హీరో అర్జున్ తో రాహుల్ సిప్లిగంజ్...రేపు సాంగ్ రిలీజ్
on Jul 9, 2025
రాహుల్ సిప్లిగంజ్ మంచి ఊపున్న సాంగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. నాట్ నాటు అంటూ ఆస్కార్ స్టేజి మీద డాన్స్ ని దుమ్ము దులిపాడు. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు రాహుల్. తర్వాత కొన్ని సింగింగ్ షోస్ కి జడ్జ్ గా వచ్చాడు. అలాంటి రాహుల్ రీసెంట్ గా గా హీరో అర్జున్ తో కలిసి ఉన్న పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. " నేను మెలోడీ సాంగ్స్ తో ప్రేమలో పడింది ఒకే ఒక్కడు మూవీ సాంగ్స్ ద్వారానే.. అర్జున్ సర్‌ను కలవడం నిజంగా ఫ్యాన్ బాయ్ మొమెంట్ నాకు. అర్జున్ సర్ డైరెక్ట్ చేసిన సీత పయనం మూవీ నుంచి రేపు నా సాంగ్ రీలీజ్ కాబోతోంది. మ్యూజిక్ అనూప్ రూబెన్స్, పాడింది నేను, మధుప్రియ..సీత పయనం టీమ్ కి బెస్ట్ విషెస్ " అంటూ రాసుకొచ్చాడు. నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు.
"ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కింగ్స్, అన్న నెక్స్ట్ లెవెల్, అన్న యు ఆర్ ది రాక్ స్టార్" అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఈ మూవీ ఈ నెల 22 న రిలీజ్ కాబోతోంది. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇక నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఇతను కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు. ఇక ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అర్జున్. ట్రెండీ ట్యూన్స్ తో ఆడియన్స్ ని ఎప్పుడూ అలరిస్తూ ఉంటాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ లో పునర్నవితో కెమిస్ట్రీ మాత్రం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
