ ని మళ్ళీ హరికథ కాలక్షేపంలో ‘రెడ్డొచ్చె మొదలెట్టు’ అన్నట్లు, అమరావతి కథ మళ్ళీ మొదటికి వస్తుందా? అమరావతికి మొత్తానికే ఎసరు పెడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  మరోవంక ముఖ్యమంత్రి మొగ్గుచూపుతున్నవిశాఖపట్నం,విషయంలోనూ శ్రీ కృష్ణ కమిటి సానుకూలంగా నివేదిక ఇవ్వలేదని,  అమరావతిని కాదన్నట్లే విశాఖనూ వద్దందని నివేదిక లోతుగా  అధ్యయనం చేసిన నిపుణులు అంటున్నారు నిజానికి,శివరామకృష్ణ  కమిటి విశాఖ రాజధాని కాకుండా చూడవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భుజస్కందాలపై ఉంచిందని, నిపుణులు అంటున్నారు. నిజానికి అదొక్కటే కాదు, స్థానిక ప్రజలు, ముఖ్యంగా  నగర జనాభాలో 60 శాతం వరకు ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు, వ్యాపార వర్గాలు విశాఖపట్నం రాజధాని అయితే, రాజకీయ ప్రభావం ఎక్కువ అవుతుంది భయపడుతున్నారు.అంతేకాకుండా, విశాఖలో ఉన్నకేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా, విశాఖను రాజధాని చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నిజానికి అప్పట్లోనే విశాఖ పోర్ట్ ట్రస్ట్ శివరామకృష్ణ  కమిటికి, విశాఖను రాజదానిగా సిఫార్సు చేయవద్దని లిఖిత్ పూర్వకంగా కోరింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ విషయంలో అంత సానుకూలంగా లేదని సమాచారం  సో.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశించినా ఇంకొరు వద్దనుకున్నా విశాఖకు రాజధాని యోగం లేదు గాకలేదని లోగుట్టు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం.  సో.. ఇటు అమరావతి అటు విశాఖ కాదనుకున్నప్పుడు..చివరాకు 2014కు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే, దొనకొండ రాజదాని అవుతుందని జరిగిన ప్రచారమే నిజమవుతుందని అంటున్నారు. రేపటి సంగతి ఎలా ఉన్నా.. ఈరోజు ఏపీ రాజధాని.. త్రిశంకు నగరమే..

ఇప్పటికి అమరావతే.. మూర్ఖుడు మారుతాడా.. కొండపల్లి రచ్చ.. మరో గండం.. టాప్ న్యూస్@7PM

ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ.. 3 రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు.సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. -------- మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అని సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని ట్విట్టర్‌లో లోకేష్‌ మండిపడ్డారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. 3 రాజధానులు చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అన్నారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని నారా లోకేష్‌ అన్నారు. -------- జగన్ సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం మహిళలపై గౌరవం ఉంటే.. తన సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.దేశ చరిత్రలో ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుడు ఎక్కడా చూడలేదన్నారు. -------- కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కీలక మలుపు చోటుచేసుకుంది. కౌన్సిల్ హాల్‌లో జరిగిన రభస అనంతరం తమకు రక్షణ లేదని టీడీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. తమను మున్సిపల్ భవనంలోనే ఈ రాత్రికి ఉండేందుకు అనుమతివ్వాలని కౌన్సిలర్లు అధికారులను కోరారు. రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు  లేఖ ఇచ్చారు. ఎంపీ నాని ఓటు హక్కుపై కోర్టులో కేసు సాగుతుండటంతో.. ఎన్నికను రేపటికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు.  ----- దక్షిణాంధ్రకు మరో ప్రమాదం పోంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ అవుతోందని, రాబోయే 4-5 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప అనంతపురం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.  ---- ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపుతున్నారు.  ---- సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌ ఘాటు విమర్శలు చేశారు. 19వ రోజు వడ్లపై క్లారిటీ ఇస్తానన్న కేసీఆర్‌కు తాగిన మత్తు దిగలేనట్లు ఉందన్నారు. కేసీఆర్‌ దేశాలు తిరగడానికి ప్రైవేట్‌ హెలికాప్టర్ కావాలా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో తాగి తినుడు తప్ప..వ్యవసాయం ఎన్నడు చేశారని నిలదీశారు. పనికిమాలిన సీఎం ఎవరన్నా ఉన్నారా అంటే అది కేసీఆరేనని దుయ్యబట్టారు. ఏ పంట వేయాలో చెప్తానన్న కేసీఆర్ ఎక్కడున్నారు? అని అర్వింద్ ప్రశ్నించారు. ------ ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదని, కొనేది లేదన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని తెలిపారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుందన్నారు. కొంటారో కొనరో తెలియక ధాన్యం కుప్పలపైనే.. రైతుల గుండెలు ఆగిపోతున్నా.. సీఎం కేసీఆర్‌ గుండె కరుగటం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. --- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో నెలకు 1,000 రూపాయలు వేస్తామని పంజాబీ మహిళలకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలు ఇందుకు అర్హులేనని కేజ్రీవాల్ అన్నారు. సోమవారం పంజాబ్‌లోని మోగాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు 

