English | Telugu

ఆగిపోయిన పెళ్ళికి భాజాలెందుకు... కమెడియన్ రాఘవకి కృష్ణ భగవాన్ వార్నింగ్

నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మొదట అంతా ప్రశాంతాం సాగుతోంది కామెడీగా ఉన్నాయి స్కిట్స్ అనుకుంటున్న టైంలో ప్రోమో ఎండింగ్ కి వచ్చేసింది. ఇక నూకరాజు స్కిట్ చేస్తుండగా రాఘవ వచ్చి "ఆగిపోయిన పెళ్ళికి భాజాలెందుకు ఇక్కడి నుంచి దుకాణం తియ్యండి" అని చెప్పేసరికి "ఏంటబ్బా ఫస్ట్ లోనే వచేస్తావ్" అంటూ నూకరాజు రాఘవను తోసేసాడు. వెంటనే బులెట్ భాస్కర్ కూడా వచ్చి వేలు చూపిస్తూ వయసులో పెద్దవాళ్ళని ఊరుకుంటున్నా" అని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత జడ్జెస్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. "రాఘవ టీమ్ కి విన్ ఇస్తే ఒప్పుకోము" అన్నాడు సీరియస్ గా. "ఇది 2020 స్కిట్" అని నూకరాజును చూపిస్తూ ఖుష్భుకు చెప్పాడు భాస్కర్. రష్మీ వచ్చి అసలు స్కోర్స్ ఎంతో ముందు తెలుసుకుందాం అని అనేసరికి భాస్కర్ అడ్డుపడి "వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు అసలు మేము అడ్డపడలేదు.

రాఘవ మూడు నాలుగు సార్లు వచ్చి ఆ ప్రాపెర్టీస్ పట్టుకుపోయి ఆ ఇమ్ము గాడి మెంటల్ గా ఎంత అప్సెట్ అయ్యాడో తెలుసా" అన్నాడు. ఇక రాఘవ లేచి "క్షమాపణలు కోరుతున్నా జడ్జెస్ ఇద్దరూ వాళ్ళకే ఫుల్ మార్క్స్ ఇచ్చేయండి" అన్నాడు. ఆ మాటలకూ కృష్ణభగవాన్ కి కోపం వచ్చింది "రాఘవ గారు స్కిట్ లో ఎంటరయ్యారు..జడ్జిమెంట్ లో కూడా ఎంటరవుతారా" అంటూ క్లాస్ పీకారు. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ మాత్రం వెంటనే ఇదంతా మాకు తెలుసులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.