English | Telugu

Guppedantha Manasu : శైలేంద్ర కలని  రౌడీలు నాశనం చేస్తారా.. రిషి నిర్ణయం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1152 లో... శైలేంద్ర కాలేజీకీ వెళ్తూ దేవుడికి మొక్కుంటాడు. అప్పుడే బావ బావ అంటూ సరోజ లోపలికి వస్తుంది. శైలేంద్ర చూసి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి.. ధనరాజ్ తనని ఇక్కడకి ఎందుకు తీసుకొని వచ్చావంటూ అడుగుతాడు. తన బావ కోసం వచ్చిందని ధనరాజ్ అంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్లు బయటకు వస్తారు. ఎవరు కావాలి అమ్మ అంటు ఫణీంద్ర అడుగుతాడు. మా బావని ఇతను తీసుకొని వచ్చాడు. అందుకే ఇక్కడికి వచ్చానని సరోజ చెప్తుంది.

మీ బావనా ఎవరు ? ఫోటో ఉంటే చూపించమని ధరణి అనగానే.. ఉంది అంటు సరోజ చూపించబోతుంటే ఫోటో ఎందుకు గానీ ఆల్రెడీ మీ బావ వెళ్ళాడు.. ఇంట్లో లేడని శైలేంద్ర అంటాడు. సరోజని తీసుకొని ధనరాజ్ వెళ్ళిపోతాడు. ఎవడురా వాళ్ళ బావ? ఇదంతా ఏంటని ఫణీంద్ర కోప్పడుతాడు. అంటే వాళ్ళ బావ నాకు తెలుసు. అందుకే అలా అంటుందని శైలేంద్ర కవర్ చేస్తాడు. ఆ తర్వాత అది ఇక్కడికి ఎందుకు వచ్చింది. కొన్ని గంటల్లో మన కల నెరవేరబోతుంది.. ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోమని శైలేంద్రకి చెప్తుంది. మరొకవైపు వసుధార, రిషిలు కాలేజీ కి వెళ్తుంటారు. సర్ ఎండీగా ఎవరనేది నిర్ణయం తీసుకున్నారా అని రిషిని వసుధార అడుగుతుంది. నువ్వు అర్హత ఉన్నా చెయ్యనంటున్నావ్ .. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని రిషి అంటాడు. మరొకవైపు ధనరాజ్, సరోజలు వెళ్తుంటే.. రిషి వసుధారలు కన్పిస్తారు. వాళ్ళని ఫాలో అవుతూ ఇద్దరు వెళ్తారు. ఆ వసుధార మా బావ అవతారం కూడా మార్చేసిందని సరోజ అంటుంది. కొద్దీ దూరం వెళ్ళాక.. నేను డ్రైవ్ చేస్తానని సరోజ స్కూటీ తీసుకొని ధనరాజ్ స్కూటీ ఎక్కకుండానే వెళ్ళిపోతుంది. మరొకవైపు పాండు శైలేంద్రకి ఫోన్ చేసి చివరిసారిగా మీతో మాట్లాడాలని కాల్ చేశానని అంటాడు. ఎందుకు ఫైనల్ సెటిల్ మెంట్ కోసమా? ఆ వసుధారని చంపామని చెప్పి చంపలేదని శైలేంద్ర అనగానే.. ఇప్పుడు అంతా పోలీసులకి చెప్పి లొంగిపోదామని వచ్చాము.. అందుకే చివరిసారి మాట్లాడాలని చెప్పానని పాండు అనగానే.. శైలేంద్ర కోపంగా మాట్లాడుతాడు. ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. వస్తున్నావ్ కదా నేను చెప్పినట్టు చెయ్ అని చెప్తాడు. దానికి రిషి సరే అంటాడు.

మరొకవైపు రిషి, వసుధారలు వెళ్తున్న కార్ డైవర్ట్ అయిపోతుంది. దాంతో సరోజ చూస్తుంటుంది. అప్పుడే ధనరాజ్ వచ్చి ఏంటి వదిలేసి వచ్చావ్.. అసలు నువ్వు నాకోసం వచ్చావా.. మీ బావ కోసం వచ్చావా అంటూ అడుగుతాడు. నీ కోసమే వచ్చాను. ఇంటిదగ్గర అమ్మమ్మ.. బావ గురించి బెంగ పెట్టుకుంది. ఆ విషయం బావకి చెప్పాలి అందుకే అని సరోజ అంటుంది. ఇంత పెద్ద సిటీలో మీ బావని ఎక్కడ వెతుకుతామని ధనరాజ్ అంటాడు. ఆ తర్వాత రిషికి బుజ్జి ఫోన్ చేసి.. సరోజ నీ కోసం హైదరాబాద్ వచ్చిందని చెప్తాడు. ఏంటి అంటా అని వసుధార అడుగగా.. మా సరోజ సిటీకి వచ్చిందట అని రిషి అనగానే.. మీ సరోజ అంటున్నారని వసుధార కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.