రేవంత్ పై టీఆర్ఎస్ మరో స్కెచ్ వేయనుందా?
posted on Sep 11, 2015 @ 3:28PM
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం.. వారికి ధీటుగా సమాధానం చెప్పగల సామర్థ్యం ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మిగిలిన పార్టీ నేతలు మాట్లాడలేరా అంటే మాట్లాడలేరని కాదు కాని రేవంత్ రెడ్డి అంత వాక్చాతుర్యం.. వారి మాటను తిప్పికొట్టి మాట్లాడగల సత్తా వారికంటే కొద్దిగ ఎక్కువగా రేవంత్ రెడ్డికే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి మాటలకు భయపడతారని రాజకీయ వర్గాలు చెప్పుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవ్వరి మీద ఫోకస్ చేయకుండా కేవలం రేవంత్ రెడ్డి మీద మాత్రమే ఫోకస్ పెట్టి చాలా పథకం ప్రకారం ఓటుకు నోటుకేసులో ఇరికించారు.
అయితే టీఆర్ఎస్ కూడా కావాలనే రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తమ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డికి ఎలాగైనా మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని చూస్తుంది. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం సరిగా రాలేదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చేప్తేకాని మాట్లాడే అవకాశం ఇచ్చేది లేదని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు కాని రేవంత్ రెడ్డి మాత్రం క్షమాపణలు చెప్పలేదు.. అలా రేవంత్ మాట్లాడకుండానే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముగిసిపోయాయి. ఆ తరువాత నోటుకు ఓటు కేసులో ఇరికించాయి.. దీనివల్ల రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం ఏంటంటే ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఎలా కట్టడి చేస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాములుగానే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు అసలే పులి అందులోనూ దెబ్బతిని ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పై తన పంజా విసరడానికి సిద్దంగా ఉన్నాడు. అసలు కేసు తర్వాత షరతులతో కూడిన బెయిల్ మీద బయటకొచ్చినప్పుడే కేసీఆర్ పై ఒక రేంజ్ లో విమర్శల బాణాలు వదిలాడు. నాకు బెయిల్ వచ్చింది కేసీఆర్ కు జ్వరం వచ్చిందంటూ ఆయనపై మండిపడ్డాడు. ఇప్పుడు హైకోర్టు ఆ షరతులను కూడా సడలింపు చేస్తూ రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు అని చెప్పిన చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి అలా వచ్చాడో లేదో కేసీఆర్ ను ఏకిపారేశాడు. సింగం వచ్చింది కేసీఆర్ చైనా పారిపోయాడు అంటూ.. ఆట కాదు వేట మొదలైందంటూ.. తాడో పెడో తేల్చుకుంటానంటూ సవాళ్లు విసిరారు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీ అంత తేలికగా తీసుకోనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈనెల 27 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తమ పార్టీని ఇరుకున పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోందని అనుకుంటున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేసేందుకు టీఆర్ఎస్ ఏం స్కెచ్ వేస్తుంది అని పలు అను మానాలు రేకెత్తున్నాయి. అయితే ముందు ఓటుకు నోటు కేసుపై సభ నుండి సస్పెండ్ చేద్దామని అనుకున్నా దాన్ని విరమించుకున్నారు. ఎందుకుంటే ఇప్పటికే ఓటు నోటు కేసు వల్ల రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు అదికూడా చేస్తే రేవంత్ రెడ్డి హీరో అయిపోతాడని ఆగిపోయారంట. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి మాత్రం టీఅర్ఎస్ పార్టీ బానే భయపడుతుందని చెప్పొచ్చు.