మృణాల్ ఠాకూర్ పెళ్లి అయిపోయిందా? మరి ఆ పిక్స్ ఎవరివి
on Jul 10, 2025
సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకగా మారిన నటి'మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur). ఆ తర్వాత నాచురల్ స్టార్ 'నాని'(Nani)తో కలిసి 'హాయ్ నాన్న'లో జత కట్టి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్జ్ ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
సోషల్ మీడియాలో 'మృణాల్ ఠాకూర్' తన కాళ్లకి మెట్టెలు తొడిగి ఉన్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్స్ షాక్ కి గురయ్యి, మృణాల్ రహస్యంగా ఎవరినైనా పెళ్లి చేసుకుందేమో అంటు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే 'డెకాయిట్' చిత్ర యూనిట్ ఆ పిక్ ని షేర్ చేసింది. అడవి శేషు(Adavi Sesh)హీరోగా 'డెకాయిట్'(Dacoit)అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో 'మృణాల్' హీరోయిన్ గా చేస్తుంది. డెకాయిట్ షూటింగ్ లో పాల్గొనడం కోసం మృణాల్ హైదరాబాద్ వచ్చిందని చెప్పడానికే, కాళ్ళకి మట్టెలు ఉన్న పిక్ ని షేర్ చేసారు.
దీంతో డెకాయిట్ లో తన క్యారక్టర్ కి సంబంధించి మృణాల్ కాళ్ళకి మట్టెలు ధరించినట్టుగా తెలుస్తుంది. షానియెల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెకాయిట్ ని యార్లగడ్డ సుప్రియతో కలిసి సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర దర్శకుడు, అగ్ర నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap)ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి బాసర్ల కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
