English | Telugu
ట్రాక్ మార్చిన డైరెక్టర్.. హిమ డాక్టర్.. శౌర్య ఆటో డ్రైవర్!
Updated : Mar 19, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. వంటలక్క, డాక్టర్ బాబుల కథగా మొదలై ఒక దశలో టాప్ టీఆర్పీ రేటింగ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సీరియల్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డులని నమోదు చేసింది. వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. సెలబ్రిటీలు సైతం దీనిపై నెట్టింట ఆరా తీశారు. అంతలా ఈ సీరియల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. దీప, డాక్టర్ బాబు కలిశాక కథ నత్తనడకన సాగడం మొదలైంది. చివరికి ఆరాధించిన ప్రేక్షకులకే విసుగు పుట్టించే స్థాయికి వెళ్లిపోయింది.
దీన్ని గమనించిన దర్శకుడు, మేకర్స్ ట్రాక్ మార్చారు. దీప - డాక్టర్ బాబు పాత్రలకు ముగింపు పలికి కొత్త తరంతో కథని గాడిలో పెట్టాలని మరో ప్రయత్నం మొదలుపెట్టారు. సౌర్యని క్షమించమని అడగాలని సౌర్య ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే అమ్మానాన్నల చావుకి కారణం నువ్వే నీతో కలిసి నేను ఉండలేను.. అంటూ సౌర్య ఇంటి నుంచి వెళ్లి పోతుంది. సౌర్య విషయంలో మీకిచ్చిన మాటని నిజం చేసేందుకు ప్రయత్నిస్తానని, తను ఎక్కడున్నా వెతికి వెనక్కు తీనుకొస్తానని డాక్టర్ బాబు, దీపల ఫొటోల ముందు నిలబడి హిమ చెబుతుంది. ఆ పాత్రలో కొత్త నటిని తీసుకొచ్చారు.
సీన్ కట్ చేస్తే.. రౌడీ శౌర్య పెరిగి పెద్దదై ఆటో డ్రైవర్ అయితే.. హిమ డాక్టర్ అవుతుంది. శౌర్యని ఎలాగైనా వెతికి వెనక్కి తీసుకువస్తానని హిమ అనుకుంటూ కార్ నడుపుతూ వుంటుంది.. శౌర్య మాత్రం హిమని ఎప్పటికీ క్షమించను అంటూ ఆటో నడుపుతూ వుంటుంది.. తన కళ్ల ముందే హిమ ఓ వ్యక్తికి యాక్సిడెంట్ చేస్తుంది. అది గమనించిన శౌర్య .. హిమపై అరుస్తుంది. `వేధించే గతాన్ని.. రక్త సంబంధం చెరిపేస్తుందా? అక్కాచెల్లెళ్ల కథతో సరికొత్తగా కార్తీక దీపం` అంటూ గురువారం ప్రోమోని విడుదల చేశారు. ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగనుందో తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్పిందే.