English | Telugu
యష్ - వేద ఫస్ట్ నైట్ లో నడుము గోల
Updated : Mar 19, 2022
బుల్లితెరపై ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సాగుతున్న ఈ సీరియల్ రోజు రోజుకీ సరికొత్త మలుపులు తిరుగుతూ పాపులర్ సీరియల్ ల జాబితాలో చేరిపోయింది. ఓ పాప చుట్టూ సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సీరియల్ ని రూపొందించారు. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించగా బెంగళూరు పద్మ, మిన్ను నైనిక, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమాండ్ల, ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు.
శుక్రవారం ఎపిసోడ్ ఎలా ఉందో ఒకసారి లుక్కేద్దాం. వేద - యష్ లకు పెళ్లి జరగడంతో ఇరు కుటుంబాల వాళ్లు వారికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. వైట్ అంట్ వైట్ సారీలో కుందనపు బొమ్మలా ముస్తాబైన వేద పాల గ్లాస్ తో గదిలోకి ఎంటరవుతుంది. పూలతో డెకరేట్ చేసిన ఫస్ట్ నైట్ బెడ్ పై కూర్చుని యష్ ఆలోచిస్తూ వుంటాడు. బెడ్ దాకా పాల గ్లాస్ పట్టుకుని వచ్చిన వేద యష్ ని గమనించి పక్కన పాల గ్లాస్ పెట్టేసి పక్కన కూర్చుంటుంది.
వెంటనే వేద లెఫ్ట్ హ్యాండ్ ని చేతుల్లోకి తీసుకున్న యష్ `నువ్వు నాకు చేసిన సహాయానికి థాంక్స్ అనే పదం చాలా చిన్నది' అంటాడు. 'ఈ రోజు నా కూతురు నాకు దక్కిందంటే దానికి ప్రధాన కారణం నువ్వే' అంటాడు. దీనికి వేద హ్యాపీగా ఫీలవుతుంది. గతంలో చూసిన యష్ కి ఇప్పడు కనిపిస్తున్నయష్ కి చాలా తేడా వుందని చెబుతుంది. అయితే థాంక్స్ అనే పేరుతో చేయి పట్టుకుని టెమ్ట్ చేయాలని చూస్తున్నావని వేద యష్ తో గొడవపడుతుంది. ఇద్దరి మధ్య మళ్లీ చిన్నపాటి ఈగో గొడవ జరుగుతుంది.
ఇదే క్రమంలో ఇద్దరు దూరం అంటే దూరంగా అంటూ దూరంగా నిలబడతారు. అప్పుడే ఫ్యాన్ గాలికి వేద శారీ గాల్లో తేలుతుంది. ఆ సమయంలో వేద నడుముని చూసేస్తాడు యష్.. ఇక లొల్లి షురూ.. చిట్టి నడుముని చూసేశావని, సారీ చెప్పేయాలని పట్టుబడుతుంది వేద.. ఆ తరువాత ఏం జరిగింది?