English | Telugu

Karthika Deepam2: కన్నతండ్రి చెంప పగులగొట్టిన కూతురు...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'( Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-124 లో.. దీప, శౌర్యల దగ్గరికి కార్తీక్ వస్తాడు. బూచోడు ఇక రాడు.. నువ్వు అమ్మ చెప్పినట్లు వినాలి.. ఎక్కడికి వెళ్ళకూడదని కార్తీక్ చెప్తాడు. ఇలా అంటున్నావంటే నువ్వు మళ్ళీ రావా అని శౌర్య అనగానే.. కార్తీక్, దీప ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ఇదంతా చాటుగా జ్యోత్స్న, పారిజాతం చూస్తారు. ఒక తల్లి, తండ్రి, పిల్ల సినిమా చూపిస్తున్నారని పారిజాతం అనగానే.. నేను వాళ్ళకి సినిమా చూపిస్తానని వాళ్ళ ఫోటోని తీస్తుంది జ్యోత్స్న.

మరోవైపు శోభ ఉండే ఇంటికి నరసింహా వెళ్ళి.. అమ్మ అమ్మ అంటూ ఆవేశంగా అరుస్తాడు. ఇక శోభ వచ్చి.. నువ్వు, మీ అమ్మ బాగానే నాటకం ఆడి నన్ను మోసం చేశారు కదా అని అంటుంది‌. మీ అమ్మ వచ్చేలోపు తన బట్టలు అన్నీ సర్దేసి బయట పడేయమని శోభ అంటుంది. అంత అవసరం లేదు.. నేనే వెళ్ళిపోతానంటూ అనసూయ వస్తుంది. నిజం చెప్పొద్దని చేతులు పట్టుకొని బతిమాలాను కదా అయినా కొడుకు కోసం ఆ మాత్రం కూడా చేయలేవా.. ఇప్పుడు దీప కేసు పెడితే నేను జైలుకి వెళ్తానని నరసింహా అంటాడు. నువ్వు జైలుకెళ్తే నష్టపోయేది నేను.. ఈవిడకేం బాగానే ఉంటుందని శోభ అంటుంది. ఇక శోభ, అనసూయ కాసేపు ఒకరికొకరు తిట్టుకుంటారు. నువ్వు నిజం చెప్పకపోయి ఉంటే నా కూతురు నా దగ్గరే ఉండేది కదా అని నరసింహా అనగానే.. ఏంట్రా నీ కూతురు కన్నప్పుడే వదిలేసి పోయావ్ ఏ రోజు అయినా దానికి కడుపు నిండా అన్నం పెట్టావా అప్యాయంగా దగ్గరకు తీసుకున్నావా దాని పేరు కూడా నేను చెప్తే నీకు తెలిసింది. దీప బిడ్డని ప్రాణంగా చూసుకుంది. బిడ్డ కోసం అయినా వస్తావని ఎదురు చూసిందిరా. దాన్ని నువ్వు దారుణంగా మోసం చేశావ్. ముగ్గురు ఆడవాళ్ల నమ్మకంతో ఆడుకున్నావ్ ఇంకా నీ కూతురి జీవితంతో కూడా ఆడుకోవాలి అనుకున్నావా దీప పాపని అల్లారు ముద్దుగా పెంచిందిరా ఆ చంటిది దీని చేతిలో పడితే బోరు బావిలో పడినట్టే. దీప మీద నీకు పగ ఉందని నాకు తెలుసు నువ్వు దాన్ని బతకనిస్తావా. ఇవన్నీ ఆలోచించి చేసిన పాపం కడిగేసుకున్నాను. నేను నా దారి చూసుకుంటాను. నేను ఎవరి పంచ తొక్కను నా దారి నేను చూసుకుంటానని అనసూయ చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక నరసింహా, ‌శోభ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.

పారిజాతం, జ్యోత్స్న రెస్టారెంట్ కి వెళ్ళగా అదే రెస్టారెంట్ కి దాస్ కూడా వస్తాడు. బేరర్ వాటర్ తీసుకెళ్తుండటం అతను అక్కడికి వచ్చి ఆయన్ను ఢీ కొట్టడంతో వాటర్ జ్యోత్స్న మీద కొడుతుంది. దాంతో జ్యోత్స్న వెయిటర్‌తో పాటు తన కన్నతండ్రిని కొడుతుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. అలాంటి వాళ్లని చెప్పుతో కొట్టాలని జ్యోత్స్న అంటే పారిజాతం జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. నువ్వు కొట్టింది ఎవర్నో తెలుసా అని పారిజాతం అనగానే.. ఎవర్నీ అని జ్యోత్స్న అంటుంది. నీ కన్నతండ్రి అని చెప్పలేను.‌. నా కొడుకు అని చెప్పలేనని పారిజాతం మనసులో అనుకొని మౌనంగా ఉంటుంది. నీకు ఎందుకు ఇంత కోపం వస్తుందో నాకు తెలీడం లేదు గ్రానీ అని జ్యోత్స్న అంటుంది.

కాసేపటికి ఇద్దరు ఇంటికి వస్తారు. జ్యోత్స్న ఇంటికి వచ్చి దీప ఉండే ఇంటికి తాళం వేస్తుంది. విడాకులు తీసుకున్న మనిషి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. అప్పుడే సుమిత్ర వచ్చి.. ఎందుకు తాళం వేశావని అడుగుతుంది. దీప ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని అనగానే.. అది నువ్వు చెప్పకూడదని సుమిత్ర అంటుంది. మరి ఎవరు బావ చెప్తాడా అని జ్యోత్స్న అని.. కార్తీక్, దీప పాప కలిసున్న ఫొటోని చూపిస్తుంది. అది చూసిన సుమిత్ర.. వాళ్లని రెస్టారెంట్ కి తనే పంపానని అంటుంది. దీపకి ఈ రేంజ్ ఎంక్‌రేజ్ మెంట్ ఉంటే.. ఇక నాకు పెళ్లి ఎందుకు అవుతుందని జ్యోత్స్న అంటుంది. నిన్ను చూస్తుంటే దీప బాగా కష్టపడింది.. రెండు రోజులు అలా సరదాగా రండి అని దీప, బావలని తీసుకెళ్లమనేలా ఉన్నావని జ్యోత్స్న అనగానే.. సుమిత్ర కోపంతో కొట్టబోతూ దీపని చూసి ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.