తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

తెలుగు రాష్ట్రాలలో గురువారం (జులై 10) ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో అలాగే కరీంనగర్ జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలో ఒక చిన్నారి సహా ఐదుగురు మరణించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి మైదుకూరు వెడుతున్న స్కార్పియో వాహనం అతి వేగంగా ముందు వెడుతున్న ఓ ట్రాక్టర్ ను ఢీ కొంది.

ఈ దుర్ఘటనలో  ఇద్దరు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్ను మూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద బైక్ పై వెడుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ సంఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు.