English | Telugu
తమ్ముళ్లను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ
Updated : Aug 14, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ రాఖీ స్పెషల్ ఎపిసోడ్ గా మల్లెమాల తీసుకొచ్చింది. ఈ షోకి బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆటో రాంప్రసాద్ రాగానే "ఏంటి అందరూ సైలెంట్ గా కూర్చున్నారు" అనేసరికి "ఎం చెప్తావయ్యా రాంప్రసాద్ భయం" అన్నాడు బాలాదిత్య. "మావోయిస్టులు ఏమన్నా దాడి చేస్తున్నారా" అన్నాడు. "అంతకన్నా ప్రమాదం..సిస్టర్స్ అయ్యా" అన్నాడు బాలాదిత్య. దానికి లేడీస్ నుంచి సత్యశ్రీ వచ్చి మనం ఈరోజు అక్కాచెల్లెళ్లలా బిహేవ్ చేయకూడదు స్టువర్ట్ పురం దొంగల్లా బిహేవ్ చేయాలి" అంటూ వాళ్ళ వాళ్ళ అన్నాతమ్ముళ్లను రాఖీ కట్టి ఏమేం అడగాలో గొంతెమ్మ కోరికలన్నీ చెప్పుకొచ్చారు లేడీస్. ఇక ఈ షోకి నివేత థామస్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే లేడీస్ అంతా అచ్చమైన పదహారణాల ఆడపిల్లల్లా చీరలు కట్టి పూలు పెట్టుకుని వచ్చారు.
ఇక రష్మీ తనకు ఉన్న ఇద్దరు తమ్ముళ్ళని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక స్టేజి మీద అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల రాకీలు కట్టుకుని రాకీ పౌర్ణమిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక అన్నలు, తమ్ముళ్లు కలిసి గోరింటాకు రుబ్బి అక్కలు, చెల్లెళ్ళ చేతికి పెట్టారు. ఇక రాఖీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కోర్ట్ సీన్ రిక్రియేషన్ ని బాలాదిత్య చేసి చూపించాడు. బాలాదిత్య చెప్పిన డైలాగ్ కి ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు తిరగకుండా ఉండవు. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎమోషనల్ టచ్ తో అందంగా ముస్తాబు చేసి తీసుకురాబోతున్నారు.