English | Telugu
అభిమన్యు ప్లాన్ ఏంటీ?. ఏం చేయబోతున్నాడు?
Updated : Mar 17, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీనియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, మిన్ను నైనిక, ప్రఫయ్ హనుమండ్ల, ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా ప్రదర్శింపబడుతున్న ఈ సీరియల్ పెద్దలతో పాటు పిల్లలని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. పిల్లలే పుట్టరని తేల్చేసిన ఓ యువతికి, తల్లిదండ్రులు పట్టించుకోని ఓ పాపకు మధ్య పెనవేసుకున్న అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ ని దర్శకుడు తెరకెక్కించారు.
వేద అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఎమోషనల్ అవుతుంది. ఒక తల్లిపడే ఆనందం ఎలా వుంటుందో నాకు ఈ రోజు తెలిసిందమ్మా అంటూ తన తల్లితో చెబుతూ భావోద్వేగానికి లోనవుతుంది. ఈ సంభాషణని దూరంగా గమనించిన యష్ తల్లిదండ్రులు మాళిని - రత్నం సంబరపడతారు. వేదకు, ఖుషీకి ద్రోహం చేసిన దేవుడు వీళ్లని కలిపి న్యాయం చేశాడని సంతోషిస్తారు. కట్ చేస్తే యష్ తన కూతురు ఖుషీని కాన్వెంట్ లో దింపడానికి కారులో బయలుదేరతాడు. మార్గ మధ్యంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతుంది. ఇదే సమయంలో ఖుషీ.. యష్ ని ఓ మాట అడుగుతుంది. అభిమన్యు అన్న మాటలు గుర్తు చేసుకుని డాడీ అమ్మని వదిలేస్తావా? అని అడుగుతుంది.
దాంతో యష్ షాకవుతాడు. ఎందుకు నాన్నా అంటాడు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, నువ్వు, నేను, అమ్మ ముగ్గురం ఎప్పుడూ కలిసే వుండాలంటుంది. అలాగే అంటూ యష్ ప్రామిస్ చేస్తాడు. మాటల్లోనే స్కూల్ కి చేరుకుంటారు. బాయ్ చెప్పేసి యష్ .. ఖుషీని స్కూల్ లో దించేసి తిరిగి ఆఫీస్ కి పయనమవుతాడు.. అయితే అక్కడే వున్న అభిమన్యు తన వైపుకు రావడాన్ని గమనించిన ఖుషీ తండ్రి యష్ ని పిలుస్తూ కార్ వెంట పరుగెడుతుంది. అది గమనించిన యష్ కార్ ఆపేసి ఖుషీ వద్దకు వస్తాడు. ఏమైందని అడిగితే అతనొచ్చాడు అంటుంది. ఎవరని తిరిగి చూస్తే అభిమన్యు కనిపిస్తాడు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. నీకు ఊహించని షాకిస్తానంటూ అభిమన్యు ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ అభిమన్యు ప్లాన్ ఏంటీ?. ఏం చేయబోతున్నాడు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.