ఢిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం (జులై 10) తెల్లవారు జామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్క ఢిల్లీలోనే కాక హర్యానాలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.  

కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం సమయంలో తమ ఇళ్లల్లోని వస్తువులు కదిలాయనీ, కొన్ని కిందపడ్డాయనీ పలువురు ఢిల్లీ వాసులు సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు జత చేశారు.