English | Telugu

Brahmamudi : ధాన్యలక్ష్మి మాటని కాదన్న కళ్యాణ్.. రానని తెగేసి చెప్పాడు కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-489 లో.. కవి, అప్పులని తీసుకురావడానికి రాజ్ వెళ్తాడు. మరోవైపు వాళ్ళిద్దరు రూమ్ ని నీట్ గా సర్దుకుంటారు. ఇంట్లోకి కావాల్సిన సరకులు, సామాన్లు కొనుక్కోవాలని కళ్యాణ్ అంటాడు. నేను మళ్లీ పిజ్జా డెలివరీకి వెళ్తానని అప్పు అనగానే.. వద్దు అప్పూ.. నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు.. నేను కష్టపడతాను.. మనకు రాత్రికి గది కూడా లేదు. ఇప్పుడు అది దొరికింది. కావాల్సిన వస్తువులు కూడా అలానే వస్తాయని కళ్యాణ్ అంటాడు.

కాసేపటికి అప్పు ఫ్రెండ్స్ వస్తారు. ఏం కవి సర్.. మీరన్న గెస్ట్ హౌస్ ఇదేనా.. చాలా బాగుందని ఒకడు అంటాడు. వాళ్ల చేతిల్లో కుకర్, చాప, చీపురు, ప్లేట్లు అన్నీ ఉంటాయి. మీ ఫ్రెండ్ బంటీ గాడేనని మాకు కూడా చెప్పొచ్చు కదా అని మరో ఫ్రెండ్ అంటాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే కదా మీరు వెళ్లిపోయారని ఒకతను అనగానే.. అవునురా.. రాత్రి మీరు చలిలో పడుకోవడం చూసి బాధేసిందని అప్పు అంటుంది. పోనీలే ఏదైతేనేం.. మీకు కూడా ప్రైవసీ ఉండాలి కదా అని మొదటివాడు అంటాడు. అసలు ఇవన్నీ ఏంట్రా అని అప్పు అంటుంది. మీకు కావాల్సిన సామాన్లు.. ఇది కుకర్, ఇది బకెట్, మగ్ అంటూ అన్నీ చూపిస్తూ.. ఇప్పుడు మేము ఇస్తాం.. రేపు మా పెళ్లికి మీరు తిరిగి కొనిచ్చేయండంటూ సరదాగా మాట్లాడుతుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. అంతా విని ఎమోషనల్ అవుతాడు. మీ జీతమేంటీ.. మీ ఖర్చులేంట్రా అంటు అప్పు తిడుతుంది. నిజానికి మీ శక్తికి మించి ఇవన్నీ తెచ్చారు.. మా కోసం మీరు చాలా శ్రమతీసుకున్నారని కళ్యాణ్ అంటాడు. అలా ఏం లేదు కవి సర్ అని మరో అబ్బాయి అంటాడు. కాసేపటికి వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇంటికి రమ్మని, పిన్ని ఒప్పుకుందని కళ్యాణ్ తో రాజ్ అనగానే.. నేను రానని, మీ అందరు అడిగేసరికి అలా అందని కళ్యాణ్ అంటాడు‌. ఇదంతా నీకు ఎలా తెలుసురా అని రాజ్ అంటాడు. అన్నయ్యా తను నీకు పినతల్లి మాత్రమే.. నాకు కన్నతల్లి.. మా అమ్మ గురించి నీకు తెలియదా అన్నయ్యా అయినా.. తనకు మొదటి నుంచి అప్పు అంటే ఇష్టం ఉండదు కదా అని కళ్యాణ్ అంటాడు. హూ.. అయినా ఇవన్నీ తాత్కాలికంరా, కాలమే మనుషుల్ని మారుస్తుందిరా అని రాజ్ అనగానే.. ఎంతకాలంలో మారుస్తుంది అన్నయ్యా అని కళ్యాణ్ అనగానే.. రాజ్ మౌనంగా అంటాడు.

వదినను అర్థం చేసుకోవడానికి నీకు, పెద్దమ్మకి సంవత్సరకాలం పట్టింది. అంతవరకూ వదిన కాబట్టి ఓపిక పట్టింది అన్నయ్యా.. మా అమ్మ మాట్లాడే మాటలు అప్పుకి నచ్చవు. అప్పూ ప్రవర్తన మా అమ్మకు నచ్చదు.. స్వప్నకు కూడా అలాంటి అవమానాలే జరిగాయి కదా? ఆ ఇంటికి ఇష్టం లేని కోడళ్లు వస్తే ఎలాంటి మర్యాదలు జరుగుతాయో నాకు తెలుసు అన్నయ్యా.. మేము రాము అని కళ్యాణ్ తెగేసి చెప్పేస్తాడు‌. దాంతో రాజ్ ఏం చేయలేక అక్కడి నుండి బయల్దేరి వెళ్ళిపోతాడు. మరోవైపు దుగ్గిరాల వారి ఇంట్లో అంతా అప్పు, కళ్యాణ్‌లని రాజ్ తీసుకొస్తాడని ఎదురు చూస్తుంటారు. అయితే రాజ్ ఒక్కడే రావడంతో అంతా షాక్ అవుతారు. ఎక్కడా కళ్యాణ్ అప్పు అని అంతా అడగడంతో.. రాను అన్నాడని రాజ్ అంటాడు. ఏ ఎందుకు రాను అన్నాడు? అంటుంది ధాన్యలక్ష్మి ఎమోషనల్‌గా. నువ్వు ఇద్దరిని కలిపి పిలిచావంటే నమ్మడం లేదు పిన్ని.. కేవలం కళ్యాణ్ కోసమే ఇద్దరినీ రమ్మన్నావనుకున్నాడని రాజ్ అంటాడు. అది నిజమే కదా అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.