English | Telugu
బిగ్ బాస్ నాన్ స్టాప్ : స్విమ్మింగ్ పూల్ లో రికార్డింగ్ డాన్స్
Updated : Mar 19, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో 19వ రోజు మరింత పరాకాష్టకు చేసింది. ఓ విధంగా రచ్చ రచ్చగా మారింది.ఈ రోజుని నీ కన్ను నీలి సముద్రం అంటూ సాగే హుషారైన పాటతో ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులంతా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి డాన్స్ చేయాల్సి వుంటుందిని చెప్పారు. సాంగ్ కంప్లీట్ అయ్యే వరకు డాన్స్ చేస్తూనే వుండాలట. చివర్లో ఇంటి సభ్యులంతా కలిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ చేయాలని బిగ్ బాస్ ఆదేశం. దీంతో ఒక్కొక్కరుగా స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ లు చేశారు. ఈ క్రమంలో హౌస్ లో వున్న భామలంతా తమ బోల్డ్ అవతార్ ని రంగంలోకి దింపేశారు.
ఓ రేంజ్ లో స్విమ్మింగ్ పూల్ అంతా అందాలు పరిచేసి దడిసిన పరువాలతో హల్ చల్ చేయడం రచ్చ రచ్చగా మారింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనేసరికి హౌస్ లో వున్న హాట్ లేడీలంతా హాఫ్ హాఫ్ డ్రెస్సుల్లోకి మారిపోయి కావాల్సినంత వినోదాన్ని, కనువిందుని కలిగించారు. ఈ టాస్క్ ని ఎక్కువగా వినియోగించుకుని అందాల విందుకు తెరలేపింది మాత్రం ఇద్దరే. సినిమాలు లేకపోవడంతో మళ్లీ ఎలాగైనా ట్రాక్ లోకి రావాలని చూస్తున్న తేజస్వీ ఈ టాస్క్ ని తనకు అనుకూలంగా మార్చుకుని అందాల విందు చేసే ప్రయత్నం చేసింది.
హమీద కూడా ఈ అవకాశం పోతే మళ్లీ రాదనుకుందో ఏమో అనేట్టుగా స్విమ్మింగ్ పూల్ టాస్క్ ని ఓ రేంజ్ లో వాడేసుకుని హాట్ షోకి దిగిపోయింది. ఈ ఇద్దరు కలిసి నానా హంగామా చేశారు. ఇక అజయ్ షర్ట్ విప్పేసి తన ఫోకస్ ని మొత్తం తేజస్విపైనే పెట్టేసి స్విమ్మింగ్ పూల్ లో తనతో ఓ ఆట ఆడుకున్నాడు. తేజస్విని స్విమ్మింగ్ పూల్ లో ఎత్తుకుని మరీ రొమాన్స్ ని పండించాడు. ఆ తరువాత ఈ ఇద్దరిని బిందు మాధవి అనుసరించి తను చేయాల్సిన రచ్చ తను చేసేసింది. ఆఖర్లో అంతా కలిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి నానా రచ్చ చేశారు. ఈ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్ లో హీటెక్కిపోయింది.