English | Telugu
బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాకే బర్త్‌డే చేసుకుంటుందట!
Updated : Mar 25, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ రోజు రోజుకీ రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇందులో బింగు మాధవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్, పిల్ల జమీందార్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బిందు మాధవి ఆ తరువాత తెలుగు సినిమాలని పక్కన పెట్టి తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లిపోయింది. ఇప్పడు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీతో తెలుగులో మళ్లీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. హౌస్ లో వున్న కంటెస్టెంట్ లందరిలోనూ బిందు మాధవ్ చాలా మెచ్యూర్డ్ గా గేమ్ ఆడుతూ ఆకట్టుకుంటోంది.
ఇతరుల జోలికి వెళ్లడం లేదు.. అలాగని తన జోలికి వచ్చినవారిని వదలడం లేదు. ఏకి పారేసి పులి పిల్ల అన్న పేరు తెచ్చుకుంది. హౌస్ లో తనని అఖిల్, అరియానా, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, తేజస్విల బ్యాచ్ టార్గెట్ చేసినా తను మాత్రం చాలా కూల్ గా వారికే ముచ్చెమటలు పట్టిస్తూ కౌంటర్ లు ఇచ్చేస్తోంది. బిందు దెబ్బతో ఒక్కో కంటెస్టెంట్ నోరు మూసుకుంటున్నారు. దీంతో తక్కువ సమయంలోనే బిందుమాధవి టైటిల్ ఫేవరేట్ అనే పేరు తెచ్చేసుకుంది.
ఇప్పుడు తన కన్ను కప్పుపై పడింది. తోటి కంటెస్టెంట్ లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిందు మాధవి టైటిల్ టార్గెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఫోకస్డ్ గా గేమ్ ఆడుతూ అందరికి షాకులమీద షాకులిస్తోంది. జూన్ 14 బిందు పుట్టిన రోజు. బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కొట్టి బయటకు వచ్చాకే పుట్టినరోజు వేడుకలు చేసుకుంటానని చెబుతోంది. దీంతో చాలామంది బిందు మాధవినే ఈ సారి టైటిల్ విన్నర్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు.