English | Telugu
Brahmamudi: బంటీతో కావ్య చెప్పిన ప్లాన్ అదేనా.. అప్పు, కళ్యాణ్ లు ఇంటికి వస్తారా!
Updated : Aug 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -488 లో.....కళ్యాణ్ , అప్పులు గుడిలో ప్రసాదం తింటూ ఉంటారు. నన్ను నమ్ముకొని వస్తే నిన్ను ఇక్కడ కూర్చోపెట్టానని కళ్యాణ్ బాధపడతాడు. కోట్ల ఆస్తులు నాకోసం వదులుకొని వచ్చావ్.. నన్ను ప్రేమించినదుకు నీ బతుకు ఇలా అయిందని నేను కూడా బాధపడాలి కదా అని అప్పు అంటుంది. నిన్ను వదులుకోవడం కన్నా, ఆస్తులు వదులుకోవడం కష్టమేమీ కాదని కళ్యాణ్ అంటాడు. నీ కోసం నేనే ఏదో ఒకటి చెయ్యాలని అప్పు అనగానే.. ఇప్పుడు నేను నీ భర్తని.. నేనే ఆ మాట అనాలని కళ్యాణ్ అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు.
మరొక వైపు అప్పు, కళ్యాణ్ ని కావ్యకి చూపిస్తాడు బంటి. వాళ్ళు ఏమైనా భాదపడుతున్నారా అని కావ్య అడుగగా.. వాళ్ళు చూడు కుళ్ళు జోకులు వేస్తు ఎలా నవ్వుకుంటున్నారోనని బంటి అంటాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్ అని కావ్య బంటికి ఏదో చెప్తుంది. ఆ తర్వాత బంటి వాళ్ళ ముందు నుండి కావాలనే వెళ్తుంటాడు. అప్పుడు అప్పు కళ్యాణ్ లు బంటిని చూసి మాట్లాడతారు. మీరు ఇక్కడ ఉండడమేంటి నా రూమ్ కీ రండి అని బంటి అనగానే.. వాళ్లు ఒప్పుకొని బంటితో వెళ్తారు.
ఆ తర్వాత కావ్య దేవుడి దగ్గరకి వచ్చి మొక్కుకొని వెళ్తుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరకి రుద్రాణి వచ్చి.. నువ్వు ఇలా ఏడిస్తే నీ కొడుకు రాడు. ముందు వాళ్లు రావడం ఇష్టమేనని చెప్పి ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పు.. ఆ తర్వాత అప్పు వెళ్లిపోయేలా చెయ్యొచ్చు అని రుద్రాణి అనగానే.. సరేనని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు బంటి రూమ్ కి వెళ్తారు. అక్కడ ఓనర్ గొడవ చేయడంతో ఎక్కువ రెంట్ ఇస్తానని బంటి చెప్తాడు. దాంతో ఓనర్ ఒప్పుకుంటాడు.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి హాల్లోకి వచ్చి.. వాళ్ళని ఇంటికి తీసుకొని రావడం నాకు ఇష్టమేనని చెప్తుంది. ఎందుకు ఇంత సడన్ గా నిర్ణయం తీసుకున్నారని కావ్యకి డౌట్ వస్తుంది. పిన్ని ఒప్పుకుంది కదా వెళ్లి వాళ్ళని తీసుకొని వద్దాం పదా అని రాజ్ అనగానే.. నేను రాను ఇది చినత్తయ్య నిర్ణయం.. అందులో నేను కలుగజేసుకోనని కావ్య అంటుంది. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ దగ్గరకి రాజ్ వెళ్తాడు. పిన్ని మీ ఇద్దరిని ఇంటికి తీసుకొని రావడానికి ఒప్పుకుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి ఒక్కడే వెళ్తాడు. ఏంటి వాళ్లు రాలేదా అని ప్రకాష్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.