శ్రీముఖి ఎంత స్లిమ్ గా ఐపోయినావమ్మా
on Jul 10, 2025
.webp)
బుల్లితెర మీద క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ ఫిమేల్ హోస్ట్ ఎవరు అంటే చాలు అందరూ శ్రీముఖి అంటారు. ఆమె హోస్ట్ చేసే షోస్ రేటింగ్స్ కూడా అలాగే పీక్స్ లో ఉంటాయి. ఐతే శ్రీముఖి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో హాష్ టాగ్ మెమోరీస్ అంటూ వాషింగ్టన్ డిసిలో దిగిన కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో శ్రీముఖి చాలా సన్నగా కనిపిస్తోంది. చిన్నపిల్లలా ఫోజులిస్తూ ఆ పిక్స్ లో కనిపిస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ తో శ్రీముఖిని పొగిడేస్తున్నారు. "ఎంత క్యూట్ గా ఉన్నావో స్కూల్ పాపలా. డ్రెస్ మస్తు ఉంది రాములమ్మ.. ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో ఎంత స్లిమ్ గా ఐపోయినావమ్మా..మా బాబు స్కూల్ షూస్ మిస్ అయ్యాయి...ఎక్కడ పోయాయో అనుకున్నా మీరు తీసుకెళ్లారా...నువ్వు లంగా ఓణీలోనే బావుంటావ్..కొన్ని ఫోజుల్లో నువ్వు అచ్చం దివ్యభారతిలా ఉన్నావు.." అంటూ రకరకాల క్యూట్ కామెంట్స్ ని పోస్ట్ చేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి అప్పుడప్పుడు ఇలా ఛిల్ల్ అవుతూ ఉంటుంది.
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తుంది అలాగే రీసెంట్ గా కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోకి హోస్ట్ చేసింది. ఇక శ్రీముఖి గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసారంటూ కొంతమంది సెలబ్రిటీస్ మీద ఈడి కేసు ఫెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీముఖి పేరు కూడా ప్రముఖంగా వినబడుతోంది. బుల్లితెరకు సంబంధించిన నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



