కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య
posted on Jul 9, 2025 4:27PM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు. బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) ఆస్పుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన వారిలో 15 మంది అస్వస్థతకు గురియ్యారు. హెచ్‌ఎంటీ హిల్స్ లోని కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన జేఎన్టీయూ అడ్డగుట్టకు చెందిన యోబు, మియాపూర్ నందిగడ్డ తండాకు చెందిన దేవదాస్, గూగుల్ ఫ్లాట్స్ 9th ఫేస్‌కు చెందిన పోచవ్వ, జేఎన్టీయూకు చెందిన చాకలి లక్ష్మి, షంషీగూడ కు చెందిన గోవిందమ్మ, పెంటీశ్, శాతవాహన నగర్ చెందిన యాదగిరి, నరసింహ, మాధవి, మొనప్ప, ఇంద్ర హిల్స్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు.
కల్తీ కల్లు తాగి నలుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అస్వస్థకు గురైన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్ గౌడ్, బి. శ్రీనివాస్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి.కుమార్ గౌడ్, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు.