English | Telugu
ఎంట్రీలోనే రాగసుధని జెండే పట్టేశాడా?
Updated : Mar 19, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని నెలలుగా జీ తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ విజయవంతంగా సాగుతోంది. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా మర్డర్ మిస్టరీ ఫ్యామిలీ థ్రిల్లర్ గా సాగుతున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా ఆసక్తికరమైన మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. వెంకట్ శ్రీరామ్ , వర్ష హెచ్ కె ప్రధాన పాత్రల్లో నటించారు. జయలలిత, బెంగళూరు పద్మ, విశ్వమోహన్ , రామ్ జగన్, అనూషా సంతోష్, జ్యోతిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.
అనుని కలవాలని ఆర్యవర్థన్ ఇంటికి చేరిన రాగసుధ .. నీరజ్ ఎంట్రీతో అడ్డంగా బుక్కవుతుంది. అర్థ్రరాత్రి మాన్సీ కారణంగా ఆర్య వర్థన్ ఇంటి నుంచి క్షేమంగా బయటపడిన రాగసుధని ఎలాగొ అలా అను ఇంటికి క్షే మంగా పంపించేస్తుంది. రాగసుధ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అను తల్లి పద్దు రుస రుస లాడుతూ రాగసుధపై ఆగ్రహంతో ఊగిపోతూ వుంటుంది. మొత్తానికి రాగసుధ ఇంటికి చేరడంతో రాత్రి ఎక్కడికి వెళ్లవని నిలదీస్తుంది. కొంచెం కూడా బాధ్యత భయం లేదని రాగసుధపై అరుస్తుంది. అను కారణంగానే తాను రాలేదని, తన ఇంటి వద్దే వున్నానని చెబుతుంది రాగసుధ.
అనుమానంగానే సపోర్ట్ చేస్తూ సరే అంటాడు సుబ్బు. ఆ తరువాత పద్దు కూడా శాంతిస్తుంది. కట్ చేస్తే .. ఆర్య, నీరజ్, అను కలిసి మాన్సీని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని రెడీ అవుతుంటారు. ఈ క్రమంలో తనన రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కొట్టింది అనునే అని కనిపెడుతుంది మాన్సి. అది నిజమో కాదో క్లారిఫై చేసుకోవాలని అనుని మళ్లీ కొట్టమంటుంది. అమాయకంగా వద్దు వద్దు మామ్ అంటూనే మాన్సీ చెంప చెల్లుమనిపించి మరోసారి చుక్కులు చూపిస్తుంది అను. దీంతో అనునే తనని కొట్టిందని మాన్సీకి క్లారిటీ వస్తుంది. అయినా తనని ఏమీ అనలేని పరిస్థితి. కట్ చేస్తే అను, ఆర్య ఆఫీస్ కి వెళతారు. అక్కడ మీరాని పిలిచి ఈ రోజు ప్రోగ్రామ్స్ చెప్పమంటాడు.
వన్ బై వన్ చెప్పేస్తుంటే.. అను మీ ఫ్రెండ్ ఎవరో జాబ్ కోసం వస్తుందన్నావ్ అని అడుగుతాడు.. అను బిత్తరపోయి లేదు సార్ తను రెండు రోజుల తరువాతే వస్తానంది అని చెబుతుంది. ఇంతలో ఎఫ్ ఎమ్ వచ్చి అను మేడమ్ ఫ్రెండ్ అంట వచ్చారు అని చెబుతాడు. అను మళ్లీ షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి తనని లోపలికి తీసుకురాబోతుంటుంది. అంతలో అటుగా వస్తున్న జెండే రాగసుధ ముసుగు తీసి ముఖం చూపించిన తరువాతే లోపలికి ఎంట్రీ అంటాడు.. రాగసుధ ముఖాన్ని జెండేకి చూపిస్తుందా? .. ఈ ఉపద్రవం నుంచి రాగసుధని అను ఎలా తప్పించింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.