English | Telugu
అఖిల్ - అషురెడ్డి మధ్య అసలు కథ షురూ
Updated : Mar 19, 2022
ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఇద్దరు కంటెస్టెంట్ ల మధ్య లవ్ స్టోరీని స్టార్ట్ చేయడం దాంతో షోని కొత్త మలుపులు తిప్పడం అలవాటుగా మారింది. దీని వల్ల ఇటీవల రెండు రియల్ జంటలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు కూడా. అందులో ఓ జంట ఏకంగా బ్రేకప్ కూడా చెప్పేసుకుని నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఫేక్ జంటలని సృష్టించి రియల్ జంటలని టార్చర్ చేసే ఈ సంస్కృతిపై ఇప్పటికే నెటిజన్ లు దుమ్మెత్తిపోస్తూనే వున్నారు. అయినా బిగ్ బాస్ నిర్వాహకుల్లో మాత్రం ఈ విషయంలో ఎలాంటి మార్పు రావడం లేదు.
ఇటీవల 24 గంటల స్ట్రీమింగ్ పేరుతో బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్షన్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి దాకా కంటెస్టెంట్ లని గ్రూపులుగా విడదీసి కొట్టుకుంటుంటే వినోదం చూసిన బిగ్ బాస్ ఇప్పుడు కొత్తగా లవ్ ట్రాక్ లని స్టార్ట్ చేశాడు. సీజన్ 4 లో అఖిల్ - మోనాల్ ల మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ చేయించి రచ్చ రచ్చ చేసిన బిగ్ బాస్ మళ్లీ ఓటీటీలోనూ అదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నాడు. అయితే ఇక్కడ అఖిల్ - అషురెడ్డిల మధ్య కొత్తగా లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేయడంతో ఇప్పుడు బిగ్ బాస్ పై సెటైర్లు వినిపిస్తున్నాయి.
వర్మతో అషురెడ్డి చేసిన వీడియోలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి అషు - అఖిల్ ల మధ్య లవ్ ట్రాక్ అంటే రచ్చ రచ్చే. ఇప్పడు ఓటీటీ బిగ్ బాస్ షో ఈ విచిత్ర లవ్ ట్రాక్ కి వేదికగా మారింది. గిల్లికజ్జాలతో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడిప్పుడే పాకాన పడుతూ ఒకరిపై ఒకరు రొమాంటిక్ సాంగ్ లు వేసుకునేలా మారిపోయింది. అఖిల్ కూడా పులిహోర కలపడం మొదలుపెట్టాడు. అషురెడ్డి కూడా డ్యూటీ ఎక్కేసి లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేసింది. ఇది ఏ టర్న్ తీసుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.