Top Stories

చర్చ రచ్చ ఏదైనా ..చివరకు మిగిలేది శూన్యం

  తెలంగాణలో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన సవాళ్ల రాజకీయం మలుపులు తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతోంది. సూది కోసం సోది కెళితే. అన్నట్లుగా అసలు చర్చ పక్కకుపోయి,రాజకీయ రచ్చ, పొంగి పొరలుతోంది. సాగుతోంది.   నిజానికి, సవాళ్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం రైతు సమస్యల వరకే పరిమితం అయ్యారు. ‘రైతులకు ఎవరు ఎంత మేలు చేశారు తేల్చుకుందాం రండని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’కు,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు బహిరంగ వేదిక నుంచి ఒకే సారి సవాలు విసిరారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణాలు ఏవైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,కేటీఆర్’ రియాక్ట్ అయ్యారు. సోమాజీగూడ గూడ ప్రెస్ క్లబ్  వేదికగా   చర్చకు సై ..అన్నారు. ఇక అక్కడి నుంచి చర్చ,రచ్చగా మారింది. చర్చ జరగవలసింది, చట్ట సభల్లో కానీ, క్లుబ్బుల్లో, పబ్బుల్లో కాదని, అసలు ముఖ్యమంత్రి సవాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్’ కు కానే కేటీఆర్’కు కాదని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు  కేటీఆర్’ విమర్శలను తిప్పి కొట్టారు. నిజమే, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు,కాంగ్రెస్ నాయకులు లేటెస్ట్’గా చెపుతున్నట్లుగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చించేందుకు సరైన వేదిక చట్ట సభలే..నిజానికి  సమస్య లేదా విషయం ఏదైనా, చర్చ జరగవలసింది, చట్టసభల్లోనే,..అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు,ప్రజా సమస్యలపై చర్చలు జరగవలసింది చట్టసభల్లోనే..మరో వేదిక అది ఎంత పవిత్రమైనది అయినా, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు అది తగిన వేదిక కాదు. నిజమే కావచ్చును,చట్టసభలు ఎంత చక్కగా జరుగుతున్నాయో,గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంత గౌరవ ప్రదంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం..అయినా సరే చట్ట సభల తీరు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నా సరే,పభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగవలసింది చట్ట సభల్లోనే.. క్లబ్బుల్లోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో కాదు. ఈ విషయంలో   అధికార, విపక్షాలకు ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు,ఉండరాదు.ఉన్నా అది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని, న్యాయస్థానాలు,రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాలో స్పష్టం చేశారు.    కానీ, ఇప్పడు రాష్ట్రంలో, రైతులకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసింది’ అనే విషయంపై చర్చ పేరిట జరుగతున్నరచ్చ, విషయానికి వస్తే.. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.సవాళ్లు ప్రతి సవాళ్లుగా సాగుతున్నరాజకీయం,రాజకీయమ పార్టీలు, నాయకులు   గమనిస్తున్నాయో లేదో  సామాన్యులకు చీదర పుట్టిస్తోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారని మీడియా చర్చల్లో పాల్గొంటున్న పెద్దలు హెచ్చరిస్తున్నారు.నిజానికి, రాజకీయ పార్టీల తీరు, అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన అంతా శ్రీ వైష్ణవులే ..అన్నట్లు, ఉందని, సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యంతో కూడిన అవేద వ్యక్తపరుస్తున్నారు.  అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున రాజకీయ రచ్చలో అసలు విషయం పక్కకు పోయి, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇదలా ఉంటే ఇప్పడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ఎజెండాతో కొత్త ప్రపోజల్’తో ముందుకొచ్చారు. కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌‌కు రమ్మంటే వస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు.  అలాగే, ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్‌ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, ఈ ప్రతిపాదనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడవలసి వుంది.అయితే, చర్చ అయినా, రచ్చ అయినా, ఏమి జరిగిన ఏమి జరగక పోయినా, చివరకు మిగిలేది శూన్యం.  
చర్చ రచ్చ ఏదైనా ..చివరకు మిగిలేది శూన్యం Publish Date: Jul 10, 2025 1:44PM

తెలంగాణ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో కోర్టు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని  నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  
తెలంగాణ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ Publish Date: Jul 10, 2025 1:35PM

