Read more!

English | Telugu

కలెక్షన్ కింగ్ కి విషెస్ చెప్పిన కౌశల్...


నిర్మాతలకు  'కలెక్షన్‌ కింగ్‌ గా, అభిమానులకు 'డైలాగ్‌ కింగ్‌' గా ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పారు ఆరడుగుల మంచు మోహన్ బాబు. ఆయనొక విలక్షణ నటుడు. సిల్వర్ స్క్రీన్ మీద విలన్‌గా , హీరోగా ఆకట్టుకున్నారు. అలాంటి పెదరాయుడు పుట్టిన రోజు ఈరోజు. ఆయన పుట్టినరోజును మంచు విష్ణు, మంచు మనోజ్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. మరి వాళ్ళే కాదు ఆయన్ని ఎంతో అభిమానించే బుల్లితెర నటుడు, బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా కూడా సెలెబ్రేట్ చేశారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు, సర్ ! వృత్తి మీద మీకు ఉన్నా డెడికేషన్, మీ పాత్రల్లో మీరు చూపించే ప్రొఫెషనలిజం, మీ నిబద్ధతకు నేను ఎప్పుడూ ముగ్దుడనైపోతుంటాను.

ఈ ఏడాది మీకు మరిన్ని అవకాశాలు రావాలి... మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి...మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు." అంటూ కౌశల్ ఒక పోస్ట్ ని పెట్టాడు. ఆయనకు బొకే ఇచ్చే పిక్స్ ని ఆయనతో కలిసి ఫుడ్ తినే పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు కౌశల్. 'స్వర్గం-నరకం' మూవీతో ఎంట్రీ ఇచ్చిన మోహన్‌ బాబు తన కెరీర్‌లో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా వెండితెరపై నవరసాలు పండించాడు. తన కెరీర్‌లో దాదాపు 575 పైగా సినిమాలు చేశారు.  'అల్లుడు గారు' , 'అసెంబ్లీ రౌడి' , 'రౌడీ గారి పెళ్ళాం' వంటి చిత్రాలు లేడీ ఆడియన్స్ ని సంపాదించిపెట్టాయి. ఆ తరవాత వచ్చిన 'అల్లరి మొగుడు', 'బ్రహ్మ' , 'మేజర్ చంద్రకాంత్' వంటి మూవీస్ బాక్సాఫీసును బద్దలు కొట్టాయి.