మూడు రాజ‌ధానుల‌తో గెలిచారా? జ‌గ‌న్‌రెడ్డీ సిగ్గు సిగ్గు!

ఇక్క‌డే ఇల్లు క‌ట్టుకున్నా. ఇక్క‌డే ఉంటున్నా. ఇక్క‌డి వారంటే ఇష్టం. ఈ ప్రాంతం అంటే ప్రేమ‌. అయినా, వికేంద్రీక‌ర‌ణే మా ల‌క్ష్యం. మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాం. మూడు రాజ‌ధానుల నినాదంతో 2019లో ఎన్నిక‌ల‌కు వెళితే ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని గెలిపించారు. విజ‌యం క‌ట్ట‌బెట్టారు. మూడు రాజ‌ధానుల‌కు ఆమోద ముద్ర వేశారంటూ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దం అంటున్నారు అంతా. జ‌గ‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఏంటి.. మూడు రాజధానుల నినాదంతో జ‌గ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల‌కు వెళ్లారా? అది కూడా 2019లోనా? ఏం చెప్పారు.. ఏం చెప్పారు.. అప్పుడు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా అమ‌రావ‌తికి మీరు మ‌ద్ద‌తిచ్చిన విష‌యం మీరు మ‌రిచారో ఏమో కానీ.. జ‌నం మ‌దిలో ఆ మాట‌లు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఆనాడు మీరు చేసిన వ్యాఖ్య‌లు ఇంకా వీడియోల రూపంలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ప్రాంతీయ విభేదాలు తీసుకురావ‌డం ఇష్టం లేకే అమ‌రావ‌తికి మ‌ద్ద‌తిస్తున్నామ‌ని.. 33వేల ఎక‌రాలు చాల‌వ‌ని.. ఇంకా భూసేక‌ర‌ణ చేయాలంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆనాడు అసెంబ్లీలో మీరు మాట్లాడిన చిల‌క ప‌లుకులు అప్పుడే మ‌రిచిపోయారా? అంటూ పార్టీలు, ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.  అమ‌రావ‌తికి మ‌ద్ద‌తిచ్చారు కాబ‌ట్టే.. 2019లో జ‌గ‌న్‌కు అంత మెజార్టీ వ‌చ్చింది. అదే, మీ దురుద్దేశ్యాన్ని అప్పుడే బ‌య‌ట‌పెట్టి ఉంటే.. ఆనాడే తాము అధికారంలోకి వ‌స్తే రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేస్తామ‌ని చెప్పుంటే.. ప్ర‌జ‌లు మీకు ఎలా బుద్ది చెప్పేవారో తెలిసుండేది. ఓటుతో బండ‌కేసి కొట్టేవారు. వైసీపీని బొంద పెట్టేవారు. 153 కాదు క‌దా.. 1..5...3...లో ఏదో ఒక నెంబ‌ర్‌కే ప‌రిమితం చేసేవారు. అమ‌రావ‌తి రీజియ‌న్‌లోనూ వైసీపీ ఎమ్మెల్యేల‌ను గెలిపించారంటే.. జ‌గ‌న్ సీఎం అయినా అమ‌రావ‌తి అలానే వెలుగొందుతుంద‌నే న‌మ్మ‌కంతోనే. లేదంటే.. ఓట‌ర్ల తీర్పు మ‌రోలా ఉండేది. ఆ ప్ర‌జాగ్నిలో వైసీపీ ద‌హించుకుపోయుండేది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇంత‌టి దౌర్భాగ్యం త‌ప్పుండేది.. అంటూ జ‌గ‌న్‌రెడ్డి తాజా వ్యాఖ్య‌ల‌పై అంతా విరుచుకుప‌డుతున్నారు.  అంత నిస్సిగ్గుగా.. తాము 2019లో మూడు రాజ‌ధానుల నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళితే ప్ర‌జ‌లు గెలిపించార‌ని జ‌గ‌న్‌రెడ్డి స‌భ‌లో చేసిన కామెంట్ల‌పై ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌తిప‌క్షం ఫైర్ అవుతోంది. లోకేశ్ జ‌గ‌న్‌ను తుగ్లక్ 3.0 తో పోల్చారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అన్నారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు.. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్.. అంటూ నారా లోకేశ్ జ‌గ‌న్‌ను ట్విట్ట‌ర్‌లో ఆటాడుకున్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు సిగ్గుచేటు అంటూ కాంగ్రెస్ నేత తుల‌సీరెడ్డి మండిప‌డ్డారు.   

తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే..

మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గబోమంటూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని.. ఘాటుగా విమ‌ర్శించారు. ఈ మేర‌కు జ‌గ‌న్‌రెడ్డి గ‌తంలో అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌ల వీడియోను జ‌త చేస్తూ ట్వీట్ చేశారు.  తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని. అంటూ ట్వీట్ చేశారు నారా లోకేశ్‌.

రాజధాని తెరపైకి దొనకొండ?

ఉద్దేశం ఏదైనా, ఎందుకోసం అయినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజదాని తేనే తుట్టెను మరో సారి కదిల్చారు. మూడు రాజధానులపై వెనకడుగు వేస్తున్న సంకేతాలిచ్చి... చివరకు ఎటూ తేల్చకుండా, ఏపీ రాజధాని ఏదీ అంటే దిక్కులు చూసే సందిగ్ధ పరిస్థితి సృష్టించారు. వికేంద్రీకరణ తప్పదని, అదొక్కటే రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రం అని చెప్పు కొచ్చారు.  అయితే, జగన్ రెడ్డి అనే కాదు, రాజకీయ నాయకులు ఎవరైనా,రాజకీయ ప్రయోజనాలు లేకుండా, ఆశించకుండా ఏ నిర్ణయం తీసుకోరు. జగన్ రెడ్డి వంటి రాజకీయ వ్యాపారులు,లేదా వ్యాపార రాజకీయ వేత్తలు, వ్యాపార ప్రయోజనాలు కూడా చూసుకుంటారు. ఈ నేపధ్యంలో మూడు రాజధానుల బిల్లును ఏ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను ఆశించిన జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏ ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రి మళ్ళీ అదే వికీద్రీకరణ  మంత్రం జపిస్తున్నారు. ఎందు కోసం వెనకడుగు తీసి ముందడుగు వేశారు ఇలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అదల ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును దానితో పాటుగా సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టినన శాసన సభా వ్యవాహాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పదే పదే శివరామకృష్ణ క‌మిటీ నివేదికను ప్రస్తావించారు. అమరావతి కంటే ప్రకాశం జిల్లా దొనకొండకు కమిషన్ ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు.  అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదికను ప్రస్తావించడమే కాకుండా, ‘శివరామకృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతేకాదు,, అమరావతి ప్రాంతంలో  క‌నీస వ‌స‌తుల క‌ల్పనకే ల‌క్ష కోట్లు అవుతుంది. ఈ రోజు ల‌క్ష కోట్లు ప‌దేళ్లకు 6 ల‌క్షల కోట్లు అవుతుంది. గ‌త ప్రభుత్వ లెక్కల ప్రకార‌మే లక్షల కోట్లు క‌నీస వ‌స‌తుల‌కు వెచ్చించాల్సి ఉందని అన్నారు. అటు బుగ్గన ఇటు సీఎం మళ్ళీ మూలాలలోకి వెళ్ళడంతో, అసలు ప్రభుత్వం ఆలోచన ఏమిటి? రాజధాని ఇష్యూ ని మళ్ళీ హరికథ కాలక్షేపంలో ‘రెడ్డొచ్చె మొదలెట్టు’ అన్నట్లు, అమరావతి కథ మళ్ళీ మొదటికి వస్తుందా? అమరావతికి మొత్తానికే ఎసరు పెడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  కాగా 2014కు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే, దొనకొండ రాజదాని అవుతుందని ప్రచారం జరిగింది. అలాగే, జగన్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ పెద్దలు అక్కడ ముందుగానే భూముల పై ఇన్వెస్ట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి.. అలాంటి దూ..రాలోచన ఏదైనా చేస్తున్నారా ? అనే అనుమానలు వినవస్తున్నాయి.

