హె‌చ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్

 

హైదరాబాద్ క్రికెట్  అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. జగన్మోహన్ రావు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని బెదిరించారని నిర్ధారణ కావడంతో ఇవాళ  ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20 శాతం టికెట్లు  ఉచితంగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో.. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన  తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu