Illu illalu pillalu : భాగ్యానికి నర్మద సవాల్.. ఇంటికెళ్ళిన ఇద్దరు కోడళ్ళు!
on Jul 10, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -206 లో.... ప్రేమ, నర్మద బాధపడేలా మాట్లాడుతుంది భాగ్యం. ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే బాగుండదని నర్మదకి భాగ్యం వార్నింగ్ ఇస్తుంది. భాగ్యం వెళ్లిపోతుంటే నర్మద పిలిచి.. మీ పాటికి మీరు మాట్లాడి వెళ్ళిపోతే ఎలా మీరు అన్నారు కదా.. నీకు ఈ ఇంట్లో ఎవరు సపోర్ట్ గా లేరని.. నాకు ఎవరు సపోర్ట్ గా లేకున్నా సరే నేను ఈ కుటుంబానికి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను.. నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకోను వారి బంఢారం బయట పెట్టేవరకు ఊరుకోను.. ఇప్పటి వరకు డౌట్ ఉండే కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అందరి సంగతి తేలుస్తానని భాగ్యంతో నర్మద అనగానే భాగ్యం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత వేదవతిని వాళ్ళ అమ్మ ఎదురింటి నుండీ పిలుస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని వేదవతి అడుగుతుంది. అక్క మనసు బాలేదని తీర్ధయాత్రలకి తీసుకొని వెళ్ళిందని వాళ్ళ అమ్మ చెప్తుంది. ముగ్గురు కోడళ్ళు వచ్చారు కదా అని కోడళ్ళ గురించి వేదవతి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది.
ముగ్గురు కోడళ్లకి ఒకరంటే ఒకరికి పడదని వేదవతి అనగానే నర్మద అయితే గడుసు పిల్ల కుటుంబం కోసం ఏదైనా చేస్తుందని వేదవతి వాళ్ల అమ్మ అంటుంది. మరొకవైపు భాగ్యం తన కూతురు పెళ్లి కోసం ఇంటిని రెంట్ తీసుకున్న దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు. ఆ ఇల్లు భాగ్యం వాళ్ళది కాదని ప్రేమ, నర్మదలకి అర్ధమవుతుంది. వేదవతి కి ఫోన్ చేసి శ్రీవల్లి అక్క పేరెంట్స్ ఎక్కడున్నారో కనుక్కోండి మేమ్ వాళ్ల ఇంటి ముందు ఉన్నామని నర్మద అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మా వాళ్ళు ఇంట్లో లేరని చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అసలు శ్రీవల్లి వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసుకొని ఇంటి పక్కన వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



