English | Telugu
అర్ధరాత్రి ఆర్య ఇంట్లో రాగసుధ.. ఏం జరగబోతోంది?
Updated : Mar 17, 2022
బుల్లితెర వీక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటూ మంచి ఆదరణ పొందులోంది. రేటింగ్ పరంగానూ ముందు వరుసలో నిలుస్తూ అలరిస్తోంది. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్, వర్ష విహెచ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో విశ్వమోహన్, రామ్ జగన్, బెంగళూరు పద్మ, అనుషా సంతోష్, జ్యోతిరెడ్డి, జయలలిత నటించారు.
థ్రిల్లర్ జోనర్ లో సాగుతున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతూ ఉత్కంఠను కలిగిస్తోంది. రాగసుధని హత్య చేయించాలని ఆర్యవర్థన్, జెండే ప్లాన్ చేస్తుంటారు. కానీ రాగసుధ తప్పించుకు తిరుగుతూ వుంటుంది. అనుతో అర్జంటుగా మాట్లాడాలని రాగసుధ.. ఆర్య వర్థన్ ఇంటికి వచ్చేస్తుంది. సెల్లార్ లో వున్న కార్ పార్కింగ్ ప్లేస్ లో అను కోసం ఎదురుచూస్తూ వుంటుంది. అను - ఆర్య సరదాగా మాట్లాడుకుంటూ పడుకోబోతుంటారు. ఇంతలో అనుకు రాగసుధ ఫోన్ చేస్తుంది. అను షాక్ అవుతుంది. ఈ టైమ్ లో ఫోన్ ఏంటీ? అని. ఫోన్ ఎత్తగానే అర్జంటుగా మాట్లాడాలంటుంది. ఇప్పడు కుదరదు అంటుంది అను. నేను మీ ఇంటి ఆవరణలోనే వున్నానని చెప్పడంతో అను షాకవుతుంది.
Also Read:అభిమన్యు, మాళవిక ప్రతీకారం తీర్చుకుంటారా?
వెంటనే అమ్మ ఫోన్ చేసిందంటూ ఆర్యని నమ్మిస్తూ హాల్ లోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి నేరుగా సెల్లార్ లోకి వెళుతుంది. ఈ టైమ్ లో ఇక్కడికి వచ్చావేంటీ అక్కా అని చిరాకు పడుతుంది. అర్జెంటుగా మాట్లాడాలి అను అంటుంది రాగసుధ.. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో అను అత్తయ్య అటు వైపుగా వస్తుంది. అతి గమనించిన అను రాగసుధని కార్ పక్కకు పంపించేసి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా కవరింగ్ ఇస్తుంది.. తను వెళ్లిపోగానే మళ్లీ ఇద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది. ఇంతలో ఆర్య అనుని వెతుక్కుంటూ కిందకి వస్తాడు.
తల్లిని అడగడంతో తను సెల్లార్ లో ఫోన్ మాట్లాడుతుందని చెబుతుంది. ఆర్య అక్కడికే వస్తాడు. కట్ చేస్తే .. అను మళ్లీ రాగసుధని తప్పిస్తుంది. ఆర్య ఆలస్యమైంది పదా అనడంతో ఇద్దరు కలిసి సెల్లార్ లో వున్న లిఫ్ట్ లో పైకి వెళ్లి పోతారు. ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాలని వెళుతున్న రాగసుధకు నీరజ్ కారులో ఎదురుపడతాడు. ఎవరు నువ్వు? ఈ టైమ్ లో ఇక్కడేంచేస్తున్నావ్ అంటూ నిలదీసి తనని ఇంట్లోకి తీసుకెళతాడు. చేసేది లేక ఇంట్లోకి వెళ్లిన రాగసుధ అర్థ్రరాత్రి ఆర్య ఇంట్లో ఏం చేసింది? అను గమనించిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.