యాపిల్ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్ ఖాన్‌కి బాధ్యతలు
posted on Jul 9, 2025 9:18PM

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. విలియమ్స్ సీవోవో బాధ్యతలను యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబిప్ ఖాన్‌కు ఈ నెల చివర్లో అప్పగించనున్నారు.
ఈ క్రమంలో డిజైనింగ్ టీమ్ బాధ్యతలను నేరుగా టిమ్‌కుక్ స్వీకరించనున్నారు. సబిప్ ఖాన్ మాలాలు భారత్‌లో ఉన్నాయి. ఆయన యూపీ మొరాదాబాద్ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్ గ్రేడ్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికా కు వెళ్లారు. 1995లో ఆయన యాపిల్ ప్రొక్యూటర్‌మెంట్ గ్రూప్‌లో పనిచేశారు.