మిమ్మల్ని చూస్తుంటే చాలా మంది కాళిదాసులే అవుతారు మేడం
on Jul 9, 2025

బుల్లితెర నటి ప్రియా గురించి చెప్పక్కర్లేదు. ఆమె సీరియల్స్ లో అటు మూవీస్ లో నటిస్తూ ఉంటుంది. చిరంజీవి నటించిన మాష్టర్ మూవీతో 1998 లో మూవీ ఇండస్ట్రీకి వచ్చింది. అలాంటి ప్రియా రీసెంట్ గా కూకు విత్ జాతిరత్నాలు షోకి కంటెస్టెంట్ గా వచ్చింది. ఐతే అవినాష్ ప్రియాతో చేసిన రీల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది ప్రియా. ఐతే ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందొ ఇప్పటికీ అలాగే ఉంది.
అందంలో మార్పు లేదు. సన్నగా, స్లిమ్ గా ఉంది. దాంతో నెటిజన్స్ అంతా కూడా అలా ఎలా అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈవిడకి అసలు వయసు పెరగదు.. మిమ్మల్ని చూసిన వాళ్ళు కాళిదాసులే అవుతారు మేడం..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ రీల్ లో అవినాష్ మాత్రం ప్రియా పక్కన చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నదంటూ కూడా అవినాష్ మీద సెటైర్స్ వేస్తున్నారు. ఎలా వెయిట్ లాస్ అయ్యారు మేడం..టిప్స్ చెప్పండి... హీరోయిన్ మెటీరియల్ మీరు అంటూ ప్రియని పొగిడేస్తున్నారు. కూకు విత్ జాతి రత్నాలు షోకి ప్రియా శారీలో, డ్రెస్ లో వస్తుంటే కాలేజీకి వెళ్లే అమ్మాయిలా అనిపిస్తోంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో వంకాయ బిర్యానీ చేసిన ప్రియాకు మంచి మార్క్స్ కూడా వచ్చాయి. అలాగే ఈమె బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. లేడీ డిటెక్టివ్, చిన్న కోడలు, మెరుపు కలలు, శశిరేఖా పరిణయం, కృష్ణ ముకుందా మురారి లాంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