హైకోర్టు భ‌యంతోనా? మండ‌లి మెజార్టీకా? జ‌గ‌న్‌రెడ్డి వ్యూహమేంటి?

జ‌గ‌న్‌రెడ్డి త‌గ్గారు. అయినా, త‌గ్గేదే లే అన్నారు. సీఆర్‌డీఏ బిల్లు ర‌ద్దును ర‌ద్దు చేశారు. వికేంద్రీక‌ర‌ణ బిల్ల‌ల‌నూ వెన‌క్కి తీసుకున్నారు. అయినా, మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల పాటే పాడారు. మ‌రోసారి మెరుగైన‌, బ‌ల‌మైన బిల్లుతో ముందుకొస్తామ‌ని చెప్పేశారు. జ‌గ‌న్‌లో ఇంత ధీమా ఎందుకు? ప్ర‌జ‌లంతా వ్య‌తిరేకిస్తున్నా.. అమ‌రావ‌తి రైతులు 700 రోజులుగా ఉద్య‌మిస్తున్నా.. మ‌హా పాద‌యాత్ర‌తో నిర‌స‌న తెలుపుతున్నా ఏమాత్రం త‌ల‌వంచ‌ని జ‌గ‌న్‌రెడ్డి.. ఇప్పుడే ఎందుకిలా స్టాండ్‌ మార్చారు. త‌గ్గ‌డం వెనుకున్న నెగ్గే వ్యూహ‌మేంటి? అనేది ఆస‌క్తిక‌రం. వారం రోజులుగా హైకోర్టు మొట్టికాయ‌లు వేస్తోంది. జ‌గ‌న్ స‌ర్కారును ప్ర‌శ్న‌ల‌తో కుళ్ల‌బొడుస్తోంది. అంతా డొల్ల బిల్లులే. టెక్నిక‌ల్‌గా అనేక లోటుపాట్లే. అందుకే.. డైలీ హైకోర్టు త‌లంటుతోంది. రాజ‌ధాని బిల్లుల‌పై విచార‌ణ‌లో భాగంగా.. చీఫ్ జ‌స్టిస్ మాట్లాడుతూ.. అమ‌రావ‌తి రైతుల‌ది మాత్ర‌మే కాద‌ని.. ప్ర‌జ‌లంద‌రిద‌నీ వ్యాఖ్యానించారు. క‌ర్నూలులో జ్యుడీషియ‌ల్ కేపిట‌ల్‌కు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు అనుమ‌తి ఉందా? అని ప్ర‌శ్నించారు. రాజ‌ధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వానిదే తుది నిర్ణ‌య‌మైనా.. అందులోని చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను మాత్రం తాము విచారించి తీర్పు చెబుతామ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.  