యశోద ఆస్పత్రికి కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

    బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మాజీ సీఎంకు మరోసారి  డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరగ్గానే ఉందని బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయిలు కొద్దిగా పెరిగాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు.  ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్‌ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు.  కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు గులాబీ బాస్ స్పష్టం చేశారు.  జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ మాజీ మంత్రి హరీశ్ రావు  విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరుకావడం లేదని కమిషన్‌కు హరీశ్ రావు సమాచారం అందజేశారు. అయితే, కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజున విచారణకు హాజరవుతానని జస్టిస్ పీ చంద్రఘోష్‌కు సమాచారం అందజేశారు హరీశ్ రావు    
యశోద ఆస్పత్రికి కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు Publish Date: Jul 10, 2025 1:10PM

ట్రంప్ టార్గెట్ భారత్.. ఫార్మా, కాపర్‌లపై టారిఫ్‌ బాదుడు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలు టారిఫ్‌ల విషయంలో డీల్స్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండగా.. రోజుకో దేశానికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. లెటెస్ట్‌గా భారత్‌ను ఈ లిస్ట్‌లో చేర్చారు. ఓ వైపు ట్రేడ్‌ డీల్‌పై ఓ అవగాహనకు వస్తున్న సమయంలో భారత్‌ ఎగుమతి చేసే కాపర్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం.. కాపర్‌పై 50 శాతం టారిఫ్‌ విధిస్తామని ఓ బాంబు పేల్చారు.   నిజానికి ట్రంప్‌ గతంలో సైతం భారత స్టాక్‌ మార్కెట్‌ను అల్లకల్లోలం చేసే వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో అమలైనవి చాలా తక్కువే. కానీ ఈసారి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే మాత్రం భారత్‌కు పెద్దదెబ్బే అంటున్నారు. ఎందుకంటే భారత్‌ ఫార్మా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది భారత ఫార్మా ఉత్పత్తిలో 40 శాతం. ఇక కాపర్ విషయానికి వస్తే.. టెక్, కన్‌స్ట్రక్షన్‌తో పాటు అనేక రంగాల్లో ఉపయోగించే కాపర్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్ డాలర్ల విలువైన కాపర్‌ను ఎగుమతి చేసింది. ఆ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలు నిజంగా అమలైతే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి.  ట్రంప్‌ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధించారు. ఇప్పుడు ఆయన చూపు కాపర్, ఫార్మాపై పడింది. ఫార్మా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ అంటున్నారు. దీని కోసం ఏడాది సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత వారిపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెబుతున్నారు.  ఇప్పటికే బ్రిక్స్‌ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందులోని దేశాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డాలర్‌ ఆధిపత్యం చేలాయించాలనేది ట్రంప్ ఆలోచన. కానీ బ్రిక్స్ దేశాలు అమెరికా ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయనేది ఆయన భయం. అందుకే  తన అమ్ములపొదిలోని అత్యంత బలమైన అస్త్రంగా భావిస్తున్న టారిఫ్‌లను ప్రపంచదేశంపైకి వదులుతున్నారు.  ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే ట్రేడ్‌ డీల్‌పై అమెరికాతో మంతనాలు జరుపుతుంది భారత్. ఇక ఇండియన్ ఫార్మా కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ను అమెరికాకు తరలించలేకపోయినా.. లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని.. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ తన టెంపరితనంతో నిజంగానే నిజంగానే టారిఫ్‌లను విధిస్తే మొదట ఆయా దేశాలకు తిప్పలు తప్పవు. అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవనేది వాస్తవం. ఫార్మా కంపెనీలు ఏసియా దేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే మరింత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికన్లపై మరింత భారం మోపుతాయన్న చర్చ కూడా ఉంది. మరి ట్రంప్‌ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
ట్రంప్ టార్గెట్ భారత్.. ఫార్మా, కాపర్‌లపై టారిఫ్‌ బాదుడు Publish Date: Jul 10, 2025 12:44PM

