రఘువీరాని ఇంటికెళ్లి మరీ కొడతా.. జేసీ
posted on Sep 11, 2015 @ 4:46PM
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ రఘువీరారెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరా రెడ్డిపై తిట్ల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ కేసులు పెడుతున్నారు.. పద్దతి మార్చుకోకపోతే రఘువీరా ఇంటికి వెళ్లి మరీ కొడతానని హెచ్చరించారు. అంతేకాదు కేవలం పార్టీ ప్రయోజనాలకే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ప్రజల కోసం మేమున్నామంటూ దొంగనాటకాలాడుతుందని.. మొసలి కన్నీరు కార్చుతుందని విమర్శించారు.
కాగా రఘువీరా రెడ్డి పెట్టిన కేసుకు ప్రతీకారంగా బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసిందని కాంగ్రెస అధ్యక్షురాలు సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్.. దిగ్విజయ్ సింగ్ పై కేసులు పెట్టారు.