ఇలా, న్యాయ‌స్థానంలో విచార‌ణ సంద‌ర్భంగా వికేంద్రీక‌ర‌ణ బిల్లులోని లూప్‌పోల్స్ అన్నీ బ‌య‌ట‌కొచ్చాయి. ఆ కేసులు కోర్టులో వీగిపోవ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మైపోయింది. అలా ప‌రువు పోక‌ముందే.. బిల్లుల‌న్నీ ర‌ద్దు కాక‌ముందే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ బిల్లుల‌ను వెన‌క్కి తీసుకుంటూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అంటున్నారు. అలా, హైకోర్టు తీర్పు రాక‌ముందే స‌ర్కారు స‌ర్దుకుంద‌ని చెబుతున్నారు.  మ‌రోవైపు, మండ‌లి వ్య‌వ‌హారం. సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపించారు మండ‌లి ఛైర్మ‌న్‌. అయితే, ఆ బిల్లును అలా సెలెక్ట్ క‌మిటీకి పంపించే అధికారం ఛైర్మ‌న్‌కు లేదంటూ.. ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు మండ‌లి ఉద్యోగి తిర‌స్క‌రించ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌భుత్వ ఒత్తిడితోనే ఆ ఉన్న‌తోద్యోగి అలా కొర్రీ పెట్టార‌ని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శించింది. సీఆర్‌డీఏ బిల్లు ర‌ద్దు బిల్లు సెలెక్ట్ క‌మిటీకి వెళ్లింద‌ని టీడీపీ అంటుంటే.. వెళ్ల‌లేద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్ర‌స్తుతం శాస‌న మండ‌లిలో టీడీపీకే మెజార్టీ ఉండ‌గా.. త్వ‌ర‌లో వైసీపీకి మ‌రో 14మంది ఎమ్మెల్సీలు కొత్త‌గా ఎన్నిక కానుండ‌టంతో మండ‌లిలో అధికార పార్టీ ఆధిప‌త్యంలోకి రానుంది. ఆ త‌ర్వాత ఏ బిల్లు తీసుకొచ్చినా.. ఇటు అసెంబ్లీలోనైనా, అటు మండ‌లిలోనైనా ప్ర‌భుత్వానిదే పైచేయి అవుతుంద‌ని భావిస్తోంది. అందుకు మ‌రికాస్త స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌టం.. ఆ లోగా ఉన్న బిల్లును వెన‌క్కి తీసుకొచ్చి.. కొత్త‌గా, మ‌రింత బ‌లంగా మ‌రో బిల్లు తీసుకురావ‌లే అనేది జ‌గ‌న్‌రెడ్డి వ్యూహమ‌ని తెలుస్తోంది. ఏది, ఏమైనా అమ‌రావ‌తిని కాల‌రాయ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్య‌మ‌ని మ‌రోసారి తేలిపోయింది. 

జ‌గ‌న్‌రెడ్డి కేపిట‌ల్‌ డ్రామా!.. CRDA బిల్లుతో అమ‌రావ‌తి ఆట‌!

