English | Telugu

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఊహించని ట్విస్ట్.. ఆర్జే చైతు ఔట్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడో వారం పూర్తి చేసుకుంది. మొదటి వారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీరపాక ఎలిమినేట్ కాగా.. మూడో వారం ఊహించని విధంగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ ఓటీటీలో ఆర్జే చైతు ముందు నుంచీ దూకుడుగా వ్యవహరించాడు. టాస్క్ ల్లోనూ, వాదనల్లోనూ తనదైన మార్క్ చూపించాడు. దీంతో చైతు ఎక్కువ వారాలు హౌస్ లో ఉండే అవకాశముందని భావించారంతా. కానీ అనూహ్యంగా మూడో వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ తరువాత నాగార్జునతో కలిసి వేదిక పంచుకున్న చైతు.. బిగ్ బాస్ హౌస్ లో లాంగ్ జర్నీ ఉంటుందని ఆశించానని, ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని అన్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు కాస్త బాధగా ఉంటుందని చైతు చెప్పాడు.

తెలుగు బిగ్ బాస్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఇది రెండో సారి. గతంలో బిగ్ బాస్-4 నుంచి అమ్మ రాజశేఖర్ అలాగే ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ నుంచి చైతు ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అవ్వడంతో తన కెప్టెన్ బ్యాడ్జ్ ని అనిల్ కు ఇస్తున్నట్లు తెలిపాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...