English | Telugu
Guppedantha Manasu : కొత్త ఎండీ అతనేనా.. శైలేంద్రని కిడ్నాప్ చేసింది ఎవరంటే!
Updated : Aug 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1153 లో....రిషి మా సరోజ హైదరాబాద్ వచ్చిందట అని వసుధారతో అనగానే.. ఏంటి మీ సరోజ అంటూ రిషిపై వసుధార కోప్పడుతుంది. ఏంటి జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని రిషి అనగానే.. అవును జెలస్ గానే ఫీల్ అవుతున్నా.. మీ విషయంలో నేను ఇలాగా ఫీల్ అవుతాను. ప్రతీ భార్య భర్త విషయంలో ఇలాగే ఉంటుంది. అది మీకు అర్ధం కాదంటూ వసుధార అంటుంది. ఆ తర్వాత పాండు దగ్గరకి శైలేంద్ర వస్తాడు. పదండి సర్ ఇద్దరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోదామని అంటాడు
నువ్వేంట్రా ఇలా ఉన్నావ్.. ఎన్ని రోజుల నుండి నా కల నెరవేరబోతుందని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్రని పాండు మనుషులు వెనకాల నుండి వచ్చి మాస్క్ ఏసుకొని తీసుకొని వెళ్తారు. మరొకవైపు శైలేంద్ర అంటూ ఇంట్లో ఉన్న ఫణీంద్ర పిలుస్తుంటాడు. వాడు కాలేజీకీ వెళ్ళాడని దేవయాని చెప్తుంది. వాడు కాబోయే ఎండీ అని ఫీల్ అవుతున్నాడా ఏంటి అని ఫణీంద్ర అంటాడు. నేను కాలేజీకీ వస్తానని దేవయాని అనగానే.. నువ్వు వద్దు.. వచ్చిన ప్రతీసారీ ఏదో ఒక గొడవ జరుగుతుందని ఫణీంద్ర అంటాడు. అలా అంటారేంటి ఈ రోజు కాలేజీలో ఎండీ ఎవరో నిర్ణయం తీసుకంటున్నారు కదా.. నేను కూడా ఉండాలి కదా అని దేవయాని అనగానే.. అయితే నువ్వే వెళ్ళు నేను వెళ్ళనని ఫణీంద్ర అంటాడు. అదేంటి అలా అంటున్నారని దేవయాని చిరాకుపడుతుంది. అయితే నువు వెళ్ళు లేదా నేను వెళ్తానని ఫణీంద్ర అనగానే మీరే వెళ్ళండి అని దేవయాని అంటుంది. ఆ తర్వాత రిషి, వసుధారలు మీటింగ్ కీ వెళ్తారు. మీ అన్నయ్య అమెరికా నుండి వచ్చాకే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని వసుధార అనగానే.. నాకు అన్ని అర్ధం అవుతున్నాయని రిషి అంటాడు. మరి ఎందుకు సైలెంట్ గా ఉంటారని వసుధార అంటుంది. బంధాలకి బానిసని అందుకే రంగాగా మారిపోయాను రంగాకి అలాంటివి ఉండవని రిషి అంటాడు.
ఆ తర్వాత మిమ్మల్ని కిడ్నాప్ చేయమని ఒక డీల్ వచ్చింది.. అందుకే కిడ్నాప్ చేసానని పాండు శైలేంద్రకి చెప్తాడు. మరొకవైపు ఇంకా మీటింగ్ కీ శైలేంద్ర రాలేదని అందరు అనుకుంటారు. ఆ తర్వాత శైలేంద్ర ని కిడ్నాప్ చేయమని పాండుకి చెప్పింది మను. మను రాగానే పాండు.. డబ్బులు వద్దు సర్ మేం రౌడీలమని ప్రూవ్ చేసుకున్నామంటూ మనుకి డబ్బులు తిరిగి ఇచ్చేసి వాళ్లు వెళ్ళిపోతారు.ఆ తర్వాత శైలేంద్ర మనుని చూసి షాక్ అవుతాడు. మరొకవైపు బోర్డు మెంబెకర్స్ అందరూ మీటింగ్ కి వస్తారు. శైలేంద్ర రాకుండా నే మీటింగ్ స్టార్ట్ చేస్తారు.. అందరు రిషి గురించి మాట్లాడుతారు. ఎండీగా రాజీనామా చేసిన వాళ్లే కొత్త ఎండీ పేరు చెప్పాలి కాబట్టి నేనే ఎండీ ఎవరో చెప్పాలి.. చెప్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.