మూడు రాజ‌ధానుల‌ను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారు. ఇప్ప‌టికి ప‌క్క‌న‌పెట్టేసి.. త్వ‌ర‌లోనే మ‌రింత ప‌దునైన అస్త్రంగా ప్ర‌యోగించాల‌ని చూస్తున్నారు. వికేంద్రీక‌ర‌ణ బిల్లునైతే వెన‌క్కి తీసుకున్నారు కానీ, వికేంద్రీక‌ర‌ణ‌పై మాత్రం ముందుకే వెళ్తామంటున్నారు. అమ‌రావ‌తినే ఏపీకీ ఏకైక రాజ‌ధాని అని ఏమాత్రం ఒప్పుకోవ‌డం లేదు. అమ‌రావ‌తికి జై కొట్ట‌డం లేదు. అదే పంతం. అదే మొండిత‌నం. మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తిని ధ్వ‌సం చేసే దుర్నీతి. సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లును ర‌ద్దు చేసి.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మైండ్‌గేమ్ ఆడుతోందని అంటున్నారు. బిల్లు ర‌ద్దు చేసినా.. మ‌ళ్లీ కొత్త బిల్లుతో వ‌స్తామన్నారు. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేసే వ‌ర‌కూ వ‌దిలిపెట్టేది లేదంటూ చెప్ప‌క‌నే చెప్పారు.  టెక్నిక‌ల్‌గా ఇప్పుడు మూడు రాజ‌ధానులు లేవు. ప్ర‌స్తుతానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తినే. సీఆర్‌డీఏ బిల్లు పున‌రుద్ద‌రించ‌బ‌డింది. అయినా, ఆనందించ‌లేని ప‌రిస్థితి. సంబ‌రాలు చేసుకోలేని దుస్థితి. ఎందుకంటే, అసెంబ్లీలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌సంగం వింటే అర్థ‌మైపోతుంది. ఆయ‌న అస‌లు ఉద్దేశ్య‌మేంటో తెలిసిపోతుంది. ముఖ్య‌మంత్రి ఏమాత్రం మార‌లేదు. అమ‌రావ‌తి రైతులు 700 రోజులుగా పాద‌యాత్ర చేస్తున్నా.. జ‌గ‌న్‌రెడ్డి మ‌నుసు క‌ర‌గ‌లేదు. హైకోర్టు భ‌యంతో, మండ‌లి బ‌లంతో.. టెక్నిక‌ల్‌గా మ‌రింత బ‌ల‌మైన బిల్లు తీసుకొచ్చి.. అమ‌రావ‌తి గుండెల్లో మ‌ళ్లీ ముల్లు గుచ్చాల‌నేది ఎత్తుగ‌డ‌. మండ‌లిలో ఆధిప‌త్యం వ‌చ్చే దాకా.. హైకోర్టు మొట్టికాయ‌లు త‌ప్పించుకునే దాకా.. మూడు రాజ‌ధానుల‌ను తాత్కాలికంగా ప‌క్క‌న‌పెట్టే వ్యూహం మిన‌హా ఇంకేమీ లేదక్క‌డ‌.  చంద్ర‌బాబు-భవ‌నేశ్వ‌రి ఎపిసోడ్‌పై ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికో.. వివేకా హ‌త్య కేసును డైవ‌ర్ట్ చేసేందుకో.. సీమ వ‌ర్షాల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకో.. కార‌ణం ఏదైనా.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌స్తుతానికి వెన‌క‌డుగు వేసినా.. మూడు రాజ‌ధానుల‌పై త‌గ్గేదే లేద‌ని తేల్చేశారు. మ‌ళ్లీ ప్ర‌జ‌ల దృష్టిలో దోషిగా నిల‌బ‌డ్డారు. మూర్ఖుడు రాజుకంటే బ‌ల‌వంతుడ‌నేది సామెత‌. అదే, మూర్ఖుడే రాజైతే...?  

షా-జగన్ జోడీ.. జాయింట్ యాక్షన్ ప్లాన్?

భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కేంద్రంలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావలి.. అయితే, అది మోడీనో అమిత్ షానో అనుకుంటే అయ్యే పని కాదు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాలనే  నమ్ముకున్నా మరో సారి  ఢిల్లీ పీఠం దక్కదు, ఈ నిజం కమల దళం గుర్తించింది. అందుకే, దక్షణాదిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రలలో పట్టు సాధించేందుకు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వైసీపీ, తెరాసకు ప్రత్యాన్మాయంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్  పార్టీలను పక్కకు నెట్టి అ స్థానాన్ని అక్రమించేందుకు అమిత్ షా స్కెచ్ సిద్దం చేశారు. అంతే కాదు, ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా  ఖతం చేసేందుకు అక్కడ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ, తెరాసలతో బీజేపే  ‘సుపారీ’ ఎగ్రిమెంట్ చేసుకుందని సమాచారం.  అదలా, ఉంటే ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం కూడా, బీజేపీ, వైసీపీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగమేనా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి, గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గిపు మొదలు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం వరకు, చివరకు సాగు చట్టాల రద్దు నిర్ణయం వరకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే, కేవలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కాకుండా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా సిద్డంవుతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. గతంలో చేసిన తప్పులు దిద్దుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలను కమల దళం మొదలు పెట్టిందని  అంటున్నారు. అందుకే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబదించి ఎన్నికలకు ముందే ఏపీలో ఒకలా  తెలంగాణలో మరోలా సెకండ్ ప్లేస్, ప్రధాన ప్రత్యర్ధి రోల్ కోసం బీజేపీ కసరత్తు ప్రారంభించిందని  విశ్వసనీయ వర్గాల సమాచారం.    కాగా, నవంబర్ మొదటి వారంలో, తిరుపతిలో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  ఎలాంటి దాపరికం లేకుండా ఖుల్లం ఖుల్లా జగన్ రెడ్డి’ కి తమ ప్లాన్ వివరించారని, అందుకు మరో మార్గం లేక జగన్ రెడ్డి తలూపారని అంటున్నారు. అమిత్ షా ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఇతరత్రా ఏదన్నా సహాయం కావాలంటే, రాష్ట్రంలో రాజకీయంగా తమకు (బీజేపీ) అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో మొదటిది, మూడు రాజధానులకు మంగళం పాడి ఒకే రాజధానికి ఒప్పు కోవడం అని తేల్చి చెప్పినట్లు సమచారం. అందులో భాగంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రెడిట్’ బీజేపీ ఖాతాలో పడేలా స్కెచ్ సిద్దమైందని అంటున్నారు. నిజానికి, రాజకీయంగా చూస్తే  ముందు నుంచి రాజధాని ఉద్యమానికి అన్నివిద్లా మద్దతు తెలుపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది  టీడీపీ ఒక్కటే. కాబట్టి, పోరాట విజయం క్రెడిట్ కూడా టీడీపీకే దక్కాలి. కనీ ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలో కాకుండా, బీజేపీ ఖాతాలో వేసేందుకు కూడా అమిత్ షా స్కెచ్ సిద్దం చేశారని సమాచాం. అందుకే, రెండు సంవత్సరాలకు పైగా రైతులు ఆందోళన చేస్తున్నా, 22 రోజులుగా మహిళలు మహా పాదయాత్ర చేస్తున్నా ఉలుకు పలుకు లేని, జగన్ ప్రభుత్వం బీజేపీ నాయకులు యాత్రలో పాల్గోనగానే, మూడు రాజధానులను మూట కట్టేసిందని, ఇది బీజేపీ, వైసేపీ జాయింట్ యాక్షన్ కావచ్చని అంటున్నారు.  అంతే కాకుండా రానున రోజుల్లో బీజేపీ, వైసీపీ జాయింట్ యాక్షన్’లో బీజేపీ పొలిటికల్ మైలేజిని పెంచే ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీస్కోవచ్చని అంటున్నారు. అందులో సవరించిన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ విక్రయం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం వంటి నిర్ణయాలు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.  అయితే, బీజేపీ, వైసీపీ జాయింట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు చిత్తశుద్దితో పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు తెలుసని, తెలుగు రైతు పోరాట విజయం తెలుగు దేశం పార్టీకే చెందుతుందని, జేఏసీనాయకులు, రైతులు  అంటున్నారు.  

