English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి నమ్మకద్రోహాన్ని సీతాకాంత్ కనిపెట్టగలడా.. రామలక్ష్మి ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -174 లో....బోర్డు మెంబర్స్ అందరు సందీప్ ని చైర్మన్ చెయ్యాలంటున్నారు.. అప్పుడే రామలక్ష్మి వచ్చి అవసరం లేదు.. ఏదో ఎవరో కావాలని నిందలు వేస్తే అది నిజమని నమ్మి ఇంత కష్టపడి.. ఈ స్థాయికి తీసుకొని వచ్చింది సీతా సర్ .. ప్రలోభాలకి భయపడి నిర్ణయం తీసుకుంటారా అని రామలక్ష్మి అంటుంది. కంపెనీ గురించి మంచి నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెంబర్ అంటాడు. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అంటూ రామలక్ష్మి నమిత మాట్లాడిన వీడియోని చూపిస్తుంది. అందులో సీతా సర్ మంచి వారు డబ్బుకి ఆశపడి నేనే అలా చేసానని ఉంటుంది.

ఇప్పటికైనా సర్ ఏ తప్పు చెయ్యలేదని నమ్ముతారా అని రామలక్ష్మి అంటుంది. మాకు సందీప్ ని చైర్మన్ చేస్తే ఉంటాం లేకపోతే మా షేర్స్ వేరే వాళ్లకు అమ్ముకుంటామని వాళ్లు అనగానే.. అయితే వెళ్ళండి కష్టంలో ఉన్నప్పుడు మీరే సాయం చేయకుండా.. ఇలా మాట్లాడితే మీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదని రామలక్ష్మి చెప్తుంది. మేమ్ లేకుండా ఈ కంపెనీని ఎలా నిలబెడుతారో మేమ్ చూస్తామని బోర్డు మెంబర్స్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. ఇంకా బోర్డు మెంబెర్స్ అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా అని అంటుంది. సందీప్ నా తమ్ముడే.. వాడు ఉంటే ఏంటి.. కంపెనీ నమ్ముకొని చాలా మంది ఉన్నారని సీతాకాంత్ అనగానే.. అందుకే సందీప్ ని వద్దని అంటున్నాను. ఏదైనా తప్పు చేస్తే పరిస్థితి ఏంటని రామలక్ష్మి అంటుంది. అవును రామలక్ష్మి చెప్పింది కూడా కరెక్ట్ అని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకి శ్రీలత వచ్చి.. ఎలాగైన సందీప్ ని చైర్మన్ ని చేస్తానని శ్రీలత అనగా.. అది జరగనివ్వనని రామలక్ష్మి అంటుంది.ఆ తర్వాత తెలిసిన వాళ్ళకి రామలక్ష్మి సీతాకాంత్ లు షేర్స్ గురించి కాల్ చేస్తుంటారు. ఎందుకు అంత త్వరగా ఇలా మారిపోయారని సీతాకాంత్ అంటాడు. మీకు ద్రోహం చెయ్యాలని చూసేవారు ఎవరో మీరు దృష్టిపెడితే కనిపెట్టగలరని రామలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంటికి వెళ్తారు. సీతాకాంత్ డల్ గా ఉండడంతో ఐస్క్రీమ్ దగ్గర అపి తింటారా అని అడుగుతుంది. వద్దని సీతాకాంత్ అనగానే తను ఒక్కతే తింటూ ఉంటుంది. మనకి టైమ్ లేదు అంటూ కంపెనీ గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. మీరు అది కాకుండా మీకు నచ్చిన విషయం గుర్తుచేసుకోండి అనగానే రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్లి చేసుకుంది గుర్తుకు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో.. మా షేర్స్ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నామని బోర్డు డైరెక్టర్స్ అంటారు. సందీప్ ని చైర్మన్ చెయ్యడానికి నేను ఒప్పుకుంటున్నానని సీతాకాంత్ సంతకాలు చేస్తుంటే.. ఆగండీ సర్ అంటు నందిని పిఏ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.