చంద్రబాబు క్లాసులో విద్యార్థిగా మారిన లోకేష్

  ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం.. మెగా పీటీఎం 2.0 నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ ఒక చోటకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు.  మెజా పీటీఎం-20 కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తి విద్యార్థులకు ‘వనరులు’ అన్న సబ్జెక్ట్‌పై క్లాస్ చెప్పారు. సహజ వనరులు, పునరుత్పాదక వనరుల వినియోగం, సంరక్షణ గురించి విద్యార్థులకు సీఎం బోధించారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్ధులకు వివరించారు. విద్యార్ధులు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా ఇతరులు మరోమారు వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ స్టూడెంట్స్‌కు చెప్పారు చంద్రబాబు.  కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలన్నారు. అందరూ ఉద్యోగాలే కాదు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగానూ మారాలన్నారు. నారా లోకేశ్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. విద్యార్థులతోపాటు బల్లపై కూర్చుని సీఎం చెప్పే పాఠాన్ని ఆసక్తిగా వినడం విశేషం.  
చంద్రబాబు క్లాసులో విద్యార్థిగా మారిన లోకేష్ Publish Date: Jul 10, 2025 12:35PM

తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

తెలుగు రాష్ట్రాలలో గురువారం (జులై 10) ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో అలాగే కరీంనగర్ జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలో ఒక చిన్నారి సహా ఐదుగురు మరణించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి మైదుకూరు వెడుతున్న స్కార్పియో వాహనం అతి వేగంగా ముందు వెడుతున్న ఓ ట్రాక్టర్ ను ఢీ కొంది. ఈ దుర్ఘటనలో  ఇద్దరు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్ను మూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద బైక్ పై వెడుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ సంఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. 
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి Publish Date: Jul 10, 2025 11:07AM

తల్లిదండ్రులు చేసే ఈ తప్పు పిల్లలను పిరికివాళ్లుగా, మొండివాళ్లుగా మారుస్తుంది.!

పిల్లలను పెంచడం పిల్లల ఆట కాదు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దానికి తగినట్టే అన్నీ వారికి అందించాలని అనుకుంటారు. కానీ చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని పరిస్థితులలో పిల్లలను తిట్టడం వారి మెదడు,  మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను  ఎప్పుడు తిట్టకూడదో,  దీని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. పిల్లలు భయంలో ఉన్నప్పుడు.. తప్పు చేసిన తర్వాత పిల్లలు కొన్నిసార్లు భయపడతారు. ఇలా  భయపడితే లేదా ఇప్పటికే ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉంటే, ఈ సమయంలో పిల్లలను తిట్టడం సరైనది కాదు. అలాంటి పరిస్థితిలో, పిల్లల మనస్సు మరింత భయపడవచ్చు. దీని ఫలితంగా పిల్లలు తను చేసిన పనులను,  విషయాలను తల్లిదండ్రులతో  పంచుకోవడం మానేస్తాడు. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఇప్పటికే సున్నితంగా ఉంటే అతన్ని తిట్టడానికి బదులుగా ప్రేమతో జరిగిన తప్పు గురించి   వివరించడం మంచిది. కొత్తగా ఏదైనా చేసేటప్పుడు చేసే తప్పులు.. పిల్లలు ఏదైనా విషయం గురించి  ఆసక్తిగా ఉండి, ప్రతి క్షణం కొత్తగా ఏదైనా చేయాలని లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అలాంటి పరిస్థితిలో, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. పిల్లలు నేర్చుకునేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఈ తప్పులు వారు మంచిగా మారడానికి,  వారికి గొప్ప అనుభవాలుగా సహాయపడతాయి. అందువల్ల, ప్రతి చిన్న తప్పుకు వారిని తిట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని కారణంగా పిల్లలు కొత్తగా ఏదైనా చేసే ముందు భయపడతారు.   పిల్లలు అలసిపోయినప్పుడు.. పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, వారు ఏదైనా తినేటప్పుడు  పిల్లలను  తిట్టకూడదు. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా  అలసిపోయినా లేదా ఆకలిగా ఉన్నా వారి మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి సమయంలో పిల్లలను తిడితే  ఇది పిల్లలకు మరింత  చిరాకు తెప్పిస్తుంది. ఆ సమయంలో పిల్లలను  తిట్టడం ప్రారంభిస్తే, విషయం మరింత దిగజారిపోతుంది.అందుకే పిల్లలను మందలించాలన్నా మొదట వారి పరిస్థితి  సాధారణ స్థితికి వచ్చాక ఆ తరువాత  తప్పు గురించి వివరించి చెప్పాలి.                                         *రూపశ్రీ.
తల్లిదండ్రులు చేసే ఈ తప్పు పిల్లలను పిరికివాళ్లుగా, మొండివాళ్లుగా మారుస్తుంది.! Publish Date: Jul 10, 2025 9:30AM

ఈ ఇంటి చిట్కా ఫాలో అయితే చాలు.. మోకాళ్ల నొప్పి మాయం కావడమే కాదు.. చకచకా నడిచేస్తారు!

  మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం,  నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం,   నొప్పి ఎక్కువగా ఉండటం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన  పేస్ట్ ఉంది.    దానిని మోకాలి నొప్పి ఉన్న  ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి.  ఉదయం నిద్రలేచిన తర్వాత  చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి,  ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం  కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1  నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా  లేదా చాలా పలుచగా ఉండకూడదు.  మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా  పూయాలి.  దానిపై మెత్తని  కాటన్ వస్త్రాన్ని చుట్టాలి.  8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది.  ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని  తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
ఈ ఇంటి చిట్కా ఫాలో అయితే చాలు.. మోకాళ్ల నొప్పి మాయం కావడమే కాదు.. చకచకా నడిచేస్తారు! Publish Date: Jul 10, 2025 9:30AM

రాణా, దేవరకొండ విజయ్ సహా పలువురు నటులపై ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది. ఇందుకు సంబంధించి   29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద కేసులు నమోదు చేసింది. ఈడీ కేసులు నమోదు చేసిన వారిలో ప్రముఖ నటులు దగ్గుబాటి రాణా,  విజయ్ దేవరకొండ,, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ఉన్నారు. గతంలోనే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ..వీరంతా భారీ పారితోషికాలు తీసుకుని నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని నిర్ధారణకు వచ్చింది.  అలాగే ఈ కేసులో ప్రముఖ యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, , సిరి హనుమంతు సహా  పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు  కూడా ఉన్నారు. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసి విాచరణకు పిలిచే అవకాశం ఉంది. 
రాణా, దేవరకొండ విజయ్ సహా పలువురు నటులపై ఈడీ కేసు Publish Date: Jul 10, 2025 8:50AM

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై 9) శ్రీవారిని మొత్తం 76 వేల 501 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 33 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది. ఇలా ఉండగా తిరుమలలో బిగ్, జనతా  క్యాంటీన్ల ఏర్పాటుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరమలలో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వాహకులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి  సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మిన్ భవనంలో  ఈ సమావేశం జరిగింది. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23న టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తిరుమలలో గుర్తింపు పొందిన హోటళ్లు, క్యాంటిన్ల నిర్వాహకులతో టీటీడీ ప్రిబిడ్ మీటింగ్ నిర్వహించింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని ఈ సందర్భంగా టీటీడీ ఈవో, ఏఈవోలు ఆదేశించారు. భక్తులకు లాభాపేక్ష లేకుండా, సేవా దృక్ఫథంతో నిర్దేశిత ధరలకే నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు. 
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు Publish Date: Jul 10, 2025 8:33AM

నటుడు ఫిష్ వెంకట్ కు తెలంగాణ సర్కార్ చేయూత

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను బుధవారం (జూన్ 9) మంత్రి శ్రీహరి పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడమే కాకుండా..తక్షణ ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించారు. రెండు కిడ్నీలూ పూర్తిగా దెబ్బ తినడంతో ఇన్నాళ్లూ డయాలసిస్‌తో నెట్టుకొచ్చిన వెంకట్ పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు కిడ్నీ  ట్రాన్స్ ప్లాంట్ చేయక తప్పని పరిస్థతి ఏర్పడింది. చికిత్స చేయించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పుడు వెంకట్ కుటుంబ సభ్యులు కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నారు.  
నటుడు ఫిష్ వెంకట్ కు తెలంగాణ సర్కార్ చేయూత Publish Date: Jul 10, 2025 7:05AM

అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక ప్రముఖ దినపత్రిలో గత కొన్ని రోజులుగా క్రైమ్ వార్తలు రాస్తున్న మెట్ల కుమార్ గత నెల 23న తన బైక్, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచీ కనిపించకుండా పోయి మెట్ల కుమార్ గురువారం (జులై 8) ఈస్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో శవంగా కనిపించాడు. మెట్ల కుమార్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి వయస్సు 45 సంవత్సరాలు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ కు తరలించారు.  మెట్ల కుమార్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి Publish Date: Jul 9, 2025 10:21PM

కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం : సీఎం రేవంత్

  గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ఇందుకు శిక్షించాల్సి వస్తే… ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కెసీఆర్ చేసిన పనికి వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిన పరిస్థితిని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీ అనుభవం సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడితే పరిగణలోకి తీసుకుంటాం అవసరమైతే ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మా మంత్రులకు పంపిస్తా కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా. దయచేసి నన్ను పబ్బులు, క్లబ్బుల్లో చర్చకు పిలవొద్దు అన్నారు. ఎవరు పెరిగిన నేపథ్యం వారిని అలా మాట్లాడిస్తుంది. అని పేర్కొన్నారు.
కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం : సీఎం రేవంత్ Publish Date: Jul 9, 2025 9:41PM

యాపిల్‌ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్‌ ఖాన్‌కి బాధ్యతలు

  ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. విలియమ్స్‌ సీవోవో బాధ్యతలను యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సబిప్‌ ఖాన్‌‌కు  ఈ నెల చివర్లో అప్పగించనున్నారు. ఈ క్రమంలో డిజైనింగ్‌ టీమ్‌  బాధ్యతలను నేరుగా టిమ్‌కుక్‌ స్వీకరించనున్నారు.  సబిప్‌ ఖాన్‌ మాలాలు భారత్‌లో ఉన్నాయి. ఆయన యూపీ మొరాదాబాద్‌ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్‌ గ్రేడ్‌ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్‌కు  వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికా కు వెళ్లారు.  1995లో ఆయన యాపిల్‌ ప్రొక్యూటర్‌మెంట్‌ గ్రూప్‌లో పనిచేశారు.
యాపిల్‌ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్‌ ఖాన్‌కి బాధ్యతలు Publish Date: Jul 9, 2025 9:18PM

ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు

  గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.  ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి.   ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.  
ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు Publish Date: Jul 9, 2025 9:07PM

వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు

  గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ. 1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది.  గత జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి. కాగా బుధవారం హుండీ, మ్రొక్కుబడుల లెక్కింపు చేపట్టగా  113 రోజుల కాలపరిమితికి గాను స్వామి వారికి భక్తుల నుండి కానుకుల రూపంలో  46 లక్షల 76 వేల, 204 రూపాయల నగదు, 19 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 319 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి.
వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు Publish Date: Jul 9, 2025 8:51PM

అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ

  గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయ వద్దకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూడగా హుండీ కూడా పగలగొట్టి అందులో ఉన్న సొమ్మును దొంగిలించినట్లు గమనించడం జరిగిందనీ అన్నారు.   ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేయగా ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ ,గుమస్తా వచ్చి చోరీ జరిగినప్పుడు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. శివాలయంలో గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని, సుమారు 15 నుండి 21వేల వరకు సొమ్ము పోయి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ Publish Date: Jul 9, 2025 8:43PM

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

  తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ అవసరాల మేరకు కేంద్ర మంత్రి నడ్డా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కాకుండా, అన్ని జిల్లాలకు యూరియా పంపిణీ చేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు.  సీఎం రేవంత్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న నడ్డా బుధవారం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇటీవల రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ, వరంగల్‌ ఎయిర్‌ఫోర్ట్ ఆర్థిక సాయం, హైదరాబాద్‌-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై చర్చించారు.
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ Publish Date: Jul 9, 2025 7:15PM

హె‌చ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్

  హైదరాబాద్ క్రికెట్  అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. జగన్మోహన్ రావు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని బెదిరించారని నిర్ధారణ కావడంతో ఇవాళ  ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20 శాతం టికెట్లు  ఉచితంగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో.. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన  తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది
హె‌చ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్ Publish Date: Jul 9, 2025 6:43PM

రైతన్నలకు బాబు సర్కార్ తీపి కబురు.. ధ్యానం పాత బకాయిలకు మోక్షం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్‌లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. ఆ క్రమంలో మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ జులై 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో ఈ ధాన్యం బకాయిల సొమ్ము జమ కానుందని తెలుస్తుంది.  ఇదే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.672కోట్లు విడుదలకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 32 వేల మంది రైతులకు ఈ నిధులు మంజూరు ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.  
రైతన్నలకు బాబు సర్కార్ తీపి కబురు.. ధ్యానం పాత బకాయిలకు మోక్షం Publish Date: Jul 9, 2025 5:20PM

అమరావతిలో తొలి అడుగు.. వచ్చే డిసెంబరు నాటికి ఎంఎల్ఏ క్వార్టర్లు సిద్దం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా  అభివృద్ధి చేస్తున్నారు. ఈ సముదాయాలలో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలూ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే సౌర విద్యుత్, గ్రౌండ్ వాటర్ రీచార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ వంటి మెరుగైన వసతులు కల్పిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం (జులై 9)న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల సముదాయాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ క్వార్టర్ల నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వసతి గృహ సముదాయాన్ని మొత్తం 12 టవర్లలో   288 క్వార్టర్లు నిర్మిస్తున్నారు. ఇవి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.  వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని సభాపతి తెలిపారు. అదే విధంగా 35 మంది మంత్రులూ, న్యాయమూర్తుల కోసం కూడా అమరావతిలో క్వార్టర్స్ నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.  స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ నివాస సముదాయాలకు కూడా మంత్రుల క్వార్టర్స్ తో  పాటు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని స్పీకర్ ఈ సందర్భంగా సూచించారు.అలాగే..  బయటి రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అమరావతికి వచ్చినప్పుడు వారికి తాత్కాలిక వసతులు కల్పించేలా కూడా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పోతే సీఎం అధికార నివాసం, రాజ్ భవన్ లు కృష్ణానది ఒడ్డున నిర్మితమౌతాయి.   అదలా ఉంటే.. ఆగస్టు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తెలుగుదేశం కూటమి ఏడాదిపాలనపై ప్రత్యేక చర్చ సహా వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. 
అమరావతిలో తొలి అడుగు.. వచ్చే డిసెంబరు నాటికి ఎంఎల్ఏ క్వార్టర్లు సిద్దం! Publish Date: Jul 9, 2025 5:06PM

అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్

  పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు. ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్‌ లోపల, బయట, చుట్టుపక్కల పారిశుధ్యం తనిఖీ చేయాలనుకున్న జిల్లా కలెక్టర్, ఆకస్మికంగా క్యాంటీన్‌కు  వెళ్ళారు. భోజనంకు వచ్చిన వారితో  పాటు ఆహారం తింటూ అన్నా కాంటీన్ లో ఆహార నాణ్యత తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్పందనను కోరారు. అన్నా క్యాంటీన్ నాణ్యత, నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి పరిచారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం రోజుకు దాదాపు రూ.90 ఖర్చు చేసి, వారికి రూ.15 కనీస ఖర్చుతో అందిస్తున్నదన్నారు. ప్రజలు అన్నా కాంటీన్ లో ఆహారాన్ని తీసుకోవాలని,  ఆకలితో ఉండకూడదని కోరారు.  క్యాంటీన్‌లో ఏవైనా లోపాలు ఉంటే  తెలియజేయాలని, వాటిని వెంటనే సరిచేస్తామని అన్నారు.
అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్ Publish Date: Jul 9, 2025 5:05PM

ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతిలో చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి    సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది.  ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం సిద్ధమవుతోందట. బనక చర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని చెబుతున్నారు.  
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు Publish Date: Jul 9, 2025 4:55PM

జ‌గ‌న్ పార్టీకి జ‌డ గండం?