అమ‌రావ‌తిపై అదే స్టాండ్‌.. మూడు రాజ‌ధానుల‌కే జ‌గ‌న్‌రెడ్డి జై..!

తేలిపోయింది. మేక‌వ‌న్నె పులి ఎవ‌రో తెలిసిపోయింది. స‌దుద్దేశ‌మేమీ లేదు. అదే ఉద్దేశ్యం. అమ‌రావ‌తిపై ప్రేమ ఏమాత్రం లేదు. అదే ధ్వేషం. మూడు రాజ‌ధానుల‌పై వెన‌క‌డుగేమీ లేదు. మ‌రింత దూకుడుగా దాడి చేసేందుకే.. వెన‌క్కి త‌గ్గి ముందుకు దూసుకొస్తామ‌ని సీఎం జ‌గ‌న్‌రెడ్డి తేల్చేశారు. అసెంబ్లీ వేదిక‌గా వికేంద్రీక‌ర‌ణ‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తేల్చి చెప్పారు.  జ‌గ‌న్‌రెడ్డి క్లియ‌ర్‌గా చెప్పేశారు. చ‌ట్ట‌ప‌రంగా, న్యాయ‌ప‌రంగా చిక్కులు తొల‌గించుకునేందుకు.. వికేంద్రీక‌ర‌ణ‌పై మ‌రింత స‌మ‌గ్ర స‌మాచారాన్ని పొందుప‌రిచేందుకు.. ప్ర‌జ‌ల‌కు మూడు రాజ‌ధానుల అవ‌స‌రాన్ని మ‌రింత వివ‌రంగా చెప్పేందుకు.. బిల్లును మ‌రింత ప‌టిష్టం చేసేందుకు.. అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని మార్పులు చేసేందుకు.. మాత్ర‌మే మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.  మ‌ళ్లీ... పూర్తి, స‌మ‌గ్ర‌మైన‌, మెరుగైన బిల్లుతో స‌భ ముందుకు వ‌స్తామ‌ని జ‌గ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. విస్తృత‌, విశాల ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.   మ‌ళ్లీ పాత చ‌రిత్రంతా త‌వ్వుకొచ్చారు. అరిగిపోయిన క్యాసెట్‌ మ‌ళ్లీ వేశారు. ఆంధ్ర ప్రాంతం త‌మిళ‌నాడుతో క‌లిసున్న‌ప్ప‌టి నుంచీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డంతా చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్య‌మం, హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం, వెన‌క‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌, శ్రీబాగ్ ఒప్పందం, శ్రీకృష్ణ క‌మిష‌న్‌, శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ.. ఇలా అదిచెప్పి, ఇదిచెప్పి.. అటుతిప్పి ఇటుతిప్పి.. హైద‌రాబాద్‌ను బూచిగా చూపించి.. వికేంద్రీక‌ర‌ణ కోస‌మే అమ‌రావ‌తి వ‌ద్దంటూ.. అన్ని ప్రాంతాల కోస‌మే మూడు రాజ‌ధానులంటూ.. చెప్పిందే చెప్పుకొచ్చారు. చివ‌రాఖ‌రికి చెప్పాల్సింది చెప్పారు. వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు.. మ‌రింత బ‌లమైన బిల్లు తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు.  

అసెంబ్లీలో సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ బిల్లు..

అసెంబ్లీలో సీఆర్‌డీఏ (CRDA) రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లులోని విష‌యాల‌పై స‌భ‌కు వివ‌రించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడి ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలను శ్రీకృష్ణ కమిటీ గుర్తించిందని బుగ్గన వివరించారు. శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఏపీలో విస్తృతంగా ప‌ర్య‌టించి.. మంచి సూచ‌న‌లు చేశార‌ని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతం అవ‌డం వ‌ల్లే.. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం వ‌చ్చింద‌న్నారు. ఏపీలో అలా కాకూడ‌ద‌ని త‌మ ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని బుగ్గ‌న తెలిపారు.  మ‌రోవైపు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు.