English | Telugu

Karthika Deepam2 : కన్నతండ్రిని అక్కడ చూసి షాకైన కొడుకు.. ఆ పెళ్ళికి అడ్డంకేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -157 లో.....స్వప్న కాశీ ప్రేమ కోసం చెయ్ కోసుకోవడంతో శ్రీధర్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. డాక్టర్ చూసి ప్రమాదమేమీ లేదని చెప్తాడు. అప్పుడే కావేరి ఫోన్ చేస్తే మాట్లాడుతు.. శ్రీధర్ బయటకు వెళ్తాడు. అప్పుడే కార్తీక్ కూడా హాస్పిటల్ కి చెకప్ కోసం వస్తాడు. తనని చూసి శ్రీధర్ టెన్షన్ పడుతాడు. స్వప్నని చూడడానికి దీప అదే హాస్పిటల్ కి వస్తుంది. నువ్వు ఇలా ఎందుకు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళావంటూ కాశీపై దీప కోప్పడుతుంది. అలాగే‌ కార్తీక్ కి దీప ఎదరుపడుతుంది.

కొంతమంది మన మధ్యలో లేకపోవడమే మంచిది.. !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -208 లో......సీతాకాంత్ నిద్ర లేవగానే రామలక్ష్మి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. నాకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉందని సీతాకాంత్ అంటాడు.‌నేను సిరి గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ కి బాస్ అయితే నువ్వు నాకు బాస్ నువ్వు కూర్చోమంటే కూర్చొని ఉంటాను నిల్చోమంటే నిల్చుంటానని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అలా అని ఒకేసారి రెండు చెయ్ అనకు నాకు కష్టం అని సీతాకాంత్ సరదాగా అంటాడు. రామలక్ష్మి కుడా నవ్వుకుంటుంది. వాళ్లు సరదాగా ఉండడం మాణిక్యం, సుజాతలు చూస్తుంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.

Brahmamudi : వినాయకుడి పూజలో భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటవ్వగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -522 లో......కావ్య వినాయకుడి విగ్రహానికి కలర్ వేస్తుంటుంది. అప్పుడే కృష్ణ మూర్తి వచ్చి ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. ఇది ఈ రోజే పూర్తి చేయాల్సిన విగ్రహమని కావ్య అంటుంది. ఈ వినాయకుడి ద్వారా అయిన అల్లుడు నువ్వు ఇద్దరు ఒకటి అయితే బాగుండని కృష్ణమూర్తి అనగానే... కావ్య కోపంగా చూస్తుంది. దాంతో కృష్ణమూర్తి లోపలికి వెళ్తాడు. మరొకవైపు సీతారామయ్య ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. ఈసారి వినాయకుడి గురించి అందరు మర్చిపోయినట్లున్నారు ఏర్పాట్లు చెయ్యడం లేదని అంటాడు.