మొన్న‌టి విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌ర ఉగాది పంచాంగం చ‌దువుతుండ‌గా ఆ పండితుడు చెప్పిందేంటంటే జ‌గ‌న్ కి స్త్రీ మూల‌క స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని. ఆ స‌రికే ఆయ‌న త‌న త‌ల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గ‌ట్రా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ్. ఇదే అతి పెద్ద గండం అనుకుంటే ఆయ‌న ఇంటా  బ‌య‌టా కూడా స్త్రీ  మూల‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్న‌ట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొన్న‌టికి మొన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ కార‌ణంగా  భువ‌నేశ్వ‌రి మాత‌ను అన‌రాని మాట‌ల‌ని.. ఆపై అది పార్టీకి అతి  పెద్ద చేటు తెచ్చిన అంశంగా త‌యారైంది. క‌ట్ చేస్తే నేడు ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనే ఈ కోవూరు మాజీ ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న  ప్ర‌శాంతిరెడ్డిని కూడా స‌రిగ్గా ఇలాంటి మాట‌లే అని పార్టీకి మ‌మూలు చెడ్డ పేరు తేలేదు. బేసిగ్గా జ‌గ‌న్ త‌న ప‌థ‌కాల‌న్నిటిలోనూ మ‌హిళ‌లే ప్ర‌ధానంగా ఉండాల‌ని భావించే ర‌కం. ఎందుకంటే మ‌గాళ్ల మూడు, ఓటు ఏ క్ష‌ణం ఎలా ట‌ర్న్ అవుతుందో తెలీదు. అదే మ‌హిళ‌లు అలాక్కాదు. వారి ఓటు- రూటూ అంతా స్ట్రయిట్ గా ఉంటాయ‌ని ఆయన నమ్మకం. అందుకే త‌న ఇంటి నుంచి త‌ల్లి, చెల్లి దూర‌మైనా స‌రే, రాష్ట్రంలో ఇంటింటా ఉన్న మ‌హిళల‌నే తన  త‌ల్లి , చెల్లిగా భావించారాయ‌న‌.  స‌రిగ్గా అదే  స‌మ‌యంలో క‌న్న త‌ల్లి, తోడ‌బుట్టిన చెల్లితో పాటు.. త‌న‌కు సోద‌రి వ‌ర‌స అయ్యే వైయ‌స్ సునీత నుంచి కూడా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కుంటున్నారు జ‌గ‌న్. అంతే కాదు.. ఇటీవ‌ల మాజీ మంత్రి, వైసీపీ మ‌హిళా నేత విడద‌ల ర‌జ‌నీ సైతం జ‌గ‌న్ అంటే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌బ‌రుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌పై ఇన్ని కేసులు న‌మోద‌వుతుంటే పార్టీ నుంచి క‌నీస మ‌ద్ధ‌తు లేద‌ని ర‌జ‌నీ వాపోతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆమె జ‌గ‌న‌న్న‌ను తెగ తిట్టుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి రోజా లోలోన ఎన్ని రాజ‌కీయ‌పు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారో ఆ వెంక‌న్నకే ఎరుక అంటున్నారు. న‌గ‌రి వైసీపీలోకి గాలి సోద‌రుడ్ని సాద‌రంగా ఆహ్వాస్తుండటంతో.. పైకి న‌వ్వుల మేక‌ప్పు వేసుకున్నా.. లోలోన జ‌గ‌న‌న్న‌ను తుక్కు తుక్కుగా తిట్టుకుంటున్నార‌ట  స‌ద‌రు మ‌హిళా నేత రోజా సెల్వ‌మ‌ణి.   దీంతో జ‌గ‌న్ కి ఎటు చూసినా  జ‌డ గండం త‌ప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ లీడ‌ర్ల‌లో దాదాపు సగానికి సగం మంది మ‌హిళ‌లంటే ఎంత మాత్రం గౌర‌వం లేని బాప‌తు.  గంజాయి, మ‌ద్య సేవ‌నంలో ఆరి తేరిన నిష్ణాతులు కావ‌డం వ‌ల్ల‌.. వారికీ సెన్సిబిలిటీ తెలీక పోవ‌డం వ‌ల్ల‌.. మ‌హిళ‌ల‌పై అకార‌ణంగా  నోరు పారేసుకోవ‌డంతో.. జ‌గ‌న్ ప‌ని ఇక్క‌డ త‌థిగిణతోం అయిపోతోందట‌. మొన్న ఎన్నిక‌ల ముందు వంశీ చేసిన మ‌హిళా వ్య‌తిరేక‌ ప్రేలాప‌న‌లు ఎంత చేటు తెచ్చాయో.. తెలిసి కూడా ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనే ఈ నేత మ‌రోమారు మ‌హిళ‌పై చేసిన  కామెంట్లు ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టీని మ‌రో ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యేలా చేస్తున్నాయంటున్నారు. ఇప్ప‌టికే ఒక మ‌హిళ‌ను అన్న పాపానికి 11 కి ప‌రిమిత‌మైంది జ‌గ‌న్ పార్టీ. వ‌చ్చే రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఆ ప‌క్క‌నున్న ఒక‌టి కూడా మాయ‌మ‌వుతుందేమో అన్న టాక్  స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది.
జ‌గ‌న్ పార్టీకి జ‌డ గండం? Publish Date: Jul 9, 2025 4:40PM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

  కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు.  బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) ఆస్పుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన వారిలో 15 మంది అస్వస్థతకు గురియ్యారు. హెచ్‌ఎంటీ హిల్స్‌ లోని కల్లు కాంపౌండ్‌ లో కల్లు తాగిన జేఎన్టీయూ అడ్డగుట్టకు చెందిన యోబు, మియాపూర్‌ నందిగడ్డ తండాకు చెందిన దేవదాస్‌, గూగుల్‌ ఫ్లాట్స్‌ 9th ఫేస్‌కు చెందిన పోచవ్వ, జేఎన్టీయూకు చెందిన చాకలి లక్ష్మి, షంషీగూడ కు చెందిన గోవిందమ్మ, పెంటీశ్‌, శాతవాహన నగర్‌ చెందిన యాదగిరి, నరసింహ, మాధవి, మొనప్ప, ఇంద్ర హిల్స్‌ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి నలుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అస్వస్థకు గురైన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌ గౌడ్‌, బి. శ్రీనివాస్‌ గౌడ్, టి. శ్రీనివాస్‌ గౌడ్‌, టి.కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. 
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య Publish Date: Jul 9, 2025 4:27PM

వైసీపీ మెయిల్స్ కుట్రలపై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా  అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. బుధవారం (జులై 9) అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ.. పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈ మెయిళ్లు పెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు.  వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరులతో ఈ మెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని సీఎం మండిపడ్డారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం.. పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిళ్లు పెట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పలువురు మంత్రులు కోరారు. దీనికి స్పందించిన సీఎం.. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసేలా ఈ మెయిళ్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తానన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తు చేశారు.  
వైసీపీ మెయిల్స్ కుట్రలపై చంద్రబాబు ఫైర్ Publish Date: Jul 9, 2025 4:16PM

వేమిరెడ్డి సతీమణికి నారా భువనేశ్వరి సంఘీభావం

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భువనేశ్వరి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో నారా భువనేశ్వరి స్పందించారు. మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతిరెడ్డికి తాను పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు నారా భువనేశ్వరి. ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న భువనేశ్వరి, మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు వారి విలువను తగ్గించలేవన్నారు. మహిళల స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవన్నారు. మన సంస్కృతి, విలువలు ఆడవారిపై గౌరవాన్ని నిలబెట్టాయనీ,  దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.
వేమిరెడ్డి సతీమణికి నారా భువనేశ్వరి సంఘీభావం Publish Date: Jul 9, 2025 4:03PM

అడుగడుగునా ఉల్లంఘన... పోలీసులపై ఆగ్రహం

    మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగడుగునా ఉల్లంఘన చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి పోలీసులు అనుమతిస్తే వైసీపీ భారీగా జనసమీకరణ చేసింది. ఉదయం 11 నుంచి మధ్యా 1.40 వరకు సైతం మార్కెట్ యార్డు కు చేరుకోలేదు. పోలీసుల భారీ భద్రతా కల్పించిన అనుమతి ఇచ్చిన 500 మంది కంటే 5వేల వరకు జనసమీకరణ చేశారు. రోడ్డు షో వద్దని పోలీసులు వారించినా వినకుండా వైఎస్ జగన్ పర్యటన రోడ్డు షో గా మారింది. నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై మామిడి కాయలు పోసి ట్రాక్టర్లతో తొక్కించిన నానా హడావిడి చేశారు. వైఎస్ జగన్ వాహనం వెంట వచ్చిన నాయకులు వల్ల స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 
అడుగడుగునా ఉల్లంఘన... పోలీసులపై ఆగ్రహం Publish Date: Jul 9, 2025 4:00PM

జర్నలిస్ట్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి

  వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ మీడియా  ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు. సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారని శివకుమార్ తెలిపారు. ఉదయం నుంచీ తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇంచార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది. మెమరీ కార్డు.. విజయానంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారని . తనపై వైసీపీ గూండాలే దాడికి పాల్పడినట్టు శివకుమార్ తెలిపారు. తన కెమెరా చిప్ లాక్కుని ఫోటోలు డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్ట్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి Publish Date: Jul 9, 2025 3:49PM