English | Telugu
రోజా మేకప్‌పై కెవ్వు కార్తీక్ సెటైర్లు.. ఫైర్ అయిన రోజా!
Updated : Mar 25, 2022
ఎమ్మెల్యే రోజా ఎక్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్త్ కామెడీ షోలకు మనోతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న రోజా టీవీ షోల ద్వారా అభిమానులని అలరిస్తోంది. టీమ్ లీడర్ లతో కలిసి తను కూడా సందర్భాన్ని బట్టి స్కిట్ లు చేస్తోంది, నవ్విస్తోంది, పంచ్ లు వేస్తోంది. కొన్ని సార్లు అవి వివాదానికి కూడా దారి తీస్తున్నాయి. అయినా పెద్దగా పట్టించుకోకుండా తనదైన స్టైల్లో షోలని రక్తి కట్టిస్తూ నడిపిస్తోంది.
ఇదిలా వుంటే ఆమె తనపై పంచ్ లు కూడా వేయించుకుంటూ సరదాగా నవ్వేస్తోంది. కానీ తాజా ఎపిసోడ్ లో మాత్రం కెవ్వు కార్తీక్ పై పెద్ద ఎత్తున ఫైరయిపోయింది రోజా. నాపైనే సెటైర్లు వేస్తావా? అంటూ భయపెట్టేంత పని చేసింది. కెవ్వు కార్తీక్ తన స్కిట్ లో భాగంగా శాంతి స్వరూప్ తో కలిసి కామెడీ స్కిట్ చేశాడు. ఇందులో శాంతి స్వరూప్ నవ్వుతుంటే, "నువ్వు మేకప్ తీసేస్తే రోజాలా వుంటావ్" అన్నాడు కార్తీక్. ఈ మాటలకు రోజాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే లేచి కార్తీక్ పై అరిచేసింది.
కార్తీక్ తన మేకప్ పై కామెంట్ చేయడంతో రోజా మండిపడింది. వెంటనే కార్తీక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. "ఏయ్ ఏదో నవ్వుతున్నాం కదాని, ఏది పడితే అది పంచ్ వేస్తావా?" అంటూ ఫైరయింది. ముగ్గురు జడ్జ్ లను పిలిచినప్పుడు కంటెంట్ ఎంత బాగుండాలి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతకు ముందు ఒకప్పటి హీరోయిన్ లైలా షోలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా ఏళ్ల తరువాత లైలా ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు రోజా, ఆమని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి స్టెప్పులేయడం హైలైట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.