English | Telugu

శివాజీకి ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అదేంటో తెలుసా!


ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అందులోను కొంతమంది సెలెబ్రిటీలకి మరీను. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో స్పై బ్యాచ్ అంటే ఒక మార్క్ ఉంది. శివాజీ,‌ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లకి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే వాళ్ళు ఓ వీడియో అప్లోడ్ చేశారంటే ఇన్ స్టా ట్రెండింగ్ లోకి వెళ్తుంటాయి.

శివాజీ తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ త్వరలో పెద్ద సర్ ప్రైజ్ ఉందంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు యావర్ హర హర మహాదేవ అంటూ శివరాత్రికి ఓ పాటని రిలీజ్ చేశాడు. అది అత్యధిక వీక్షకాధరణ పొందింది. ఇక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఎవరి అంచనాలకి అందకుండా మెరుగైన ఆటతీరుతో, తన మాటతీరుతో అటు హౌస్ మేట్స్ ని ఇటు బయట షో చూస్తున్న ప్రేక్షకుల ఆదరణ,అభిమానాన్ని పొందాడు. బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి చివరి వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ తగ్గేదేలే అన్న రైతుబిడ్డ ‌పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూశారు. అయితే హౌస్ లోని ప్రతీ ఆటలో వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి తనేంటో నిరూపించుకున్నాడు ప్రశాంత్. చివరివరకు తగ్గేదేలా అంటు రెచ్చిపోయాడు. సెలెబ్రిటీలందరిని దాటేసి రైతుబిడ్డ సత్తా చాటుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి వెళ్ళనంతవరకు ఎంతోమంది ఎగతాళి చేశారు. వారందరికి తన గెలుపుతో‌ సమాధానం చెప్పాడు.

తాజాగా ఓ పేద కుటుంబానికి రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడే బియ్యాన్ని పంచాడు ప్రశాంత్. ఇక ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు శివాజీ, సందీప్ మాస్టర్, భోలే షావలి కూడా హాజరయ్యారు. దాంతో శివాజీకి ప్రశాంత్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. శివాజీ చేతిలో ఓ బ్రూ కాఫీ పొడి డబ్బా పెట్టాడు పల్లవి ప్రశాంత్. దీంతో శివాజీ తెగ నవ్వుకున్నాడు. ఇంతకీ శివాజీకి కాఫీ డబ్బా రైతుబిడ్డ ఎందుకిచ్చాడనేది బిగ్‌బాస్ ఆడియన్స్‌కి బాగా తెలుసు. ఎందుకంటే కాఫీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద యుద్ధమే చేశాడు శివాజీ. కాఫీ పొడి పంపించకపోతే హౌస్ నుంచే బయటికి పోతా అంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివాజీ హౌస్‌లో ఉన్న అన్ని రోజులూ కాఫీ పొడి డబ్బాలు పంపిస్తూనే ఉన్నాడు బిగ్‌బాస్. ఇక దీని కోసం శోభా శెట్టి కూడా పెద్ద గొడవే చేసింది. శివాజీకి కాఫీ పొడి దొరక్కుండా తన ప్లేస్‌లో చాలా సార్లు దాచేసింది. దీంతో మొత్తానికి శివాజీకి ఫన్నీగా ఇలా కాఫీ పొడి డబ్బా గిఫ్ట్‌గా ఇచ్చాడన్న మాట ప్రశాంత్. మరి మీలో ఎంతమందికి శివాజీ, ప్రశాంత్, యావర్ లు తెలుసు. ప్రశాంత్ కాఫీడబ్బాను శివాజీకి గిఫ్ట్ గా ఎందుకిచ్చాడో తెలిస్తే కామెంట్ చేయండి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.