English | Telugu
Karthika Deepam2 : కథలోకి దాస్.. కీలకంగా మారిన కార్తీక దీపం ఎపిసోడ్!
Updated : Aug 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123 లో.... కోర్టులో అమ్మతోనే ఉంటానని శౌర్య చెప్పగానే.. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. శౌర్యని దీప హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఈ రోజు ఇచ్చిన తీర్పు మనసుకి నచ్చిందని జడ్జ్ అంటాడు. ఆ తర్వాత అనసూయ వెళ్లిపోతుంటే దీప వెళ్లి.. తన కాళ్ళపై పడి థాంక్స్ అని చెప్తుంది. నాకు తల్లి ఉంటే కూడా ఇలా సాయం చేసేది కాదేమోనని దీప అంటుంది. మీ కొడుకు కోడలు ఇంట్లోకి రానివ్వరు.. నా దగ్గరకి రండి ఊర్లో ఉన్నట్టే ఇక్కడే ఉందామని దీప అనగానే.. లేదు గాని కూతురుని తీసుకొని వెళ్ళమని చెప్పి అనసూయ వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత దీప లాయర్ జ్యోతికి థాంక్స్ చెప్తుంది. మీ అత్త గారి వాళ్ళే నువ్వు ఈ కేసు గెలిచావని దీపతో జ్యోతి అంటుంది. మరొకవైపు పారిజాతం కొడుకు దాస్.. ఆటో దిగి ఒక దగ్గరకి వస్తాడు. ఆ ప్లేస్ దగ్గర ఆగి ఆ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడే జరిగినట్లు ఉంది. అది ఇద్దరు తలరాతలు మార్చేసిన రాత్రి.. ఒక పనిమనిషి కూతురు యజమాని అయింది. ఒక యజమాని కూతురు అనాధ అయింది. ఆ అనాధ ఒక అభాగ్యుడి చేతిలో పడింది. వాడు ఎవడో తెలియదు ఎక్కడుంటాడో తెలియదు. ఆ బిడ్డ ఏమైంది. నన్ను ఆ శివన్నారాయణ ఇంట్లో నుండి గెంటేసినా, వాడి మనవరాలిని నా తల్లి అనాధని చేసినా.. నా కూతురుని ఆ ఇంటికి వారసురాలిని చేసింది. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో.. ఆ వారసురాలు ఎలా ఉందో.. అందరికి దూరం వెళ్లి మళ్ళీ రావాల్సి వచ్చింది. కాలం మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చిందోనని దాస్ అనుకుంటాడు. నా కూతురు ఎలా ఉందో చూడాలని దాస్ అనుకుంటాడు. ఆ తర్వాత టీ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే.. డబ్బులు అని టీ షాప్ అతను అడుగుతాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ వచ్చి తాగుతాను. ఈ ప్లేస్ కి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక పుట్టుక, ఒక చావు అని చెప్పి వెళ్ళిపోతాడు.
మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం లు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి దీప, కార్తీక్, శౌర్యలు వస్తారు. వాళ్ళని చూసి జ్యోత్స్న కోప్పడుతుంది. దీప బాధపడుతుంటే ఇక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా.. ఎందుకు బాధ.. మీ శ్రీయోభిలాషిగా నేను ఎప్పుడు ఉంటానని దీపతో కార్తిక్ అంటాడు. అలాగే బూచోడు ఎప్పుడు రాడు హ్యాపీగా ఉండు అంటు శౌర్యతో కార్తిక్ అంటాడు. తరువాయి భాగంలో దాస్ ని జ్యోత్స్న కొడుతుంది. పారిజాతం షాక్ అవుతుంది. మరొకవైపు దీప ఇంటికి జ్యోత్స్న తాళం వేస్తుంది. దీప గురించి జ్యోత్స్న తప్పుగా జ్యోత్స్న మాట్లాడుతంటే తనని సుమిత్ర కొట్టబోతుంది. అప్పుడే దీప వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.