English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్తని జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వమన్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -175 లో.... సీతాకాంత్ కంపెనీ గురించి ఆలోచిస్తూ డల్ గా ఉంటే రామలక్ష్మి కార్ అపమని ఐస్క్రీమ్ తీసుకుంటుంది. మీరు జరగదు అనుకున్నది జరిగింది ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకోండి అని రామలక్ష్మి అనగానే.. రామలక్ష్మితో పెళ్లి జరిగింది గుర్తుకుచేసుకుంటాడు సీతాకాంత్. మీరు నవ్వుతున్నారంటే ఏదో మీరు అనుకున్నది జరిగినట్లు ఉంది అయితే ఇప్పుడు ఐస్క్రీమ్ తినండి అంటు సీతాకాంత్ మూడ్ ని రామలక్ష్మి డైవర్ట్ చేస్తుంది.

మరొకవైపు ఇంటికి సందీప్ రాగానే.. మీరు చైర్మన్ అయితే నాకు గోల్డ్ తీసుకోవాలంటూ సందీప్ కి చెప్తూ శ్రీవల్లి చిరాకు తెప్పిస్తుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి లేవకముందే సీతాకాంత్ లేచి.. ఆఫీస్ కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాడని రామలక్ష్మి కిందకి వచ్చి పెద్దాయనని అడుగుతుంది. మన కంపెనీ లో షేర్స్ పెట్టండి అని అడగడానికి వెళ్ళాడని చెప్తాడు. ఈ రోజే కదా షేర్స్ ని వేరే కంపెనీకీ అమ్ముతాం అన్నారు.. నేను వెంటనే ఆఫీస్ కీ వెళ్ళాలని రామలక్ష్మి రెడీ అయి ఆఫీస్ కి బయలుదేర్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఆలోచిస్తూ నందిని వస్తున్నా కార్ కి ఎదురు పడుతుంది. దాంతో కోపంగా నందిని కార్ దిగుతుంది. తీరా చుస్తే రామలక్ష్మి. ఏంటి అంతలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నారు.. పదండి నేను డ్రాప్ చేస్తానని నందిని అనగానే రామలక్ష్మి తనతో వెళ్తుంది. దార్లో ప్రస్తుతం ఆఫీస్ లో ఉన్న సమస్య గురించి నందినికి చెప్తుంది.

ఆ తర్వాత రామలక్ష్మి కార్ దిగి తన కార్ లో వెళ్ళిపోతుంది. మీటింగ్ జరుగుతుంటుంది. ఇక మా షేర్స్ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నామని బోర్డు డైరెక్టర్స్ అంటారు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. మీ ఇష్టం.. ఇంత రిక్వెస్ట్ చేస్తున్న వినకపోతే ఏం చేస్తామని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే కంపెనీ ఎంప్లాయిస్ నష్టపోతారని సీతాకాంత్ అంటాడు. అయితే సందీప్ ని చైర్మన్ ని చెయ్యండి అంటారు. అందుకు నాకు ఇష్టమేనని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ సంతకాలు చేయబోతుంటే.. అప్పుడే నందిని పిఏ వచ్చి ఆపండి సర్.. మీపై మాకు చాలా నమ్మకం ఉంది. మీ కంపెనీలో షేర్స్ మేమ్ కొంటాం.. మీతో కలిసి వ్యాపారం చెయ్యడం మాకు ఇష్టమేనని అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో సీతాకాంత్ బర్త్ డే ని రామలక్ష్మి సెలబ్రేట్ చేస్తుంది. జీవితాంతం గుర్తుండి పోయే గిఫ్ట్ ఇవ్వమని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.