జర్నలిస్ట్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి
posted on Jul 9, 2025 3:49PM
.webp)
వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ మీడియా ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు. సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారని శివకుమార్ తెలిపారు. ఉదయం నుంచీ తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇంచార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది. మెమరీ కార్డు.. విజయానంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారని . తనపై వైసీపీ గూండాలే దాడికి పాల్పడినట్టు శివకుమార్ తెలిపారు. తన కెమెరా చిప్ లాక్కుని ఫోటోలు డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.