English | Telugu

బిగ్ బాస్ లోకి రిషి, వసుధార.. షాక్ లో ఫ్యాన్స్ !

గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తూ ఈ సీరియల్‌కి మరికొన్ని రోజుల్లో శుభం కార్డ్ వేయనున్నారు. నిన్నటితో ‘గుప్పెడంత మనసు(Guppedantha Manasu)’ సీరియల్‌ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నిజానికి రిషి రీఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్‌కి పూర్వ వైభవం వచ్చింది. రిషి, వసుధారలు ఒకటి కావడంతో ఈ సీరియల్‌ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మను తండ్రి మహేంద్రే అని తెలియడమే ఆలస్యం.. ఇక గుప్పెడంత మనసు సీరియల్‌కి ముగింపు పలకడమే అన్నట్టుగానే కథ ఆ వైపుగా సాగుతోంది.

ఇప్పుడు బిగ్ బాస్ వస్తుండటంతో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ని హడావిడిగా క్లోజ్ చేయాల్సి వచ్చిందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడలోనూ బిగ్ బాస్ 11 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ కన్నడ బిగ్ బాస్‌కి రిషి అలియాస్ ముఖేష్ గౌడ(Mukesh Gowda) కంటెస్టెంట్‌గా వెళ్తుండటంతో 'గుప్పెడంత మనసు’ ని హడావిడిగా క్లోజ్ చేశారని తెలుస్తోంది. రిషి, వసుధారలకి ఆన్ స్క్రీన్ ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ల ప్లేస్‌లో కొత్త వాళ్లని తీసుకుని వస్తే కథలో సోల్ మిస్ అవుతుంది. కాబట్టి కథ ముందుకు వెళ్లాలంటే రిషి, వసుధారలు ఉండాల్సిందే. వాళ్లిద్దరిలో ఎవరు లేకపోయిన గుప్పెడంత మనసు సీరియల్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ తరుణంలో రిషి అలియాస్ ముఖేష్ గౌడ(Mukesh Gowda) కి కన్నడ బిగ్ బాస్‌లో ఆఫర్ రావడంతో అతను బిగ్ బాస్‌కి వెళ్లడం కన్ఫమ్ అయ్యిందట. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుండటంతో వసుధార అలియాస్ రక్ష గౌడ(Rakha Gowda) తెలుగు బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా రాబోతుందట.

ఒకవేళ రక్ష గౌడ తెలుగు బిస్ బాస్ హౌస్ లోకి వస్తే గుప్పెడంత మనసు ఫ్యాన్స్ అంతా తనకే ఓట్లు వేస్తారు‌. అయితే ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్ సెలెక్ట్ కావడం వల్లే ఈ సీరియల్ ని ఎండ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం గుప్పెడంత మనసు ఎండ్ అవుతుందని అభిమానులు డిప్రెషన్ లో ఉన్నారు.