English | Telugu

Brahmamudi : కొత్తజంటని ఇంటికి తీసుకురమ్మన్న ధాన్యలక్ష్మి.. షాకిచ్చిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -487 లో.....అప్పు ఫ్రెండ్స్ రాగానే.. మేమ్ ఇక వెళ్ళిపోతామని వాళ్ళతో అప్పు అంటుంది. ఎందుకు మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా అని వాళ్లు అడుగుతారు. అదేం లేదు.. కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్స్ ఉందట.. అందుకే వెళ్తున్నామని అప్పు చెప్తుంది. మరొకవైపు కావ్య అందరికి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ధాన్యలక్ష్మి రాలేదా అని ఇందిరాదేవి అడుగుతుంది. అయినవాళ్లే వెన్నుపోటు పొడిచాక ఎలా వస్తుందని అక్కడే ఉన్న రుద్రాణి అంటుంది. అయినవాళ్లు ఎవరని ఇందిరాదేవి అడుగగా.. ఇంకెవరు రాజ్ , కావ్య అని రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. కాఫీ తీసుకొండి అని కావ్య అనగానే.. విషమా అని కోపంగా ధాన్యలక్ష్మి అంటుంది. నాకు ఇవ్వమ్మ అని ప్రకాష్ అంటాడు. ప్రకాష్ కాఫీ తాగుతూ కళ్యాణ్ అంటు పిలుస్తాడు. అందరు షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి కోపంగా వెళ్లి.. ఎక్కడ కళ్యణ్ ఆ అప్పుని చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు కదా అని అంటుంది. ధాన్యలక్ష్మి బాధపడుతుంటే రాజ్ వెళ్లి అందరికి బాధ ఉందని అంటాడు. అందరికి ఉంటే ఇలా చేసేవాడివి కాదని ధాన్యలక్ష్మి అంటుంది. వాడు ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు.. రాజ్ ని అంటువేంటని అపర్ణ అంటుంది. అవును వెనకాల ఉండి నడిపించిన కావ్యని వదిలేసావ్ ఏంటని రుద్రాణి అనగానే.. తనపై అపర్ణ కోప్పడుతుంది. చూసారా ఇందుకే నన్ను అంటరానే ఈ పెళ్లి వద్దని చెప్పానని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ప్రకాష్ ఏడుస్తూ.. కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని రా అని రాజ్ కి చెప్తాడు. వాళ్ళిద్దరిని ఒప్పించి ఇంటికి తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. ఇద్దరు ఎవరు నాకు ఒక్కడే కొడుకు వాడే ఇంటికి రావాలని ధాన్యలక్ష్మి అంటుంది. దానికి ఎంత కావాలో అంత ఇస్తానని ధాన్యలక్ష్మి అనగానే.. నీకెంత కావాలి నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి అని ధాన్యలక్ష్మిని ప్రకాష్ కోప్పడతాడు.

ఆ తర్వాత కళ్యాణ్ అప్పు మెడలో తాళి కట్టాడు.. కానీ నువ్వు ఒక్కడినే తీసుకొని రమ్మని అంటున్నావ్ .. అది పాపమని రాజ్ అనగానే.. నాకు అవసరం లేదు నాకు నా కొడుకు మాత్రమే కావాలి.. అప్పుని ఎప్పటికి నా కోడలిగా ఒప్పుకోనని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ కావ్యలు గొడవపడతారు. తరువాయి భాగంలో నా కొడుకుని దూరంగా ఉంచి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.. వాళ్ళని ఇంటికి తీసుకొని రావడానికి ఒప్పుకుంటన్నానని రాజ్ తో ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో చూసావా పిన్ని ఒప్పుకంది.. పదా వెళ్లి వాళ్ళని తీసుకొని వద్దామని కావ్యతో రాజ్ అనగానే.. నేను రానని కావ్య అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.