English | Telugu

శేఖర్ మాష్టర్ ని చుట్టుముట్టిన అమ్మాయిలు...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది సెమి ఫినాలే వీక్ అని చెప్తూ అందరికీ పవర్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఈ ఎపిసోడ్ కి అనసూయ వచ్చిన గెటప్ చూస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. అంటే టూటన్ఖామున్ మాస్క్ లాంటి కాస్ట్యూమ్ తో వచ్చింది. ఇక ఇందులో అబ్బాయిలకు అమ్మాయిలకు హ్యాండ్ టు హ్యాండ్ రెజ్లింగ్ పెట్టింది. దాంతో కిరణ్ ఒక అమ్మాయి ఇలా రెజ్లింగ్ చేస్తున్నప్పుడు బ్రహ్మముడి కావ్య వచ్చి కిరణ్ ని కి ముద్దులిచ్చి అతని మైండ్ ని డైవర్ట్ చేసి ఆ గేమ్ ఓడిపోయేలా చేసింది. తర్వాత శేఖర్ మాస్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది "మిమ్మల్ని రెండింతలు ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేయొచ్చు" అనేసరికి నన్నెవరూ ఏమీ చేయలేరు అని చెప్పారు శేఖర్ మాష్టర్. సరే రండి అని అనసూయకి శేఖర్ మాష్టర్ కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ రెజ్లింగ్ పోటీ పెట్టారు. ఇక శేఖర్ మాష్టర్ ని చుట్టుముట్టారు అమ్మాయిలంతా..

శేఖర్ మాష్టర్ కి చక్కిలిగింతలు పెట్టి గేమ్ నుంచి పక్కకు తప్పుకునేలా చేసారు. తర్వాత సాంగ్స్ కి డాన్స్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక లాస్ట్ లో ఈ రెండు టీమ్స్ మధ్య గొడవయింది. విష్ణుప్రియ త్వరగా ఆ గేమ్ అర్ధం చేసుకుని ఆడుతుండేసరికి అసలు అమ్మాయిలూ ఇలా ఇంత త్వరగా ఎలా అర్ధం చేసుకుంటున్నారని శ్రీకర్ గట్టిగా అడిగేసరికి అనసూయ ఫైర్ అయ్యింది. "అమ్మాయిలు బాగా ఆడుతున్నారంటే నమ్మశక్యంగా ఎందుకు ఉండదు" అని అడిగింది. దాంతో శ్రీకర్, అనసూయ, విష్ణుప్రియ మధ్య గట్టిగానే ఫైటింగ్ అయ్యింది.