English | Telugu
కొత్త కుట్రకు తెరలేపిన అభిమన్యు
Updated : Mar 25, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్ తదితరులు నటించారు. పెళ్లి జరిగినా వేద - యష్ టామ్ అండ్ జెర్రీ లాగే ప్రతీ విషయానికి గొడవపడుతుంటారు.
వేద స్టెతస్కోప్ మర్చిపోయిందని గమనించిన యష్ తనకు ఇచ్చేయాలని హడావిడిగా హాస్పిటల్ కి వచ్చేస్తాడు. అయితే వేద మాత్రం ఇది ఇవ్వాలన్న వంకతో నా దగ్గర మార్కులు కొట్టేయాలని తీసుకొచ్చారంటుంది. దీంతో ఎప్పటి లాగే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది. నీకంత సీన్ లేదని డైరెక్ట్ గానే చెప్పేస్తాడు యశోధర్. ఆ తరువాత వేద గోల మరీ ఎక్కువైపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనతో పెట్టుకుంటే ఇంతే మరి అని వేద నవ్వేస్తుంది.
Also Read:ఈ రోజు నుంచి `కార్తీకదీపం` కొత్త కథ షురూ
కట్ చేస్తే.. యశోధర్ కు అతని స్నేహితుడు ఫోన్ చేసి మ్యారేజ్ యానివర్సరీ వుందని, పార్టీ ఇస్తున్నానని, ఖచ్చితంగా రావాలంటాడు. ఇదే పార్టీకి మాళవికని, అభిమన్యుని ఆహ్వానిస్తాడు. ఇక ఈ పార్టీ విషయం తెలిసి యష్ తల్లి మాలిని ... వేదాని కూడా పార్టీకి తనతో తీసుకెళ్లమంటుంది. అది కుదరదని అంటాడు యష్. ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అంటుంది మాలిని. కట్ చేస్తే వేద, యష్ కలిసి పార్టీకి వెళతారు. అక్కడ అభిమన్యు ఎంట్రీ ఇస్తాడు. తన ఖుషీని తనకు కాకుండా చేశావని, ఖుషీ తన రక్తం పంచుకుపుట్టిన పాప అని కొత్త డ్రామా మొదలుపెడతాడు అభిమన్యు. ఒక్కసారిగా షాక్ కు గురైన యష్ ఆ మాటలకు ఏం చేశాడు? ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.