రాణా, దేవరకొండ విజయ్ సహా పలువురు నటులపై ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది. ఇందుకు సంబంధించి   29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద కేసులు నమోదు చేసింది. ఈడీ కేసులు నమోదు చేసిన వారిలో ప్రముఖ నటులు దగ్గుబాటి రాణా,  విజయ్ దేవరకొండ,, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ఉన్నారు.

గతంలోనే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ..వీరంతా భారీ పారితోషికాలు తీసుకుని నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని నిర్ధారణకు వచ్చింది.  అలాగే ఈ కేసులో ప్రముఖ యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, , సిరి హనుమంతు సహా  పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు  కూడా ఉన్నారు. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసి విాచరణకు పిలిచే అవకాశం ఉంది.